Monday, April 12, 2010

బడి నేర్పిన పాఠాలు ...

ఇది 2005 లో ఎమెస్కో - ఆంధ్రజ్యోతి వాళ్ళు కలిసి చేసిన పోటీలో ప్రచరించబడిన వ్యాసాల హారం. దీన్ని ఎమెస్కో వాళ్ళు పుస్తకం గా వేసారు... ఈ పుస్తకం గురించి బుడుగు గారు ఇంతకు ముందు చెప్పారు. అబ్బా ఎం చదువుతాం లెద్దు వ్యాసాలు, మనకి అసలే సమయం తక్కువ అని వొద్దు అని చెప్పాను. కానీ ఎవరో స్నేహితుడు వస్తుంటే అయన పుస్తకం వేరే వాటితో కలిపి పంపేసారు. వచ్చాక చదకుండా ఉండం కదా ! సరే అని మొదలు పెట్టాను...

ఇరవై వ్యాసాలు , నూట పది పేజీల పుస్తకం. చాలా బాగుంది.. అన్ని బాగా ఉన్నాయి అని నేను చెప్పను... కాని బాగున్నా కొన్ని కోసమైనా కొని చదవక తప్పదు ఈ పుస్తకం. కిశోర్ భారతి పాఠశాల గురించి చదువుతుంటే ఎంతో ముచ్చట వేస్తుంది. అలాగే ఎక్కడో రాజస్తాన్ లో దిగంతర్ పాఠశాల కూడా.. మన దేశం లో ఇలాంటివి కూడా ఉన్నాయి అని తెలిసి ఆశ్చర్యం , ఆనందం ముప్పేటలా పెనవేసుకోక పొతే అడగండి..

పిల్లలపై మనం చెప్పే పాఠాలు , వాటిని వారు ఎంత బాగా మనకన్నా బాగా ఆచరించాగాలరో అన్నది ఒట్టు అన్న వ్యాసం చెబుతుంది... అలాగే సూర్యుడికో దీపం వ్యాసం పిల్లల చదువు, వారి పట్టుదల పెద్దలని ఎలా మారుస్తుందో చెపుతుంది...

కొన్ని వ్యాసాల్లో స్వత్కోర్శ కొంచం అతి గా ఉన్నా... వారు పడ్డ శ్రమ మాత్రం తప్పకుండా మరువ రానిది... తప్పకుండా కొని చదవాలిసిన పుస్తకం ఇది...

బడి నేర్పిన పాఠాలు ... ఎమెస్కో ప్రచురణ వేల యాభై రూపాయలు....

గమనిక : ఈ పుస్తకం బాగుంది అనగానే ఆన్ లైన్ లో ఉందా అనే స్నేహితులు కొంతమంది ఉన్నారు.. అసలు ఎప్పుడు అన్నా పుస్తకం కొని చదువుతారా .. రచయితలని బతికిన్చుకుంటారా అన్నది నాకు అంతు పట్టని ప్రశ్న ...

3 comments:

jeevani said...

వారం రోజుల కిందట పుస్తకం చదివాను. చాలా బావుంది. కిశోర్ భారతి, దిగంతర్ లాంటివి మన రాష్ట్రంలో జిల్లాకు ఒకటి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. అయితే నేటి బోగస్ కాన్సెప్టు స్కూళ్ళ వల్ల అవి వెలుగులోకి రాకుండా పోవచ్చు. అనంతపురం జిల్లాలో టింబక్టు కలెక్టివ్ అనే స్వచ్చ్బంద సంస్థ ఇలాంటి బడిని నడుపుతోంది. జీవని ద్వారా నెలకొలనున్న విద్యాలయం కూడా ఇలాగే ఉండబోతోంది.

కన్నగాడు said...

మరి మీరేమో పుస్తకం ధర వేల రుపాయలన్నారు అంత స్తోమత ఉండొద్దండీ! :)
"వేల యాభై రూపాయలు"

budugu said...

ఇప్పటికైనా తెలిసిందా బుడుగు రికమండేషన్స్ బాగుంటాయని ;-) నాకైతే ఒట్టు వ్యాసం చదువుతుంటే కన్నీళ్ళొచ్చాయి.
-బు
తా.క.ఆశ్చర్యం, ఆనందం తో పాటు పెనవేసుకొనే ఆ మూడోదేంటబ్బా? :-p