వంశీ గారి సినిమా అంటే ఒక రకమైన అంచనాకి రావడం మానేసి చాల కాలం అయ్యింది. అయన అనుమానాస్పదం తిసినప్పుడే అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ నిజాలే అని అనుకున్నా... దింపుడు కళ్ళం ఆశ లాగా ఏదన్నా ఒక మెరుపు మేరిపిస్తారేమో అని ఎక్కడో కోడగట్టిన దీపం లాగ ఉన్నది కూడా సినిమా చూసాక కొందేక్కింది.
కంగాళి కథ కి తోడు పాత పాటలనే మళ్ళి రెమిక్ష్ చేసి వాటిని వంశి గారి గొంతుకుతో వినిపించారు .. (వంశీ గారు మీకు పాటలు అవసరమా అండి ? సినిమా సరిగ్గా తీస్తే అదే పదివేలు కదా...).
కథ గోదావరోడ్డున మొదలై హైదరాబాద్ లో తేలుతుంది. అమెరికా నుంచి వచ్చే పెళ్ళికొడుకులు అంటే మనవాళ్ళకి ఎందుకు అంట చిన్న చూపో అన్నది నాకు తెలీని భేతాళ ప్రశ్న ! అమెరికా లో చదువు పూర్తీ చేసుకుని వచ్చిన శ్రీనివాస్ కి డ్రైవర్ రంగబాబు (అల్లరి నరేష్ ) అంటే పడదు. కారణం మరేం కాదు... రంగబాబు డ్రైవర్ , తను అమెరికా లో చదువు కొని వచ్చాడు కాబట్టి డ్రైవర్ ని చిన్న చూపు చూస్తాడు. (అమెరికా లో చదివే వాళ్ళకి ఎంతో కొంత డిగ్నిటీ అఫ్ లేబర్ తెలుస్తుంది. శ్రీనివాస్ లాగ ఉండరు. బస్సు డ్రైవర్ కి కూడా దిగే ముందర థాంక్స్ చెపుతారు ఇక్కడ వాళ్ళు ). శ్రీనివాస్ కి హైదరాబాద్ లో ఉండే మణిమాల తో వివాహం నిశ్చయం అవుతుంది . కానీ శ్రీనివాస్ కి తను మారువేషం లో వెళ్ళి ఆ ఇంట్లో ఉండి మణిమాల ని గమనించి కాని పెళ్లి చేసుకోను అని చెపుతాడు. దానికోసం తాను డ్రైవర్ గా రంగబాబు ని అమెరికా రిటర్న్ గా బయలు దేరతారు ( రాజముండ్రి నుంచి ఈ వేషాలు వేసుకుని శ్రీనివాస్ డ్రైవర్ లాగా బండి తోలడం ఏంటో .. హైదరాబాద్ వెళ్ళాక వేషం మార్చుకోలేడా ? ) కానీ దారి మధ్యలో మళ్ళి బుద్ది మార్చుకుని ఎవరి సొంత పాత్రల్లో కి వాళ్ళు వెళ్ళిపోతారు. కాని ఈ లోపల శ్రీనివాస్ తండ్రి విల్లిద్దరు ఇలా మారువేషాల్లో వస్తున్నారు అని ఆహుతి ప్రసాద్ కి చెప్పేస్తాడు.
ఆహుతి ప్రసాద్ ఇంకా డ్రైవర్ లో అల్లుడి లాగా అల్లుడిని డ్రైవర్ లాగ సత్కరించడం తో పాటు హీరో డ్రైవర్ కాబట్టి హీరోయిన్ కూడా డ్రైవర్ కి ప్రేమించడం, శ్రీనివాస్ వాడిని ప్రేమించినా సరే నన్నే పెళ్లి చేసుకో అంటూ గోల పెట్టడం కావలిసినంత సోది కుళ్ళు కామెడి తో సినిమా కోన సా......గు ..... తూ....... ఉంటుంది.. మధ్యలో వంశి గారి గొంతు (నొక్క్లానిపిస్తే మన తప్పు కాదు ) తో పాటలు పంటి కింద రాళ్ళు లాగా కథ కి అడ్డం పడుతూ ఎక్కడ సదరా అన్నది లేక సంగతులు మన తో పలికిస్తుంది ...
చక్రి కి జయసూర్య (కింగ్ సినిమా వివాదం గుర్తు ఉందా ) అని నామకరణం చెయ్యడం లో ఎక్కడా తప్పు కనపడదు నాకు . ఇళ్లయరాజ గారి పాటలు కాపి... ఇక నేపధ్య సంగీతం దారుణం ... సంభాషణలు కూడా దారుణమే లెండి .. (సినిమా నే దారుణం అంటారా ..ఇంకా ఎం అనలేం )
వంశి ఆంధ్ర జ్యోతి ముఖాముఖీ ఇంకా పూర్తిగా చూడలేదు .. చూసాక దాని మిద రాస్తా .. కాని సినిమా మాత్రం డబ్బు పెట్టి చూడటం అంట బుద్ది తక్కువ ఇంకోటి లేదు ...
2 comments:
ఆంధ్రజ్యోతి ముఖాముఖి link ఇవ్వండి please.
బ్లాగు పేరు మార్చి చాలా రోజులైందాండీ? ఈ మధ్యన కనబడక ఏమైందో అనుకుంటున్నాను.
నేను సినిమా చూడలేదు కానీ రివ్యూ బాగుందండీ. (రిలీజ్ అయ్యాకా చాలా చోట్ల చదివిన వాటికి దగ్గరగా) వంశీ సినిమా.. చూడాలో మానాలో...అనుకుంటుంటే....హమ్మయ్య చూడక్కర్లేదు అన్న ధైర్యాన్నిచ్చింది మీ రివ్యూ.
Post a Comment