Tuesday, December 1, 2009

ఆర్య - 2 సమీక్ష

గత ఏడాది జూలై లో నవదీప్ లో మాట్లాడుతున్నప్పుడు ఆర్య - 2 చిత్రం చేస్తున్నా అని చెప్పారు. అల్లు అర్జున్ ని హీరో గా పెట్టుకుని మీకు అంత చెయ్యడానికి ఏం ఉండక పోవచ్చ్చు అని అన్నాను. కథ ముగ్గురి మీద ఉంటుంది. అందువల్ల సమస్య ఉండక పోవచ్చు అని అన్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు కాగానే ముందర అనుకున్న కథ కన్నా బాగా వస్తోంది అది ఇది అని కబుర్లు మొదలు పెట్టారు.

జగడం తో అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన సుకుమార్ ఈ సారి చాలా జాగర్త గా అన్ని చూసుకుని చేస్తున్నాడు అని అంటే ఓహో నిజమే కాబోలు అని నమ్మారు జనాలు. జగడం నిర్మాత , బి వి ఎస్ ఎన్ ప్రసాద్ కలిసి సంయుక్తంగా తీస్తున్నారు అని అన్నారు. సినిమా పూర్తి కావోచ్చే సరికి నిర్మాతలు ఇద్దరికీ గొడవలు వచ్చేసాయి. నిర్మాతకి దర్శకుడికి గొడవలు వచ్చేసాయి. హీరో కి నిర్మాతకి గొడవలు వచ్చేసాయి. ఇన్ని గొడవల మధ్య లో అసలా సినిమా పూర్తి అయ్యి విడుదల అవుతుందా అన్నది నమ్మకం లేకుండా పోయింది. బిజినెస్ మాత్రం బోలెడు చేసేసారు. దేశం లో నే కాక బైట కూడా అన్ని చోట్ల కూడా ధియేటర్ లు బుక్ చేసారు. తెలుగు లో ఒకే ఒక డి టి ఎస్ చేసే అతను ఉన్నాడు మన ఖర్మ కి . అతనికి కూడా ఆర్య అయ్యే వరకు వేరే సినిమా కి పని చెయ్యడానికి లేక కూర్చున్నాడు. దానితో రావలిసిన సినిమా లు అన్ని ఆగిపోయాయి.

సరే ఇన్ని అంచనాలు తో విడుదల అయిన సినిమా ఎలా ఉంటుందో అన్ని నిద్ర మాని ప్రీమియర్ కి వెళ్ళిన వాళ్లకి చావు దెబ్బ కొట్టాడు సుకుమార్. తెలుగు లో పర్వేర్తేడ్ దర్శకులు ఉన్నారు అని తెలుసు కాని ఇంత పెర్వేర్షన్ ఉన్న దర్శకులు ఉన్నారు అని తెలుసు కోవడం ఇదే మొదటి సారి. ఇప్పటి దాకా పూరి ఒక్కడే అనుకున్నా సుకుమార్ పూరి కి ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదివాడు.

కథ గురించి చెప్పదల్చుకోలేదు. ఇప్పటికే బోలెడు మంది చెప్పేసి ఉంటారు కదా. సినిమాలో తిక్క గురించి చెప్పడం ఈ వ్యాసం ఒక్క ఉద్దేశం. హీరో కి లేని అలవాటు లేదు. ఒక పక్క నవదీప్ ని ప్రేమిస్తున్నా అని అంటాడు. ఇంకో పక్క నాయిక ని కూడా ప్రేమిస్తాడు. అర్జున్, నవదీప్ ల మధ్య సన్నివేశాలు చూస్తూ ఉంటె జనాలకి అర్జున్ మిద ఇంకో అభిప్రాయం వస్తే అది వారి తప్పు కాదు. దారుణమైన హెయిర్ స్టైల్. మొహం సగం కనపడదు (అదే కరెక్ట్ ఏమో లెండి, నటన అవసరం లేదు అప్పుడు. ఏది చేసినా చెల్లిపోతుంది కదా. నవదీప్ కి చెయ్యడానికి ఎం లేదు. శ్రద్ధ దాస్ కి అంతే. బ్రహ్మానందం పాత్రం దారుణం. సినిమాలో అయన పేరు దశావతారం. ఆ కంపెనీ కి హెచ్ ఆర్ . సినిమాలు జనాలు అందరు అయన చుట్టూ చేరి భజన తప్ప ఎం కనపడదు సినిమాలో. పరమ దండగ పాత్ర. మొదటి గంట గీత (నాయిక ) ఆర్య మంచి వాసు కాదు అని నిరూపించడానికి చేసే ప్రయత్నాలే తప్ప మిగతాది ఎం కనపడదు.

ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఎలా నడుస్తుందో కూడా తెలీకుండా ఎలా సినిమా తీయావచ్చో సినిమా చూస్తె అర్ధం అవుతుంది. సినిమా లో నాయిక వచ్చిన ఐదో నిమషం లో నాయకుడు పెదవుల మిద ముద్దుపెట్టేస్తాడు. అంతే మనకి అప్పుడే తెలిసి పోతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని. ఒక రకంగా కథ అయిపోయినట్టు. అలాంటిది దాని ఇంకో రెండు గంటలు సాగా తియ్యడం దేనికో అర్ధం కాదు. ఒక దశలో ఆర్య చేష్టలు చూసి ఈ దర్శకుడు సమాజానికి ఎం చెప్పదలుచుకున్నడో అర్ధం కాదు. ఊరూరా ఉన్న మనోహరులు చాలరు అన్నట్టు గా కొత్తగా ఈయన నాయకుడు అనే వాడు ఇలా ఉండాలి అని చెప్పడం ఒక రకం గా విడ్డూరం. ఆర్య చేసే దానికి చిన్న ఉండాహరణ ఇంట్లో తలకిందులుగా వేలాడుతూ టి వి ని కూడా తలకిందులుగా వేలాడదీసి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇది మచ్చుకు మాత్రమె.

దర్శకుడు ప్రేమ ఆంటే ఎలా ఉండాలి అని దర్శకుడి అబిప్రాయం ? ఆర్య లాగ అన్ని విదాలుగా మోసం చేసి ప్రేమించాలా ? అల చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది ? మోసం కాని. సినిమా అంటా ఒక రకమైన ఏవగింపు. అసహ్యం మన మిద మనకే కలుగుతుంది ఇలాంటి చెత్త సినిమా ఇంతవరకు రాలేదు .. దీనికన్నా ఆలి చేసిన సోంబేరి, తిన్నామా పడుకున్నామా లాంటి సినిమాలు చాలా చాలా బెటర్ అని అనిపిస్తే అది మన తప్పు కాదు. గీత పాత్ర కి బుర్ర అంటూ ఉన్నది ఆంటే సందేహమే ... సినిమాలో ప్రతి పాత్రా గీత తో ఫుట్ బాల్ ఆడుకుంటుంది. ఇన్ని చెప్పాక కూడా ఇంకా చూడాలని ఉందా ...మీ ఖర్మ .. అల్లు అర్జున్ ఈ మీకు దిక్కు. సినిమా మొత్తం చూసాక కోతి నుంచి వచ్చాడు మానవుడు అని పాడుకుంటూ బైటకి రాక పొతే అడగండి.

ఇన్ని చెప్పి సంగీతం గురించి చెప్పక పోవడం అన్యాయం. పాటలు ఓ హిట్ రేంజ్ కదా. సినిమాలో మొత్తం సెన్సార్ చేసి బైట ఉన్న ఆడియో కి సినిమాలో వినే దానికి బోలెడు మార్చి పడేసారు. రెండు పాటలు తప్ప అన్ని ఆంగ్ల గీతాలు అనుకుంటే మన తప్పు కాదు. దేవి శ్రీ పాత పాటలే ఇంగిలి పీసు లో పాడేసాడు కొత్తగా.. పాత భాణీలే అయినా రెండు పాటలు బాగున్నాయి . అవి వింటే చాలు .. వాటి కోసం సినిమా చూసారో చచ్చారే .. మీఇష్టం..

5 comments:

Kathi Mahesh Kumar said...

నూరుశాతం ఒప్పేసుకున్నాను. మీ సమీక్షతో 200% అంగీకరించేశాను.

Anonymous said...

AARYA 1 : unconditional Love + అర్ధం చేసుకోలేని lover + అర్ధం చేసుకునే audience......

AARYA 2 : unconditional Friendship + అర్ధం చేసుకునే lover + అర్ధం చేసుకోలేని audience......

అమ్మాయిని un conditional గా love చేసే వాళ్ళు చాలా మందే వుంటారు.... దాన్నే love at first sight అని కూడా అంటారు ...but express చెయ్యరు ....ఆర్య లో "beacuase i am so expressive"...అంటూ convience చేస్తాడు ...

but అబ్బాయి తో unconditional friendship ఎవరు చెయ్యరు ...convience కూడా చెయ్యలేదు ....జనాలకి ఎక్కలేదు...

మురళి said...

మీరింతగా చెప్పాకా ఇక ధైర్యం చెయ్యను లెండి.. మిత్రుల మాట కూడా 'అట్టర్ ఫ్లాప్' అనే.. ఫ్యాన్స్ మాత్రం స్లో గా పికప్ అయ్యి హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారుట.. డీటీఎస్ టెక్నిషియన్ లాగా థియేటర్స్ ని కూడా వంద రోజులు బ్లాక్ చేసేస్తారో ఏమిటో..

cartheek said...

సినిమాల్లో ఆడ వాళ్లకు నిండు గా బట్టలేస్తే బాగుండు అప్పు కచ్చితంగా హిట్ అవ్వుతాయ్..

నేను అస్సలు ఇలాంటి సినిమాలు చూడను

budugu said...

మహాత్మ, ఏక్ నిరంజన్ విషయంలో మీ మాట వినక అనుభవించాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ తప్పు చేయను. కర్తీక్ గారు, మీ కామెంట్ చూసి ఎంతగా నవ్వుకున్నానో చెప్పలేను. i can empathize with you.