Wednesday, February 24, 2010

శేఖర్ కమ్ముల - లీడర్

లీడర్ సినిమా విడుదల కి ముందర బోలెడన్ని అంచనాలు. శేఖర్ తక్కువ ఖర్చుతో తీసిన హ్యాపీ డేస్ మంచి విజయం సాధించడం, శేఖర్ తో నాగార్జున ఒక సినిమా చెయ్యబోతున్నాడు అన్న వార్త ఒకటి రావడం, అది కాదు రామానాయుడు మనవడు చిన్న రామానాయుడు తో సినిమా అది కూడా పేరు పొందిన ఏ వి యం సంస్థ అవడం తో భారీగా పెరిగాయి.

కానీ నాకు అర్ధం కానిది ఏంటి అంటే, శేఖర్ కి ఉన్న అభిమానులు ఎక్కువగా నగర ప్రేక్షకులు, చిన్న చిన్న ఊర్లల్లో ఉన్న వారికి కాని మధ్యతరగతి ఆడవారికి కాని ఎక్కువగా అలరించే సినిమాలు శేఖర్ ఇంతవరకు తియ్యలేదు. అలాంటప్పుడు ఎ రకంగా పదహారు కోట్లు పెట్టి సినిమా ఎందుకు తియ్యడం. ఒక సినిమాకి పదహారు కోట్లు కర్చు పెడితే, ఆ సినిమా కి దానికి రెట్ట్టింపు కన్నా ఎక్కువ వస్తే కాని ఆ సినిమా కి పెట్టిన కర్చు తిరిగి వచ్చినట్టు కాదు. అంటే ఈ పదహారు కోట్లు రావాలి అంటే సినిమా ఎంత లేదు అన్న దాదాపు గా యాభై కోట్లు వసూలు చెయ్యాలి. ఈ సినిమాకి అంత వసూలు చేసే అవకాశం ఉందా అంటే, ఈ సినిమాకే కాదు శేఖర్ తీసే సినిమాలకి అంత వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి అలాంటప్పుడు శేఖర్ ఇంత కర్చు పెట్టి తియ్యడం ఎంత వరకు సమంజసం ?

ఆనంద్ కి అయిన కర్చు రెండుకోట్లు లోపు. అది అయన సొంత సినిమా. గోదావరికి అయిన కర్చు దాదాపు ఏడు కోట్ల కు పైన. హీరో మార్కెట్ అప్పటికి మూడు కోట్లు. అతని మిద అంత కర్చు పెట్టి సినిమా తీస్తే వచ్చింది అదే మూడు కోట్లు. ఆ నిర్మాత ఆ దెబ్బతో మళ్ళా సినిమా తీసే స్తోమత్తు లేక కూలపడ్డాడు. ఆ తరవాత సొంత బ్యానర్ మీద కొత్తవాళ్ళతో మళ్ళీ రెండుకోట్ల తో హ్యాపీ డేస్ తీసాడు. అది దాదాపుగా ఏడు కోట్లు దాక సంపాదించడం తో లీడర్ పదహారు కోట్లతో తీసాడు. తన మార్కెట్ ఎంత, ఎంత లో తీస్తే వర్క్ అవుట్ అవుతుంది అన్న లాజిక్ ఒక నిర్మాత దర్శకుడుకి లేక పోవడం ఎంత తప్పిందమో అన్నదానికి ఇది ఒక ఉదాహరణ.

ఇక సినిమా సంగతికి వద్దాం. సినిమాలో నాయకుడు, నడక , వాచకం, వస్త్ర ధారణ అంతా శేఖర్ ఎలా ఉంటాడో అలాగే ఉంది. నాయకుడిలో మనం శేఖర్ నే చూస్తాం, రానా ని చూడం. సినిమా సగం రాత్రిళ్ళు జరుగుతుంది అందువల్ల మనం నాయకుడు రానా ని ఎక్కువగా సగం వెలుతురు లో చూస్తాం. అందువల్ల ఎక్కువగా హవాభావాలకి కష్టపడే సమస్య తప్పింది. మరి కష్టపడాల్సిన చోట సుబ్బరంగా లాంగ్ షాట్ లో పని అవగోట్టారు. రానా వాచకం బాగుంది. చక్కగా భావప్రకటనా చేసాడు వాచకం లో.

సినిమాలో ఏదన్న సంఖ్యా కావాలంటే ముందుగా వచ్చేది లక్ష. ముఖ్యమంత్రి పొతే పదివేల మంది కూడా రారు. అందుకని లక్ష మంది ని తీసుకురమ్మని అంటాడు సుబ్బరాజు. సుహాసిని పొతే లక్ష మంది ఆడవాళ్ళు వస్తారు. నాయకుడు లక్ష కోట్ల నల్ల ధనం వెలికి తెసుకు వస్తా అని అంటాడు. ఇలా ఏదన్నా సరే అన్నిటికి లక్ష . నాయకుడి తండ్రి ఇరవై వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తాడు అని చెప్తుంది తల్లి. ప్రతిపక్షం వాళ్ళు దాని గురించి ఎక్కడా గోల పెట్టినట్టు కనపడదు. నాయకుడి తండ్రి డబ్బు దాచిపెట్టిన వాళ్ళు అందరు, సగం డబ్బు కూడా తిరిగి ఇవ్వరు. అలాంటప్పుడు ఇరవై వేల కోట్లు ఎలా ఉన్నట్టు ? నాయకుడు ఎం ఎల్ ఏ లని, మంత్రుల్ని కొనడానికి బోలెడు కర్చు పెడతాడు ఆ కర్చు పెట్టాక కూడా ఇరవై వేల కోట్లు జమ చేస్తున్నా అని అంటాడు. ఆ కర్చు చేసింది ఆ ఇరవై కోట్లలోదే కదా... అదేమన్న తరగని పాతరా...

నాయకుడు పదవి నిలబెట్టుకోవడం కోసం అమ్మాయిని అడ్డం పెట్టుకోవాలని అనుకుంటాడు. అదే నాయకుడు వేరే వాడు అమ్మాయిని పాడు చేసాడు అంటే వాడిని చంపెయ్యమని చెపుతాడు. తనకి ఒక న్యాయం , పక్కవాడికి ఒక న్యాయమా. ప్రపంచాన్ని బాగు చేద్దాం అనుకున్న నాయకుడు అమ్మాయిని అడ్డం పెట్టుకుని పదవి నిలబెట్టుకోవలనుకోవడం ఎంత సిగ్గు చేటు ! శేఖర్ కి గాంధి సినిమా (లేక గాంధి గారి ఆత్మ కథ లో ని సన్నివేశం కాపి కొట్ట వలసిన అవసరం ఉందా ? అలా గాంధి లాంటి మనస్తత్వం ఉన్న అబ్బాయి అని చెప్పాలి కాబట్టి ఆ సన్నివేశం ఉంది అని ఒక నిమషం సేపు అనుకుందాం. మరి అలాంటి మనస్తత్వం ఉన్న అబ్బాయి లుంబిని పార్క్ లో బాంబు పేలి వందమంది కి పైగా చనిపోయారు అంటే వెళ్ళే దారి లో హీరోయిన్ తో పాటలు పాడుకుంటూ వెళ్తాడు. ఎంతటి పరస్పర విరుద్ద భావాలో చూడండి.

సినిమా మొదట్లో నాయకుడు చెప్పేది, నల్లదనం వెలికి తీసి దాన్ని సక్రమంగా వినియోగిస్తాను అన్నది ఒకటి రెండోది కుల నిర్మూలన. దానికోసం ఆవేశంగా హీరోయిన్ ని పెళ్ళి చేసుకుంటాను వెళ్లి ఒక వజ్రాల ఉంగరం కొనుక్కురా అని చెపుతాడు తన అసిస్టెంట్ తో. అంతే కాని ఆ అమ్మాయి ఆంటే ప్రేమ ఉండి కాదు. అది తప్ప కుల నిర్ములనకి ఎం చేసినట్టు కనపడదు మరి.

అలా అని సినిమా ఎం బాగాలేదు అని అనుకోవద్దు. సినిమా మొదటి సగం బాగానే ఉంది తప్పులు ఉన్నా కాని. రెండో సగం ఎటు పోతుందో ఎం చెయ్యాలో అర్ధం అయ్యినట్టు కనపడదు. ఇంకో సమస్య ఏంటి ఆంటే సినిమా లో అందరిని అలరించే పాళ్ళు రక్కువ. రెండో సారి చూడాలి ఆంటే కష్టం. దాని వల్ల మళ్ళా చూసే ప్రేక్షకులు తక్కువ. ఎక్కడో కొంతమంది లేరని నేను అనను. కాని అలంటి వాళ్ళ సంఖ్యా తక్కువ అందువల్ల వసూళ్లు పెరిగే అవకాశాలు తక్కువ. కానీ ఒక విభిన్న చిత్రం తీద్దాం అనుకోవడం మెచ్చ దగ్గ విషయం. దాన్ని వనరులు అన్ని ఉన్నా సరిగ్గా తియ్యలేక పోవడంవిచారకరం.

4 comments:

భావన said...

అవునండి నాకు కూడా సెకండ్ హాఫ్ పాపం శేఖర్ గార ఎలా తియ్యాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు నిపించింది. కాని ఫ్రెండ్స్ 40 నిమషాల పైనే ఎడిట్ చేసేరట అందుకే స్క్రీన్ ప్లే కొంచం బెసికింది అన్నారు మరి. అబ్బ ఈ టీనేజ్ లేచి పోయే సినిమాలు, ఈరో ఈరోయిన్లు ముద్దు గా తిట్టుకునేవి, బాంబులేసి రక్తపుటేరు ల సినిమా లకంటే 1000 రెట్లు బాగుంది లెండి ఈ సినిమా. హాల్ లో నుంచి పళ్ళు నూరుతూ బయటకు రాలేదు. అక్కడకు హాపీ నేను.

Unknown said...

ప్రస్తుతం వస్తున్న అర్థం పర్థం లేని సినిమాల కంటే ఈ సినిమా చాలా నయ్యం. శేఖర్ గారి ఈ ప్రయత్నం నాకు నచ్చింది. ఎంతసేపూ పదో క్లాసు పాస్ అయినా అవ్వకపోయిన ప్రేమించడం లేచిపోవడం, దాదాగిరీ చెయ్యడం,ఇలాంటి లక్షణాలు ఉన్నవాడే మగాడు అని చూపించే సినిమాల కంటే, ఇది బోల్డురెట్లు better.

కన్నగాడు said...

సెకండ్ హాఫ్।లో 'ఔననా కాదనా' పాట ఒక్కటి తీసేస్తే ఇప్పుడు బాలేదు అన్న వాళ్ళలో సగం మంది 'ఓకే' అనేవారు. ఆ పాట మరీ సాగదీసినట్టుగా సీరియస్ సన్నివేషాల మధ్య ఇరుక్కుంది.
పాపం తెలంగాణ ఉద్యమం వల్ల పతాక సన్నివేషాల చిత్రీకరణ అనుకున్న విధంగా చేయలేకపోయారనుకుంట, అప్పుడెప్పుడో(జనవరిలో) సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వద్ద షూటింగును అడ్డుకోవటంతో పోస్టరు పెట్టి కానించాడు, వరంగల్ కీర్తితోరణం కూడా అలాగే....

Anonymous said...

very good review. keep it up.