తెలుగు వారికీ స్వంతమైన పచ్చడి... జీవితానికి నిర్వచనం .... అందుకే బ్లాగ్ పేరు మార్చాను ....
Saturday, September 12, 2009
ఈ వారం నేను చూసిన సినిమాలు
బాగున్న సినిమాలు ముందర...
సికిందర్ : ఇది హిందీ సినిమా ... కాశ్మీర్ నేపద్యం లో నడుస్తుంది. ఒక స్కూల్ కి వెళ్ళే అబ్బాయి కి అనుకోకుండా ఒక పిస్టల్ దొరుకుతుంది. అప్పటి నుంచి తన జీవితం ఎలా మలుపులు తిరిగింది .. తనకి తెలేకుండానే ఎలా సాలె గూటిలో చిక్కుకున్నాడో తెలియ చెప్పే చిత్రం ఇది.
బాగున్నా అంశాలు : సంజయ్ సూరి, మాధవన్ ల నటన. సంజయ్ సూరి కూతురు గా వేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. కెమెరా చాల చాల బాగుంది...
బాగోలేని అంశాలు : రెండో సగం లో సినిమా రెగ్యులర్ సినిమా పంథా ని అనుసరించడం. మొదటి సగం చాల బాగా తీసారు.
బాబార్
ఇది కూడా హిందీ సినిమానే .
శోహం షా అని కొత్త నాయకుడు పరిచయం అయ్యాడు ఈ చిత్రం తో. కొంచం మన రాంగోపాల్ వర్మ చిత్రం సత్య పోలికలు ఉన్నాయి. ఒక చిన్న అబ్బాయి పరిసరాల ప్రభావం వల్ల ఎలా ఒక కిల్లర్ గా మారాడు అన్నది. పోలీసు వ్యవస్థ లో అవినీతి , నిజాయితీ గల ఒక పోలీసు ఆఫీసర్ ఇలా అన్ని కొనాలని చూపించే సినిమా. ప్రతి దృశ్యం లో ఒక తూటా పేలుతూనే ఉంటుంది.
బాగున్నా అంశాలు : సోహం షా , ఓం పూరి , మిథున్ నటన , సంగీతం
బాగోలేని అంశాలు : ఒకళ్ళని ఒకళ్ళు కాల్చు కోవడం తప్ప ఎక్కువ గా ఎం లేక పోవడం. ఇలాంటి సినిమాలు చాల చూసిన ఫీలింగ్.
బాగోలేని సినిమాలు :
జోష్
నాగ చైతన్య సినిమా అంటే నాగార్జున కొడుకు కదా అని కుతూహలం తో చూసారో చచ్చారే ... బాబు కి నటన లో ఓ అంటే డ రాదు. అబ్బాయి చేసిన దాంట్లో ఒక్కటే సీన్ బాగుంది . ఒక చోట ఉపన్యాసం ఇస్తాడు. అది ఒక్కటే బాగుంది. మిగిలిన అన్ని సన్నివేశాల్లో బాబు చాల వీక్. నాయక విషయం చెప్పక్కర లేదు ..నాయకుడికన్నా బాగుంటే సమస్య అనుకున్నారేమో ఆవిడా ఇయనకి సరి జోడి. దొందు దొందే . కథ మొదటి సగం ఎక్కడికి కదలదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు గా ఉంటుంది. రెండో సగం కొంచం శివ కొంచం స్టూడెంట్ నెంబర్ వన్ . దిల్ రాజు గారు ఎం చెప్పాలి అనుకుంటున్నారో ఆయనకి క్లారిటీ ఉందా అన్నది తెలిదు. యువతని ఆకర్షించడం కోసం స్టూడెంట్ అన్నవాడు ఎవెరి మాట వినడు లాంటి తొక్కలో సంభాషణలు చొప్పించారు. నాయకుదికన్న పక్కన ఉన్న నటులు బాగున్నారు / బాగా చేసారు . సో సో సంగీతం. అన్ని సో సో నే. .. బ్రహ్మానందం దండగ ... చక్రి కూడా దండగే. .
నాకు నచ్చిన ఒక సంభాషణ ఈ చిత్రం లో :
నాయకుడు : రోజు ఎం చేస్తారు మీరు ?
స్టూడెంట్ : ఏముందండి రాగానే హాజరు వేయించుకోడం , గోడ మిద కూర్చుని వచ్చే పొయే అమ్మాయిలకి sight కొట్టడం, మనకి పడ్డారా మన అదృష్టం లేక పొతే వాళ్ళ అదృష్టం.(ఈ సినిమా చూసారా నిర్మాత అదృష్టం చూడలేదా మీ అదృష్టం )
రాజాది రాజా
రాఘవేంద్ర లారెన్స్ గారి డబ్బింగ్ చిత్రం ఇది. సినిమా అంతా పరమ నాటు సంభాషణలు మాములుగా కొన్ని సిన్మాల లో ద్వాందా అర్ద సంభాషణలు ఎక్కువగా ఉంటాయి. కాని ఈ సినిమాలో అన్ని ఆ రకమైన సంభాషణలే. కథ ప్రకారం రాజా (లారెన్స్ ) కస్టపడి అన్నలని ఒకళ్ళని డాక్టర్ , ఒకళ్ళని పోలీసు ఆఫీసర్ ఇంక్కోక్కరిని లాయర్ ని చేస్తాడు. కాని వాళ్ళు సమాజ సేవ కి బదులు డబ్బు సంపదనే ధ్యేయం గా పెట్టుకుని సమాజానికి హాని చెయ్యడం చూసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు . చివరకి వాళ్ళని తుదముట్టిస్తాడు. అది టూకీగా కథ. దానికి ముగ్గురు నాయకలు .. అర కోర దుస్తులు దారుణమైన పాటలు అదనపు ఆకర్షణ.
సుమారుగా ఉన్న సినిమా
వాదా రహా ...
ఇది హిందీ సినిమా .. బాబి డియోల్ నాయకుడు , కంగనా రావత్ నాయక. నాయకుడి కి మొదటి పాట అవ్వగానే ఆక్సిడెంట్ అవుతుంది దాంతో మెడ కింద బాగం అంతా చచ్చు పడిపోతుంది. అప్పటికి మంచి డాక్టర్ గా పేరు ఉన్న నాయకుడికి జీవితం మిద ఆసక్తి నశించి పోతుంది. ఆసుపత్రి లో ఒక అబ్బాయి పరిచయం తో ఎలా కొత్తగా జీవితం మొదలు పెట్టాడు అన్నది కథ...
బాగున్నవి : ఫోటోగ్రఫీ .. అబ్బాయి ఆక్షన్.
మంచి సెంటిమెంట్ .. తీరికగా ఏడవొచ్చు సినిమా చూస్తునప్పుడు.. కళ్ళకి మంచి excercise కొంచం మన పాట సినిమా జ్యోతి, ఆనంద్ (హిందీ ) పోలికలు ఉన్నాయ్ ...
Monday, August 31, 2009
అనువాద రచయిత రాజశ్రీ గారి కి నివాళి
ముందరగా వెన్నెలకంటి గారికి ఫోన్ చేశా. అయన రాజశ్రీ గారి అబ్బాయి సుధాకర్ తో పరిచయం ఉంది కాని ఫోన్ నెంబర్ తెలీదు మా అబ్బాయి శశాంక్ కి తెలుసు రేపు ఫోన్ చెయ్యండి కనుక్కుని చెప్తా అని అన్నారు. (వారి అబ్బాయి అప్పుడు అక్కడ లేరు అని చెప్పారు లెండి ). సరే ఈయన ఉండేది మద్రాస్ కదా, అక్కడ మనకి గణేష్ పాత్రో గారు తెలుసు కదా, చాలా రోజులు అయింది పలకరించి అని ఆయనకి ఫోన్ చేశా. అయన తో కాసేపు మాట్లాడాకా జరిగింది చెప్పాను. పాత్రో గారు వెంటనే రాజశ్రీ గారి అమ్మాయి, వారి అమ్మాయి మంచి స్నేహితులు అని నెంబర్ కనుక్కుని ఫోన్ చేస్తా అని ఒక పావు గంట లో అయన ఫోన్ చేసి ఇచ్చేసారు. అలా రాజశ్రీ గారి అబ్బాయి సుధాకర్ నెంబర్ దొరికింది. ఇంకేం కోతికి కొబ్బరి కాయ లాగ వెంటనే ఫోన్ చేశా ఆయనకి. అయన ముంబై లో ఉన్నారు. నాదగ్గర రాజశ్రీ గారి ఫోటో లేదు అంటే అయన తన దగ్గర ఉన్న చిత్ర పటాన్ని పంపారు.
అయన చెప్పిన కబుర్లలో కొన్ని ఇక్కడ ...
నాన్నగారు డబ్బింగ్ రచయిత గా బాగా పేరు ఉంది అని చెప్పడం అంటే కొత్త విషయం కాదు. శ్రీ శ్రీ , ఆరుద్ర గార్లు ఇద్దరి తర్వాత నాన్నగారే ఎక్కువ సినిమాలు చేసారు. బంగారు పతకం సినిమా డబ్బింగ్ జరిగే అప్పుడు శివాజీ గణేషన్ గారు డబ్బింగ్ చూడటానికి వచ్చారు. జగ్గయ్య గారు డబ్బింగ్ చెపుతున్నారు దానికి. ఆ సమయం లో శివాజీ గారు వచ్చారు. శివాజీ గారిది కొంచం టిపికల్ లిప్ మూమెంట్. ఆయనకి డైలాగ్ భావం చెడకుండా ... లిప్ మూమెంట్ కి అతికేలా డబ్బింగ్ అన్నది కష్టమైన ప్రక్రియ అయన ఆక్కడ డబ్బింగ్ చూసి వెంటనే వచ్చి నాన్నగార్ని గట్టిగా కుగిలించుకుని ఇన్నాళ్ళు నేను తెలుగు డైరెక్ట్ చిత్రం చెయ్యలేదు అని బాధపడే వాడిని. ఇప్పుడు ఈ డబ్బింగ్ చూసాక నాకు ఆ బాధ తప్పింది ఇది నా డైరెక్ట్ సినిమా అంత గొప్పగా వచ్చింది అని అన్నారు. ఇది నేను ఎప్పటికి మర్చిపోలేని సంఘటన
రెహమాన్ తన మొదటి చిత్రం నుంచి నాన్నగారు ఉన్నంత కాలం అయన తో నే వర్క్ చేసారు. అలాగే మణిరత్నం గారు. అలా చాల మందికి నాన్నగారు రెగ్యులర్ గా రాసీవారు. ఒక సారి నాన్నగారితో స్నేహం చేస్తే ఎవరు వదిలే వారు కాదు. చలం గారి రమణ చిత్ర బ్యానర్ కి నాన్నగారు చేసిన పాటలు సత్యం గారి సంగీతం ఎప్పట్టికైన మరవగలమా.... కురిసింది వానా నా గుండెలోనా ... (బుల్లెమ్మ -బుల్లోడు ), మామా , చందమామా ... (సంబరాల రాంబాబు ), ఎక్కడో దూరాన కూర్చున్నావు ... (దేవుడమ్మ ), రాధకు నీవేర ప్రాణం ... (తులాభారం ) ఇలా ఎన్ని పాటలు అని చెప్పగలం.
నాన్నగారికి దర్శకత్వం అంటే మక్కువ ఎక్కువ. అప్పట్లో అయన మూడు సినిమాలకి దర్శత్వం వహించారు. రాఘవ గారి చదువు సంస్కారం , నిజం చెపితే నేరమా, ఓ ప్రేమ కథ. చదువు సంస్కారం బాగానే ఆడింది, నిజం చెపితే నేరమా ఓ మోస్తరుగా ఆడింది. ఓ ప్రేమ కథ ఫ్లాప్. ఓ ప్రేమ కథ మొదలు పెట్టగానే రాధిక పెళ్లి చేసుకుని లండన్ వెళ్లి పోయింది. దాంతో ఆ సినిమా ఒక ఆరు నెలలు కదలలేదు. ఈ లోపల అదే కథ తో శ్యాం ప్రసాద్ గారు తలంబ్రాలు తీసి హిట్ చేసేసారు (నాన్నగారు దానికి కూడా పాటలు రాసారు , నేను దానికి గిటారిస్ట్ ని , సత్యం గారి దగ్గర అప్పుడే చేరాను నేను) . అదే కథ మళ్ళా రావడం తో ఆ సినిమా అనుకున్నంత గా ఆడలేదు. దాంతో అయన దర్శత్వానికి స్వస్తి చెప్పారు. అంతే కాక అనువాద రచయిత గా కూడా చాలా బిజీ గా ఉన్నారు అయన. అది ఇంకో కారణం.
నాన్నగారు హటాత్తుగా పోవడం తో నాకు ఒక్కసారి ఎలా అయన చేసే ప్రాజెక్ట్స్ హేండిల్ చెయ్యాలో తెలీలేదు. అప్పటికి నేను గిటారిస్ట్ గా చాలా బిజీ గా ఉన్నాను. మా ఇంట్లో నేను ఒక్కడినే సినిమాల్లోకి వచ్చింది. అందువల్ల నేను ఆ సమయం లో నాన్నగారు చూస్తున్న శ్రీ కృష్ణ, రామాయణం సీరియల్స్ కి సంగీతం , పాటలు మాత్రం చేసాను. 2000 లో నేను మొట్ట మొదటి చిత్రం అనువాద రచయిత గా ప్రవేశం చేసాను. మొదటి సినిమా deep blue sea (పడమట సంద్యా రాగం నాయకుడు టాం హీరో గా వచ్చిన చిత్రం ) . అది కొలంబియా వారిది. దాని తరవాత ఒక రెండు వందలు దాక చేసి ఉంటా ఆ బ్యానర్ కి. హిందీ లో నేను బాగా కష్టపడ్డ సినిమా జోదా అక్బర్. దాదాపు ఒక ఏడాది కష్ట పడ్డాను దానికి. అసుతోష్ కూడా మద్రాస్ లో పది రోజులు నాతొ కుర్చుని ఒక్కో వాక్యం చెక్ చూసుకుని చూసుకున్నారు. ఆ సినిమా నాకు చాల పేరు తెచ్చింది. మా నాన్న గారి పేరు నిలబెట్టే సినిమా అని నేను అనుకుంటున్నా ఆ సినిమాతో.
రాజశ్రీ గారి మిద వ్యాసాన్ని ఆంగ్లం లో ఇక్కడ చదవండి ...
రాజశ్రీ సుధాకర్ గారి మినీ ఇంటర్వ్యూ ని ఆంగ్లం లో ఇక్కడ చదవండి
Saturday, August 29, 2009
సు'స్వరాల' మాల - పెండ్యాల గారికి నివాళి
శివశంకరీ, శివానందలహరి... (జగదేకవీరుని కథ, 1961)
చిగురాకులలో చిలకమ్మా!... (దొంగ రాముడు, 1955)
రసికరాజ, తగువారము కామా?... (జయభేరి, 1958)
హాయిహాయిగా జాబిల్లి... (వెలుగునీడలు, 1961)
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ... (పరువు-ప్రతిష్ట, 1963)
మీరజాలగలడా నా యానతి... (శ్రీకృష్ణ తులాభారం, 1966)
మాట మీరగలడా... (శ్రీకృష్ణ సత్య, 1971)
జోహారు శిఖిపింఛమౌళీ!... (శ్రీకృష్ణ విజయం, 1971)
మెరిసే మేఘమాలికా... (దీక్ష, 1974)
చిరునవ్వుల తొలకరిలో... (చాణక్య చంద్రగుప్త, 1977)
ఇలా వ్రాసుకుంటూపోతే చాలానే ఉన్నాయి. కె.వి.రెడ్డి గారికి పెండ్యాల గారే ఆస్థాన సంగీత దర్శకుడు ఒక రకంగా. ఆయన చేసిన చాలా సినిమాలకి (దొంగరాముడు, భాగ్యరేఖ, భాగ్యచక్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము, సత్య హరిశ్చంద్ర, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ), అలాగే కె.బి.తిలక్ గారి అన్ని చిత్రాలకి (అత్తా ఒకింటి కోడలే, ఈడు-జోడు, ఉయ్యాల జంపాల, కొల్లేటి కాపురం, భూమి కోసం, పంతాలు-పట్టింపులు, ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ) ఈయనే సంగీత దర్శకుడు. ఎన్ని పాటలు, ఎన్ని చిత్రాలని చెప్పగలం... ఆయన చేసిన ప్రతి పాటా ఒక అణిముత్యమే, ప్రతి చిత్రమూ ఒక మధుర సంగీత జ్ఞాపకమే!
Friday, August 28, 2009
మల్లన్న - చిత్ర సమీక్ష
కథ ఎమన్నా కొత్తదా అంటే ఎం లేదు. అదేం లేదు. ఇంతకు ముందు శంకర్ మూడు సార్లు తీసి పడేసిందే. జెంటిల్ మాన్, ఒకే ఒక్కడు, శివాజీ అన్నిటి కథ ఒక్కటే కదా. ఇది కూడా ఆ తాను లోని ముక్కే. ఇండియా లో ఉన్న బ్లాకు మనీ ని జనాలకి పంచి పెడితే ఎలా ఉంటుంది అన్నది కధాంశం. దానికి మాములుగానే ఆరవ గోల లో తీసారు. మీకు ఏదన్న సమస్య వస్తే మల్లన్న గుడి లో చీటీ కడితే మీ కోరిక తీరుతుంది అని నమ్మిక. అలా జనాల సమస్య తీర్చడం ఎలా అంటే .. నాయకుడు CBI లో ఆర్ధిక నేరాల విభాగం లో ఉంటాడు. అందువల్ల బాగా ఉన్నవాళ్ళ ఇంటి మిద దాడి చేసి అక్కడ వచ్చిన డబ్బులో సగం GOVT కి ఇవ్వకుండా జనాలకి పంచి పెడతాఉంటాడు. ఆయనకి సపోర్ట్ మన సూపర్ స్టార్ కృష్ణ. అయన మీద ఎంక్వయిరీ ఆఫీసర్ ప్రభు. నాయకుడి ని ప్రేమిస్తునట్టు నటించి ప్రేమలో పడే సుబ్బలక్ష్మి పాత్ర లో శ్రేయ వేసింది.
నాయకుడిగా విక్రం విభిన్న పాత్రలు బాగానే చేసాడు. కష్టపడ్డాడు. కానీ కథ ఎక్కడా కదలదు. ఎక్కడ వేసిన గొంగళి లాగా సాగు...తూ.... ఉంటుంది. నిర్మాత బోలెడు కర్చు పెట్టారు. అంత అవసరమా అంటే అక్కరలేదు నిజానికి.
దర్శకుడు సుసీ గణేష్ కి ఇది నాల్గో చిత్రం. రెండో చిత్రం 5 star చిత్రం చూసాను. బాగుంది బాగా తీస్తారు అని అనుకున్నా (తెలుగు లో లైఫ్ స్టైల్ అని మొన్న విడుదల అయ్యింది, ముప్పలనేని శివ దర్శకుడిగా, ఆ చిత్రానికి మాతృక ఈ చిత్రం.). సుసీ గణేశన్ అసలు పేరు సుబ్బయ్య (తండ్రి పేరు ) గణేషన్ డిగ్రీ చదువుతున్నపుడు (ఇంజనీరింగ్ ) తల్లి పేరు (సితప్ప ) కూడా కలిసి వచ్చేలా సూసీ గణేశన్ గా మార్చుకున్నాడు. చదువు అయ్యాక కొంతకాలం పత్రికా విలేఖరిగా చేసాడు. అక్కడ ఒకసారి మణిరత్నం ని కలిసాడు. మణిరత్నం దగ్గర బొంబాయి , దిల్ సె , ఇద్దరు చిత్రాలకి సహాయకుడిగా చేసాడు. (5 star చిత్రానికి మణిరత్నం నిర్మాత ) మూడో సినిమా తిరుత్తు పాయలె కూడా మంచి హిట్ సినిమా. ఇలాంటి దర్శకుడు తీసే సినిమా అంటే అంచనాలు అంబరాన్ని అంటాయి. కానీ సినిమా చూసాక స్పుత్నిక్ లా చతికిల పడ్డారు .
సినిమా కి ఒక రకం గా మైనస్ ఎడిటింగ్ . సినిమా నిడివి మూడు గంటల పదినిమషాలు శ్రియ , విక్రం మధ్య లవ్ ట్రాక్ చెత్తగా ఉంది. శ్రియ జయమాలిని, ముమైత్ ఖాన్ లకి పోటీ అని చెప్పుకొనవచ్చు. అర కోర దుస్తులతో పాటు, తెరపై మొదటి సారి లిప్ కిస్ ఇచ్చింది.
ఈ సినిమాలో ముమైత్ ధర ముప్పై లక్షలు అని చూపించారు. ముప్పై లక్షలు ఇస్తే ఎవరి దగ్గర అన్నా నాట్యం చేస్తుంది అన్న భావన వచ్చేలా ఉన్నాయ్ దృశ్యాలు. మరి ముమైత్ కి విషయం తెలుసో లేదో మనకి ఎరుక లేదు.
అన్ని అన్ని దేశాలు ఎందుకు వెళ్ళారో ఎందుకు అంత కర్చు పెట్టారో అర్ధం కాని సినిమా. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్టు గా ఉంది ఈ సినిమా. వీళ్ళు చెప్పినట్టు ఆ సినిమా కి పెట్టిన కర్చు ని జనాలకి పంచి పెడితే ఇంకా మంచి ఉపయోగం గా ఉండేదేమో.
రఘువరన్ ఈ సినిమా చెయ్యాల్సి ఉంది. సగం షూటింగ్ అయ్యాక అయన మరణించడం వల్ల అయన పాత్రలో ఇంకొకరిని తీసుకున్నారు.
విక్రం ఈ చిత్రం లో తన పాటలు తానె పడుకోడమే కాక తొలిసారిగా తెలుగు లో తన డబ్బింగ్ తానె చెప్పుకున్నాడు. అది ఒకటి అభినందనీయం. కానీ ఆహార్యం సరిగ్గా లేదు. వయసు మీరినట్టు కనిపించాడు చాల చోట్ర్ల . సరి అయిన శ్రద్ధ తీసుకున్నట్టు కనపడదు.
పాటలు అన్ని గోల గోల పాటలే. కెమెరా కూడా అయన ఇష్టం వచ్చినట్టు గా ఉంది.
సినిమా చూడాల వొద్దా అంటే నేను మాత్రం వొద్దనే చెపుతాను.
పాపం మా ఫ్రెండ్. ...
పెళ్లి అయ్యి హనీ మూన్ గట్రా ముగించుకుని రాత్రి న్యూయార్క్ లో వాలాడు కొత్త పెళ్లి కూతురు తో కలిసి. కనెక్టింగ్ ఫ్లైట్ చాలా మాములుగా దైవాదీనం కదా. ఒకసారి ఇంకో గంట అన్నాడు .. మళ్ళా తూచ్ కాదు రెండు గంటలు అంటా అన్నాడు .. ఏదయితే ఎం రాత్రి తొమ్మిది కి రావాల్సిన వాళ్ళు , రెండుగంటలకి ఫ్లైట్ దిగారు. వాళ్ళ లగేజీ కి ఒక కార్ సరి పోదు కదా అని రెండు కార్లు వేసుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాం. అక్కడ నుంచి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్లి లగేజి వాళ్ళ ఇంల్లో పెట్టె కార్యక్రమం నలుగురు చూస్తూండగా , మా వాడు ఇంకో ఫ్రెండు కింద కార్లు పార్క్ చేసి పైకి వచ్చారు. కొత్త పెళ్లి కూతురు కదా అని హారతి ఇద్దాం అని ఉత్సాహ పడిపోయింది మా కజిన్. ఎవరం సిగరెట్లు తాగేవాళ్ళం కాకా పోవడం వల్ల అగ్గిపెట్టె లేదు. వాళ్ళ స్టవ్ చూస్తె electric స్టవ్ సరే అని కొంచం కుస్తీ పది ఒక పేపర్ అంటించి దాంతో కర్పూరం వెలిగించాం.
\
గుమ్మం కాడ (గుమ్మం అంటే లేదు లెండి కాని ఫ్రంట్ డోర్ దగ్గరే ) పేర్లు చెప్పి లోపలి రండి అని హారతి ఇస్తున్నాం, ఈ లోపల వల్ల తలుపు దగ్గర ఉన్న (వీళ్ళు ఉండేది మూడో అంతస్తు ) కారిడార్ లో ఉన్న ఫైర్ అలారం మోగడం మొదలు పెట్టింది (హారతి దానికి అనుకున్నట్టు ఉంది ). అప్పుడు సమయం ఉదయం మూడు గంటలు. అది ఎక్కడ ఆగేలా లేదు అని అర్ధం అయింది. మేము మా వాడికి జాగర్తలు చెప్పి చల్లగా కిందకి చేరుకునే అప్పటికి పాపం నిద్ర మొహాలతో జనాలు గదులు కాళి చేస్తూ బయటకి వస్తున్నారు. అది false అలారం అని కొంతమందికి చెప్పి మేము మా ఇంటికి బయలుదేరాం.
దార్లో situation ఏంటో కనుక్కుందాం అని వాడికి కాల్ చేసాం. ఏముంది నాలుగు పోలీసు కార్లు, మూడు ఫైర్ ఇంజన్లు , నలుగు అంబులెన్స్ లు వచ్చాయి అని చల్లగా చెప్పాడు. వాళ్ళు వచ్చి అంతా వెతికి అంతా బాగానే ఉంది అని చెప్పే దాక అందరూ కింద నిద్రమొహాలతో కూర్చున్నాం అని చెప్పాడు. అది ఒక అరగంట పట్టింది.
పొద్దున్నే మా వాడు మళ్ళా ఫోన్ .. ఏంటి అంటే కార్ కనిపించడం లేదు అని. కార్ రాత్రి పార్క్ చేసాం కదా అంటే . అది డే కేర్ కి సంబందించిన పార్క్ ఏరియా దాంట్లో ఎక్కువ సేపు చెయ్యకూడదు. అందువల్ల మళ్ళా tow చేసారు అని తాజా వార్త. పొద్దున్నే మా వాడికి ఇంకో నూట యాభై డాలర్లు బొక్క.
Thursday, August 27, 2009
సగం తెరిచిన తలుపు - పాపినేని శివ శంకర్
మొన్న వారాంతం రోజున న్యూయార్క్ వెళ్ళే అప్పుడు దారిలో చదువుదాం అని ఆ పుస్తకాన్ని తీసుకు వెళ్ళాను. పుస్తకం లో మొదటి కథ చింతల తోపు కథ చదువుతూ ఉంటె ఒకప్పటి బాల్యాన్ని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు అని అనిపించింది. ఒక బాలుడి బాల్యం తో ముడిపడిన సేద్యపు జీవితం ఎలా మెల్లిగా మారింది అన్నది కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది.
అలాగే ఒక్క వాన కోసం కథ లో జీవితాన్ని జీవితం లాగా ఎలా తిసుకోవచ్చో చాలా బాగా చెప్పారు. ఎప్పటికి ఈ పరుగు అపకపోవడం వల్ల ఎలా ఉంటుందో చెప్పకుండా నే చెప్పారు.
మనం మాట్లాడక పోవడం వల్ల మనుషుల మధ్య లో గోడలు ఎలా పేరుకు పోతాయో ఇంకో కథ లో చెప్పారు.
శివ రెడ్డి గారి కవిత్వం ఎందుకు నచ్చుతుందో.. నారాయణ రెడ్డి గారు ఇంకా ఇంగువ కట్టిన గుడ్డ లాగ పత్రికలని ఎలా తింటున్నారో (పరోక్షంగా ) చెప్పారు.
చివరి పిచ్చుక కథ చదువుతుంటే ఒకప్పుడు మా ఊర్లో ఉండే తుమ్మ చెట్లకి గుత్తులు గుత్తులుగా వేళ్ళాడే గిజిగాడి గూళ్ళు ఇప్పుడు కనపడక పోవడానికి కారణం తెలిసింది ఏమో అనిపించించి. అప్పట్లో తుమ్మ చెట్లు, తుమ్మ బంక కోసం వెళ్లి ఆ గూళ్ళు చూసి, నగరంలో మాకు అవి కనపడవు కదా అని ఎత్తుకొస్తే మా బాబాయి తిట్టిన తిట్లు ఇంకా చెవిలో మోగుతున్నట్టుగా వినిపిస్తాయి.
సముద్రాన్ని ఎక్కడ పరబోయ్యాలో తేలిక మనం కూడా ఆలోచన లో పడిపోతాం సముద్రం కథ చదివాక.
మొత్తం పదహారు కథలు ఉన్న ఈ సంకలనం మనలని ఒక లోకం లో కి తీసుకుపోవడం ఒక అనుభూతి.
మాములుగా మనం ఒక కథ చదివితే రచయిత మనకి తను ఎం అనుకుంటున్నారో విపులంగా చెప్పేస్తారు. మనకి ఎక్కువ ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉండక పోవచ్చు. కాని శివశంకర్ గారి కొన్ని కథల్లో రచయిత గా అయన చెప్పాల్సింది చెప్పేసి కథ ని మన ఊహకే వదిలేస్తారు. దాని వల్ల ఒక కథ చదువరి మెదడుకి పదును పెడుతుంది. కథ కొంతకాలం తప్పకుండా వెంటాడుతుంది.
ప్రతి కథ దేనికి దానికి బిన్నంగా, ప్రతి కథ లో కూడా వస్తు వైవిధ్యాన్ని దాంట్లో కూడా మర్కిజం అస్తిత్వం ఇలా భిన్నమైన సబ్జెక్టు లను అవలీల గా చర్చిస్తారు. అలా అని తన భావాలని మన మిద రుద్ద కుండా మన ఆలోచనలని పదును పెట్టె లాగా రాసారు.
ఈ కథా సంకలం అన్ని పుస్తక విక్రేయ కేంద్రాల్లో లభ్యమవుతాయి. వేల డెబ్భై రూపాయలు. అమెరికా లో అయితే avkf.org వాళ్ళ సైట్ లో దొరుకుతుంది. వేల సుమారుగా ఒక డాలరు అరవై సెంట్లు.
Tuesday, August 25, 2009
వర్షం లో న్యూయార్క్
ఈ మధ్యే చదువు కోసం మన దేశం నుంచి మా ఊరు (pittsburgh) వచ్చాడు ఒక అబ్బాయి పేరు అనూప్ . ఆ అబ్బాయి కి న్యూయార్క్ ఈ వారాంతం చూపిద్దాం అని మా స్నేహితుడు ప్రమోద్ నేను బయలుదేరాం. నాకు తెలిదు కానీ మా ప్రమోద్ కి వారాంతం వాతావరణం బాగా లేదు అని weather report లో చూసేసాడు అంట. వచ్చిన అబ్బాయి అనూప్ చెన్నై నుంచి, తెలుగు వాడే. చెన్నై లో అలవాటు ప్రకారం గొడుగు తన సంచి లో వేసుకు వచ్చాడు. ( నేను ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో అక్కడ నుంచి గొడుగు తేవడం అన్నది చూడటం మొదటి సారి సుమా. ) మా కార్ సగం దూరం వచ్చాక మా స్నేహితుడు చల్లగా రేపు thuderstroms న్యూయార్క్ లో అన్నాడు. ఆనూప్ ఏమో నేను గొడుగు తెచ్చాగా అని ఇంకా చల్లగా చెప్పాడు. న్యూజెర్సీ లో ఉన్న ఇంకో స్నేహితుడు కిరణ్ ఇంటికి వెళ్ళాం. అక్కడ మేము చేరే అప్పటికి రాత్రి పన్నెండు అయ్యింది. అప్పటికే భోరున వర్షం. మేము వెళ్ళాక తగ్డింది. నైట్ టైం న్యూ జెర్సీ నుంచి న్యూ యార్క్ చూద్దాం అని ఒక నలభై నిమషాలు డ్రైవ్ చేసి వెళ్ళాం .. వెళ్ళే అప్పుడు బాగానే ఉంది వాతావరణం అని గొడుగులు తీసుకెళ్ళ లేదు. అక్కడ బండి పార్క్ చేసి నడుచు కుంటూ వెళ్ళాం. వెళ్ళిన అయిదు నిమషాలు బాగా ఎంజాయ్ చేసాం వ్యూ. ఈ లోపల భోరున వర్షం అలా తడుస్తూ న్యూ యార్క్ ని వర్షం లో చూడటం ఒక మంచి అనుభవం. అర్ధరాత్రి ఎవరు మనలని తరమ కుండా అలా ఎంత సేపు అన్న చూస్తూ ఉండటం ఎంత బాగుంటుందో. కాని ఎక్కువ సేపు ఆ వర్షాన్ని తట్టుకోలేక గబ గబా పరిగెత్తి ఒక అపార్ట్మెంట్ బాల్కొని కింద నిల్చున్నాం . మాతో వచ్చిన ఇంకో అబ్బాయి వెళ్లి కార్ తీసుకుని వచ్చాడు. ఇంకా అందరం ఇంటికి బయలు దేరాం. ఇంటికి చేరే అప్పటికి రాత్రి మూడు అయ్యింది. వెంటనే నిద్ర పోద్దాం అంటే కుదరలేదు. కారణం మరేం లేదు. నల్లులు పీకి పాకం పెట్టాయి. వాటికీ పాపం చాలా రోజులకి కొత్త మనుషులు దొరికినట్టు ఉన్నారు, పండగ స్పెషల్ ఆఫర్ అన్నమాట.
ఆలస్యంగా పడుకోవడం వాళ్ళ శనివారం నాడు ఆలస్యంగా నే లేచాము. లేచి న్యూయార్క్ కి కార్లో వెళ్లి తిరగడం కష్టం కాబట్టి న్యూయార్క్ వరకు ట్రైన్ లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. కార్ రైలు స్టేషన్ లో పెట్టి రైలు ఎక్కుదాం అని స్టేషన్ కి బయలు దేరాం. ఇంటి దగ్గర ఎడమ వైపు మలుపు తీసుకోకుండా కుడి వైపు తీసుకోడం వల్ల దారి తప్పి కొంచం సేపు తిరిగాం. మళ్ళా కిరణ్ కి ఫోన్ చేసి సరిఅయిన దరి కనుక్కొని. అటు వెళ్ళాం. కాని వెళ్ళే దారి అంతా సందేహమే రైలు సరి అయిన సమయానికి వస్తే దొరకదు అని. మా అదృష్టం కొద్ది అది పదిహేను నిమషాలు ఆలస్యం గా వచ్చింది (శని , ఆదివారాలు తక్కువ రైళ్ళు తిరుగుతాయి అందువల్ల ఈ రైలు కనుక అందుకోలేక పొతే ఇంకో గంట అక్కడ స్టేషన్ లో చెక్క భజనే అది మా సమస్య ) అప్పటికే వాతావరణం మన ఊటీ లాగ ఉంది. అంటే పొగమంచు సన్నగా తుపర ఎటు చూసినా పచ్చగా చాలా అందంగా ఉంది .
ప్రమోద్ టికెట్ కొన్న నలుగు నిమషాలలో నే రైలు వచ్చింది. నేను TANA కి వచ్చినప్పుడు పాపినేని శివశంకర్ గారు ఇచ్చిన సగం తెరిచిన తలుపు పుస్తకం తెచ్చుకున్నా రైలో చదువుకోడానికి. దాంట్లో ఒక్క వాన కోసం కథ చదువుతూ ఉంటే నేను కూడా న్యూయార్క్ లో వర్షం లో లిబెర్టి విగ్రహాన్ని వర్షం లో చూస్తా కదా అన్న ఆలోచన వచ్చింది.
మేము న్యూయార్క్ చేరే అప్పటికి వర్షం రావడానికి ముందర వచ్చే ఉక్క, మబ్బు లతో ఉంది. నలభై రెండో వీధి (42 nd street ) దిగి అక్కడ మమ్మల్ని కలవడానికి వచ్చే కమల్, నిత్య ల కోసం వేచి ఉన్నాం. కమల్ కి గొడుగులు తెమ్మని చెప్పాము. కమల్ న్యూయార్క్ లో ఉండటం వల్ల ఇంట్లో నాలుగు గొడుగులు ఉన్నాయ్ అని చెప్పాడు. (న్యూ యార్క్ లో ఉండే జనాలకి గొడుగులు రోజు తెసుకేల్లడం అలవాటు మన చెన్నై వాసుల లాగా) కానీ కమల్ మర్చిపోవడం వల్ల మళ్ళా వెనక్కి వెళ్లి తీసుకుని రావడానికి వెళ్ళడం వల్ల తనకి రావడం ఆలస్యం అయింది. ఈ లోపల మేము తిరగడం మొదలు పెట్టాం. కమల్ వచ్చే దాక వర్షం పాపం మా దగ్గర గొడుగులు లేవు కదా అని ఆగింది. కమల్ వచ్చిన అయిదు నిమషాలకి వర్షం మెల్లిగా మొదలు అయింది. అప్పటిదాకా రెండు డాలర్లు ఉన్న గొడుగు ఇరవై డాలర్లకి అమ్మడం మొదలు పెట్టాడు రోడ్డు పక్కన ఉన్న చైనా వాడు. మేము గొడుగు లు ఉండటం వల్ల హాయిగా తిరగడం మొదలు పెట్టాం.
నాకు , అనూప్ కి ఫొటోస్ పిచ్చి ఉండటం వల్ల వర్షాన్ని ఎక్కువ లెక్క చెయ్యకుండా ఫోటోలు తియ్యడం మొదలు పెట్టాం. ప్రమోద్ , కమ
అక్కడ నుంచి బైట పడి కిందకి వచ్చాక , మదన్ పాపం పొగ తాగుదాం అనుకుని malboro cigerettes కొన్నాడు . అమెరికా మొత్తం మిద ఎక్కడ ఖరీదు ఎక్కువ అంటే సిగరెట్లు దొరకును అనగా న్యూయార్క్ అని టక్కున సమాధానం చెప్పొచ్చు. ఒక్క పాకెట్ ఖరీదు పడి డాలర్లు మాత్రమె. పాపం ఎం చేస్తాడు అలవాటు కదా తప్పదు అని దేవుడా అని కొన్నాడు (మనవాళ్ళు మాములుగా ఇండియా నుంచి వచ్చే అప్పుడు ఒక డబ్బా తెచ్చుకుంటారు సిగరెట్లు, ఇండియా బ్రాండ్లు ఇక్కడ ఖరీదే కాక దొరకవు కదా. ఈ అబ్బాయి కూడా అల తెచుకున్నాడు కాని, ఈ రోజు తీసుకురావడం మర్చి పోయాడు. ఈయన కూడా ఇండియా నుంచి గొడుగు తెచ్చుకున్నాడు )
అక్కడ నుంచి టైం స్క్వేర్ దగ్గరకి వచ్చాం. క్రతం ఏడాది లేనిది కొత్తగా అక్కడ పెట్టింది ఏంటి అంటే ఎర్ర మెట్లు . రాత్రి పుట ఆ మెట్ల కింద లైట్లు వెలుగుతూ ఒక రకమైన అందాన్ని ఇస్తాయి. ఆ మెట్లు ఎక్కి చుస్తే టైం స్క్వేర్ మొత్తం బాగా కనిపిస్తుంది. మెట్లకి ఇరు వైపులా చాలా మంది ఒక వరసలో నుల్చుని పాటలు వినడమో, పుస్తకం చదవడమో లేక పక్క వాళ్లతో మాట్లాడటమో చేస్తున్నారు. నాకు అర్ధం కాలా ఎందుకో అని. కమల్ ని అడిగా దేనికి ఆ లైన్ అని. ఆ లైన్ లో ఆ రోజు broadway shows కి మిగిలన టికెట్స్ అమ్ముతారు సగం ధరకి అని చెప్పాడు. తెలుసుగా అక్కడ broadways కి చాలా ప్రసిద్ది. ఈ సారి డిసెంబర్ లో jude law నటించిన Hamlet ప్రదర్శన కూడా ఉంది. (jude law అంటే talented mr. ripley lo dickie greenfield పాత్ర వేసారు, ఇంకో మంచి సినిమా ఈయన చేసింది Road to Perdition (2002) దిన్ని తెలుగు లో మన మోహన్ బాబు శివశంకర్ అని తీసి పడేసారు లెండి ) . ప్రస్తుతం ఎక్కడ చూసినా లయన్ కింగ్ musical బాగా ఆడుతోంది అక్కడ. ఎక్కడ చూసినా ఆ ప్రదర్శన తాలూకు ప్రకటనలే కన్పించాయి.
కమల్ అక్కడ ఉన్న john pizzaria కి తేసుకు వెళ్ళాడు. అది నిజానికి 1888 లో ఒక చర్చి. అది కాలి పోవడం తో అలాగే కనిపించేలా p
భోజనాలు అయ్యాక అక్కడ నుంచి సబ్వే పట్టుకుని statue of liberty కి బయలుదేరాం. అక్కడ మాకు స్ట్రీట్ performers కనపడ్డారు . మంచి పెర్ఫార్మన్స్ వాళ్ళది. బాగుంది. అక్కడ నుంచి ఫెర్రీ ఎక్కి liberty statue కి బయలుదేరాం. దాని చుట్టూ తిరిగి మళ్ళా వెనక్కి వచ్చాము. ఫెర్రీ లో నుంచి చూస్తే న్యూ యార్క్ చాలా బాగా కనపడుటింది . అక్కడ కాల్గేట్ వాళ్ళ పెద్ద watch కనపడుతుంది .
అక్కడ నుంచి మళ్ళా సబ్వే పట్టుకుని సెంట్రల్ పార్క్ కి బయలు దేరాం. సెంట్రల్ పార్క్ కి వెళ్ళే దార్లో కమల్ వాళ్ళ ఆఫీసు చూసాం. వాళ్ళ ఆఫీసు పైన ఉన్న అపార్ట్మెంట్ ల లో సింగెర్ బియన్సి ఉంది అని చెప్పాడు. ఆ అమ్మాయి పెళ్లి అయినప్పుడు ఆ విధి అంతా ప్రెస్ రిపోర్టర్లు తో నిండి పోయింది అని చెప్పాడు. సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న పార్క్ హోటల్ లో ఒకప్పుడు హోం ఆలోన్ సినిమా తీసారు ఇప్పుడు దాన్ని condominums గా మర్చి అమ్మేసారు. దాని కి ఇంకొంచం ముదుకు వెళ్తే సోనియా గాంధి అమెరికా వచ్చినప్పుడు నివసించిన హోటల్ ఉంది అది దాటి ముందుకు వెళ్తే కొలంబస్ సర్కిల్ . అక్కడ సింగర్ Rickey martin (Livin' La Vida Loca పాట గుర్తు ఉందా, తెలుగు లో మనవాళ్ళు పెళ్లి పెళ్లి అంది అమ్మాయి అని వెంకటేష్ బాబు పాడెసాడు ) తను ఉండేది అక్కడే, టాప్ ఫ్లోర్ లో సింగల్ బెడ్రూం కి నూట అరవై మిల్లియన్ లు అని అన్నాడు కమల్.
దారి నిండా పక్కన మన
ఆర్ వైశాల్యం 843 ఎకరాలు. దీని ప్రత్యేకత ఏంటి అంటే , దీన్లో ఉన్న ప్రతి మొక్క కూడా మనుషులు నాటిందే. ప్రపంచం లో ఒక నగరం లో ఉన్న పెద్ద పార్క్ ఏది అంటే ఇదే అని చెప్పుకొనవచ్చు. పైన ఉన్న ఫోటో చూస్తున్నారు కదా ఇది ప్రతి ఋతువు కి మారుతుంది . దీని పోస్ట్ కార్డు లాగ అమ్ముతారు . అక్కడ ఇంకా చీకటి పడటం తో పార్క్ నుంచి బైటకి వచ్చి జాక్సన్ హైట్స్ కి బయలుదేరాం. సబ్వే కి వెళ్ళే దారిలో NBC స్టూడియో చూసాము. రోజు weatherman ఎక్కడ నిల్చున్తాడో అక్కడికి పక్కనే ఉంది APPLE స్టోర్. దాంట్లో కి వెళ్ళాం. బైట ఉన్న ఉక్కకి లోపలి వెళ్ళగానే బోలెడు చల్లదనం ఏంటో హాయిగా అనిపించింది.
రాత్రి తొమ్మిది అయినా బాగా జనం ఉన్నారు అక్కడ. అది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది అని చెప్పాడు కమల్. ఎక్కువగా IPOD లు IPHONE లో ఉన్నాయ్. IPHONE నుంచి ఎవరికన్నా ఫోన్ చేసుకోవచ్చు అనుకుంటా .. చాలా వరకు నంబర్లు కనపడ్డాయి మేము ఒక దాని BROWSE చేస్తుంటే . మదన్ ఒక్కసారి గట్టిగా తుమ్మాడు. ఇంకా చూసుకోండి చుట్టూ ఉన్న జనాలు చిల్ల పెంకుల్లా చెదిరిపోయారు. మదన్ కి పాపం ఎం అర్ధం కాలా.. (ఇక్కడ జనాలు మనం తుమ్మాము అంటే చాలు వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది అని భయపడతారు ). బైటకి వచ్చాక మదన్ తనకి పని ఉంది అని వెళ్ళిపోయాడు. మేము జాక్సన్ హైట్స్ కి దారి తీసాము.
జాక్సన్ హైట్స్ ఒక రకంగా మన సుల్తాన్ బజార్ అని చెప్పుకొనవచ్చు. కిళ్ళీ కోట్లు, బట్టల కోట్లు , భోజన హోటల్ ల తో మనకి మన దేశం లో ఉన్నామా అన్న భావన కనపడుతుంది. షారుక్ ఖాన్ మొహం మనకి ప్రకటనల రూపం లో గోడల మిద కనపడుతుంది. అక్కడ సమోసా , చాట్ లాంటివి లాగించి కమల్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం.
వాళ్ళ ఇల్లు ( apartment ) ఒక చిన్న ద్వీపం లో ఉంది. ఆ ద్వీపం ఒకప్పుడు జైలు గా ఉపయోగించే వారు. దాని తర్వాత దాని కొన్ని రోజులు మానసిక చికిత్సాలయంగా వాడరు. దాని తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్ లు కట్టి polution free జోన్ గా మార్చారు. ద్వీపం మొత్తం ఒక్కటే రహదారి. వీళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అవతల ఒడ్డు న న్యూ యార్క్ నగరం మిరుమిట్లు గొలుపుతూ కనపడుతుంది . సాయంకాలం అలా నదుకుతుంటూ వెళ్ళడం చాల చాల బాగుంది. వాళ్ళు ఉండేది పన్నెండో అంతస్తు. అక్కడ నుంచి న్యూయార్క్ చూడటానికి చాలా బాగుంది (అల కనపడే అపార్ట్మెంట్ కి అద్దె కొంచం ఎక్కువే సుమా ) వాళ్ళ ఇంట్లో భోజనం చేసాక మళ్ళా వెనక్కి బయలు దేరాం (న్యూ జెర్సీ కి ). సమయం అప్పటికే పది దాటటం వల్ల కాబ్ (అద్దె కార్ ) పట్టుకోవడం ఆలస్యం అవడం వల్ల ( కాబ్ డ్రైవర్ మాత్రం మన ఆటో వాళ్ళకి దీటుగా నడిపాడు లెండి, వెనకాల కూర్చున్న మమ్మల్ని బస్తాలు కుదేసినట్టు ఇష్టం వచ్చినట్టు చక్రం తిప్పేసాడు. ) మేము వెళ్ళే సరికి మా రైలు రెండు నిమషాలు ఆలస్యం అని వదిలేసి వెళ్లి పోయింది. (పొద్దున్న ఏదో మా కోసం ఆలస్యం గా వచ్చింది కదా అని ఎప్పుడు ఆలస్యం గా వస్తానా హమ్మ అని తిట్టింది లెండి. ) చేసేది లేక అలా గే ఇంకో ముప్పావు గంట కూర్చున్నాం. పక్కనే ఉన్న పళ్ళ రసం అమ్మే దుకాణం లో కి వెళ్తే అక్కడ మనవాళ్ళే తెలుగు విధ్యార్థులు చక్కని తాజా పళ్ళ రసం ఇచ్చారు.
రైలు వచ్చాక ఇంకో గంట ప్రయాణం చేసి న్యూ జెర్సీ వచ్చాం. వచ్చాక గాస్ (పెట్రోల్ ని ఇక్కడ ఇలాగె అంటారు లెండి) కొట్టిందాం అని చూస్తె ఒక్కడు కూడా లేడు. మరి రాత్రి ఒంటి గంట అయింది కదా. అంటే దాదాపు గా పదమూడు గంటలు రోడ్లంమాట తిరిగాం అన్నమాట. ఆ దెబ్బకి పడుకున్నాక మళ్ళా పొద్దున్నే తొమ్మిది కి సాయికిరణ్ (వినాయకుడు దర్శకుడు ) ఫోన్ చేసే దాకా మెలుకువ రాలేదు. ఇంకా అప్పుడు లేచి మళ్ళా ఒక గంట ఆగి పండగ కదా ఎం చేద్దాం అని ఆలోచించాం. సమయం చుస్తే సరి పోదు అని అక్కడ ఉన్న ఓక్ లాండ్ లో భారతీయ దుకాణాల్లో సరుకులు కొని ఇంకో భోజన శాలలో లో భోజనం చేసి తిరుగు ప్రయాణం అయ్యాము గాస్ కొట్టించుకుని. (మాములుగా అమెరికా లో ఎవరి కార్ లో వాళ్ళే గ్యాస్ నింపుకుంటారు, కాని న్యూజెర్సీ లో మాత్రం ఇండియా లో లాగా వాళ్ళ మనిషి వచ్చి నింపుతారు ) .
వెళ్ళే అప్పుడు PA TURNPIKE తీసుకోవడం వల్ల పల్లె అందాలు చూడలేక పోయాం అని ఫీల్ అవ్వడం వల్ల ప్రమోద్ ఈ సారి మమ్మల్ని పల్లెల్లో నుంచి తీసుకు వెళ్ళాడు. దానికి దీనికి మూడు గంటలు ఎక్కువ సమయం డ్రైవ్ కి. అందువల్ల మేము వచ్చే అప్పటికి రాత్రి పదిగంటలు అయింది దాదాపుగా. ఇంతకూ ముందర చాల సార్లు న్యూయార్క్ వెళ్ళా ( స్వాగతం షూటింగ్ అప్పుడు, అంతకు ముందర కూడా రెండు మూడు సార్లు వెళ్ళా ను ) కాని ఈ సారి బాగా ఎంజాయ్ చేసాను. చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల కావచ్చు అది.