నామిని గారి వి మొదటగా మిట్టూరోడి కథలు చదివా, అప్పట్టికి ఇంకా తెలిసి తెలియని వయసు .. అందువల్లో లేక మామూలుగా చదివే కృష్ణ జిల్లా బాష కాకపోవడం వల్లో కాని ఎక్కువగా దాని గురించి ఆలోచించాలా .. నిజానికి అవి నాకు పేపర్ లో వచ్చాయని అని కూడా తెలీదు అప్పుడు. వేసవి సెలవులకివూరు వెళ్ళినప్పుడు అన్నయ్య దగ్గర ఉన్న పేపర్ కట్టింగ్ లో చదివా ... ఆ తరవాత వాటి గురించి అంతగా ఎక్కువ ఆలోచన గాని గుర్తు గాని పెట్టుకోలా.... మళ్ళా ఎప్పుడో ఒకసారి నవోదయ కి వెళ్ళినప్పుడు బాపు గారి బొమ్మ కనపడి పుస్తకం కొనాలా వొద్దా అని ఆలోచిస్తుంటే , అక్కడే ఉన్న షాప్ అయన మంచి బుక్ అని రికమెండ్ చేసారు ... సరే అని కొన్నా... కొని దాన్ని ఇంకో నెల దాకా చదవాలా.. మళ్ళి నెల కాగానే నవోదయ కి వెళ్ళాను.. అయన పుస్తకం చదివారా అని అడిగారు. నేను ఇంకా లేదు అని మొహమాటం గా జవాబు చెప్పి, ఇంకొన్ని పుస్తకాలు కొనుకొచ్చి, ఇంటికి రాగానే మొదట కొత్తగా తెచ్చిన పుస్తకాలు పక్కన పెట్టి , పచ్చ నాకు సాక్షి గా చదవటం మొదలు పెట్టాను. పుస్తకం పూర్తిగా చదివే వరకు ఆపలేదు. ఆ తరవాత ఆ పుస్తకాన్ని నాన్నగారికి ఇచ్చ చదవమని (మా ఇంట్లో ఎవరి పుస్తకాల అల్మేరాలు వాళ్ళవి .. ఎప్పుడన్నా పుస్తకం కావాలి అంటే ముందుగా చెప్పాల్సిందే, తిరిగి ఇవ్వాల్సిందే)... పుస్తకం నచ్చింది ఇద్దరికీ ... కాని ఎక్కువ ఆలోచించలేదు. అప్పట్లో నేను కలిసిన ఒకే రచయిత వీరేంద్రనాథ్ అది కూడా పనికట్టుకుని వెళ్లి కలవలేదు . ఏదో సినిమా ఫంక్షన్ లో కలిసారు.
అమెరికా కి వచ్చాక పుస్తకాలు దొరకడం కష్టం గా ఉండేది ... ఎవరన్న ఇండియా నుంచి వస్తున్నారు అంటే నవోదయ లో బుక్స్ తెమ్మని చెప్పేవాడిని. ఒక సరి చికాగో వెళ్ళినప్పుడు అక్కడ ఇండియా బుక్ హవుసే లో చందా కడితే వారం వారం ఆంధ్రజ్యోతి / ప్రభ పంపుతా అన్నాడు .. దాంతో వాడికి చందా కట్టాను. అప్పుడు జ్యోతి లో పోలేరమ్మ బండ అని ఖదీర్ బాబు కథు సీరియల్ గా వస్తున్నై. అవి చదివి నేను ఖదీర్ కి ఆంధ్రజ్యోతి ఆఫీసు కి ఫోన్ చెసి మాట్లాడాను.. అప్పుడు ఫోన్ ఎత్తింది నామిని గారు. ఆ తరవాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీసు కి వెళ్ళినప్పుడు ఖదీర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు నామిని గారిని కూడా కలవడం జరిగింది. పక్కనే ఉమామహేశ్వర రావు కూడా ఉన్నారు ... కానీ ఉమా గారు ఎక్కువ మాట్లాడలేదు. అప్పుడు నామిని గారి పుస్తకం మళ్ళి కొని ఆటోగ్రాఫ్ తీసుకున్నాను (అది ఇప్పటికి నా దగ్గర ఉంది ). హైదరాబాద్ లో ఉన్న ఆ అరునేల్లల్లో దాదాపు గా ఒక నలుగు నారలు కలిసి ఉంటాను వారిని.
తిరిగి అమెరికా వచ్చాక ఆంధ్రజ్యోతి ముసినప్పుడు ఎలా ఉన్నారో కనుక్కుందాం అని ఖదీర్ ని అడిగితె బాగానే ఉన్నారు ప్రాబ్లం లేదు . లక్షన్నర దాక ఆంధ్రజ్యోతి నుంచి వచ్చింది అని చెప్పారు. (అప్పుడు ఖదీర్ నీహార్ ఆన్ లైన్ లో పనిచేస్తున్నారు). తరవాత చాల సార్లు ఎలా ఉన్నారో కనుకునే వాడిని వేరే స్నేహితుల ద్వారా ... అందరు బాగానే ఉన్నారు ... పుస్తకాలూ ఆయనే ప్రింట్ చేసుకుంటున్నారు ..అక్కడి స్చూల్స్ లో అమ్ముతున్నారు అని బాగానే ఉన్నారు అని చెప్పేవారు.. నాకు సరిగ్గా అర్ధం కాకపోయినా బాగున్నారు కదా అని అనుకునేవాడిని.
గత సంవత్సరం పచ్చనాకు పుస్తకానికి పాతికేళ్ళు అని దాదాపు గా అన్ని పేపర్స్ లో ఆర్టికల్స్ రావడం ఆయనకి సన్మానం చెయ్యడం పదిలక్షలు ఇవ్వడం జరిగింది. నేను కూడా సంతోషించాను. వెంటనే ఆంధ్రజ్యోతి ఓ వారం దాని మిద అయన రాయడం. దాని మిద చర్చ చర్చ జరగడం విన్నాను. కానీ పట్టించుకోలేదు . అది జరిగిన కొన్ని నెలలకి ఒక స్నేహుతుడు నామిని కొత్తపుస్తకం పంపుతున్న అని అన్నాడు. కొన్ని కారణాల వాళ్ళ ఆ పుస్తకం నాకు చేరలేదు. మొన్న జంపాల గారు ఇండియా వెళ్లి నప్పుడు నాకోసం ఇంకో కాపీ కొని పోస్ట్ చేస్తారు. రాగానే చదివాను ...
పుస్తకం పూర్తి చెయ్యగానే ఒక రోజు వరకు మామూలు గా ఆలోచించలేక పోయాను. అయన పచ్చ నాకు సాక్షి గా నాకు బాగా నచిన పుస్తకం. కాని అయన కి అయన గొప్ప వ్యక్తీ ని అనుకోవడం, లేక ఇంకొకళ్ళు ఎప్పుడు ఆయనకి సాయం చెయ్యాలి అనుకోవడం అంత ముర్ఖత్య్వం , భార్య పట్టా అయన చూపిన వైనం లాంటివి నాకు మింగుడు పడలేదు . కొన్ని విషయాలు తెలుసుకోక పోవడం అంత మంచిదని ఇంకోటి లేదు . ఇది కూడా అలాంటిదే ఏమో మరి. ఒక రచయితా ఆత్మ కథ అని ఒదిలేసుకోవాలి ఏమో మరి.
ఉద్యోగం పోగానే ప్రపంచం అంతా అంధకారం అయిపోవడం ఏంటో. ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు పొదుపు అన్నది ఎక్కడా కనపడదు. జీతం తో పాటు గీతం కూడా తీసుకునేవారం అని చెప్పారు.. మరి పొదుపు గురించి ఎక్కడా చెప్పలేదు. పిల్లల గురించి కూడా ఎక్కడా పట్టించుకున్నట్టు గా కనపడదు. బాపు గారు గొప్పవారు అని పుస్తకం లో ఒక పది సార్లు రాసి ఉంటారు ... మరి అయన ని ఎక్కడ ఆదర్శం గా తెసుకున్నట్టు గా కనపడదు. బాపు గారు నామిని గారిని గొప్పవారు అన్నారు కాబట్టి నామిని గారు నిజం గా నే గొప్పవారు అనుకోవాలి ఒకరు వెళ్ళిన తోవ లో నేను పోగూడదు అని కొత్త దోవ వేసాను చూడండి అని ఇయన అనవచ్చు... కాని ఆ దోవ ఎంతవరకు ఇతరులకి మార్గదర్శర్వం అంటే నాకు తెలిసి లేక నావరకు అయితే ఎక్కడా ఆచరించేలా లేదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసే చూపులు తప్ప . అన్ని చోట్ల వాళ్ళు నాకు సాయం చేసారు ... పలానా వాళ్ళు మోసం చేసారు అని తప్ప స్వహతగా నామిని గారు సమాజానికి తన వంతుగా చేసింది ఏమిటి, లేక అయన తనవంతు గా తన కుటుంబానికి కాక వేరే వారికి చేసిన సాయం ఎంత ?? శూన్యం...
ఒక రచయిత, రచయిత గా బతకాలి అంటే ఇంత కష్టపడాలి కాబోలు అని ఒక అభిప్రాయం రావడానికి ఈ పుస్తకం చదివాక అనిపించవచ్చు. కాని ఇంకో పార్శం ఏంటి అంటే ... నామిని గారి మెప్పు కోసం చాలామంది ఎదురు చూస్తున్నట్టు గా రాసుకోవడం. బాపు గారు నామిని గారి గురించి రాస్తే అది గొప్ప... కాని అదే బాపు గారు వంశి గారి గురించి రాసినా కాని వంశి గొప్పవారు కాదు. అలాగే చాసో , రావి శాస్త్రి ఇంకా మిగిలినవాళ్ళు కూడా ...
ఒకరి సాయం లేకుండా ఈ ప్రపంచం లో గడపటం కష్టం. అది ఎటువండిది అయినా కావచ్చు. కాని జీవితాంతం ఎవరిదో ఒకరి ఆసరా ఉండాలి అనుకోవడం ... తనని ఎవరు గుర్తించలేదు అని వ్యసనాలకి బానిస కావడం అంత దురదృష్టం ఇంకోటి లేదు. నామిని గారి జీవితం అయన ఇష్టం అది తప్పు కాదు ... కాని అయన అలా కావడానికి కారణం ఇతరులు అని అయన అనడమే నాకు నాకు అర్ధం కాలేదు.
చివరగా ... మీకు నామిని గారి పచ్చ నాకు సాక్షిగా , మిట్టూరోడి కథలు లాంటివి నచ్చితే .... ఈ పుస్తకం చదవకండి ... ఇది అయన మీద ఉన్న అభిమానాన్ని చాలా వరకు తగ్గించవచ్చు...