Schoolలో ఉన్నప్పుడు "జైత్రయాత్ర" మొదటిసారి చూడగానే "దర్శకుడు రాంగోపాల్‌వర్మ శిష్యుడా?" అనిపించింది. మొదటి సగం interesting గానే కాక taking పరంగా అద్భుతంగా ఉంది. సినిమాలో fade-in, fade-out shots Hollywood levelలో తీసారు. రెండో సగం వచ్చేసరికి సినిమాలో comedy part miss అవటం వలన కానీ తరువాత ఏం జరుగుతుందో తెలిసిపోవడం వల్ల కానీ సినిమా నత్తనడక నడిచి totalగా art cinema look వచ్చి సినిమా commercialగా ఆడలేదు. కానీ నాగ్‌కి వేసిన దుస్తులు కానీ అతని mannerisms కానీ సగటు మనిషి లాగా ఉండి మనని ఆలోచింపజేయడమే కాక బాగా అనిపిస్తుంది కూడా. ఉప్పలపాటి జైత్రయాత్ర తరువాత తీసిన "రక్షణ" ఎంతో కొంత విజయవంతమై అతని పేరు నిలబెట్టింది. ఉప్పలపాటి అనగానే "జైత్రయాత్ర", "రక్షణ" గుర్తు వస్తాయే కానీ "అల్లరి పోలీస్", "పాతబస్తీ" లాంటి సినిమాలు "జ్ఞాపకం" రావు! మంచి taste కానీ taking పరంగా కానీ సత్తా ఉన్న దర్శకుడు luck లేకపోవటం వల్ల ఈ చిత్రసీమలో ఎలా వెనకబడ్డాడో చెప్పడానికి ఉప్పలపాటి ఒక ఉదాహరణ.
Read the retrospect in Telugucinema.com
No comments:
Post a Comment