తెలుగు వారికీ స్వంతమైన పచ్చడి... జీవితానికి నిర్వచనం .... అందుకే బ్లాగ్ పేరు మార్చాను ....
Monday, September 24, 2007
Railway Gate (2007)
Agatha Christie వ్రాసిన Murder on the Orient Express (1974)ని ఎంత చెత్తలాగా తీయొచ్చో మనం ఈ సిత్రం చూసి తెలుసుకోవచ్చు. ఆకశ్ (పృథ్వీ) అమెరికా నుంచి వచ్చి వ్యాపార వ్యవహారాలు చక్కపెట్టుకుని ఆస్తి అమ్మేసి మళ్ళీ అమెరికా పోవాలనుకుంటాడు. అతనికి ఉన్న అమ్మాయిల పిచ్చి వల్ల దారుణంగా railway gate దగ్గర హత్య చేయబడతాడు. దాన్ని పరిశోదించడానికి ఇంకో పృథ్వీ వచ్చి ఎలా murder mysteryని ఛేదించదు అన్నదే క్లుప్తంగా కథ. మొదటి సగం సిత్రం పృథ్వీ అమ్మాయిల పిచ్చి, హత్యతో సరిపోగా రెండో సగం రెండో పృథ్వీ పరిశోధన పేరుతో కాలక్షేపం చెయ్యాలని చూసారు. సినిమాకి సంబంధం లేకుండా మరో పక్కన ఆలీ-కొండవలస comedy track, సుమన్ శెట్టి dance ఏంటో ఆ దర్శకమహానుభావుడికే తెలియాలి. ఒక మంచి thrillerని ఎలా ఖూనీ చేయవచ్చో మనవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు!
Disturbia (2007)
Alfred Hitchcock తీసిన Rear Window (1954) గుర్తుందా? దాన్ని ఈ కాలానికి అనుగుణంగా తీసిందే ఈ సినిమా. మాతృకకు మంచి comedy కూడా కలిపి తీసారు. కథ ఒకటే అయినప్పటికీ కథనం కొత్తగా ఉండి మంచి ఉత్కంఠతతో సాగి చినెమ చూడబుద్ధేస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు మెదడుకి పని చెప్పకుండా ఒకసారి చూడొచ్చు.
Saturday, September 22, 2007
Italianetz (2005)
Italianetz (2005) English title The Italian, Vanya Solntsev (Kolya Spiridonov) అనే రష్యన్ కుర్రాడు ఒక ఆనాధ అశ్రమం లొ ఉంటాడు. ఆతన్ని పెంచుకొడానికి ఒక italian కుటుంబం ముందుకు వస్తుంది. కాని vanya కి తన తల్ల్లిని వెదికి పట్టుకోవాలని అనుకుంటాడు. తల్లి చిరునామ Warden వద్ద ఉన్న లాకర్ లొ ఉంటాయి. అది ఎదొ తెలుసుకొవాల్లన్న అతనికి చదువు రాదు. తనకన్న పెద్ద వారిని సహయం అడగాలనుకుంటె ఆ అమ్మాయి డబ్బు అడుగుతుంది. తరువాత అతని మీద జాలి పడి చదువు చెపుతుంది. అతికస్టం మీద తల్లి చిరునామ ఉన్న సంపాదించి తనని వెతుకుతున్న శరణాలయం వాల్ల బారినుంచి తప్పుకుని తల్లిని చెరుకున్నడ లేదా అన్నది చూడవలిసిందే. చిత్రం లొ ఎక్కడ అబ్బాయి ఎడుపులు కాని ఎక్కువ cinematic గా కని కనపడదు. rabbit proof fence తరవాత అంత మంచి చిత్రం అని నిస్సందెహం గా చెప్పుకొవచ్చు. తప్పక చూడవల్సినది గా చెప్పుకొవచ్చు
Thursday, September 20, 2007
Perfect Stranger (2007)
Haley Berry ఒక journalist. ఆరునెలలు కష్టపడ్డ scoop కాస్తా senator కావడం వల్ల paperలోకి రాదు. ఈలోపల చిన్ననాటి స్నేహితురాలు హత్య చెయబడుతుంది. కారణం Bruce Willis అని అనుమానం. స్నేహితుడైన తోటి పాత్రికేయుడితో కలిసి Bruce Willis చుట్టూ వల పన్ని శిక్ష పడేలా చేస్తుంది Haley Berry. కానీ Bruce Willis అసలు హంతకుడా కాదా అని regularగా English చిత్రాలు చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకు, ఎవరు, ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడండి ...ఫరవాలేదు, వేరే పనేమీ లేనప్పుడు చూడొచ్చు... తీయగలిగితే తెలుగులో కూడా తీయొచ్చు సరైన screenplay వ్రాసుకుంటే...
unfaithful (2002)
Richard Gere, Diana Lane భార్యాభర్తలు. Diana Lane ఒక అబ్బాయి ఆకర్షణలో పడి Richard Gereకి తెలియకుండా ఆ అబ్బాయితో సంబంధం పెట్టుకుంటుంది. తరువాత తరువాత పశ్చత్తాపపడి వాడిని వదిలించుకోవాలని చూస్తుంది. ఇంతలో ఆ అబ్బాయినెవరో హత్య చేస్తారు! ఆ హత్య Richard Gere వేసిన పథకం అని తెలుస్తుంది! ఇక్కడే మలుపు... చచ్చినవాడు బ్రతికివస్తాడు! ...తర్వాత ఏం జరిగిందంటే... కొత్తగా విడుదలయిన మన Hindi సిత్రం "అగర్" చూడండి... "దానికి దీనికి సంబంధమేంటి?" అంటారా? మనవాళ్ళు సుబ్బరంగా copy కొట్టేసారుగా మరి!
Sunday, September 16, 2007
Jaitra Yatra 1991
Schoolలో ఉన్నప్పుడు "జైత్రయాత్ర" మొదటిసారి చూడగానే "దర్శకుడు రాంగోపాల్‌వర్మ శిష్యుడా?" అనిపించింది. మొదటి సగం interesting గానే కాక taking పరంగా అద్భుతంగా ఉంది. సినిమాలో fade-in, fade-out shots Hollywood levelలో తీసారు. రెండో సగం వచ్చేసరికి సినిమాలో comedy part miss అవటం వలన కానీ తరువాత ఏం జరుగుతుందో తెలిసిపోవడం వల్ల కానీ సినిమా నత్తనడక నడిచి totalగా art cinema look వచ్చి సినిమా commercialగా ఆడలేదు. కానీ నాగ్‌కి వేసిన దుస్తులు కానీ అతని mannerisms కానీ సగటు మనిషి లాగా ఉండి మనని ఆలోచింపజేయడమే కాక బాగా అనిపిస్తుంది కూడా. ఉప్పలపాటి జైత్రయాత్ర తరువాత తీసిన "రక్షణ" ఎంతో కొంత విజయవంతమై అతని పేరు నిలబెట్టింది. ఉప్పలపాటి అనగానే "జైత్రయాత్ర", "రక్షణ" గుర్తు వస్తాయే కానీ "అల్లరి పోలీస్", "పాతబస్తీ" లాంటి సినిమాలు "జ్ఞాపకం" రావు! మంచి taste కానీ taking పరంగా కానీ సత్తా ఉన్న దర్శకుడు luck లేకపోవటం వల్ల ఈ చిత్రసీమలో ఎలా వెనకబడ్డాడో చెప్పడానికి ఉప్పలపాటి ఒక ఉదాహరణ.
Read the retrospect in Telugucinema.com
Read the retrospect in Telugucinema.com
The Return 2006
Sarah Michelle Gellar, plus మన Asif Kapadia కదా అని తెచ్చి చూసా. సినిమా ఎంతకూ సాగదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటే ఇదేనేమో అనిపించేంత సోది సినిమా. సినిమా మొదలుకాగానే Joanna (Sarah Michelle Gellar) కి ఎవరో తనని వెంటాడుతున్న feeling, ఎవరో ఏదో చెబుతున్న feelingతో మొదలవుతుంది. ఇంక అక్కడి నుంచి సినిమాలో ఒక గంట పాటు అదే పునరావృత్తమవుతుంది! ఆఖర్లో మన Manoj Shyamalan typeలో మెలికతో కథ కంచికి మనం Saridon/Anacin మాత్రలకి వెళతాం.
Asif మొదటి సినిమా The Warrior చాలా better చిత్రం దీని మీద. అది మొత్తం రాజస్థాన్‌లో తీసదు. కుదిరితే అది చూసి దీన్ని వదిలెయ్యండి.
Asif మొదటి సినిమా The Warrior చాలా better చిత్రం దీని మీద. అది మొత్తం రాజస్థాన్‌లో తీసదు. కుదిరితే అది చూసి దీన్ని వదిలెయ్యండి.
Blue Smoke (2007) TV
Englishలో కూడా పరమ సోది సినిమాలు ఉన్నాయని చెప్పడానికి ఇది రెండో సినిమా ఈ వారంలో... నాయిక అగ్నిప్రమాదాల మీద పరిశోధించి insurance company వాళ్ళకి నిజానిజాల మీద report ఇచ్చే పనిలో ఉంటుంది. చిన్నతనంలో జరిగిన అగ్నిప్రమదంలో schoolలో ఈ అమ్మాయి మీద అత్యాచారం చెయ్యబోయిన వాడి తండ్రిని దోషిగా నిర్ణయించి శిక్ష పడేలా చేస్తుంది. పదిహేనేళ్ళు తిరిగాక ఈ అమ్మాయి ఎవరిని ప్రెమించినా వాడు అగ్నిప్రమాదంలో చస్తూ ఉంటాడు. అమ్మాయి చివరకి వాడిని పట్టుకుందా లేదా అని అడగనక్కరలేకుండా దర్శకుడికి చిరాకు వచ్చి అవగొడతాడు సిత్రాన్ని ... చూడకపోవడం better!
Thursday, September 6, 2007
Casi Casi (2006)
Spanish cinema - కొంచెం మన जो जीता वही सिकंदर లాగా ఉంటుంది. దీంట్లో నాయకుడు నాయిక దృష్టిలో పడటం కోసం school president పదవికి పోటీ చేస్తాడు. నాయిక స్కూల్లో most popular girl. అతనికి తెలియని విషయం ఏంటంటే నాయిక కూడా అదే పదవి కోసం పోటీ చేస్తోందని.
సినిమాలో అతని స్నేహితులు అతను గెలవడం కోసం పడిన తిప్పలు, నాయకుడు నాయిక ప్రేమ కోసం పడే పాట్లు... ఇలా సరదాగా సాగి చివరికి నాయుకుడు బాహ్యసౌందర్యం కన్నా మనఃసౌందర్యం గొప్పని తెలుసుకుంటాడు. బాగుంది సినిమా - మన తరుణ్ లాంటి వాళ్ళని పెట్టి తీయొచ్చు.
36 hours (1965)
మంచి concept. సుబ్బరంగా తెలుగులో తీయొచ్చేమో... మంచి suspense thriller అవుతుంది. ఒక అమెరికా సైన్యాధికారిని జర్మనీ సైనికులు బంధిస్తారు. అతను స్పృహ వచ్చే సమయానికి అతన్ని ఒక ఆసుపత్రిలో join చేసి అక్కడ వాతావరణం మొత్తం అమెరికన్ హాస్పిటల్ లాగా కనపడే లాగా చేసి, యుద్ధం ముగిసి అయిదేళ్ళయ్యాయని చెప్పి అలా కనపడేటట్టు, నమ్మకం కలిగించేలా దినపత్రికలు, రేడియో లాంటివి ఏర్పాటు చేస్తారు. అలా నమ్మించి మిలిటరీ రహస్యాలు అతని నుంచి రాబట్టాలని వాళ్ళ వ్యూహం. అది ఒక రకంగా ఫలిస్తుంది. చివరికి ఏం జరిగిందో చూడాలంటే సినిమా చూడాలి మరి. సినిమా మంచి పట్టుతో సాగుతుంది. అంతే కాకుండా దీంట్లో మంచి మానవతావిలువలు కూడా ఉన్నాయి. మంచి నటులు, మంచి దర్శకుల చేతిలో పడ్డ మంచి కథ - నాకు నచ్చింది.
Subscribe to:
Posts (Atom)