Tuesday, November 16, 2010

ప్రేక్షకుల పై కత్తి కట్టిన కళ్యాణ్ రాం

అతనొక్కడే , హరే రాం విజయవంతం అయ్యాక కళ్యాణ్ రాం జయీభవ అని ఒక డకోటా సినిమా తీసాడు.. అది గల్ల పెట్టి దగ్గర గల్లంతయ్యింది. దాని తరవాత వరసగా పరాజయాలే సోపానాలుగా ఉన్న మల్లికార్జున్ తో కత్తి అని సినిమా మొదలు పెట్టాడు. మూడు పరాజయాలు కదా ఈ సారి అన్నా ఈ దర్శకుడు ఏదన్నా కొంచం కొత్తగా ప్రయత్నిస్తాడు ఏమో అని చూద్దాం అనుకున్నామో... మన మంగలి కత్తి తో మన గొంతు కోసుకున్నట్టే.

సినిమా పరమ పాత చింతకాయ పచ్చడి (అఫ్ కోర్సు అది ఆరోగ్యానికి మంచిది .. కాని ఈ సినిమా కాదు ). ఈ సినిమా హీరోలకి అందరికి ఒక జాడ్యం ఉంది. అన్న సెంటిమెంట్ , తమ్ముడి సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్ ఉన్న సినిమాలు గల్ల పెట్టెలను బద్దలు చేస్తాయని. ఇప్పటికే తమ్ముడి సెంటిమెంట్ మిద కళ్యాణ్ రాం సినిమా చేసేసాడు ...ఇంకా వరసలో మిగిలింది చెల్లి... తన సీనియర్ లు అయిన వాళ్ళు, తనతో పాటు సినిమాలు చేసే వాళ్ళు అందరు చెల్లి సెంటిమెంట్ మిద ఇప్పటికే చేసేసి ఉండటం వల్ల, తను వెనకపదిపోయాను ఏమో అన్న ఫీల్ తో ఈ సినిమా చేసాడు అనుకుంటా ...

ఈ సెంటిమెంట్ ఒక రాజశేఖర్ కి మాత్రం వర్కౌట్ అయ్యింది. గోరింటాకు సినిమా హిట్ అయింది. కాని మిగిలిన వాళ్ళకి కాలేదు . గోపి చంద్ కి లక్ష్యం తరవాత వచ్చిన శౌర్యం సుమారుగా ఆడింది. అది చెల్లి సెంటిమెంట్ సినిమా., కాని తారక్ కి రాఖి ఫ్లాప్ , పవన్ కి అన్నవరం ఫ్లాప్ , మహేష్ కి అర్జున్ ఫ్లాప్. ఇవి అన్ని చూసి కూడా మనకి వర్క్ అవుట్ అవుతుంది అని అదే పాత పద్దతిలో తియ్యడం ఒక పెద్ద బ్లండర్.

కథ లో మనకి కావాల్సిన కామెడి మనం ఏరుకోవచ్చు. వేణుమాధవ్, బ్రాహ్మి లాంటి వాళ్ళు ఉన్నా కాని కామెడికి కరువు సినిమాలో. కళ్యాణ్ మొహం లో నటన శూన్యం. చూడటానికి మాన్లీ గా ఉన్నాడు. డాన్సులు బాగా కష్టపడ్డాడు. నటన మాత్రం దరికి చేరనివ్వలేదు. సనాఖాన్ కొన్ని వైపుల నుంచి చూడటానికి బాగుంది. నటన లో కళ్యాణ్ రామ్ కి పోటి (మొహం లో ఒక భావం కనపడితే ఒట్టు). సినిమాలో ఇంకో ముఖ్య పాత్ర కిక్ శ్యాం ది. హీరో హీరోయిన్ లు ఇద్దరు దొందు దొందే లాగ నటించనప్పుడుఐ నేను మాత్రం తక్కువ తిన్నానా అని అయన సినిమా మొత్తం ఒకే మొహం తో లాగించేసాడు. ఆహుతి ప్రసాద్ అండ్ కో , చంద్ర మోహన్ అండ్ కో సినిమాలో ముప్పాతిక బాగం కనపడరు.

మణిశర్మ ఇంక సినిమాలు మానెయ్యడం మంచిది. సింహ పాట కి కాపి కొట్టేసారు. (సింహ మంచి చిన్నోడే వేట కొచ్చాడే .... దొర దొర దొర దండాలు ).ఇంకో పాట క్కోక్కో రకో పాట హ్యాపీ హ్యాపీ గా లో పుట్టుకు జరా జరా డుబ్బుకు మే పాటకు మక్కి మక్కి. (హ్యాపీ హ్యాపీ గా కి కూడా ఆయనే సంగీతం ). మిగిలిన పాటలు కూడా పాత పాట లే తిప్పి తిప్పి దేవిశ్రీ లాగా వాడారు. నేపధ్య సంగీతం ఒక దారుణమైన శిక్ష . సినిమాలో బాగుంది కమెరా పనితనం. నిర్మాణ విలువలు బాగున్నై. ఈ కత్తి కి దూరం గా ఉండటం చాల మంచింది ..

Monday, November 15, 2010

పొగమంచు .....


మేము ఉండేది ఎనిమిదో అంతస్తులో, ఎక్కువగా హాల్ లో నే పడుకుంటాం, పొద్దున్నే లేచే అప్పటికి రోజు ఆకాశం రోజుకో రకం గా కనపడుతుంది ... ఈ రోజు లేచే అప్పటికి ఆకాశం అంతా ఎర్రగా ... కింద అంతా సముద్రం లా మంచు పొగ .. మధ్య మధ్య లో కానీ కనపడకుండా చెట్లు .... అందులో కొన్ని ఆకులు లేకుండా , కొన్ని రంగు రంగు ల ఆకులతో భలే అందంగా కనపడింది. అలా చూస్తూ ఉండగానే పొద్దునే వీధిన పడుతున్నందుకు సంధ్యా దేవి తిట్టినట్టు గా మొహం అంతా ఎర్రగా చేసుకుని రానా వొడ్డ అనుకుంటూ వస్తున్నా సూర్యుడు వచ్చేసాడు.

సరే ఇలా చూస్తూ ఉంటె సమయం సరిపోదు అనుకుని తయారయ్యి బస్సు కోసం కిందకి దిగితే మా ఇంటి ముందున్న పచ్చగడ్డి అంతా మంచు తో వెలిసి పోయినట్టు గా వుంది. ఇంకా నీరెండ పడకపోవడం వల్ల ఇంకా నీటిగా మారలేదు ఏమో అనిపించింది.

బస్సు లో ఎక్కాక .. బైటకి చూస్తె చెట్లు చీల్చుకు వచ్చే కిరణాలూ కిందకి తాకాలా వొద్దా అని అలోచిస్తున్నై. కింద పడ్డ రంగు రగుల ఆకులు మంచు రజను కాస్త కరిగి రంగు రంగులు గా మెరుస్తూ కనపడుతూ ఒక వింత అందాన్ని సంతరించుకుంది. దారి పొడువునా సాగుతున్న చెట్లు వాటితో దోబుచులడుతున్న సూర్య రశ్మి దట్టంగా ఉన్న పొగ మంచు ఎదురుగా దూరం గా వస్తున్న కార్ హెడ్ లైట్స్ ని చూస్తుంటే మొత్తం మూడు సూర్యులా అన్న సందేహం రాక మానదు. బస్సు కొంత దూరం వచ్చేసరికి పొగమంచు ఎక్కువ కావడం వల్ల , తన ప్రతాపం పనిచేయ్యేక పోవడం వల్ల తెల్ల మొహం వేసిన సూర్యుడు చంద్రుడులాగా కనపడ్డాడు .బస్సు వంతెన మిద నుంచి వెళ్తుంటే ... కింద ఉన్న నది కనపడకుండా తెరలు తెరలు గా పొగ మంచు... ఎదురుగా ఉన్న ఇంకో వంతెనని దాచేస్తూ . ఇంత అందాన్ని చూస్తూ ఫోన్ లో హెడ్ ఫోన్స్ తో తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అన్న పాట వింటుంటే హటాత్తు గా కూరగాయలు, గ్రీన్ కార్డ్ సోది కోసం మానని విసిగించే వాళ్ళని చూస్తుంటే ఏమి చేయ్యలనిపిస్తుందో మీరే చెప్పండి .

ఫోటో కర్టేసి : రవి కిరణ్ వేమూరి

Monday, November 8, 2010

కెమెరా కబుర్లు ....


నేను మొట్టమొదటి సారిగా కమెరా ముందర నిల్చుంది బాగా చిన్నప్పుడు ఉహ తెలీని వయసులో. చిన్నప్పుడు చాలా మంది లాగే తిరుపతి మొక్కు ఆలస్యం అవ్వడం వల్ల కొన్ని రోజులు పిలక కట్టే వాళ్ళు.. ఫోటో మొదటి ఫోటో.. దాంట్లో నన్ను మా నాన్న ఎత్తుకుని ఉంటారు రెండో పక్క మా పక్కింటి సత్యం అన్న ఉన్న ఫోటో ఇప్పటికి మా ఇంట్లో ( మా సత్యం అన్న ఇంట్లో కూడా) గోడకి వేలాడుతూ కనపడుతుంది. తరవాత ఫోటో మా పెద్దక్క పెళ్లి లో ... దాదాపుగా ప్రతి ఫోటో లో ఉన్నా ... అప్పట్లో కలర్ ఫోటో అంటే చాలా ఖరీదు. ఆటోమాటిక్ గా కలర్ ఉండేది కాదు. దాంతో ఫోటో స్టూడియో వాడు ఒక నెల రోజులు దాదాపుగా తిప్పి కాని మన ఫోటోలు మనకి ఇచ్చేవాడు కాదు. తరవాత ప్రతి ఏడు బళ్ళో తీసే ఫోటోలు, మన నాటకాల ఫోటోలు ఏవో అన్ని ఒక డబ్బాలో ఉండేవి. కామెర అంటే సరదా ఉన్న కాని మనకి దాని అందుబాటులో లేకపోవడం వల్ల దాని మిద వ్యామోహాన్ని తొక్కి వెయ్యవలసి వచ్చింది.

నేను ఇంటర్లో ఉన్నప్పుడు బావగారు దుబాయ్ వెళ్లి పోయారు. అయన ఒక సారి సెలవలకి వచ్చినప్పుడు కెమేరా తెచ్చారు. (నాకు కాదులెండి ). ఇంకా చూసుకోండి.. మా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికీ ఎం పండగ ఉన్నా సరే మనం దాన్ని పట్టుకుని తాయారు అయ్యేవాళ్ళం. ఏప్రిల్ ఒకటి విడుదల దివాకరం లాగ అన్ని తిసేవాడిని. మళ్ళా అది కదిగించే దాగా వాళ్ళని నిద్రపోనించే వాడిని కాదు. నా బాద పడలేక (లేక వల్ల కెమేరా ఎక్కడ చెదగోదతానో అనో కాని మా అక్క సిఫార్సు వల్ల ఇంకోసారి వచ్చే అప్పుడు మా బావగారు నాకోసం యాషికా కెమెరా పక్టి కొనుకోచ్చారు . దాన్ని ఇంకా చూసుకోండి కోతికి కొబ్బరికాయ లాగ ఎడా పెదా నాలుగేళ్ళు వాడేసా ( పోకట్ మనీ సగం దానికే పోయేది). నాలుగేళ్ళ తరవాత ఫ్రెండ్ పెళ్ళికి అంతర్వేది పాలెం వెళ్లి అక్కడ ఎక్కడో మర్చిపోయి వచ్చా. దెబ్బకి ఇంకో రెండేళ్ళ వరకు కెమేరా కొనడం పడలేదు .

తరవాత ఇంకో యాషికా కొన్నాను. అది తెసుకునే అమెరికా వచ్చాను. అమెరికా తో నాతొ పాటు వచ్చినవి కెమెరా , ఇంకో ఫ్రెండ్ ఇచ్చిన వాక్ మాన్ (అది అమెరికా నుంచి వచ్చిందే ) దిగగానే నేను చూసిన న్యూ యార్క్ , ఫిలడెల్ఫియా అన్ని దీంతో తీసాను. తరవాత ఉద్యోగం లో జేరగానే వచ్చిన మొదటి జీతం తో నికోన్ కెమేరా కొన్నా.. యాషికా కెమేరా అలవాటు నికోన్ కి కొంచం కష్టమే (యషికా బరువు తక్కువ, నికోన్ బరువు ఎక్కువ ) కానీ తొందరలో బాగా అలవాటు అయ్యింది. ఇంకా కెమెరా తో బోలెడు ఫొటోస్ ఎద పెదా తెసాను. ఫొటోస్ తియ్యడం ఒక ఎత్తు అయితే వాటిని కడిగించి ఫొటోస్ తియ్యడం ఒక పని. ఇక్కడ గ్లోస్సి ఫొటోస్ తొందరగా డెవలప్ చేసేవారు కాని నేను మాట్ ఫినిష్ కావలి అనేవాడిని. దాంతో ఆలస్యం అయ్యేది (గ్లోస్సి ఫొటోస్ కాలం గడిచిన కొద్ది రంగు వెలిసే అవకాసం ఎక్కువ, మాట్ ఫినిష్ లో అవకాశం తక్కువ . ఇండియా వెళ్లి నప్పుడు మాత్రం డస్ట్ కి నా అజాగ్రత్త తోడూ కావడం తో లెన్స్ లో ఒక భాగం కొంచం పాడయింది. ఒక నట్టు ఊడిపోయింది. దాని బాగు చెయ్యడం కన్నా కొత్తది కొనడం ఇక్కడ చవుక కాబట్టి కొత్త లెన్స్ కొనుకున్నా.

పానాసోనిక్ లో కాంట్రాక్ కి పనిచేస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా డిజిటల్ కమేరాలు . దాంట్లో పనిచేస్తుండటం వల్ల దాదాపుగా డెబ్బై శాతం తగ్గింపు ధరకి వచ్చింది. దాంతో దాదాపు గా ఒక పది కమేరాలు కొని స్నేహితులకి పంచిపెట్టాం. కాని అది బాగా చిన్న కమెరా .టూ మెగా పిక్షల్ కెమెరా అది అందువల్ల క్లారిటీ సరిగ్గా ఉండేది కాదు . కమెరా ఎక్కడ ఉందొ కూడా గుర్తు లేదు ఇప్పుడు. నా యాషికా కెమెరా తో పాటు అది కూడా ఇచ్చేసి ఉంటానా మా మామేనల్లుడికి ?? ఏమో...

తరవాత ఒక ఒకసారి తానా సభలకి వెళ్ళాను. అక్కడ కి వెళ్ళే ముందర డిజిటల్ కెమెరా కొనాల్సిందే అని నికోన్ డి ఇంకో డి సెవెంటీ ఎస్ కొన్నా అప్పుడే మార్కెట్ లో కి వచ్చింది అది. దాంతో పాటులెన్స్ ఇంకా బోలెడు కొన్నా.. కెమెరా బాగా జాగర్త గా నే చూసుకున్నా ... అది తిరగని స్థలం లేదు నాతొ పాటే తోకలాగా ఒకే ఒక సరి మాత్రం ఇంట్లో మర్చిపోయే వెళ్ళా... మధ్యలో ఇండియా వెళ్ళిపోతూ ఇంకో స్నేహితుడు తన నికోన్ ఇచ్చేసి వెళ్ళాడు.. దాంతో ఇంట్లో ఉన్న నికోన్ సంఖ్యా మూడు కి చేరింది. అన్ని ఎస్ ఎల్ ఆర్ కేమెరాలే . (ఎవరన్న చిన్న కెమెరా ఇస్తే మనకి చేతికి అనేది కాదు భారి కెమెరాలు వాడటం valla ) అలాంటి ఇబ్బంది ఒకసారి బాలయ్య గారి దగ్గర వచ్చింది . తానా లో ఒకసారి వాళ్ళ ఫ్యామిలి ఫోటో తియ్యమని అయన తన చిన్న కెమెరా ఇస్తే మనకి అది ఎలా పనిచేస్తుందో తేలిక తికమక పడి అది ఆయనకి తిరిగి ఇచ్చి నా కెమెరా తో తీసి ఆయనకి ... మెయిల్ చేసాను.

గత ఏడాదిగా కొత్త కామేరా కొనడం కోసం ఆలోచన... ఎక్కడా.. కుదిర్తేనా ఇంట్లో మూడు కెమెరాలు ఉన్నాయ్..ముందర ఒకటి అన్నా అమ్మెయి అని గోల... సరే అని చివరకి ఒక స్నేహితుడికి నా డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ అమ్మేసా నిన్నే .... కొత్తది కొనాలి.. ఇంకా మార్కెట్ లో కి రాలేదు... సారి నికోన్ డి సెవెన్ తౌసండ్ కొందాం అనుకుంటున్నా ..

Friday, October 29, 2010

శిశిరం .


చిన్నప్పుడు మా ఊర్లో వీధి లో రెండు రావి చెట్లు ఉండేవి ... దాని ఆకులు అప్పడప్పుడు రంగు మారుతూ సంక్రాంతి సమయానికి చెట్లు మొత్తం బోడిగా ఉండేవి ఎండాకాలం లో ఆ చెట్ల కింద పులి మేక ఆటో , పెకాటో ఆడేవాళ్ళు.. వేసవి లో చెట్టు ని పచ్చగా చూసి, సంక్రాంతి పండగ కి ఊరికి వచ్చి అలా చూడాలి అంటే బోలెడు బెంగ వేసేది. మళ్ళా ఎప్పుడు ఆకులతో చూస్తామో అని అనిపించేది. అదే కాదు ఇంటి ముందర ఉన్న వేప చెట్టు కూడా బోలెడు ఆకులని రాల్చేది కాని మొత్తం బోడిగా ఉండేది కాదు. (మా పనివాడు ఆ ఆకులని ఎత్తి పోయ్యలేక గొణిగేవాడు ) కాని మొక్కలు / చెట్లు మొత్తం రంగు మారడం కాని మొత్తం చెట్లు అన్ని బోడిగా అవ్వడం అన్నది నేను పెరిగిన చోట ఎక్కడా చూడలేదు. అలాంటిది అమెరికా వచ్చిన కొత్తలో ఫాల్ డ్రైవ్ కి వెళ్దాం అని అడిగితె అర్ధం కాలేదు.
అక్టోబర్ మాసం మొదలు అవ్వగానే చెట్లు మెల్లి మెల్లి గా ఆకుల రంగు మారుతూ అక్టోబర్ మాసం ముగిసే సరికి దాదాపుగా మోడుగా మారిపోతాయి. చలి ఎక్కువగా ఉంటె ఇంకా తొందరగా కూడా అవ్వొచ్చు లెండి. రోజూ బస్ లో వచ్చే అప్పుడు పుస్తకం చదవుకోవడమో , పాటలు వినడమో అలవాటు అలాంటిది ఈ శిశిరం లో కాని వసంత మాసం లో కాని బైటకి చూస్తూ ప్రకృతిని చూడటం ఎంత బాగుంటుందో .. గత ఏడాది శిశిరం లో భారి వర్షం పడి ఆకులు అన్ని ఒక్కసారి ఆ గాలి కి రాలి పోయి ఒక్కసారిగా మోడు పడిపోయాయి. అయ్యో ఈ ఏడాది ఒక్క ఫోటో కూడా తియ్యలేదు అని ఎంత భాద పడిపోయానో. ఫాల్ డ్రైవ్ కి రెండు వారాల క్రితం వెళ్దాం అనుకున్నాం. కాని మా సుబ్బి శెట్టి గారు కుదరన్నివ్వలేదు (పెట్రోల్ బిల్ అవుతుంది అని మనసులో అనుకున్నాడు) పొద్దునే బాల్కనీ లో నుంచి చుస్తే రంగు రంగుల చెట్లు ఊరినిండా దూరం నుంచి చూడటానికి ఒక పూల గుత్తి లాగా కనపడుతుంది.
రోజు చూసే చెట్టే కాని ఒక రోజు పొద్దున్న లేచే అప్పటికి కొత్తగా రంగు రంగులుగా కనపడుతుంది కొన్ని చెట్లు ఎర్రగా కొన్ని లేత గులాబీ రంగులో కొన్ని పసుపు పచ్చగా ... లేక పొతే ఒక చెట్టే సగం ఆకులు ఒక రంగులో.. మిగిలిన సగం ఇంకో రంగులో ఉంది చూడటానికి కంటికింపుగా కనపడతాయి... కొన్నిసార్లు అవి ఆకులా లేక గులాబి రేకులా అన్న సందేహం రాకపోదు అంట బాగుంటాయి ఆకుల రంగులు.
శిశిరం ఆఖర్లో వచ్చే హల్లోవిన్ పండగ కోసం ఇంటి ముందర పెద్ద పెద్ద గుమ్మడి కాయలతో , దానికి తోడూ దారి పొడుగునా గుమ్మం దాక రాలిన ఆకులు చూస్తూ ఉంటె ఎంత బాగుంటుందో ... ఆ చెట్లు ఈ చలి కాలం అంతా ఇలా బోడిగా ఉండాలి కాబోలు అని తలచుకుంటే బోలెడు బాధ .. ఇంకో నలుగు నెల్లల్లో వసంతం వస్తుంది అని మనలని మనం ఓడర్చుకోవడం తప్ప ఎం చెయ్యగలం ...

Friday, October 15, 2010

వై వి ఎస్ కామెడి ...

సినిమా వాళ్ళల్లో మందు మగువ జోలికి పోనీ అతి కొద్ది మంది లో వై వి ఎస్ గారు ఒకరు. ఆ విధం గా అయన అంటే నాకు మంచి గౌరవం ఉంది. దానికి నేను కింద చెప్పబోయే దానికి సంబంధం లేదు.
భారతీ రాజా గారి దర్శకత్వం లో వచ్చిన సీతాకోక చిలక సినిమా గుర్తు ఉంది కదా ... ఆ సినిమా లో నాయకుడు మురళి కార్తికేయన్ (తెలుగు లో మురళి అని తమిళ్ లో కార్తిక్ అని అంటారు..) ప్రముఖ తమిళ నటుడు ముత్తురామన్ కొడుకు . ఆ సినిమా మీద ఒక ఆర్టికల్ చేద్దాం అని అనుకున్నప్పుడు ప్రముఖ చాయగ్రహుడు కన్నన్ తో మాట్లాడాను . (కన్నన్ గారు ప్రముఖ దర్శకుడు యోగానంద్ కొడుకు ) అప్పుడు అయన చెప్పిన కథ :

సీతాకోక చిలక సినిమా కోసం హీరో కోసం వెతుకుతూ ఉంటె ఒక రోజు ఇంటి పక్కన గల్లి లో క్రికెట్ ఆడుకుంటున్న అబ్బాయి కనపడ్డాడు.. భారతీ రాజా ఆ అబ్బాయి దగ్గరకి వెళ్లి ఎవరబ్బాయివి , మా సినిమాలో హీరో వేషం వేస్తావా అని అడిగారు అంట .. అప్పుడు ఆ అబ్బాయి తాను ముత్తు రామన్ కొడుకు అని తొందరలో సినిమా మొదలవ్వబోతోంది అని చెప్పారు అంట. భారతీ రాజా పట్టుబట్టి తన సినిమాలో హీరో గా తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సీతాకోక చిలక లో నటింప చేసారు ( తమిళం లో రాధ , తెలుగు లో ముచ్చెర్ల అరుణ హీరోయిన్ లు గా చేసారు ) ..

ఒక్క మగడు , సలీం చిత్రాలు రెండు దారుణంగా ఫ్లాప్ అవ్వడం తో తరవాత సినిమా కోసం ఆలోచిస్తున్న చౌదరికి పవన్ కల్యాణ్ కబురు పంపారు. తన అక్క కొడుకు సాయి ధర్మ తేజ ని హీరో చేసే బాధ్యత ఒప్పగించాడు.. దానికి దాదాపు గా ఎనిమిది కోట్లు చెక్ కూడా ఇచ్చాడు అని సినిమా జనల భోగట్ట.. దానికోసం చౌదరి ఈ మధ్య ఎవరికీ చెప్పకుండా అమెరికా అంతా లొకేషన్ ల కోసం తిరిగాడు కూడా .. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి తన సొంత బ్యానర్ మిద సినిమా తీస్తునట్టు తెలియజేసారు . అంతే హీరో ని ఎలా కనుకున్నారు అంటె ... పవన్ కళ్యాణ్ చూపించాడు అని చెప్పకుండా ... ఆ అబ్బాయి మా ఆఫీసు దగ్గర క్రికెట్ ఆడుతుంటే చూసి హీరో గా వేస్తావా అని అడిగా .. అప్పుడు చెప్పాడు తాను చిరు గారి మనల్లుడు అని... ముప్పై ఏళ్ళ క్రితం మురళి కి జరిగిన కథ ఇప్పుడు మళ్ళి కొత్తగా జరిగినట్టు గా చెప్పారు...

మనవాళ్ళు సినిమాలో సన్నివేశాలే కాదు జీవితం లో సన్నివేశాలని కూడా కాపి కొడతారు అని నిరూపించారు ....

Monday, October 11, 2010

ఖలేజా - ఓ సినిమా కథ ...

ఖలేజా సినిమా రివ్యూ మళ్ళి మళ్ళి రాసి విసిగించదలచుకోలేదు ...

ఖలేజా సినిమా దాదాపుగా పూర్తీ అయ్యింది అన్న వార్త వచ్చినప్పటినుంచి బోలెడు అంచనాలు... అభిమానుల హుంగామ... ఇంకో పక్క రోబో డబ్బింగ్ సినిమా చరిత్రలో కానీ విని ఎరుగని ధరకి అమ్ముడుపోవడం.. ఒక వారం ముందర అది కూడా విడుదల కి సన్నాహాలు చేసుకోవడం తో టెన్షన్ మొదలు అయ్యింది. మధ్యలో బృందావనం కూడా విడుదల అవ్వొచ్చు అన్న ఒక వార్త దానికి తోడై ఇంకా ఎక్కువ అయ్యింది...

ఇక కథలో కి వస్తే ... మా ఊర్లో రోబో తమిళ్ వెర్షన్ విడుదల ఒక రెండు వారాల ముందర నుంచి మొదలు అయ్యింది... మా వాళ్ళు పోస్టర్ అంటించడం ఆలస్యం సినిమా ఎక్కడ , ఎప్పుడు , టిక్కెట్ ఎంత ... ఎక్కడ అమ్ముతారు అని వరసగా ఫోన్స్.. ఇంకో పక్క సినేమార్క్ వెబ్ సైట్ వాడేమో షెడ్యూల్ అప్ లోడ్ చెయ్యడు. అసలు ప్రింట్లు వస్తాయా రావా అని ఒక టెన్షన్.. మన తెలుగు వాళ్ళు ఒత్తి వెధవాయులోయి అన్ని గిరీశం గారు తెలుగు వాళ్ళని అన్నారు కాని తమిళ్ తంబి లని కాదు కదా అని ఒక ఓదార్పు .. తమిళ్ తంబిల సినిమా ఎప్పుడు సరిగ్గా సమయానికి విడుదల అవుతుంది.. మనవాళ్ళ సినిమాలు నూటికి డెబ్బై శాతం వరకు ప్రింట్స్ కాని డి టి ఎస్ కానీ సమస్య అవుతుంది.. డిజిటల్ వచ్చాక కూడా ఆ సమస్య పోలేదు.. రేలైన్సు వాళ్ళు సరిగ్గా అప్ లోడ్ చెయ్యక... చేసినా పాస్ వర్డ్ పంపక బోలెడు సార్లు సినిమాలు ఆలస్యం అయ్యి పంపణీ దారులని త్రిశుంక స్వర్గం లో నెట్టారు.. తాజా ఉదాహరణ కొమరం పులి.. సినిమా ఒక రోజు ఆలస్యం గా విడుదల అయ్యింది అమెరికా అంతటా... దాంతో కొన్నవాళ్ళకి బోలెడు నష్టం.. (పవన్ కళ్యాణ్ తన పారితోషికం లో కొంత తిరిగి నిర్మాతకి తిరిగి ఇచ్చాడు అని తాజా వార్త .. కాని ఆ నిర్మాత కొన్నవాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా ).

సరే తమిళ తంబిల ని నిరశాపరచాకుండానే సినిమా ప్రింట్ ఒక రోజు ముందుగానే మా ఊరు వచ్చింది .. కాని వెబ్ సైట్ లో సినేమార్క్ వాడు ఇదిగో వస్తోంది అని పెట్టలేదు .. సినిమా ఏమో రేపే విడుదల ఇంకా చూస్కోండి వస్తోందా రాదా అని ఎడా పెదా ఫోన్స్ .. చివరకి మా మిద దయ తలచినట్టు గా వాడు సైట్ లో పెట్టాడు . వాడు పెట్టిన గంటకి మొదటి రేజు రెండు ఆటలు ...ఫుల్ల్స్ , ఇంకో గంటకి శని, ఆది వారాలు కూడా ఫుల్ అయ్యాయి... ఇంకా ఆ రెండు రోజులు మీ దగ్గర ఏమన్న్నా టికెట్లు ఉన్నాయా అని ఫోన్స్.. తెలుగు రోబో ఎప్పుడు అని ఫోన్స్.. తెలుగు రోబో, ఖలేజా రెండు ఒకే సారి విడుదల చేస్తాం మీ ఊర్లో అని పంపిణీ దారుని ఉవాచ .. సరే అని అదే చెప్పా మా ఊర్లో జనాలకి ... ఇంకా అప్పటి నుంచి ఖలేజా హడావుడి మొదలయ్యింది ...

ఇండియా లో మా వాళ్ళని అడిగితె సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అని అనుకుంటున్నాం అని అన్నారు.. నాకు ఏమో మూడేళ్ళు తీసే సినిమాల మీద అంత నమ్మకం లేదు ఎప్పుడు (అరుంధతి లాంటి సినిమాకి పట్టొచ్చు కానీ సంఘీకం సినిమాలకి అంత సమయం దేనికో నాకు అర్ధం కాదు ). ఆ మాట అంటే ... లేదు త్రివిక్రమ్ , మహేష్ ఇద్దరి సినిమా అతడు కన్నా ఇంకా మంచి సినిమా అది ఇది అని నాకు సుద్దులు చెప్పారు .. ఇంతలో సెన్సార్ లో ఉండే స్నేహితుడు ఒకడు ఫోన్ చేసి .. సినిమా మహేష్ తప్ప సోది అని చల్లగా చెప్పాడు.. ఆ ముక్క మావల్లతో అంటే మీ సెన్సార్ వాళ్ళు అంతే లే.. సినిమా సూపర్ గా ఉంటుంది మీ వాళ్ళకి చూడటం తెలీదు అని చెప్పారు. సరే ఇంకో రెండు రోజుల్లో తెలుస్తుంది కదా అని ఆగాను...

హైదరాబాద్ లో కన్నా విజయవాడ లో ముందర విడుదల అవ్వటం తో నెట్ లో దాని మీద వాడిగా వేడిగా చర్చలు జరిగాయి... సాయంకాలం ఎనిమిది నుంచి వరసగా ఫోన్ లు మొదలు అయ్యాయి.. ఒక్కళ్ళు కూడా మెచ్చుకున్న పాపాన పోలేదు. ఒక్క వీర ఫాన్ మాత్రం సినిమా సూపర్ మీదే తప్పు అని భాద పడ్డాడు . న్యూ జెర్సీ , సానోస్ లాంటి చోట్ల సినిమా అవ్వడం ఆలస్యం ఫోన్ చేసి దర్శకుడిని తిట్టిపోయ్యడమే.

మాకు ఏమో ఇంకా ప్రింట్ రాలా.. సరే పొద్దున్న కన్నా వస్తుందో రాదో అని ఆలోచిస్తూ పడుకున్నా...

మర్నాడు ప్రింట్ వచ్చింది కాని సినేమార్క్ వాడు షరా మాములుగా వాడి వెబ్ సైట్ లో పెట్టలేదు. దాంతో సినిమా ఉందా లేదా అన్నది జనాలకి తెలీకుండా పోయింది. ప్రతి పది నిమషాలకి ఒకసారి ఫోనో ఎస్ ఎం ఎస్ కానీ వచ్చేవి .. సినిమా ఉందా లేదా అని.. చివరకి నా బాద పడలేక సిని మార్క్ వాడు నలుగు గంటలకి వాడి సైట్ లో సినిమా ఉంది అని పెట్టాడు.. పెట్టిన పావు గంటలో టికెట్స్ ఆ రోజు ఉన్న ఒక్క షో కి అయ్యిపోయాయి . మా రూం మేట్ కొనడం తో నాకు టికెట్ ఉండింది..

ముందర వెళ్లి అందరికి సీట్స్ ఆపాము. ఇండియా లో లాగ ఇక్కడ సీట్స్ నంబర్లు ఉండవు కదా మరి .. ఇంకా సినిమా మొదలు అయ్యే దాక వచ్చే పొయ్యే వాళ్ళకి పళ్ళు ఇక్కిలిస్తూ , బుర్ర ఊపుతూ తింగర ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాం .
సినిమా మొదలు అవ్వగానే ఇంకా మావాళ్ళు కయ్యి మని విజుల్స్ వెయ్యడం మొదలు పెట్టారు...మహేష్ బాబు కనపడగానే స్క్రీన్ మీదకి కాగితం ముక్కలు వేసారు...

ఇంకా మహేష్ బాబు గారు గ్రాఫిక్ పాము పట్టుకుని ... ఏదో అర్ధం పర్ధం లేని పోరాటం ఒకటి చేసి నలుగురిని చంపి ...గుర్రం మీదకి ఎక్కడానికి గోడ ఎక్కి దాని మీదకి దూకుతాడు (ఇక్కడే విచిత్రం జరిగిపోతుంది... గుర్రం మీదకి దూకిన మహేష్ బాబు .. మోటర్ బైక్ మీద తేలుతాడు మనకి ఎం జరిగందో కొంచం సేపు అర్ధం కాదు) తరవాత మళ్ళి మహేష్ బాబు ని చూడటం లో మునిగిపోతాం. కొన్ని కుళ్ళు కామెడి దృశ్యాల తరవాత మహేష్ కి అక్కలాగా ఉండే అనుష్క వస్తుంది. ఆవిడ విల్లన్ కొడుకుతో హెలికాప్టర్ ఎక్కి (అమ్మాయి వొంటి మిద నగలు ఉండవు ఆ సమయం లో ) ఎడారి లో కాండిల్ లైట్ డిన్నర్ కి వచ్చి సరదాగా ఎడారిలో పారిపోయి హీరో దగ్గర తేలుతుంది ... ఇక్కడ ఇద్దరు సాంగ్ వేసుకునే సమయానికి నగలు వచ్చేస్తాయి... సెల్ ఫోన్ హీరో హీరోయిన్ లకి తప్ప అందరికి పని చేస్తుంది ... (సునీల్ సెల్ ఫోన్ తో ఫోన్ చేసి వాళ్ళ వాన్ తెప్పించుకుని వెళ్ళిపోతాడు )

మహేష్ బాబు, అనుష్క అక్క బస్సు ఎక్కుదాం అనుకునే సమయానికి సుబ్బరాజు వచ్చి ఒక పోటు పోడుస్తాడు ... పొడిచి మహేష్ వివరాలు ఫోన్ లో ప్రకాష్ రాజ్ కి చెప్తాడు మరి ప్రకాష్ రాజ్ కి మహేష్ వివరాలు ఎలా తెలుసో మహేష్ బాబు కే (సినిమాలో మహేష్ బాబు దేవుడు మరి ) తెలవాలి .. ఇలా సినిమాలో ఒకో సీన్ కి ఒకో రకం గా మనుషులు మారిపోతూ చివరకి మహేష్ బాబు ని దేవుడిని చేసి మానని వెధవలని చేసి పంపుతారు ...

సినిమాలో బాగుంది ఒక్కటే ... మహేష్ ... మహేష్ ... మహేష్ ... అది ఒక్కటే సినిమాకి బలం .. బలహీనత ...

మిగిలిన బలహీనతలు : కథ , కథనం , సంగీతం... మణిశర్మ ఇంత దారుణంగా మహేష్ బాబు చిత్రానికి సంగీతం ఇవ్వడం ఇదే మొదటి సారేమో ... బగున్న ఇంకో అంశం చాయగ్రహణం ....

Thursday, October 7, 2010

కామెడి నందుల ప్రహసనం ...

దాసరి గారికి ఉత్తమ నటుడు అవార్డు అది కూడా మేస్త్రి సినిమా కి ... ఆ సినిమా వచ్చి వెళ్ళినట్టే చాలమన్డికి తెలీదు సొంత వూరు అన్న సినిమా ఎ ఊర్లో ఆడిందో దేవుడికి తెలవాలి ఒక రకం గా అది డాక్యుమెంటరీ సినిమా. అంతే మనకి డాక్యుమెంటరీ సినిమాలకి అవార్డు ఇస్తారు ఏమో ... తెలుగు ఏంటో తెలీని హీరోయిన్ కి ఉత్తమనటి అవార్డు... ఇంకోసారి దర్శకుడు కి ఉత్తమ నూతన దర్శకుడి అవార్డు ఇచ్చారు... బాణం దర్శకుడి కి ఎందుకు రాలేదు ... రాజకీయం తప్ప ! వడ్డించే వాడు మనవాడు అయితే విస్తరి చివర కూర్చున్నా అన్ని దొరుకుతాయి అంటే ఇదేనేమో ... కలవరమాయే మదిలో సినిమా కూడా అంతే ... ప్రొడ్యూసర్ కి కలవరం తప్ప ఎం మిగలలేదు .. ఆ సినిమా అతుకుల బొంత సినిమా దానికి అవార్డు ఏంటో ... సొంతవూరు, ఇంకోసారి సినిమాలకి నాయకుడు రాజా , కాంగ్రెస్స్ కి చెందిన వాడు కావట్టి ఆ సినిమాలకి అవార్డు వచ్చింది అనడం లో ఎటువంటి సందేహం లేదు... అలాగే దాసరికి మంత్రి పదవి ఎలాగు పోయింది కాబట్టి కంటి తుడుపుగా ఒక అవార్డు ఇచ్చి కుర్చోబెట్టినట్టు గా ఉంది ... అలాగే సమీక్షలు కాపి కొట్టి రాసే విలేఖరి కి ఉత్తమ క్రిటిక్ అవార్డు .... ఇంత చెత్త అవార్డు లు నాకు తెలిసి ఇదే మొదటి సారి ...

Tuesday, October 5, 2010

నేను .. బ్లాగు ....

దాదాపు మూడేళ్ళ క్రితం బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు ముఖ్యం గా మా సైట్ లో ఉన్న పాత ఆర్టికల్స్ వెతకడం కష్టం అవుతోంది కాబట్టి ఇక్కడ అన్ని పెడదాం అని మొదలు పెట్టాను. నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ... తరవాత ఏవో కొన్ని ఆర్టికల్స్ పెట్టాను.. మళ్ళా కొన్ని రోజులు ఎం పెట్టలేదు... తరవాత ఒక సారి డెట్రాయిట్ వెళ్ళినప్పుడు చాలా మంది బ్లాగర్లు కలిసారు... అప్పటికి నేను బ్లాగ్ రాస్తున్నా అని కూడా చెప్పలేదు. కాని నేను మా తెలుగుసినిమా సైట్ ద్వారా చాలా మందికి తెలిసి ఉండటం వల్ల వాళ్ళ మీటింగ్ లో కుర్చోవలిసి వచ్చింది. నాకు తెలుగు లో రాయడం ఒక యజ్ఞం అప్పటికి (కంప్యూటర్ లో సుమా ) అందువల్ల అప్పటికి తెలుగు లో రాయాలని కూడా ఆలోచించలేదు ... ఆ మీటింగ్ లో గూగుల్ తెలుగు ఉందని తెలిసి సరే ఇంకా బ్లాగ్ తెలుగు లో రాయాలి అని నిశ్చయించుకున్నాను. మొదట్లో అసలు బ్లాగ్ కి పేరు కూడా పెట్టలేదు .. తరవాత నేను సినిమాలు .. పుస్తకాలూ ఇంకా అన్ని అని పెట్టాను... కొన్ని రోజులకి బోర్ కొట్టింది ... ఇదేదో సొంత సోది అని అనుకుంటారు అని అనిపించింది .. అప్పుడే ఉగాది వచ్చింది .. సరే తెలుగు వాళ్ళకి ఏంటో ఇష్టమైన పండగ కదా మన జీవితాలకి సరిపోతుంది కదా ఇది పెడితే ఎలా ఉంటుంది అని ... ఆ పేరు పెట్టాను... తీరా చూస్తె ఉగాది తెలుగు వల్లే కాదు ... ఉత్తరభారతం లో కూడా చేసుకుంటారు అక్కడ కూడా ఇలాంటిదే ఏదో పచ్చడి చేస్తారు అని తెలిసింది ... దేవుడా అనుకున్నా ... పేరు మార్చాక రెగ్యులర్ గా కామెంట్ చేస్తే వాళ్ళు చాలా మంది తెలీక రావడం మానేసారు ... దాంతో ఇప్పుడు మళ్ళి పేరు మార్చాలి అంటే అలోచినలో పడ్డాను...
కామెంట్స్ వాటి ప్రభావం : చాలా వరకు ప్రోత్సాహకరంగానే ఉంటాయి... కాని నేను అప్పుడప్పుడు సినిమా రివ్యూ లో నేగితివే గా రాస్తే .. కొంతమంది బూతులు పంపుతారు... నాకు భాద కాదు కాని నవ్వు వస్తుంది ... ఆ రాసేది కూడా పేరు లేకుండా అనామకులు గా పంపుతారు.. అంత ధైర్యం లేకుండా అనామకం గా పంపడానికి పాపం ఎంత కష్టపడతారో కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు .. కొంతమంది ఏమో మీరు .. మీ నేపధ్యం వివరాలు పంపండి అని మెయిల్ పంపుతారు ... ఇది కొంచం ఇబ్బంది పెట్టె విషయం.. అవతల వ్యక్తీ గురించి తెలీకుండా .. తెలిసినా కాని మన వివరాలు , అభిరుచులు మొత్తం ఎలా చెపుతాం .. మీతో స్నేహం చెయ్యాలని ఉంది అని మెయిల్ పంపుతారు .. అది కూడా కొంచం ఇబ్బందే ... స్నేహం అనేది మనం చేస్తే రాదు ఏమో అని నా అభిప్రాయం అది కాలం తో పెరిగేది
ప్రస్తుతానికి మళ్ళా పేరు మార్చే ఆలోచన కి కొంచం విరామం ఇద్దాం అని అనుకుంటున్నా ...

Sunday, October 3, 2010

కరెంటు పొతే ....

మరీ చెత్త ప్రశ్న ... కొవ్వొత్తి వెలిగించుకోవచ్చు కదా...అని చిన్న పిల్లాడు కూడా చెప్తాడు.. దానికి మళ్ళా బ్లాగ్ లో రాయాలా సోది కాకపోతే అని తిట్టిపోయకండి ..మామూలుగా అయితే అంతే.. అది ఒక గంట రెండు గంటల కట్ అయితే సమస్య లేదు ... భారత దేశం లో అయితే రోజు కరెంటు పొతూ నే ఉంటుంది కాబట్టి అంత పెద్ద విషయం అసలు కాదు... కోవోత్తో ,ఊళ్ళో అయితే కిరసనాయిలు లాంతరు వెలిగించి జీవితం గడిచిపోతుంది. కాని పొద్దున్న లేచి కరెంటు పొయ్యి వెలిగించి (లేదా మైక్రో వేవ్ లో పెట్టి ) కాఫీ కాని కార్న్ ఫ్లకేస్ కాని తిని పొద్దునే బస్సు (లేదా కార్ పూల్ కో ) బయలుదేరని వాళ్ళు ఉండరు ఏమో అమెరికా లో.. అలాంటిది ఒక గాలి వాన కి మన అపార్ట్మెంట్ కాంప్లేక్స్ ఒక నాలుగు రోజులు కరంట్ మటాష్ అయితే మన పని మటాష్ అని వేరే చెప్పాలా...

గత వారం మా ఏరియా లో బోలెడు గాలి .. ఒక చిన్న వాన వచ్చింది.. ఆ దెబ్బకి మా పక్క బిల్డింగ్ పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మ ఒకటి విరిగి కరంట్ తీగల్ని తాకుతూ కింద పడ్డాయి.. ఇలాగే మా చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లో జడగడం వల్ల దాదాపు గా ఒక యాభై వేల ఇళ్ళల్లో కరంట్ పోయింది...ఇది జరిగింది మధ్యానం. ఆ సమయానికి మనం పని లో ఉండటం తో , (అక్కడ కరెంటు పోలేదు లెండి ). మా రూంమేట్ ఎస్ ఎం ఎస్ పంపాడు ... కరంట్ పోయింది అని.. ఇక్కడ కరెంటు పొతే ఒక అర గంట లో మాములుగా వచ్చేస్తుంది లే అన్న ధీమాతో ... ఇట్ ఇస్ ఓకే అని రిప్లై పంపా. ...
ఇంటికి వెళ్ళే సమయం కి ఎందుకన్నా మంచింది అని పక్కనే ఉన్న డాలర్ షాప్ లో ఒక రెండు కొవ్వొత్తులు (మాకు ఒకటి .. మా పక్క ఇంటివాళ్ళ కోసం ఒకటి ) కొని ఇంటికి బయలుదేరా ... ఈ లోపల మా వాడి రెండో ఎస్ ఎం ఎస్ ఇంకా రాలా కరంట్ ..నేను ఇంకా ఆఫీస్ లో నే ఉన్నా... నా భోజనం ఇక్కడే అవ్వొచ్చు ...మీరు మన రెస్టారంట్ కి ఆర్డర్ ఇస్తారా అని ఉంది... నేను ఇంటికి చేరాలంటే రెండు బస్సులు మారాలి.. రెండు బస్సు ఎక్కే చోట మాక్ డొనాల్డ్స్ ఉంది .. అక్కడ కి వెళ్లి రెండు మాక్ చికెన్ ఆర్డర్ చేస్తే ఆ అమ్మాయి ఆస్ప్రో బిళ్ళలు లాంటి చిన్న చిన్న బన్ను ముక్కుల మధ్య ఇంకా చిన్న చికెన్ ముక్క పెట్టి ఇచ్చింది. అది ఇద్దరికీ సరిపోదు (ఇంకో పక్క బస్సు వస్తుంది ఏమో అన్న కంగారు..) మొత్తానికి ఇద్దరికీ సరిపడా ప్యాక్ చేయించు కొని బస్సు స్టాప్ కి వచ్చా... అక్కడ రోజు బస్సు స్టాప్ లో కనపడే అరవ అబ్బాయి కనపడ్డాడు.. సరే అని ఆ అబ్బాయి కి తెలుసో లేదో ఇంకా బస్సు కూడా రాలేదు అని ఆంగ్లం లో ఇలా కరంట్ పోయింది , ఇంకా రాలేదు ... భోజనం కి ఇబ్బంది కావొచ్చు , మాక్ డొనాల్డ్స్ లో ఏదన్న కొనుకుని వెళ్ళు బాబు అని చెప్పాను . వద్దు మా ఇంట్లో మా రూం మేట్ ఉంటాడు ... నేను వెళ్ళే సమయానికి వండి పెట్టి ఉంటాడు సమస్యే లేదు అని అన్నాడు... అబ్బ చా ! అనుకుని ...డూడ్ మనం ఉండే అపార్ట్మెంట్ లో కరంట్ లేక పొతే పొయ్యి వెలగదు అని చెప్పను.. బాబు కి అప్పుడు తలలో దీపం వెలిగి వాళ్ళ రూం మేట్ కి కాల్ చేసి అరవ భాష లో అడిగాడు సంగతి ఏంటి అని... నేను చెప్పెంది చెప్పినట్టు ఉన్నాడు అవతల అబ్బాయి... ఇదంతా అయ్యే సరికి బస్సు వచ్చేసింది దాంతో చేసేది ఎం లేక బిక్క మొహం వేసుకుని బస్సు ఎక్కాడు ( ఇంకో బస్సు ఇంకో గంటకి కాని లేదు ... అప్పటికే సమయం పావు తక్కువ తొమ్మీది అయ్యింది ... ఆ సమయం లో బస్సు స్టాప్ లో ఉండటం కొంచం రిస్క్ కదా మరి ) బస్సు ఎక్కాక మాకు కార్ కూడా లేదు ఇప్పుడు వెళ్ళాలి అంతే ... పిజ్జా ఆర్డర్ చేస్తాం ఎం చేస్తాం అన్నాడు... చుట్టూ పక్కల అంతా కరంట్ పోయింది పిజ్జా ఎలా ఆర్డర్ ఇస్తాడో పాపం ఇంటికి వెళ్ళే సరికి ఎమన్నా సర్దుకుంటుంది అని ఆలోచిస్తూ బస్సు దిగాను...

బస్సు దిగి మా పక్క బిల్డింగ్ లో ఉండే ఇంకో స్నేహితుడి కి ఫోన్ చేశా ..వంట సంగతి ఏంటి బాబు.. భోజనం చేసావా అని .. లేదు వెన్నెల లో కుర్చుని టీ తాగుందాం పొయ్యి మిద టీ పెట్ట కాని పొయ్యి వెలగదు కదా అని అప్పుడు నాకు వెలిగింది అని నవ్వాడు.. సరే మా ఇంటికి రా బన్ను ముక్కలు తెచ్చాను అని అన్నా... వాళ్ళు ఉండేది ఆరో అంతస్తు .. మేము ఉండేది పక్క బిల్డింగ్ లో ఎనిమిదో అంతస్తు ... పాపం తను దిగి మల్ల మా ఎనిమిది అంతస్తులు ఎక్కి వచ్చాడు (లిఫ్ట్ పని చెయ్యదు కదా మరి ..సెల్ ఫోన్ వెలుగు లో మెట్లు చూసుకుంటూ ఎక్కక తప్పలా మరి... ) మా అపార్ట్మెంట్ తలుపు తెరవగానే బోలెడు వెలుతురు.. కార్పెట్ అంతా వెన్నెల పరచుకుని ఉంది ... రోజు లైట్ ల వెలుగులో ఇంత వెన్నెల ని మిస్ అవుతున్ననా అని అనిపించింది... ఆ వెన్నెల్లో కొవ్వొత్తి వెలిగించి బన్ను ముక్కలని .. నిన్నటి అన్నం లో పెరుగు వేసుకుని ఆవకాయ తో తిన్నాం ఇద్దరం.

ఆ రోజు మా వాడు ఆఫీసు లో నుంచి వచ్చే సమయానికి అర్దరాత్రి దాటింది... పొద్దున్నే కి కరంట్ వస్తుంది కదా అన్నా ఆశ తో పడుకుంది పోయాం. కానీ పొద్దునే కి కూడా రాలేదు.. తప్పదు కదా అని చల్లటి నీళ్ళతో స్నానం చేసి పనికి వేల్లిపోయం ఇద్దరం... కాని సాయంకాలానికి కూడా రాలేదు ... (వెబ్ సైట్ లో చెక్ చేస్తే తెలిసింది కానీ దాదాపు గా డెబ్బై శాతం ఇళ్ళకి వచ్చింది అని వార్త కనపడింది ) .. ఎం చేద్దామా అని ఆలోచిస్తుంటే వేరే ఏరియా లో ఉండే స్నేహితుల నుంచి ఫోన్స్ , మా ఇంటికి వచ్చి ఉండు కరంట్ వచ్చేదాకా అని ... వెళ్దామా అనుకుని కూడా ... మనలాగా ఇంకా ముప్పై శాతం మంది ఉన్నారు .. వాళ్ళకి లేని సమస్య మనకేనా అని అనిపించింది.. సున్నితంగా రాను అని చెప్పి వాళ్ళకి తప్పించుకున్నా .. ఇంటికి వెళ్లి మల్లి దేవుడా అని ఎనిమిదో అంతస్తు ఎక్కి మా వాడి కోసం వెయిటింగ్ మొదలు పెట్టాను. మా వాడు రెస్టారంట్ కి ఆర్డర్ ఇచ్చి గంట అయ్యింది .. అది తీసుకు రాడానికి వెళ్తే ఇంకో గంట పడుతుంది అని చెప్పారు చల్లగా ... దాంతో ఆగే ఓపిక లేక వాడి వచ్చే లోపల పడుకుని నిద్ర పోయాను...

మర్నాడు మధ్యానం కాని మాకు కరెంటు రాలేదు ... మేము బాచిలర్స్ కాబట్టి అంత సమస్య కాదు కాని .. పిల్లలు కలవాళ్ళ అవస్తలు ఎలా ఉన్నయ్యో అని మాత్రం అనిపించింది ... ఇండియా నీ బెటర్ కరంట్ పోయిన అంత ఇబ్బంది అనిపించింది .. కాని గుడ్డి లో మెల్ల స్నో టైం లో కన్నా ఈ టైం లో జరిగింది అని కూడా అనిపించింది (అప్పటి పరిస్థితి ఇంకా ఇప్పుడే తెలీదు కదా ! )