మంచి concept. సుబ్బరంగా తెలుగులో తీయొచ్చేమో... మంచి suspense thriller అవుతుంది. ఒక అమెరికా సైన్యాధికారిని జర్మనీ సైనికులు బంధిస్తారు. అతను స్పృహ వచ్చే సమయానికి అతన్ని ఒక ఆసుపత్రిలో join చేసి అక్కడ వాతావరణం మొత్తం అమెరికన్ హాస్పిటల్ లాగా కనపడే లాగా చేసి, యుద్ధం ముగిసి అయిదేళ్ళయ్యాయని చెప్పి అలా కనపడేటట్టు, నమ్మకం కలిగించేలా దినపత్రికలు, రేడియో లాంటివి ఏర్పాటు చేస్తారు. అలా నమ్మించి మిలిటరీ రహస్యాలు అతని నుంచి రాబట్టాలని వాళ్ళ వ్యూహం. అది ఒక రకంగా ఫలిస్తుంది. చివరికి ఏం జరిగిందో చూడాలంటే సినిమా చూడాలి మరి. సినిమా మంచి పట్టుతో సాగుతుంది. అంతే కాకుండా దీంట్లో మంచి మానవతావిలువలు కూడా ఉన్నాయి. మంచి నటులు, మంచి దర్శకుల చేతిలో పడ్డ మంచి కథ - నాకు నచ్చింది.
No comments:
Post a Comment