Tuesday, January 21, 2014

నేనొక్కడినే - నా ఒక్కడి సమీక్ష


     సుకుమార్  - మహేష్ బాబు సినిమా , సక్సెస్ బాట లో ఉన్న మహేష్ ,  కర్చు కి వెనకాడకుండా తీసిన సినిమా ఇంకా ఈ సినిమా తెలుగు సినిమా ల లో ఒక నూతన అధ్యాయం అని మాములుగా నే ఉదారగోట్ట బడ్డ సినిమా . 
    ముందర నుంచి నాకు సుకుమార్ మీద మరి అంత గొప్ప అభిప్రాయం లేదు .   వాణిజ్య పరమైన సినిమాలు తియ్యడం బాగా నే వచ్చు సుకుమార్ కి .  స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది. కాని తీసిన సినిమాలు అన్ని ఒక రకం గా పర్వేర్తేడ్ సినిమాలు అని నా అభిప్రాయం .  ఉదాహరణ కి ఆర్య సినిమా నే తీసుకోండి.  హీరో సినిమాలో అమ్మాయిని వెంట పడి నువ్వు ప్రేమించాక పోయినా నేను ప్రేమిస్తా అని వేదిస్తాడు . అదే ఇంకో అబ్బాయి చేస్తే సహించలేడు.  ఒక రకమైన సైకో .. ఈ సినిమా మే లో విడుదల అయ్యింది.  జూన్ లో విజయవాడ శ్రిలక్ష్మి ని అన్యాయం గా పొట్టనపెట్టుకున్నారు ఇలాంటి ప్రేమికుడు ఒకడు . 
   హండ్రెడ్ పెర్సెంట్ లవ్ ఇంకో డకోటా సినిమా ..  నాయకుడు  దీంట్లో ఒక రాంక్ హోల్డర్ , అతడి ఫోటో పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో పెడతారు కాలేజి వాళ్లు . అలాంటి వాడు తరవాత  రాంక్ కోసం అడ్డమైన పనులు చేస్తాడు.. ఆఖరికి నాయిక ని అడ్డం పెట్టుకుని రాంక్ తెచ్చుకుంటాడు . ఇది యువతకి ఎలాంటి చెత్త ఐడియా లు ఇస్తుందో ఒక్క సరి ఆలోచించాడా అన్నది నాకు సందేహమే . 
   ఇంకా ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడి సినిమా అంటే నాకు ముందు నుంచి ఒక రకమైన సందేహాలు ఉన్నాయ్ .  (అవి సినిమా చూసాక తీరిపోయాయి అనుకోండి ) .. అందరు ఓ పోగిడేసినట్టు ఇదో అద్భుతమైన తెలుగు చిత్రం కాదు అనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు .  రెగ్యులర్ సినిమా లో బ్రాహ్మి ఉంటాడు .. దీంట్లో లేడు అదే తేడా .  ఒక సినిమాలో బ్రాహ్మి ని (బాద్షా ) మీకు ఏది కలో ఏది నిజమో తెలీదు , ఇది టైం మెషిన్ ని ఆడుకుంటారు . ఈ సినిమాలో జనాలని డైరెక్టర్ ఆడుకున్నాడు అదే తేడా . 
    మాములుగా సినిమాల్లో ప్రతీకార చిత్రాలు మొదలు అయినప్పటి నుంచి ఉండే ఫార్ములా ఒక్కటే . నా కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని విడిచి పెట్టను .. దెబ్బకు దెబ్బ తీస్తాను అన్నది . ఇందులో కూడా అంతే . రెగ్యులర్ సినిమాలో  ఉండే ఒక నాయిక , మూడు డ్యూయెట్ లు , ఒక ఐటెం సాంగ్ , ప్రతి పది నిమషాలకి ఒక పోరాటం , తల్లి తండ్రుల హత్య , ముగ్గురు విల్లన్లు ఇవి అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి . లేనిది హాస్యం ఒక్కటే అదే ఈ సినిమాలో ఉండే ప్రత్యేకత అంటే ఇంకా ఎం చెప్పలేం .
     సినిమాలో మనం ఆడే రెగ్యులర్ రుబిక్ క్యూబ్ ఇంకా కొంచం మార్చి సినిమాలో వాడారు . దాంట్లో నాయకుడు చిన్నప్పుడు దాన్ని ఒక రకం గా తీసుకు రావడం అన్నది చెప్పరు మనకి .. (అది ఎడిటింగ్ లో పోయింది అన్నది దర్శకుడి ఉవాచ )  ఇలాంటివి మనకి అర్ధం కానివి అన్ని ఎడిటింగ్ లో పోయాయి . అనవసరం అయిన చాలా సన్నివేశాలు ఉండిపోయాయి (సినిమా విడుదల అయ్యాక ఒక ఇరవై నిమషాల సినిమా ఎడిట్ చేసారు మరి ).  ఇవే కాక సినిమాలో  Tomcruise, camerion diaz   నటించిన  Knight and Day  సినిమా నుంచి సన్నివేశాలకి సన్నివేశాలు ఎత్తేసారు .  మరి అన్యాయం ఏంటి అంటే , సినిమా చివరలో మహేష్ బాబు , గౌతమ్ పాట , సన్నివేశం రెండు కూడా అయితే ఓల్డ్  బాయ్ అన్న కొరియా సినిమా నుంచి ఎరువు  తీసుకొచ్చి ఈ సినిమా కి ఎరువు గా వాడారు .  దానికి మన వాళ్ళు  అబ్బ ఎం తీసాడు , ఎలా తీసాడు మహా తోపు అని మెచ్చి శాలువాలు కప్పడం మొదలెట్టేసారు .  ( వందశాతం ప్రేమ సినిమా లో హీరో కాపి కొట్టడం ఎలా నో చూపించాడు , ఈ సినిమాలో దర్శకుడు  అది చేసి చూపించారు )  
    సినిమా లో బాగుంది మహేష్ నటన .  చాల బాగా చేసాడు . నేపధ్య సంగీతం మొత్తం ఓల్డ్ బాయ్ సినిమా నుంచి ఎత్తుకోచ్చారు.  సినిమా లో హీరో పాప్ సింగర్ ... బట్ బిభత్సమైన పోరాటాలు అద్భుతం గా ఒంటి చేత్తో చేసేస్తూ ఉంటాడు . ఫాస్ట్ అండ్ ఫురియాస్ సిన్మా లో లాగ భవంతుల మీద నుంచి అవలీలగా దూకి పరిగెట్టడం లో కూడా ప్రవీణుడు.  ఇంకా డాక్టర్ ఉంటాడు సినిమాలో ప్రపంచం లో ఇలాంటి డాక్టర్ ని ఎక్కడ చూడని టైపు, హీరో కన్నా వాడికి ముందర వైద్యం చేయించవలసిన వాడు .. ఫోటోగ్రఫి బాగుంది . హీరోయిన్ మనకి అలవాటు పడటానికి టైం పడుతుంది . బట్ ఓకే .

Saturday, October 26, 2013

భాయ్ .... సినిమా సమీక్షకొన్ని నెలల క్రితం మెహర్ రమేష్ అనే ఒక గొప్ప దర్శకుడు , వెంకటేష్ అనే  హీరో ని డిఫరెంట్ గా చూపిస్తా , ఈ సినిమా డిఫరెంట్ గా చేశా అని కాకమ్మ కథలు చెప్పి షాడో అని మహత్తర చిత్ర రాజాన్ని తీసి అటు నిర్మాతని , హీరో ని పనిలో పని గా ప్రేక్షకులని హింసించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది.  మనవాళ్ళు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోకుండానే , వీరబద్రం అనే దర్శకుడు నాగార్జున ని అదే కథ ని కొంచం అటు ఇటు గా చెప్పి నిర్మాతగా కూడా ఒప్పించి సినిమా తీసి పారేసాడు (నిజ్జంగా పారేసాడు ) .

     సినిమా విడుదల కి ముందర వీరబద్రం , నాగార్జున ఇచ్చిన బిల్డుప్ కి ఈ సినిమా తోపు అని వెళ్ళామో , హాల్ లో నుంచి తోసు కుంటూ రావాల్సిందే . హీరో పేరు భాయ్ , చేసేది ఒక మాఫియా డాన్ వద్ద కిల్లర్ పని.  కానీ ఆరుగంటల వరకే ఆ పని ఆ తరవాత ప్లే బాయ్ అని ఒక డైలాగ్ ఉంటుంది అది మొదటి సీన్ వరకే (సాంగ్ కోసం) , ఆ తరవాత ఆ సంగతి మర్చిపోతారు.  నాగన్న ఓపెనింగ్ పంచ్ డైలాగ్ , ఆ తరవాత ఒక నెత్తిమీద టోపీ కిందపడకుండా జులపాల విగ్ కదలకుండా వొళ్ళు అలవకుండా ఒక భీకరమైన (చూసేవాళ్ల కి  అని తీసేవాళ్ల అభిప్రాయం లెండి ) ఫైట్ అయ్యాక సాంగ్ అయ్యాక హైదరాబాద్ లో ఉన్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ని లేపే పని ఒప్పుకుని హైదరాబాద్ కి విగ్ తీసేసి వస్తాడు .
      హైదరాబాద్ లో అండర్ కవర్ కాప్ ని పట్టుకునే పని మర్చిపోయి సరదాగా ఇంటర్వెల్ వరకు గడిపి ఇంటర్వెల్ లో ఆ పోలీస్ తన తమ్ముడు అని తెలుసుకుని షాక్ తింటాడు . (షాడో లో కూడా డిట్టో డిట్టో ) .  తరవాత హీరో వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తి ఇంట్లో కి చేరి హీరో తమ్ముడిని రక్షించుకోడానికి ప్రయత్నిస్తాడు , కాని తమ్ముడికి తెలిసిపోతుంది అన్న భాయి అని .  తమ్ముడు హీరో వెనకాల పడతాడు , ఈ లోపల నిజం డాన్ కి సంగతి తెలిసి వాళ్ళ వెనకాల పడతారు, ఇంకా క్లైమాక్స్ ఫైట్ గట్రా గట్రా ...
    నాగార్జున ఒకటో రెండో సీన్స్ లో కాస్త నటించడానికి ట్రై చేసాడు . మిగిలిన సీన్స్ లో నల్ల కళ్ళజోడు తో లాగించేసాడు.  బాబు కి ఈ మధ్యే మోకాళ్ళకి శాస్త్ర చికిత్స జరిగింది దాంతో ఇంకా ఎక్కువ శ్రమ పడకుండా ఫైట్ లు  డాన్సులు కానిన్చేసారు .  గురుడు ఫైటింగ్ కి వెళ్ళే ముందర ఒక డ్రెస్ , ఫైట్ లో ఒక డ్రెస్ , ఫైట్ అయ్యాక వచ్చే సీన్ లో ఇంకో డ్రెస్ తో సంబంధం లేకుండా దృశ్యాలు వచ్చి పోతూ ఉంటాయి. 
  ఇంకా నటుల సంగతి సరే సరి . హేమ కి డైలాగ్స్ కూడా లేవు, ఇంకా మిగిలిన వాళ్ల  సంగతి సరే సరి . సినిమా అంతా హేమా హేమీలు ఉన్నారు .. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నటించాలి , సినిమా కి ప్లస్ అవుతుంది అన్నవాళ్లు లెరు. అందరు ఒకటే చెక్క మొహం వేసి నటన అంటే తెలీని వాళ్ళలాగా కనిపించారు .హీరోయిన్ సంగతి మర్చిపోయా ... ఎందుకంటే హీరోయిన్ కి చెయ్యడానికి ఎం లేదు . అమ్మాయి మొహం లో ఎటువంటి భావం పలకదు (సినిమా లో తండ్రి పాత్ర ద్వారా ఆ విషయం కూడా చెప్పించారు ). మన అదృష్టం బాగుంది అమ్మాయి సినిమాలో నుంచి ఇంకా తాత్కాలికం గా విరమించా అని మొన్నే ట్వీట్  చేసింది  భారి తారాగణం భారి డబ్బింగ్ , భారి తలనొప్పి వెరసి భాయి.
          సినిమా మొత్తం పంచ్ డైలాగు ల తో లాగించారు . సినిమా లో మాత్రం పంచ్ లేకుండా చేసారు .
    నిజానికి ఈ సినిమా పోకిరి రాజా అన్న మలయాళం సినిమా కి ఫ్రీ మేక్ ... ఆ సినిమాలో మమూట్టి , పృథ్వీ రాజ్ లు ఇద్దరికీ మంచి పాత్రలు ఉండటం వల్ల  సినిమా వర్క్ అవుట్ అయింది . ఇక్కడ తమ్ముడి పాత్ర ని స్నేహ భర్త ప్రసన్న తో చేయించారు . అలా అని ఆ పాత్ర కి మంచి గా మలచారా అంటే అలాంటిది ఎం లేదు, ఆట లో అరటి పండు పాత్ర .
సినిమా విడుదల కి ముందర నాగన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో అత్తారింటికి సినిమాకి దేవిశ్రీ సంగీతం ఇచ్చాడు, హంస నందిని గెంతింది ... మా సినిమా కి కూడా సేం టు  షేమ్  అన్నాడు . నిజం గానే షేమ్ ..  ఇలాంటి సోది లెక్కలు వేసుకుని సినిమా తీస్తే సినిమా సోది లో లేకుండా పోతుంది అని థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ కి తెలీకపోవడం ఏంటో అర్ధం కాదు.

Saturday, September 28, 2013

అత్తారింటికి దారేది .... సమీక్ష ...


   త్రివిక్రమ్ అభిమానులని (నాకు తెలిసి చాల మందిని ) నిరాశ పరిచిన సినిమా ఇది.  ఒక రకం గా గుండమ్మ కథ సినిమా కి ఇంకా బోలెడు శ్రీను వైట్ల , వినాయక్  లని కలిపి దానికి కొంచం విదేశి సొగసులు అద్ది న  స్వదేశి సినిమా ఇది. 

 సినిమా రిలీజ్ కి ముందరే అంతర్జాలం లో సినిమా ప్రత్యక్షం కావడం తెలుగు లో ఇదే మొదటి సారి.  దెబ్బతో సినిమాకి బోలెడు పబ్లిసిటీ ,  నిర్మాతకి టెన్షన్ వచ్చేసింది. హడావిడిగా సినిమా విడుదల చేసేసారు

  సినిమా మొదట్లో మిలాన్ లో ఉండే ఫలానా కంపని లో షేర్స్ , దాన్ని స్వంతం చేసుకోవాలని ఎవడో గొట్టం గాడు ప్లాన్, నా కంపని కొంటావా అని హీరో వాడిని తన్నడానికి వెళ్లి , వాడిని వదిలేసి ఇంకో గొట్టం గాళ్ళని చంపేసి , వాడిని బెదిరించి నేను సింహాన్ని అని అర్ధం పర్ధం లేని డవిలాగులు నాలుగు చెప్పి బోమ్మ తుపాకి ఊపుకుంటూ వచ్చేస్తాడు .
   హీరో పేరు గౌతమ్ , గౌతమ్ తాతగారు బొమ్మై ఇరాని, బాబు ముకేష్ రుషి వీళ్ళు ఇద్దరు ఇంటి ఆడపడుచు , పాతికేళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్లి పోయిన సునంద (నదియ ) కోసం ఏడుస్తూ ఉంటారు . తాతగారికి మూడు నెల్లల్లో  రాబోయే పుట్టినరోజు కి సునందని తీసుకువస్తా అని ప్రతిజ్ఞ చేసి గౌతమ్ బాబు బ్యాండ్ మేళ్ళం గాళ్ళని (అనగా బాడీ గార్డ్ గాళ్ళు , వీళ్ళు  హీరో గారి కోసం బట్టలు ఇస్త్రి చెయ్యడం, చెప్పులు మొయ్యడం లాంటివి మాత్రమె చెసెదరు. పోరాటములు హీరో గారే చేసెదరు అని గమనించవలెను )  తీసుకుని భారతదేశం సొంత విమానం లో బయలుదేరతారు.  విమానం లో ఎక్కువ స్థలం లేక (లేక పొతే ప్రొడ్యూసర్ కి వాచిపోతుంది కదా మరి ) విదేశి బ్యాండ్ మేళ్ళం గాళ్ళని వదిలేసి స్వదేశి వాళ్ళని పెట్టుకుంటాడు దిగగానే, వాళ్ళకి బాబు గారి గురించి మొత్తం ఆటోమేటిక్ గా ట్రైనింగ్ అయి ఉంటారు. సార్ వాళ్ళని వేలి  తో కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. 

   గౌతమ్ మేనత్త భర్త  గారికి గుండెపోటు రావడం , హీరో గారు రక్షించడం , దెబ్బకి మేనత్త ఇంట్లో డ్రైవర్ గా పాగా వేసి, ఇంట్లో సమస్యలని పరిష్కరిస్తూ , అత్త కూతుర్లకి లైన్ వేస్తూ ఉండంటం చక చక జరిగిపోతాయి  .  మరి ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉండాలి కదా ... అత్తగారు మేనల్లుడిని ఎప్పుడో  గుర్తుపట్టా అనీ చెప్పడం ఇంటర్వెల్ అన్నమాట .
   ఆ తరవాత సినిమాలో కి ఫ్యాక్షన్ గొడవలు , హీరో గారు సింగల్ హ్యాండ్ తో వాళ్ళని సితకకోట్టడం వినాయక్ సినిమాలో లాగ చేసింగులు , వైట్ల సినిమా లో లాగ హీరోయిన్ కి తాత్కాలికంగా గజినీ అయిపోవడం ఆ పై సినిమా పిచ్చి ఉన్న బ్రాహ్మి సినిమాకి సంబంధం లేని కామెడి , కెవ్వు కేక సాంగ్ పేరడీ  గా హీరో గెంతడం, కాటమ రాయుడ కదిరి నరిసిమ్హుడా అని బ్రహ్మిని తన్నడం లాంటి వెకిలి చేష్టలతో సినిమా రెండో అర్ధ భాగం లాగించి ... చివరకి అత్తగారిని పుట్టింటికి తీసుకువెళ్ళడం తో కథ ముగిస్తాడు త్రివిక్రమ్...

 సినిమా లో బాగోలేనివి :
   ఒకటి కాదు సినిమా చూస్తూ ఉంటె పాత  సినిమాలో ని సీన్స్ రివ్వున వచ్చిపోతూ ఉంటాయి . సెంటిమెంట్ సీన్ లో కూడా ప్రాస లో మాట్లాడుతూ ఉంటారు జనాలు .

 పనికి రాని కాస్టింగ్ బోలెడు మంది సినిమా నిండా ... హీరో కి ఇంకో నలుగురికి తప్ప ఎవరి పాత్ర కి సరి అయిన న్యాయం జరగదు .  హీరోయిన్ కి బుర్ర ఏ కాల్లో కూడా లేనట్టు గా ఉంది.

హీరోయిన్ బెడ్ రూం లో బాత్ టబ్ ఉంటుంది ... బెడ్ రూం కి బాత్ రూం కి తేడా ఉండదు అనుకుంటా మరి ... 

 పళ్ళు రాలి పొతే ఫిసికల్లీ హండికప్ద్ కోటా కిందకి వస్తారా ??!! త్రివిక్రమ్ గారు కొంచం అప్పడప్పుడు మోకాలు గోక్కోండి ప్లీజ్.  నిన్నటి దాక లేని షాప్స్ అన్ని ఇంటిముందర తెల్లరె టప్పటికి ప్రత్యక్షం అవుతే ఇంట్లో వాళ్ళకి ఈ మాత్రం అనుమానం రాదు .. అసలు దాన్ని గురించే పట్టించుకోరు.

త్రివిక్రమ్ ఇంకా అతడు హంగొవెర్ నుంచి బైటకి వచ్చినట్టు లేరు . ఇంకా ఫైట్ సీన్స్ ఆ హాంగ్ ఓవర్ నుంచి రాలేదు . అదే రకం గా తీస్తున్నారు . 

  కొన్ని సింహాద్రి సీన్స్ , కొన్ని వినాయక్  సీన్స్ , కొన్ని వైట్ల సీన్స్ ... కొంచం గుండమ్మ కథ , కొంచం ఇంగ్లీష్ సినిమా   సీన్ సీన్ కి పాత సినిమాలు చిరాగ్గా వచ్చిపోతూ ఉంటాయి ...

బాగున్నై :
పవన్ కళ్యాణ్ , పవన్ కళ్యాణ్ ... పవన్ కళ్యాణ్ ... ఇన్ని లోపాలున్నా సినిమా చూడగలిగాం అంటే ఓన్లీ బికాస్ అఫ్ పవన్ కళ్యాణ్ .  అదరగొట్టాడు. ఇంతకు ముందర సెంటిమెంట్ సీన్స్ లో పవన్ చేయ్యగిలిగే వాడు కాదు. కాని ఈ సినిమా తో దాన్ని అధిగమించాడు . హి ఇస్ గుడ్ .
 ప్రసాద్ మురేళ్ళ చాయాగ్రహణం బాగుంది . అలాగే అక్కడక్కడ దేవిశ్రీ పరవాలేదు . ఆనంద్ సాయి సెట్స్ బాగున్నై.  పవన్ కోసం ఈ సినిమా ఒక సారి  ఓకే నాకు ...

Sunday, September 8, 2013

తూఫాన్ - చిత్ర సమీక్షసిరు గారు కేంద్రమంత్రి గా కావడం .... జంజీర్ సినిమా హిందీ ప్రకటన దాదాపు గా ఒక సమయం లో జరిగాయి. తెలుగే  సరిగ్గా రాని  అంజని పౌత్రుడు హిందీ లో  ఇరగ తీసేస్తాడు అని మన వాళ్ళు బోలెడు నమ్మకాన్ని , కొండంత ఆశని పెట్టుకున్నారు (కొంతమంది ). కాకపోతే బాబు గారి కోయ్యమొహం మీద ఇంకాస్త ఎక్కువ నమ్మకం ఉన్న నాలాంటి వాళ్ళు ముందరగానే ఫిక్స్ అయిపోయాం ఇదో గాలివాటం సినిమా నే కాని వాళ్ళు చెప్పినట్టు  గా తూఫాన్ కాదు అని.
    సినిమా మొదలు అవ్వగానే అవాంతరాలు కూడా మొదలు అయ్యాయి.  ముందర హక్కుల చిక్కులు, ఆ పై సంజయ్ జైలు మధ్యలో ఇలా చిక్కులు అన్ని అయ్యిపోయాయి అనుకుంటే చివర్లో రాష్ట్ర విభజన , సినిమా కొన్న బ్లూ స్కై వాళ్ళు వెన్నక్కి పోవడం లాంటివి జరిగాయి.  అన్ని అడ్డంకులు దాటి సినిమా విజయవంతం గా విడుదల అయ్యింది . ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుల సంగతి చూద్దాం.
   సినిమా మొదలు కాగానే ఇప్పటికి కొన్ని వేల సార్లు చూపించినట్టే రాష్ట్ర మంత్రి రోడ్ మిద ధర్నా , హీరో గారు తండ్రి , బాబాయ్ గార్ల పోస్టర్ల సాక్షి గా మంత్రి ని కొట్టి దారి ని సుగమం చేసి ప్రజలని రహదారి బాధల  నుంచి రక్షించి మంత్రి ఆగ్రహం కారణం గా ముంబై కి బదిలీ చెయ్యడం చక చక జరిగిపోతాయి .
    ఆల్రెడీ కామెడి మొదలయింది అని అనుకోకండి ... పేర్లు పిచ్చ కామెడి ... తూఫాను టపాను అంటూ దాదాపు నగ్నంగా ఉన్న అమ్మాయిలు (బాండ్ టైపు ) వొంటి నిండా సంకెళ్ళ తో వస్తూ పోతూ ఉంటారు . (జంజీర్ అన్నమాట ) దానికి అర్ధం పర్ధం లేని సాహిత్యం ఒకటి జత . చంద్రబోసు గారు ఇలా దరిద్రం గా రాస్తారు అని అనుకోలా ... డబ్బింగ్ గాబ్బు గా ఉంది ...  నిజానికి తెలుగు సినిమాకి దర్శక పర్యవేక్షణ యోగి కాని అయన ఎక్కడా కనిపించినట్టు గా లేదు మరి.
 పేర్లు అవ్వగానే సర్ గారి రికార్డ్లు పనిపాట లేని అనౌన్సర్ లు రికార్డ్లు వేస్తూ ఉంటారు . వెనకాల ఒకటే నేపధ్య సంగీతం రఘుపతి రాఘవ రాజారాం అని, సినిమాకి దానికి సంబంధం లేకుండా . ఒకపక్కన హీరో జనాలని చావ చిత్తక కొడుతూ ఇంకో పక్క శాంతి మంత్రం పాటిస్తున్నట్టు గా ఉంది .  మన పోలీసులకి గడ్డం చేసుకోడానికి సమయం ఉండదో లేక జీతం చాలదో తెలీదు కాని సినిమాలో ఎక్కడ గడ్డం చేసుకున్నట్టు గా కనపడదు. 
ఇంకా శ్రీహరి నటన ... అబ్బోఅదొ టార్చర్ ..  షేర్ ఖాన్ అని పేరు పెట్టుకున్నా కదా అని అరవడమే పనిగా పెట్టుకునట్టు గా ఉంది .  ప్రతి మాట ఒక రేంజ్ లో అరవడం అరవ సినిమా లాగా ...షేర్ ఖాన్ , హీరో ఇద్దరు కొట్టుకున్నాక , షేర్ ఖాన్ చెయ్యి కలపబోతే నీకు సంకెళ్ళే వేస్తా అని , తరవాత సీన్ లో ఇద్దరు స్నేహితులు అయిపోతారు, ముందర సీన్ కి సంబంధం లేకుండా.   హీరో పక్కన ఉండే పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు బఫూన్ టైపు బుర్ర అరికాల్లో కూడా లేని రకాలు .
   ఇంకా హీరోయిన్ పేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితురాలి పెళ్ళికి అమెరికా నుంచి వచ్చి , పెళ్లి లో ఐటం డాన్సు చేసి మందు కొట్టి (పెళ్లి నగరం లో జరుగుతుంది ) అమ్మాయి స్టార్ హోటల్ లో ఉంటుంది రెండిటికి మధ్య ఊరు ఉంటుంది ...ఇంక ఆవిడ అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ గారి హత్య చూస్తుంది .
   ఆ తేజ ఎవరు అనగానే ఇంకో ఐటెం సాంగ్.  అది అవ్వగానే డైనింగ్ టేబుల్ మిద తేజ ఒకడిని చంపడం . ఏంటి ఈ పాత చింతకాయ సీన్స్ అంటే అదే మరి తూఫాన్ గొప్పదనం . ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్ లేకుండా , నలభై ఏళ్ళ  క్రితం వచ్చిన జంజీర్ సినిమాకి అదే సీన్స్ తో తెలుగు హిందీ నటులతో ఏ మాత్రం కొత్తదనం కాని, నటన కాని లేకుండా ఎంత చెత్తగా తియ్యోచ్చో భారి కర్చు పెట్టి అని చూపించారు .
   ఇంకా ఈ సినిమా కి అన్ని చోట్ల జీరో రేటింగ్స్ ఇచ్చినా అంజనీ పౌత్రుడు మాత్రం అబ్బో నాకు బోలెడు మంది ఫోన్స్  చేసి పోగిడేసారు అని ఊదర కొట్టేస్తున్నాడు .
  రిలీజ్ కి ముందరే ఈ సినిమా వంద (నా బొంద ) కోట్లు దాటేస్తుంది అని కాకి లెక్కలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. హిందీ మిద చూస్తె తెలుగు లో కొంతవరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది , హిందీ లో ప్రకటన కర్చులు కూడా వచ్చే అవకాశం లేదు మరి .  ఈ హీరో కి నటన ఎప్పటికి వచ్చెనో లేక మనం తినగా తినగా వేమ  తియ్యగనుండు లాగ ఈ చెక్క మొహానికి అలవాటు పడిపోతాం ఏమో (ఇప్పటికే అలవాటు పడ్డవాళ్ళ గురించి నేను ఎం చెప్పలేను అనుకోండి ). 
 సినిమా కి పాటలు , నేపధ్య సంగీతం దొందు దొందే ... ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఇంతోటి సినిమా కి అది చాల్లే అనుకున్నట్టు గా ఉన్నారు ..
సినిమాలో లోపాలు కో కొల్లల్లు .. హీరో తండ్రిని కోల్పోయిన సంఖ్య సీన్ కి ఒకలాగా మారుతుంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎందుకు ఎలా పుట్టిందో డైరెక్టర్ కి కూడా తెలుసా అన్నది అనుమానమె. 
సొరంగం లో నీటి నిప్పుల మధ్య జరిగే పోరాటం మొహ్హారం ఊరేగింపు లో కి వచ్చి మళ్ళి సొరంగం లో కి ఎలా వెళ్తుందో ఆ ఎడిటర్ కి కూడా తెలీదు .. 
ఇలా ఒకటా రెండా సినిమా చూస్తె మెదడు ఏ కాల్లో ఉందొ ఎత్తుక్కుకోవాల్సి వచ్చింది
ఈ సినిమా తరవాత ఇంకా రెండో మూడో హిందీ సినిమాలు అతి త్వరలో అని ప్రకటించేసాడు అబ్బాయి .. ఇంకా కాసుకోండి...  

Friday, April 26, 2013

ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి

ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి

 
utsavakanuka
వ్యాసకర్త: శ్రీ అట్లూరి
*****
ఈ పుస్తకం మాములుగా కన్నా ఎక్కువ సమయం పట్టింది చదవటానికి. నిజానికి ఈ పుస్తకం చదవటానికి కారణం బాపు గారి బొమ్మ. అది చూసి ఈ పుస్తకం కొన్నాను. మొత్తం పదిహేను కథలు, మూడు ఇతర విశేషాలతో ఉన్న పుస్తకం ఇది.
సరళమైన భాష అందరికి అర్థమయ్యే పదాల పొందిక ఈ కథల విశేషాలు. మొదటి కథ ఉత్సవ కానుక అన్నిటిలోకి బాగున్న కథ. ఒక సంగీత అభిమాని ఒక సంగీత కళాకారుడికి ఇవ్వగలిగిన బహుమతి అంతకన్నా ఏముంటుంది అనిపిస్తుంది కథ మొత్తం చదివాక.
రెండో కథ అమ్మాయి పెళ్లి. ఒక మధ్య తరగతి ఇల్లాలు తన కూతురుకి అమెరికా సంబంధం కోసం పడే తాపత్రయం ఈ కథ. తెరువు కథ మూడోది … ఈ కథ చాలా మంచి కథ. మనం చూసేవి అన్ని మనం అనుకున్న నిజాలు కాకపోవచ్చు అన్నదానికి ఇది మంచి ఉదాహరణ ఈ కథ. తప్పకుండా చదవాల్సిన కథ ఇది.
పాత బంగారులోకం ఒక మామూలు కథ . ఊరట, సర్వం జగనాథం, సంసారంలో హింసానాదం, బెస్ట్ కపులు గిఫ్ట్ కూపను ఒక మోస్తరు కథలు. చిలకపచ్చరంగు చీర బట్టలకోట్లల్లో జరిగే డిస్కౌంట్ ల సంబరం మీద, దాన్నివల్ల మధ్యతరగతి వాళ్ళు ఎలా మోసపోతున్నారో తెలియచెప్పే కథ (ఇలాంటి కథలు మనం ఇంతకు ముందు కూడా చదివి ఉండొచ్చు ). బతుకు దారి దిగువ తరగతి కుటుంబాల్లోని నిజాయితీకి అద్దం పట్టే కథ.
వృత్తి ధర్మం మనకున్నదాంట్లో ఒకరికి సహాయపడితే భగవంతుడు మనకి సహాయపడతాడు అని చెప్పే కథ. అంతరాలు మధ్యతరగతి జీవితాల్లో డబ్బుకి మానవ సంబంధాలకి జరిగే అంతర్మథనం ప్రధాన వస్తువు. కొంచం సాగతీత అనిపిస్తుంది. బంధం కథ ముగింపు ఓ హెన్రీ కథలని పోలి ఉంది. మంచి ముగింపు ఉన్న కథ ఇది. గోరింట పండింది బాగా పాతకాలం కథ. ఇప్పటి కథ కాలం కథ కాదు. ఆనందపురం వెళ్ళాలి టైటిల్ కొంచం మధురాంతకం గారి కథ లాగా అనిపించినా బాగానే ఉన్న కథ.
మొత్తం మీద కథలు అన్నీ మధ్యతరగతి సమస్యలు, వారి జీవన విధానాలు ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. అన్ని చదివించే కథలే. కాని కొన్ని కథలు సాగతీత వల్ల మంచి కథ అవాల్సి కూడా కాకుండా మాములు కథలాగా మిగిలిపోతాయి. వీరి ఇంకో కథా సంపుటి అత్మద్రుతి నేను చదవలేదు దాని గురించి విశేషాలు ఈ కథా సంపుటిలో ఉన్నాయి.
*****
from : http://pustakam.net/?p=14304
Book available in Kinige.com 

Tuesday, March 26, 2013

ప్రళయ కావేరి కథలు – స. వెం. రమేష్pralayakaverikathalu
వ్యాసకర్త: Sri Atluri
******
దాదాపు గా నాలుగు ఏళ్ళ క్రితం అనుకుంటా ప్రళయ కావేరి కథలు చదివాను. భాష కొంచం నాకు కష్టం గానే ఉండింది. కానీ రెండు కథలు చదవగానే అర్ధం కావడం మొదలు పెట్టింది. నిజానికి ఈ కథలు అన్ని ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురించబడ్డాయి కాని అప్పటికి ఆన్లైన్ లో ఆంధ్రజ్యోతి రాకపోవడం వల్లో లేక నేను సరిగ్గా చూడకపోవడం వల్లో చదవలేకపోయాను. అనుకోకుండా ఒకసారి ఈ కథలగురించి వినడం దాంతో ఇండియా నుంచి తెప్పించి చదవడం జరిగింది.
ఈ కథ సంకలనం లో మొత్తం ఇరవై ఒక్క కథలు ఉన్నాయి. ఉత్తరపొద్దు కథతో మొదలైన ఈ సంకలనం వోల్లెరుగని నిద్ర కథ తో పూర్తవుతాయి. రమేష్ గారికి భాష మీద పట్టుతో పాటు ప్రేమా, మమకారం కూడా చాలా ఉన్నాయి. ప్రళయకావేరి అనగా మనకి తెలిసిన పులికాట్ సరస్సు. ఇది ఇండియా లో రెండో అతి పెద్ద సరస్సు. ఈ సరస్సు చుట్టూ ఉన్న దీవులు వాటి పేర్లు, అక్కడి వారి జీవన విధానం ఏంటో, ఎంతో అందం గా రాసారు. మనకు తెలీని బోలెడు పేరులు మానని అలా పలకరించి మానని వదలవు.
ఈ పండ్ల పేర్లు చూడండి.. పాలపండ్లు , కలిగి పండ్లు , బీర పండ్లు , బిక్కి పండ్లు, నిమ్మ టాయలు, ఊటి పండ్లు , గొంజి పండ్లు, ఎలుక చెవులు, బలిజ పండ్లు, పిల్లట్లు – ఇవి అన్ని అడవిలో దొరికే పండ్లు. వీటిలో ఒక్కదాని పేరు కూడా వినలేదు నేను ఇప్పటిదాకా (రుచి మాట దేవుడెరుగు). అసలు ఇలాంటి పండ్లు ఉంటాయని కూడా తెలీదు నాకు. అంటే మనం పట్నం లో పెరిగి ప్రకృతికి ఎంత దూరం గా పెరిగామో అని ఒక రకమైన సిగ్గు వేస్తుంది. నారింజ కాయని కిచ్చిలి కాయ అంటారని ఇప్పుడే తెలిసింది. బలిగూడు (చెడుగుడు) ఆటలో కూతలు ” ఆకు పాకు బెల్లం పెడతా నాకు” “గోడమీద గొలుసు, నీ అబ్బ నాకు తెలుసు ” వింటే ఎంత నవ్వు వస్తుందో… ఇలాంటివి కూడా ఉంటాయని తెలీదు మనకి (నాకు) .పరంటిది పెద్దోళ్ళు కథలో భజన గురించి చదువుతుంటే చిన్నప్పుడు మన అక్కవాళ్ళు బొమ్మల పెళ్ళికి మనం చేసే హడావిడి గుర్తుకు రాకమానదు.
ఇరవై ఒక్క కథలలో ఒక్క కథ కూడా నచ్చని కథ లేదు అంటే అతిశయోక్తి లేదు. అన్ని కథలు చాలా బాగున్నాయి. ఒక కథ చదువుతుంటే మానని మనం చదువుకుంటున్న భావన వస్తే అది మన తప్పు కాదు.
తిని దిబ్బెకిన్నోడూ, అవునమ్మి అప్పుతీరిచ్చినోడు బాగుపడడు అని చెపుతాడు రమేష్. దాదాపు గా ఇదే సంగతి మన ఇళ్ళల్లో మన. పెద్దవాళ్ళు చెపుతారు . ఎద్దుల గురించి చదువుతుంటే మా నాన్నకి మా ఇంట్లో ఉన్న ఎద్దుల మీద ఉన్న మమకారం గుర్తుకు వచ్చింది. వాటిని అమ్మవలసి వచ్చిన రోజు అయన కూతురిని అత్తవారింటికి పంపిన బాధ కంటే ఎక్కువ పడ్డాడు.. దాదాపు గా నాలుగేళ్ళు నెల నెల వెళ్లి చూసుకు వచ్చేవాడు వాటిని.
అమ్మ పాల కమ్మదనం చదువుతుంటే అమ్మతనం మీద మమకారం పెరగక పోదు.ఆటకెక్కిన అలక చదువుతుంటే మన చిన్ననాటి అలక ఎంత సేపో చెప్పకనే చెప్పుతుంది. అలాగే ఆడే వయసులో ఆడాల, కాసేవ్వఅత్తా భాగోతం, పాంచాలి పరాభవం, పరంటిది పెద్దోళ్ళు కతలు నవ్వు తెప్పిస్తే, పద్దినాల సుట్టం, తెప్ప తిరనాళ్ల, వోళ్ళేరుగని నిదుర, అడ పోడుసు సొంగోం కథలు కంటతడ పెట్టిస్తాయి. ఒక్క కథ పేరు చెప్పి ఇంకో కథ పేరు చెప్పకపోవడం ఆ కథలకి అన్యాయం చెయ్యడమే. ప్రతి కథ ప్రత్యేకమైనవే.
“అమ్మంటే కన్నతల్లె కాదు, అమ్మ బాస కూడా, అమ్మంటే అమ్మనేల కూడా” ఎంత చక్కటి విశ్లేషణ. ఇది చెప్పింది చదువుకొని రమేష్ తాతగారు. వారికి నా నమస్సులు. ఇలాంటి కథలు రమేష్ గారు మర్రిన్ని రాయాలని కోరుకుంటూ …

Pustakam.net vachina naa sameeksha 

Monday, February 11, 2013

రంగుటద్దాల కిటికీ .... ఎస్. నారాయణస్వామి

రంగుటద్దాల కిటికీ .... ఎస్. నారాయణస్వామి

ఈ కథా సంపుటం లో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి.  వీటిలో తప్పకుండా చదవల్సిన కథ తుపాకి ... కథ ముగింపు లో మనకి తెలీకుండానే కళ్ళలో నీళ్ళు తిరగక మానవు. మిగిలన కథల్లో వీరిగాడి వలస మధ్యతరగతి మనస్తవాన్ని తెలియ చేసే కథ. efficency ప్లీజ్ , వలయం, నిరసన లాంటి చిన్న కథలు అమెరికా లో జరుగుతున్నా కథలు . అమ్మాయి మనసులని తెలియ చేసే కథలు ఇండియన్ వాల్యూస్, డిటెక్టివ్ నీలు.  ధీరసమీరే ముగింపు యండమూరి వీరేంద్ర నాథ్  ఆనందో బ్రహ్మ కి నకలు...

దీంట్లో నాకు ఏమనాలో తెలీని కథలు ఒక మూడు ఉన్నాయి. అవి సాయం సేయరా డింభికా , ఖాండవ వనం, చక్కని చుక్క.  దీంట్లో సాయం సేయరా  కథలో  నాయకుడు పక్కింటి తెలుగు కుటుంబానికి అవసరానికి ఆదుకుంటాడు , ఆ తెలుగు కుటుంబం ఆతను వీరి ఇల్లు మారినప్పుడు ఈ రోజు నాకు కుదరకపోవచ్చు ఇంకో రోజు పెట్టుకోండి అంటారు. నాయకుడి భార్య కి ఒక అమెరికన్ కొలీగ్ ఉంటుంది ... ఆవిడ పెళ్ళికి వీళ్ళని పిలవదు కానీ వీరు ఇల్లు మారినప్పుడు  సహాయం చేస్తారు. ఇది కథ. అమెరికా లో ఉన్నవాళ్ళకి  అమెరికన్స్ పెళ్ళికి చాల తక్కువ మందిని పిలుస్తారు అన్నది బాగా తెలుసు. అలాంటిది ఈ కథలో వాళ్ళు పిలవలేదు అన్న ఫీలింగ్ దేనికో అర్ధం కాదు. అలాగే మనం ఒకళ్ళు మనకి సహాయం చేస్తారు ఫ్యూచర్ లో అని సహాయం చెయ్యము. మనకి కుదిరింది కాబట్టి చేసాం.. వాళ్ళకి కుదరలేదు అని అనుకోవడం మంచిది లేక పొతే అది సహాయం కిందకి రాదు, వ్యాపారం కిందకి వస్తుంది.
    ఖాండవ వనం కథలో పాత్రలు తెలంగాణా లో మాట్లాడుకుంటూ ఉంటారు.. మిగిలినది అంట వేరే భాషలో ఉంటుంది... అది కూడా తెలంగాణా లో ఉంటె ఇంకా మంచి కథ అయ్యేది. 
  చక్కని చుక్క కథ మంచి కథ... పిల్లలు మనం వాళ్ళని సరిగ్గా దారిలో వెళ్ళేలా చూస్తున్నామ లేదా అని. కాని కథనం లో కి వచ్చే సరికి చాల ల్లోప్ హోల్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఒకటి మాములుగా మన ఇళ్ళల్లో పార్టీలు అంటే, మనతో పాటు మన పిల్లలు కూడా ఉంటారు. పిల్లలు పిల్లలు మంచి స్నేహితులు  అవుతారు. ఇక్కడ అమ్మాయి కి అలాంటిది ఉండకపోవడం అన్నది ఆశ్చర్యం, ఇంకో blunder  ఏంటి అంటే దిలీప్ అమెరికా లో మాస్టర్స్ చదివి సెక్స్ విత్ మైనర్ ఇస్ క్రైమ్ అని తెలీకపోవడం. 

ఈ కథ సంపుటం లో నాకు నచ్చింది తుపాకీ, వీరిగాడి వలస మిగిలినవి ఇంకా బాగా రాయొచ్చు ఏమో అని నా అభిప్రాయం.  రచయితా లో మంచి భావుకుడు ఉన్నారు.

చెప్పుకోవలిసిన ఇంకో విషయం అన్వర్ గారి బొమ్మలు. అవి చాల బాగున్నాయి.

కినిగే లో దొరుకుతుంది ఈ పుస్తకం ....