అమెరికా లో వసంత ఋతువు వచ్చింది అంటే చాలు. మొక్కలకి ఆకులు అన్నవి కనపడవు... చెట్లు అన్ని ఒక పూల బోకే లాగా కనపడతాయి... పొద్దునే బస్సు స్టాప్ లో నిల్చుంటే మత్తెక్కే పూలవాసన ని మోసుకుంటూ వచ్చే నులి వెచ్చని చల్ల గాలికి కొంచం చలిగా వణుకుతూ... ఎండలో నిల్చుంటే ఆ అనుభూతే వేరు... బస్సు ఎంత సేపటికి రాకపోయినా అలుపన్నది తెలీదు. అలా నిల్చుని... ఫోన్ కి ఇయర్ ప్లగ్స్ తగిలించుకుని (ఇప్పటి ఫోన్ లు అల్ ఇన్ వన్ లు కదా మరి , కెమెరా , మ్యూజిక్ ప్లేయర్ అన్ని ఉంటాయి ) నేనొక పూలమొక్క కడ నిల్చి అంటున్న ఘంటసాల గారిని గుర్తు తెచ్చుకుంటూ బస్సు వచ్చేది కూడా గమనించము.
ముందు రోజు బోసిగా ఉన్న మొక్క పొద్దున్న లేచే సరికి పూల గుత్తిలా ఎలా మారిపోతుందో అన్నది నాకు ఇంకా ఆశ్చర్యమే... ఎప్పుడు ఇలా ఉంటె ఎంత బాగుండునో అన్ని ఒక పిచ్చ కోరిక...
ఈ రోజు పొద్దున్నే కెమెరా తగిలించుకుని వెళ్తే అప్పటికే సగం చెట్లు అయ్యవారు వచ్చే దాకా అమావాస్య ఆగదు చిట్టి అంటూ ఆకులు వచ్చేసాయి. దానికి తోడు ఈ సారి తులిప్స్ సరిగ్గా రాలేదు మా వూళ్ళో దాంతో బోలెడు నిరాశ పడిపోయా.. అలా యునివెర్సిటీ లో తిరుగుతూ ఉంటె అక్కడ ఈ మంచి దృశ్యం కనపడింది... చెట్టు కింద ఒక అబ్బాయి .. అమ్మాయి చదువుకుంటూ
గమనిక : ఫోటో పెద్దగా పూర్తి సైజు లో చూడాలనుకుంటే ఫోటో మీద క్లిక్ చెయ్యగలరు...
2 comments:
మీ ఉనికిపట్టు (Location) తెలియచేస్తూ నాకు ఒక జాబు వ్రాయగలరు. ఛాయాగ్రహణం అంటే నాకు ఇష్టం.
cbrao
cbraoin at gmail.com
Mountain View, CA.
చాలా బాగుంది సర్, ఇలాంటి ఫీల్ గుడ్ వ్యాసం చదివి చాలా రోజులైంది.
Post a Comment