Saturday, November 7, 2009

ది వైట్ బలూన్ (1995).


ఈ సినిమా గురించి చాలా సార్లు నేను ఇంకో సినిమా స్నేహితుడు చర్చించాం. నిజానికి నేను Jafar Panahi దర్శకత్వం వహించిన రెండో చిత్రం "అయినా" (ది మిర్రర్ ) అన్న సినిమా ముందరగా చూసాను . దాన్ని చర్చిస్తున్నపుడు ఈ సినిమా గురించి తెలిసి అప్పుడు ఈ సినిమా చూసాను . జాఫర్ గురువు Abbas Kiarostami ( where is my friends home, taste of cherry, the wind will carry us చిత్రాల దర్శకుడు ). ఈయన దగ్గర ఒక చిత్రానికి సహాయకుడిగా చేసాడు. వైట్ బలూన్ కి చిత్రానువాదం (స్క్రీన్ ప్లే ) Abbas Kiarostami సమకూర్చారు.

సినిమా మొదట్లో నే రేడియో లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి తయారుగా ఉండండి అని వినిపిస్తుంది. అక్కడ నుంచి కెమెరా విభిన్న తరగతలు , సంస్కృతుల వ్యక్తులని ఒక చోట చూపిస్తూ మనకి ఇది ఒక పట్టణం లోని కూడలి అక్కడ జనాల జీవన స్రవంతి ని ఒక చిన్న షాట్ ద్వారా పరిచయం చేస్తారు దర్శకుడు. అలా కెమెరా మెల్లిగా ఒక యువతి రెండు చేతులతో సామాను మోస్తూ ఎవరినో వెతుకుతూ ఉన్నట్టు గా కనపడుతుంది. ఆమె వెతికేది ఆమె కూతురు Razieh (Aida Mohammadkhani) . అమ్మాయికి ఆరు ఏళ్ళు ఉండవచ్చు. అక్కడ ఉన్న కొట్టు లో గాజు జాడి లో ఉన్న తెల్ల చేప పిల్లని చూసి ముచ్చట పడుతుంది. తల్లిని దాని కొనిపెట్టమని సతాయించడం మొదలు పెడుతుంది. ఇంట్లో అలాంటివి చాలా ఉన్నాయి కదా , అది ఒద్దు అని అంటుంది తల్లి. దారి పొడుగునా అదే సంభాషణ ఇద్దరి మద్య .

ఇంటికి వచ్చే అప్పటప్పటికి అమ్మాయి అన్న తండ్రికి సబ్బు తీసుకు రావడానికి బయలుదేరుతా కనపడతాడు. (చిత్రం లో తండ్రి పాత్ర ఉన్నా అది ఎక్కడా కనపడదు వినపడుతుంది అంతే) అన్న సబ్బు తీసుకు వచ్చే వరకు అమ్మాయి చేప పిల్ల కోసం అడుగుతానే ఉంటుంది. తల్లి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే పనుల్లో హడావుడిగా ఉంటూనే అమ్మాయి కి జవాబు చెపుతూ ఉంటుది. అబ్బాయి తిరిగి వస్తాడు. తండ్రి సబ్బు కాదు షాంపూ తెమ్మని అరుస్తాడు. అబ్బాయి మళ్ళి షాంపూ తెచ్చే వరకు చేప సంగతి తేలదు.

అబ్బాయి తిరిగి వచ్చి అమ్మాయి మొహం చూసి తల్లి కి నచ్చ చెప్పి అది కొనడానికి ఆ డబ్బు ఇప్పిస్తాడు. అమ్మాయి ఆ డబ్బు దారిలో పారేసుకుంటుంది. అక్కడ నుంచి సినిమా అమ్మాయి ఆ డబ్బు తిరిగి ఎలా సంపాదించింది, దానికి అన్న ఎలా సహాయపడ్డాడు, ఇతరులు ఎలా సహాయ పడ్డారు అన్న దాని చుట్టూ తిరుగుతుంది.

సినిమాలో ఎవరు ఎవరికీ కారు. కాని సహాయం అవసరం అయినప్పుడు ఎలా సహాయపడతారు అన్నది చక్కగా చూపించారు. మనవ సంబందాలు ని చక్కగా ఆవిష్కరించారు అని చెప్పవోచ్చు.

సినిమా నిజానికి మనకి ఇంగ్లీష్ టైటిల్స్ లో చూడటం వల్ల చాలా వరకు ఒరిజినల్ ఫ్లేవోర్ మిస్ అవుతున్నాం అని అర్ధం అవుతూనే ఉంది. అలా అని సినిమా ని ఎంజాయ్ చెయ్యకుండా కూడా ఉండము. కాని భాష అర్ధం అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఏమో అని అనిపించక మానదు. ఎందుకంటే బజార్ లో మనకి ఒక భాష కాదు బోలెడు బిన్న సంస్కృతుల మనుషులని పరిచయం చేస్తారు దర్శకులు.

తన పదో ఏట మొదటి పుస్తకం రాసి దానికి బహుమతి పొందారు జాఫెర్. అదే సంవత్సరం 8mm ఫిలిం తో ఒక దాంట్లో నటించడం , ఇంకో దానికి సహాయకుడిగా పనిచెయ్యడం కూడా జరిగింది. తరవాత ఫోటోగ్రఫీ లో కొన్ని రోజులు దాని తరవాత పదేళ్ళు సైనికుడిగా పనిచేసి చివరగా సినిమాల్లోకి వచ్చారు. మొదటి చిత్రం తరవాత రెండో చిత్రం "అయినా" (ది మిర్రర్ ) కూడా చిన్న పిల్ల కథాంశమే. తరవాత వచ్చిన "సర్కిల్" సినిమా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. సర్కిల్ చిత్రానికి చిత్రీకరణకి పర్మిషన్ రావడానికే పది నెలలు పట్టింది. అది కూడా తీసిన తరవాత సెన్సార్ అయితే నే విడుదలకి నోచుకుంటుంది అన్న షరతు మీద. దాని సెన్సార్ కి పంపకుండా వేరే దేశాలలో విడుదల చేసారు అనుకోండి. నాలుగో చిత్రం crimson gold చిత్రం కూడా అదే పరిస్థితి. దానికి కూడా సెన్సార్ కాలేదు అక్కడ విడుదల కాకా పోవడం వల్ల ఆ సినిమాకి బెస్ట్ ఆస్కార్ ఎంట్రీ కి తిరస్కరించ బడింది. జాఫర్ చివరి చిత్ర్రం (ప్రస్తుతానికి ) ఆఫ్ సైడ్ కూడా అక్కడి (ఇరాన్) ఆడవారి పరిస్థితులకి అద్దం పడుతుంది.

జాఫర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక వివాదం తయారు గా ఉండేది. అమెరికా కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి నానా గొడవ చేసి ఇవ్వకుండా వెనక్కు వెళ్ళిపోయాడు (ఇది మీడియా కి తెలీదు కాని హాంగ్ కాంగ్ లో సినిమా స్క్రీనింగ్ అప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పారు. ) హాంగ్ కాంగ్ లో కూడా ఇలాంటిదే అయ్యింది. ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు కలగ చేసుకుని వీసా ఇప్పించారు. ఇలా వివాదాల కి స్వాతంత్రానికి పేరు పొందిన జాఫర్ మొన్న జూలై లో టెహరాన్ లో కుటుంబం తో అరెస్ట్ కాబడ్డారు (ఎన్నికల కి వ్యతిరేకంగా ఉన్నవారి మరణాలకి మద్దత్తు గా జరిగిన ఊరేగింపు గా వెళ్ళిన వారి లో వీరి కుటుంబం కూడా ఉంది )

నాలుగు దేశాల్లో నాలుగు భిన్నమైన ఫిలిం ఫెస్టివల్స్ లో ఉత్తమ చిత్రంగా ఎన్నికైన చిత్రం ఇది. ఇది అనే కాదు జాఫర్ తీసిన ప్రతి చిత్రం అవార్డ్లు పొందిన చిత్రాలే .

కుదిరితే జాఫర్ గారి సినిమాలు అన్ని చూడండి.