యద్దనపూడి నవల జీవనతరంగాలు అప్పట్లో పుస్తకాలు విరివిగా చదివేవారికి బాగా పరిచయం. అది రేడియో లో సీరియల్ గా వచ్చే సమయానికి జనాలు అందరు రేడియో కి అత్తుక్కు పోయేవారు అనడం లో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. దాన్ని రామానాయుడు కొని సినిమాగా తీస్తే చాలా పెద్ద విజయం సాదించింది.
తెలుగు లో మళ్ళా కృష్ణంరాజు దాన్ని టీవీ సీరియల్ గా తీస్తున్నాడు అని తెలిసి చూద్దాం అనుకున్నా. సీరియల్ ని ఎంత నాసిరకం గా తియ్యాలో అంత నాసిరకంగా తీసాడు. విజయ పాత్రకి రాజాశ్రిధర్ అసల పనికిరాడు, అనంత్ పాత్రకి చక్రి పరవాలేదు. ఒక పాత తరం నవలని కాలానుగుణం గా మార్చుకోగలిగితే అది మంచి సీరియల్ గాని చిత్రం అవుతుంది. ఉదాహరణకి bourne identity చిత్రాన్ని నవలలో మూలకథ మార్చకుండా ఇప్పటి కి సరిపోయేలా ఎలా మార్చారో చూడండి. మనవాళ్ళు ఎప్పటికి అలా మార్చి తియ్యగాలరో అన్నది నాకు అంతుచిక్కని సమాధానం,
No comments:
Post a Comment