ఖంగారు పడకండి ఇదేమిటని ,,, మా వేణు కొడుకు విభు కి నేను భస్మసురుడిని. వాడి వయసు నాలుగేళ్ళు . చిన్నప్పటినుంచి వాడికి పాలతో పాటు రామాయణం , భారతం పట్టించాడు వాళ్ళ బాబాయి. దాంతో వాడికి రాముడు , కృష్ణుడు కన్నా రాక్షసులు బాగా నచ్చేసారు. అంతే కాకుండా అన్ని రకాల ఆయుధాలు వాటి ప్రయోగాలు గట్రా బ్రహ్మాండంగా తెలిసి పోయాయి. నేను ఒక రోజు వాడికి ఫోన్ చేశా (వాళ్ళ బాబాయి కి చేసాలెండి). ఆ సమయానికి వాడికి వాళ్ళ బాబాయ్ వాడికి భస్మాసురుడి కథ చెపుతున్నాడు. దాంతో ఎవరు నువ్వు అని నన్ను అడిగాడు నేను భస్మాసురుడిని అని చెప్పా. ఇంకా అప్పటినుంచి నా పేరు భస్మాసురుడు అయిపొయింది. అప్పుడప్పుడు వాడికి ఏదన్నా గిఫ్ట్లు గట్రా పంపేవాడిని. దాంతో వాడు ఎవరన్నా వాడిని భయపెడితే, భస్మాసురుడు నా ఫ్రెండ్ , వాడికి చెప్పి నిన్ను కల్చేయిస్తా అని బెదిరించేవాడు. అంతే కాదు వాడికి బోలెడు అస్త్రాలు తెలుసు అని చెప్పా కదా... ఏవో మంత్రాలూ చదివి మనమిద ఆ అస్త్రం వేస్తున్న అని చెప్పేవాడు. వాడికి గిఫ్ట్లు పంపేవాడిని అని చెప్పా కదా.. అందుకని ఈ సారి కొత్త సంవత్సరం రోజు నాకోసం వాడే ఒక గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసి దాని మీద వాడికి వచ్చిన అక్షరాలతో నాపేరు రాసి దాని మిద మళ్ళి డిజైన్ వేసి పంపాడు. కార్డ్ తో పాటు ఒక కీ చైన్ కూడా పంపాడు. భస్మాసురుడు కాబట్టి బి అక్షరంతో వచ్చే కీ ఛైన్ తీసుకోయాడు. అయితే వాళ్ళ బాబాయి అడ్డుపడి శ్రీ భస్మాసుర అని పూర్తీ పేరు అని చెప్పి ఎస్ అన్న అక్షరం తో ఉన్న కీ ఛైన్ పంపారు. నాకు ఆ కార్డ్ వస్తోంది అని తెలీదు. ఇండియా నుంచి మామూలుగా బుక్స్ అని తీసి చూస్తె ఇవి .. చూడగానే నవ్వు , రేపు నిజం గా నన్ను చూస్తె విభు భస్మాసురుడు ఇలా ఉన్నాడు ఏంటి అని అనుకుంటాడా అని కూడా అనుకుంటాడు ఏమో అని కూడా అనిపిస్తుంది.
వాడిని ఫొటోస్ లో చూడటం / ఫోన్ లో వినడం తప్ప ఎప్పుడు స్వయంగా కలవడం జరగలేదు ఎందువల్ల అంటే వాడు పుట్టాక నేను ఇండియా వెళ్ళలేదు కాబట్టి ... ఈ సారి వెళ్ళాక చూడాలి మరి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి ...
కెమెరా లేకపోవడం వల్ల ఇప్పటిదాకా ఈ కార్డు ఫోటో తియ్యడం పడలేదు... ఇప్పుడు కొత్త కెమెరా కొన్నాక తీశాను ఇది .