Tuesday, January 21, 2014

నేనొక్కడినే - నా ఒక్కడి సమీక్ష


     సుకుమార్  - మహేష్ బాబు సినిమా , సక్సెస్ బాట లో ఉన్న మహేష్ ,  కర్చు కి వెనకాడకుండా తీసిన సినిమా ఇంకా ఈ సినిమా తెలుగు సినిమా ల లో ఒక నూతన అధ్యాయం అని మాములుగా నే ఉదారగోట్ట బడ్డ సినిమా . 
    ముందర నుంచి నాకు సుకుమార్ మీద మరి అంత గొప్ప అభిప్రాయం లేదు .   వాణిజ్య పరమైన సినిమాలు తియ్యడం బాగా నే వచ్చు సుకుమార్ కి .  స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది. కాని తీసిన సినిమాలు అన్ని ఒక రకం గా పర్వేర్తేడ్ సినిమాలు అని నా అభిప్రాయం .  ఉదాహరణ కి ఆర్య సినిమా నే తీసుకోండి.  హీరో సినిమాలో అమ్మాయిని వెంట పడి నువ్వు ప్రేమించాక పోయినా నేను ప్రేమిస్తా అని వేదిస్తాడు . అదే ఇంకో అబ్బాయి చేస్తే సహించలేడు.  ఒక రకమైన సైకో .. ఈ సినిమా మే లో విడుదల అయ్యింది.  జూన్ లో విజయవాడ శ్రిలక్ష్మి ని అన్యాయం గా పొట్టనపెట్టుకున్నారు ఇలాంటి ప్రేమికుడు ఒకడు . 
   హండ్రెడ్ పెర్సెంట్ లవ్ ఇంకో డకోటా సినిమా ..  నాయకుడు  దీంట్లో ఒక రాంక్ హోల్డర్ , అతడి ఫోటో పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో పెడతారు కాలేజి వాళ్లు . అలాంటి వాడు తరవాత  రాంక్ కోసం అడ్డమైన పనులు చేస్తాడు.. ఆఖరికి నాయిక ని అడ్డం పెట్టుకుని రాంక్ తెచ్చుకుంటాడు . ఇది యువతకి ఎలాంటి చెత్త ఐడియా లు ఇస్తుందో ఒక్క సరి ఆలోచించాడా అన్నది నాకు సందేహమే . 
   ఇంకా ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడి సినిమా అంటే నాకు ముందు నుంచి ఒక రకమైన సందేహాలు ఉన్నాయ్ .  (అవి సినిమా చూసాక తీరిపోయాయి అనుకోండి ) .. అందరు ఓ పోగిడేసినట్టు ఇదో అద్భుతమైన తెలుగు చిత్రం కాదు అనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు .  రెగ్యులర్ సినిమా లో బ్రాహ్మి ఉంటాడు .. దీంట్లో లేడు అదే తేడా .  ఒక సినిమాలో బ్రాహ్మి ని (బాద్షా ) మీకు ఏది కలో ఏది నిజమో తెలీదు , ఇది టైం మెషిన్ ని ఆడుకుంటారు . ఈ సినిమాలో జనాలని డైరెక్టర్ ఆడుకున్నాడు అదే తేడా . 
    మాములుగా సినిమాల్లో ప్రతీకార చిత్రాలు మొదలు అయినప్పటి నుంచి ఉండే ఫార్ములా ఒక్కటే . నా కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని విడిచి పెట్టను .. దెబ్బకు దెబ్బ తీస్తాను అన్నది . ఇందులో కూడా అంతే . రెగ్యులర్ సినిమాలో  ఉండే ఒక నాయిక , మూడు డ్యూయెట్ లు , ఒక ఐటెం సాంగ్ , ప్రతి పది నిమషాలకి ఒక పోరాటం , తల్లి తండ్రుల హత్య , ముగ్గురు విల్లన్లు ఇవి అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి . లేనిది హాస్యం ఒక్కటే అదే ఈ సినిమాలో ఉండే ప్రత్యేకత అంటే ఇంకా ఎం చెప్పలేం .
     సినిమాలో మనం ఆడే రెగ్యులర్ రుబిక్ క్యూబ్ ఇంకా కొంచం మార్చి సినిమాలో వాడారు . దాంట్లో నాయకుడు చిన్నప్పుడు దాన్ని ఒక రకం గా తీసుకు రావడం అన్నది చెప్పరు మనకి .. (అది ఎడిటింగ్ లో పోయింది అన్నది దర్శకుడి ఉవాచ )  ఇలాంటివి మనకి అర్ధం కానివి అన్ని ఎడిటింగ్ లో పోయాయి . అనవసరం అయిన చాలా సన్నివేశాలు ఉండిపోయాయి (సినిమా విడుదల అయ్యాక ఒక ఇరవై నిమషాల సినిమా ఎడిట్ చేసారు మరి ).  ఇవే కాక సినిమాలో  Tomcruise, camerion diaz   నటించిన  Knight and Day  సినిమా నుంచి సన్నివేశాలకి సన్నివేశాలు ఎత్తేసారు .  మరి అన్యాయం ఏంటి అంటే , సినిమా చివరలో మహేష్ బాబు , గౌతమ్ పాట , సన్నివేశం రెండు కూడా అయితే ఓల్డ్  బాయ్ అన్న కొరియా సినిమా నుంచి ఎరువు  తీసుకొచ్చి ఈ సినిమా కి ఎరువు గా వాడారు .  దానికి మన వాళ్ళు  అబ్బ ఎం తీసాడు , ఎలా తీసాడు మహా తోపు అని మెచ్చి శాలువాలు కప్పడం మొదలెట్టేసారు .  ( వందశాతం ప్రేమ సినిమా లో హీరో కాపి కొట్టడం ఎలా నో చూపించాడు , ఈ సినిమాలో దర్శకుడు  అది చేసి చూపించారు )  
    సినిమా లో బాగుంది మహేష్ నటన .  చాల బాగా చేసాడు . నేపధ్య సంగీతం మొత్తం ఓల్డ్ బాయ్ సినిమా నుంచి ఎత్తుకోచ్చారు.  సినిమా లో హీరో పాప్ సింగర్ ... బట్ బిభత్సమైన పోరాటాలు అద్భుతం గా ఒంటి చేత్తో చేసేస్తూ ఉంటాడు . ఫాస్ట్ అండ్ ఫురియాస్ సిన్మా లో లాగ భవంతుల మీద నుంచి అవలీలగా దూకి పరిగెట్టడం లో కూడా ప్రవీణుడు.  ఇంకా డాక్టర్ ఉంటాడు సినిమాలో ప్రపంచం లో ఇలాంటి డాక్టర్ ని ఎక్కడ చూడని టైపు, హీరో కన్నా వాడికి ముందర వైద్యం చేయించవలసిన వాడు .. ఫోటోగ్రఫి బాగుంది . హీరోయిన్ మనకి అలవాటు పడటానికి టైం పడుతుంది . బట్ ఓకే .

3 comments:

no one replace you :-( said...

Excellent write up sir :-)

Kottapali said...

"ఇంకా డాక్టర్ ఉంటాడు సినిమాలో ప్రపంచం లో ఇలాంటి డాక్టర్ ని ఎక్కడ చూడని టైపు, హీరో కన్నా వాడికి ముందర వైద్యం చేయించవలసిన వాడు" .. ha ha ha.

Good one :)

Tejaswi said...

సుకుమార్ తీసిన 100 పర్సెంట్ లవ్ సినిమాను నేను బాగానే ఎంజాయ్ చేశాను. కానీ, మీ రివ్యూ చదివాక ఆలోచిస్తే, అది యువతకు రాంగ్ మెసేజ్ ఇస్తోందన్నది నిజమేననిపిస్తోంది. హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ కూడా బాగానే చేయించాడు...దానిలో. ఇదే కోవలో హ్యాపీడేస్ కూడా చూడటానికి బాగుంటుంది. కానీ, ప్రతివాళ్ళకీ ఒక బాయ్/గాళ్ ఫ్రెండ్ ఉండి తీరాలనే రాంగ్ మెసేజ్ ఉంటుంది ఆ పిక్చర్‌లో.