Monday, April 12, 2010

బడి నేర్పిన పాఠాలు ...

ఇది 2005 లో ఎమెస్కో - ఆంధ్రజ్యోతి వాళ్ళు కలిసి చేసిన పోటీలో ప్రచరించబడిన వ్యాసాల హారం. దీన్ని ఎమెస్కో వాళ్ళు పుస్తకం గా వేసారు... ఈ పుస్తకం గురించి బుడుగు గారు ఇంతకు ముందు చెప్పారు. అబ్బా ఎం చదువుతాం లెద్దు వ్యాసాలు, మనకి అసలే సమయం తక్కువ అని వొద్దు అని చెప్పాను. కానీ ఎవరో స్నేహితుడు వస్తుంటే అయన పుస్తకం వేరే వాటితో కలిపి పంపేసారు. వచ్చాక చదకుండా ఉండం కదా ! సరే అని మొదలు పెట్టాను...

ఇరవై వ్యాసాలు , నూట పది పేజీల పుస్తకం. చాలా బాగుంది.. అన్ని బాగా ఉన్నాయి అని నేను చెప్పను... కాని బాగున్నా కొన్ని కోసమైనా కొని చదవక తప్పదు ఈ పుస్తకం. కిశోర్ భారతి పాఠశాల గురించి చదువుతుంటే ఎంతో ముచ్చట వేస్తుంది. అలాగే ఎక్కడో రాజస్తాన్ లో దిగంతర్ పాఠశాల కూడా.. మన దేశం లో ఇలాంటివి కూడా ఉన్నాయి అని తెలిసి ఆశ్చర్యం , ఆనందం ముప్పేటలా పెనవేసుకోక పొతే అడగండి..

పిల్లలపై మనం చెప్పే పాఠాలు , వాటిని వారు ఎంత బాగా మనకన్నా బాగా ఆచరించాగాలరో అన్నది ఒట్టు అన్న వ్యాసం చెబుతుంది... అలాగే సూర్యుడికో దీపం వ్యాసం పిల్లల చదువు, వారి పట్టుదల పెద్దలని ఎలా మారుస్తుందో చెపుతుంది...

కొన్ని వ్యాసాల్లో స్వత్కోర్శ కొంచం అతి గా ఉన్నా... వారు పడ్డ శ్రమ మాత్రం తప్పకుండా మరువ రానిది... తప్పకుండా కొని చదవాలిసిన పుస్తకం ఇది...

బడి నేర్పిన పాఠాలు ... ఎమెస్కో ప్రచురణ వేల యాభై రూపాయలు....

గమనిక : ఈ పుస్తకం బాగుంది అనగానే ఆన్ లైన్ లో ఉందా అనే స్నేహితులు కొంతమంది ఉన్నారు.. అసలు ఎప్పుడు అన్నా పుస్తకం కొని చదువుతారా .. రచయితలని బతికిన్చుకుంటారా అన్నది నాకు అంతు పట్టని ప్రశ్న ...

వసంతం పల్లకి




అమెరికా లో వసంత ఋతువు వచ్చింది అంటే చాలు. మొక్కలకి ఆకులు అన్నవి కనపడవు... చెట్లు అన్ని ఒక పూల బోకే లాగా కనపడతాయి... పొద్దునే బస్సు స్టాప్ లో నిల్చుంటే మత్తెక్కే పూలవాసన ని మోసుకుంటూ వచ్చే నులి వెచ్చని చల్ల గాలికి కొంచం చలిగా వణుకుతూ... ఎండలో నిల్చుంటే అనుభూతే వేరు... బస్సు ఎంత సేపటికి రాకపోయినా అలుపన్నది తెలీదు. అలా నిల్చుని... ఫోన్ కి ఇయర్ ప్లగ్స్ తగిలించుకుని (ఇప్పటి ఫోన్ లు అల్ ఇన్ వన్ లు కదా మరి , కెమెరా , మ్యూజిక్ ప్లేయర్ అన్ని ఉంటాయి ) నేనొక పూలమొక్క కడ నిల్చి అంటున్న ఘంటసాల గారిని గుర్తు తెచ్చుకుంటూ బస్సు వచ్చేది కూడా గమనించము.

ముందు రోజు బోసిగా ఉన్న మొక్క పొద్దున్న లేచే సరికి పూల గుత్తిలా ఎలా మారిపోతుందో అన్నది నాకు ఇంకా ఆశ్చర్యమే... ఎప్పుడు ఇలా ఉంటె ఎంత బాగుండునో అన్ని ఒక పిచ్చ కోరిక... రాత్రి డౌన్టౌన్ లో నడిచి వస్తుంటే దారి కిరువైపులా చెట్లు తెల్ల పూలని రాలుస్తూ స్వగతం చెపుతూ గుస గుసలాడుతున్నట్టు (పూల గుస గుస లాడేనని సైగ చేసెనని అది ఈరోజే తెలుసింది అన్న పాట యాంత్రికంగా నోట్లో కి రాక పొతే మీరు మీరే కాదు)... వీటిని చూస్తూ మురిసిపోవదమేనా లేక కెమెరా లో బందించే ఆలోచన ఎమన్నా ఉందా అనిరోజూ అనుకోవడమే... ఇదిగో అదిగో అంటూ దానికి మీన మేషాలు లెక్క పెట్టామో పచ్చటి ఆకులు పూలని కప్పేస్తూ జరా జరా వచ్చేస్తాయి....

రోజు పొద్దున్నే కెమెరా తగిలించుకుని వెళ్తే అప్పటికే సగం చెట్లు అయ్యవారు వచ్చే దాకా అమావాస్య ఆగదు చిట్టి అంటూ ఆకులు వచ్చేసాయి. దానికి తోడు సారి తులిప్స్ సరిగ్గా రాలేదు మా వూళ్ళో దాంతో బోలెడు నిరాశ పడిపోయా.. అలా యునివెర్సిటీ లో తిరుగుతూ ఉంటె అక్కడ మంచి దృశ్యం కనపడింది... చెట్టు కింద ఒక అబ్బాయి .. అమ్మాయి చదువుకుంటూ.... యెంత బాగుందో ... దాన్ని వాళ్ళకి తెలీకుండా తీస్తేనే సహజంగా ఉంటుంది అని దూరంగా నిల్చుని ఫోటో తీశాను. వెళ్ళినందుకు ఫోటో ఒక్కటే చాలు అని వెనక్కి తిరిగి వచ్చా...

గమనిక : ఫోటో పెద్దగా పూర్తి సైజు లో చూడాలనుకుంటే ఫోటో మీద క్లిక్ చెయ్యగలరు...

Saturday, April 3, 2010

అమెరికా అల్లుడికి పాతికేళ్ళు ....

ఈ వేసవి కి అమెరికా అల్లుడు సినిమా విడుదల అయ్యి పాతికేళ్ళు. తెలుగు లో మొట్టమొదటిగా అమెరికా లో నిర్మించ బడ్డ తెలుగు చిత్రం ఇదే. అంతే కాదు ఈ సినిమా కి బోలెడు చరిత్ర ఉంది.

తెలుగు లో మొట్ట మొదటిసారిగా ఒక తెలుగు పాట ని సినిమా కోసం అమెరికా లో రికార్డు చెయ్యడం కూడా మొదటి సారే. అంతే కాదు, దానికి సంగీతం, గాయకులు, గీత రచయితా అందరు ప్రావాస ఆంధ్రులు కావడం ఒక విశేషం. (ఆ పాటకి ప్రేరణ ఒక ఆంగ్ల గీతం అనుకోండి అది వేరే విషయం).

ఈ సినిమాకోసం అతి తక్కువ మంది మంది ఇండియా నుంచి వచ్చారు. సుమన్ తో పాటు ఒక సహాయకుడు, భానుప్రియ తో ఆమె తల్లి, డాక్టర్ తంబు, కే వాసు (దర్శకుడు, నటుడు ), సూర్యకాంతం గారు, కెమెరా మాన్ రఘు , అతనికి ఒక సహాయకుడు అంతే. మిగిలిన వాళ్ళు అందరు ఇక్కడ పని చేసే వాళ్ళే కావడం గమనించ దగ్గ విషయం.

దాదాపు ఏడాది పైగా కథ చర్చలు జరిగాయి. ముందర అనుకున్న కథ ప్రకారం అమెరికా కి వచ్చిన నలుగురు అబ్బాయిలు , అందులో ముగ్గురు, వారి అభిరుచులకి అనుగుణంగా భిన్న స్వభావాలు కల అమ్మాయిలని పెళ్లి చేసుకుంటారు. నాలుగో అతను వీళ్ళ పెళ్లి లో ఏది మంచిది అన్నది బెరేజు వేసుకుని పెద్దలు నిర్ణయించిన పెళ్లి మంచింది అని మన సంప్రదాయాలకి అనుగుణంగా పెళ్లి చేసుకుంటాడు. కాని తరవాత ఆ కథ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాదు ని నిర్ణయించుకుని డాక్టర్ కావూరి గారు సలహా మేరకు ఈ కథ ని మేడిసన్ యునివెర్సిటీ లో ప్రొఫెసర్ గా చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారి తో కథా చర్చలు మొదలు పెట్టి ఈ కథ నిర్ణయించారు. ముందుగా ఈ చిత్రానికి జంధ్యాల గారిని దర్శకుడిగా అనుకున్నారు. జంధ్యాలగారు కూడా ఒప్పుకున్నారు. కానీ అయన వీసా కి వెళ్ళినప్పుడు అమెరికా లో సినిమా దర్శకత్వం వహించడానికి వెళ్ళుతున్నా అని చెప్పడం తో దానికి హే చ్ వన్ వీసా కావాలి అని రెజెక్ట్ చేసారు. దాంతో రమేష్ గారికి చిన్నప్పటి నుంచి తెలిసిన స్నేహితుడు కే. వాసు గారికి అప్పగించారు.

ఈ వ్యాసం పూర్తి గా తెలుగుసినిమా.కాం లో ఆంగ్లం లో చదవగలరు.

ఈ వ్యాసం కోసం సుమన్ ని సంప్రదించాలని చాలా ప్రయత్నం చేసాం. కాని సుమన్ దొరకలేదు. అందువల్ల సుమన్ అనుభవాలను రాయలేక పోయాను.