Tuesday, September 14, 2010

కొమరం పులి ... సమీక్ష

సినిమా అసలు చూడాలా వద్ద అని ఆలోచించా ... మా వాడు పవన్ నటన లో కొంచం మేరుగుపడ్డాడు అంటే కాబోలు అనుకున్నా... సరే కొంచం ప్రయత్నిద్దాం అని సినిమా డౌన్లోడ్ చేశా... (ధియేటర్ కి వెళ్ళే ధైర్యం లేక పోయింది మరి ... మరీ పద్దెనిమిది డాలర్లు పెట్టి తలనొప్పి తెచ్చుకునే కోరిక కూడా లేక పోయింది... మా ఊర్లో రెండు షో లు ప్రకటించి ఒక షో నే వేసారు ... పన్నెండు మంది వచ్చారు సినిమాకి అని తెలిసింది. )

సినిమా మొదట్లోనే సూర్య గారి (దర్శకుడు ) పైత్యం చూసి దిమ్మ దిరిగింది.. హీరో కడుపు లో ఉండగానే పోలీసు కవాతు మొదలు పెట్టినట్టు చూపిస్తారు. ఇంకా పెద్దవగానే మనకి హీరో గారు నల్లకళ్ళద్దాలు పెట్టుకుని హెలికాప్టర్ మిద నుంచి పారచూటు లేకుండానే పెద్ద పెద్ద భవంతులు పైకి స్పిదర్ మాన్ లాగా గెంతుకుంటూ దుండుగులని ఎడాపెడా (కళ్ళద్దాలు కిందపడకుండా) . చంపేసి భారత ప్రదాని ని రక్షించేసి ప్రశంసలు / పతకాలు పొందుతాడు. ఆ మీటింగ్ లో ప్రధానికి ఒక ఉపన్యాసం ఇచ్చేసి పులి టీం అని ఒకటి తయారు చేస్తాడు. ఉపన్యాసం మధ్యలో ఆయనకి కొమరం ఇంటి పేరు తెలంగాణా అని గుర్తుకు వచ్చి తెలంగాణా ల్లోకి దిగుతాడు (సినిమా మొత్తం తెలంగాణా లో మాట్లాడటానికి సమస్య ఏంటో నాకు అర్ధం కాలేదు, సూర్య గారి వివరణ ప్రకారం .. మనకి ఆవేశం వచ్చినప్పుడు మన సొంత భాషలో మాట్లాడుతాం అందువల్ల ఉపన్యాసం మద్యలో తెలంగాణా పెట్టం అన్నారు ... బాగానే ఉంది కానీ మొత్తం తెలంగాణా లో మాట్లాడవచ్చు కదా సినిమా అంతా... కొమరం తెలంగాణా కి సంభందించిన వాడు కాబట్టి ఆ భాషలో మాట్లాడాడు అని చెప్పొచ్చు కదా... ఇలా గందరగోళం అంటూ ఉండదు కదా. ).

హీరో గారి మిద ప్రేమతో హీరోయిన్ నాటకం ఆడి హీరో ని ప్రమలో పడేస్తుంది... కాని హీరో కి హీరోయిన్ తో కాపురం చెయ్యడానికి ఇష్టపడడు. కారణం మరేం లేదు .. కాపురం చేస్తే పిల్లలు పుడతారు కానీ ఇయనకి ఇలాంటి సంఘం లో పిల్లలు పాడయిపోతారు కాబట్టి ఒద్దు అనుకుంటాడు..కాని ఆ విషయం చెప్పడం కూడా ఇష్టం ఉండదు. అందుకని కాపురం చెయ్యకుండా తప్పించుకు తిరుగుతాడు (హీరో కి గర్భ నిరోధక మార్గాల గురించి తెలీదు అనుకుంటా )...

హీరో తప్ప ఇంటర్పోల్ .. సి బి ఐ లాంటి వాళ్ళు అందరు తల తోకా లేకుండా ఉంటారు. ఇంటర్ నేషనల్ డాన్ హైదరాబాద్ లో నే ఉంటాడు... వాడికి మన రాజకీయ నాయకులు తానా అంటే తందానా అంటూ ఉంటారు... ఒక హీరో తప్ప... సినిమా నిండా ఉపన్యాసాల హోరు.. ( టి వి లో ప్రజారాజ్యం బోరు తప్పింది అనుకుంటే సినిమాలో పెట్టారు ). అంట పెద్ద హీరో కూడా విలన్ ని పట్టుకోడానికి ఒక కాం ని పెట్టి ప్రపంచం అంతా ప్రసారం చేస్తాడు. ఈ తొక్క ఆలోచన సినిమా మొదట్లో వస్తే నిర్మాతకి బోలెడు డబ్బు మిగిలేది, ప్రక్షకుడికి సిరో భారం తప్పేది కదా ...

పవన్ చేతులు ఊపడం తప్ప నటన శూన్యం. కొత్త అమ్మాయి కి అన్ని శూన్యం ... బాగా చేసింది శరణ్య .. మిగిలిన సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి సినిమాకి మల్ల ఎవరు దొరకరు అన్నట్టుగా బొంబాయి కెమెరా మాన్ ... అయన కొత్తగా చూపించింది ఎం లేదు సినిమాలో... పవన్ ఒక సారి కాఖి బట్టలు వేస్తె ఇంకో సారి ఇంకో రకం బట్టలు వేస్తారు.. అయన ఎ పోసిషన్ లో ఉన్నారో ఆయనకన్నా తెలుసా అన్నది నాకు సందేహమే. సినిమా నిండా బోలెడు బెజ్జాలు ... కార్ షో రూం కి వెళ్లి చెక్ ఇస్తే కార్ ఇచ్చే లెవల్ కి పెరిగిపోయిందా మన దేశం ??!!
సినిమా లో మచ్చుకు ఒక రిలీఫ్ అన్నది లేదు... పరమ సోది సినిమా

6 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

సచ్చిన పాముని ఎన్ని సార్లు చంపుతారు ...

Anonymous said...

:))) Enjoyed reading.

కన్నగాడు said...

హ్హహ్హహ్హ! నేను కూడా సినిమా హాలుకి వెళ్ళే ధైర్యం లేక డౌన్లోడు చేసే చూసా. మీ దగ్గరన్నా పద్దెనిమిది డాలర్లు, మా దగ్గర సోమవారం నాడు వేసిన ఒకే షోకి పదహారు పౌండ్లు వసూలు చేసారు(సాధారణంగా పది-పన్నెండు పౌండ్లు). ఎంత మంది వెళ్ళారో కూడా తెలీదు.
అసలు కొన్ని సార్లు ఏం మాట్లాడుతున్నాడో, ఏ భాషలో మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు.

కొత్త పాళీ said...

పద్ధెనిమిది డాలర్లే? మగధీరకి పదిహేను వసూలు చేస్తేనే నేను హాహాకారాలు చేశాను.

BTW, welcome back.

life is beautifull said...

@కార్ షో రూం కి వెళ్లి చెక్ ఇస్తే కార్ ఇచ్చే లెవల్ కి పెరిగిపోయిందా మన దేశం ??!!

ఇందులో వింత ఏముంది. నేను నా 2 wheeler చెక్ ఇచ్చే డెలివరీ తీసుకున్నాను ఆన్ స్పాట్ ...చిన్న ఉజ్జోగం చేసే నాకే ఇంత లెవెల్ ఉంటె ....డబ్బు తో పాటు పేరు ఉంటె ఇలాంటిచి మామూలే బ్రదర్ ..(డబ్బు నాది పేరు మా బాస్ ది)

so pls remove that point.

Sai chand said...

y this holly wood, people only use titles like superman returns, batman returns.. Y dnt we use such a great title for this terrific film. This is what I want to say. Title is the major mistake for Puli.So,
My choice of title is : The Vijaykanth Returns.