Sunday, January 30, 2011

ఈ వి వి అంకుల్ ఇక లేరు ..


.పని లో బోలెడు హడావిడి గా ఉన్న నాకు జేబులో ఉన్న ఫోన్ లో ఎస్ ఎం ఎస్ సౌండ్ కి ఫోన్ ఆన్ చేసి చూస్తె ...పిడుగులాంటి వార్త ... ఈ వి వి గారు పోయారు అని. సైట్ లో వార్హ పెట్టమని . ఒక క్షణం సరిగ్గా చూసానా అని సందేహం. అప్పుడే ఎక్కడన్నా న్యూస్ ఉందేమో అని గూగుల్ చేసి చేశా .. ఎక్కడా లేదు.. నరేష్ కి కాని రాజేష్ కి కాని కాల్ చేసి చూద్దామా అని అనుకోవడానికి ఇదేమ సుభావార్హ్త కాదు. ఎం చెయ్యాలో కూడా అర్ధం కాని పరిస్టితి. సరే అని హైదరాబాద్ కి ఫోన్ చేసి చూసా. విన్న వార్త నిజమే అని చెప్పారు. అప్పటికి కూడా నమ్మబుద్ది కాలేదు.

ఆయనతో మాట్లాడి ఒక వారం కూడా కాలేదు అప్పుడు బాగానే ఉన్నారు. వచ్చే నెల రాజేష్ నిశ్చితార్ధం వస్తావా, పెళ్లి కి వస్తావా లేక పొతే అని అడిగారు. ఇప్పుడు ఈ వార్త ఏంటి అని ఎం తోచక అలా ఉండిపోయాను . ఇప్పటికి కూడా అయన లేరు అన్న వార్త నమ్మలేక పోతున్నా.

ఈ వి వి గారిని మొదటి సారి దాదాపు పదేళ్ళ క్రితం తానా కి వచ్చినప్పుడు కలిసాను. అప్పుడు నేను తానా కి వెళ్ళలేదు కాని ఆ తరవాత అయన తో వచ్చిన ట్రూప్ తో కలిసి తిరిగాను. ఈ వి వి గారు, నేను , రాజేష్, నరేష్ (అప్పటికి ఇద్దరు ఇంకా సినిమాల్లో కి రాలేదు ) రాశి , రాశి వాళ్ళ సోదరుడు విజయ్, తనికెళ్ళ భరణి గారు , ఎం ఎస్ నారాయణ గారు,అలీ , హరికిషన్, శ్రీకాంత్ ఇంకా నిర్మాతలు కే ఎస్ రామ రావు గారు, మాగంటి బాబు ఇంకా చాల మంది కలిసి ఒకే బస్సు లో చాల ప్రదేశాలు తిరిగాం. అప్పుడు పరిచయం మాకు ఆయనతో. అప్పటి నుంచి ఎప్పుడు ఏదన్న సందేహం వచ్చిన, లేక ఉరికే పలకరింపు కో దేనికో ఒక దానికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడిని. రాజేష్ మొదటి ఫోటో షూట్ జరిగినప్పుడు వచ్చిన స్టిల్ల్స్ బాగున్నై అని ఫోన్ చెయ్యడం నుంచి సినిమా ఎలా వచ్చింది అని మాట్లాడటం. సొంతం సినిమా లో పాటలు బాగున్నై అని చెప్పడం. ఇలా ప్రతిది పంచుకునే వారం.

నాలుగు స్తంభాలాట సినిమాలో తనకి అవకాసం ఎలా వచ్చిందో చెప్పడం దగ్గర నుంచి తన మొదటి సారి అమెరికా రావాడానికి అన్ని అయ్యాక ... ఆఖరి నిమషం లో తనని కాదని ఇంకొకరిని ఎందుకు తీసుకోవలసి వచ్చిందో చెప్తే ఆశ్చర్యం వేసింది. (పడమటి సంధ్య రాగం సినిమాకి అయన అమెరికా రావాల్సి ఉండింది. కాని పాస్ పోర్ట్ విసా అన్ని అయ్యాక అయ్యని తప్పించి ఇంకొకరిని తీసుకున్నారు కారణం మరేం లేదు అయన మనవాళ్ళు కాకపోవడమే.) నరేష్ పుట్టాక నరేష్ కి పాల డబ్బా కోసం ఎన్ని గుమ్మాలు ఎక్కారో (అవకాశాలు కష్టమై) అన్ని చెప్పేవారు. ఇంద్రుడు చంద్రుడు సినిమా కి దాదాపు గా ఆయనే అన్ని చేసారు. ఇలాంటి విషయాలు ఎన్నో పంచుకునే వారు.

అయ్యాన్ని ఎప్పుడు నేను ఒక సినిమా వ్యక్తీ గా చూడలేదు . అలాగే అయన కూడా నన్ను ఎప్పుడు ఒక ప్రెస్ గానో లేక ఒక బయట వ్యక్తి గానో చూడలేదు. ఎప్పుడు నేను ఫోన్ చేసి ఆ అంకుల్ నేను అనే లోపల ఏమ్మా శ్రీను బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించేవారు. నరేష్ తో కితకితలు తీసినప్పుడు కాని, రాజేష్ తో ఎవడి గోల వాడిదే తీసినప్పుడు కాని సినిమా వ్యయం ఎంత, ఎంత వసూలు చేసింది వివరంగా చెప్పేవారు. ప్రతి సినిమా విడుదల ముందు తరవాత తప్పనిసరిగా మేము మాట్లాడుకునే వాళ్ళం.. నరేష్ రాజేష్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అన్ని వివరంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళం.

పోయిన సారి తానా కి నరేష్ రావాల్సి ఉండింది . ఆఖరి నిమషం లో ఈ వి వి గారికి బాగాలేదు . కాన్సెర్ అని ముంబై హాస్పిటల్ లో చేర్చారు అని చెప్పారు. నేను ఫోన్ చేస్తే .. ట్రీట్మెంట్ జరుగుతోంది పరవాలేదు. ప్రాబ్లం లేదు అని చెప్పారు. దాని తరవాత సినిమాలకి కూడా ఫోన్ చేసాను. ఎప్పుడు ఆరోగ్యం గా నే ఉన్న అని చెప్పే వారు. మే లో కిమో తెరపి ఉంది చెప్పారు. రెండు రోజుల ముంది కూడా బాగానే ఉన్నారు అని అన్నారు. ఇంతలో ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అయన పోయారు అన్న వార్త ఇప్పిటి కి ఎప్పటి కి నమ్మలేను ఏమో ... నేనే ఇలా ఉన్నా అంటే నరేష్ కి రాజేష్ కి ఎలా ఉంటుందో ఊహించగలను. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుదాం అన్న కాని ఎం మాట్లాడాలో తెలీని పరిస్థితి. భగవంతుడు తనకి ఇష్టమైనవి తీసుకుపోతాడు అని అంటారు. అందుకే అందరికి ఇష్టుడైన ఈ వి వి గారిని తీసుకుపోయారు అను అనుకోవడం తప్ప ఎం చెయ్యలేం. రాజేష్ కి నరేష్ కి ఈ షాక్ నుంచి తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ ...

2 comments:

Unknown said...

EVV's sudden demise is really a shock. His movies are always stress busters and I do not see any one else out there who cares for comedy movies.First it was Jandhyala, now EVV, we have no other option than seeing their old DVDs..We miss you EVV. Thanks Sri for sharing your thoughts.

budugoy said...

i was a bit shocked to know. as someone said, he lives in our memories. peace to u and his family.