త్రివిక్రమ్ అభిమానులని (నాకు తెలిసి చాల మందిని ) నిరాశ పరిచిన సినిమా ఇది. ఒక రకం గా గుండమ్మ కథ సినిమా కి ఇంకా బోలెడు శ్రీను వైట్ల , వినాయక్ లని కలిపి దానికి కొంచం విదేశి సొగసులు అద్ది న స్వదేశి సినిమా ఇది.
సినిమా రిలీజ్ కి ముందరే అంతర్జాలం లో సినిమా ప్రత్యక్షం కావడం తెలుగు లో ఇదే మొదటి సారి. దెబ్బతో సినిమాకి బోలెడు పబ్లిసిటీ , నిర్మాతకి టెన్షన్ వచ్చేసింది. హడావిడిగా సినిమా విడుదల చేసేసారు
సినిమా మొదట్లో మిలాన్ లో ఉండే ఫలానా కంపని లో షేర్స్ , దాన్ని స్వంతం చేసుకోవాలని ఎవడో గొట్టం గాడు ప్లాన్, నా కంపని కొంటావా అని హీరో వాడిని తన్నడానికి వెళ్లి , వాడిని వదిలేసి ఇంకో గొట్టం గాళ్ళని చంపేసి , వాడిని బెదిరించి నేను సింహాన్ని అని అర్ధం పర్ధం లేని డవిలాగులు నాలుగు చెప్పి బోమ్మ తుపాకి ఊపుకుంటూ వచ్చేస్తాడు .
హీరో పేరు గౌతమ్ , గౌతమ్ తాతగారు బొమ్మై ఇరాని, బాబు ముకేష్ రుషి వీళ్ళు ఇద్దరు ఇంటి ఆడపడుచు , పాతికేళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్లి పోయిన సునంద (నదియ ) కోసం ఏడుస్తూ ఉంటారు . తాతగారికి మూడు నెల్లల్లో రాబోయే పుట్టినరోజు కి సునందని తీసుకువస్తా అని ప్రతిజ్ఞ చేసి గౌతమ్ బాబు బ్యాండ్ మేళ్ళం గాళ్ళని (అనగా బాడీ గార్డ్ గాళ్ళు , వీళ్ళు హీరో గారి కోసం బట్టలు ఇస్త్రి చెయ్యడం, చెప్పులు మొయ్యడం లాంటివి మాత్రమె చెసెదరు. పోరాటములు హీరో గారే చేసెదరు అని గమనించవలెను ) తీసుకుని భారతదేశం సొంత విమానం లో బయలుదేరతారు. విమానం లో ఎక్కువ స్థలం లేక (లేక పొతే ప్రొడ్యూసర్ కి వాచిపోతుంది కదా మరి ) విదేశి బ్యాండ్ మేళ్ళం గాళ్ళని వదిలేసి స్వదేశి వాళ్ళని పెట్టుకుంటాడు దిగగానే, వాళ్ళకి బాబు గారి గురించి మొత్తం ఆటోమేటిక్ గా ట్రైనింగ్ అయి ఉంటారు. సార్ వాళ్ళని వేలి తో కంట్రోల్ చేసేస్తూ ఉంటారు.
గౌతమ్ మేనత్త భర్త గారికి గుండెపోటు రావడం , హీరో గారు రక్షించడం , దెబ్బకి మేనత్త ఇంట్లో డ్రైవర్ గా పాగా వేసి, ఇంట్లో సమస్యలని పరిష్కరిస్తూ , అత్త కూతుర్లకి లైన్ వేస్తూ ఉండంటం చక చక జరిగిపోతాయి . మరి ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉండాలి కదా ... అత్తగారు మేనల్లుడిని ఎప్పుడో గుర్తుపట్టా అనీ చెప్పడం ఇంటర్వెల్ అన్నమాట .
ఆ తరవాత సినిమాలో కి ఫ్యాక్షన్ గొడవలు , హీరో గారు సింగల్ హ్యాండ్ తో వాళ్ళని సితకకోట్టడం వినాయక్ సినిమాలో లాగ చేసింగులు , వైట్ల సినిమా లో లాగ హీరోయిన్ కి తాత్కాలికంగా గజినీ అయిపోవడం ఆ పై సినిమా పిచ్చి ఉన్న బ్రాహ్మి సినిమాకి సంబంధం లేని కామెడి , కెవ్వు కేక సాంగ్ పేరడీ గా హీరో గెంతడం, కాటమ రాయుడ కదిరి నరిసిమ్హుడా అని బ్రహ్మిని తన్నడం లాంటి వెకిలి చేష్టలతో సినిమా రెండో అర్ధ భాగం లాగించి ... చివరకి అత్తగారిని పుట్టింటికి తీసుకువెళ్ళడం తో కథ ముగిస్తాడు త్రివిక్రమ్...
సినిమా లో బాగోలేనివి :
ఒకటి కాదు సినిమా చూస్తూ ఉంటె పాత సినిమాలో ని సీన్స్ రివ్వున వచ్చిపోతూ ఉంటాయి . సెంటిమెంట్ సీన్ లో కూడా ప్రాస లో మాట్లాడుతూ ఉంటారు జనాలు .
పనికి రాని కాస్టింగ్ బోలెడు మంది సినిమా నిండా ... హీరో కి ఇంకో నలుగురికి తప్ప ఎవరి పాత్ర కి సరి అయిన న్యాయం జరగదు . హీరోయిన్ కి బుర్ర ఏ కాల్లో కూడా లేనట్టు గా ఉంది.
హీరోయిన్ బెడ్ రూం లో బాత్ టబ్ ఉంటుంది ... బెడ్ రూం కి బాత్ రూం కి తేడా ఉండదు అనుకుంటా మరి ...
పళ్ళు రాలి పొతే ఫిసికల్లీ హండికప్ద్ కోటా కిందకి వస్తారా ??!! త్రివిక్రమ్ గారు కొంచం అప్పడప్పుడు మోకాలు గోక్కోండి ప్లీజ్. నిన్నటి దాక లేని షాప్స్ అన్ని ఇంటిముందర తెల్లరె టప్పటికి ప్రత్యక్షం అవుతే ఇంట్లో వాళ్ళకి ఈ మాత్రం అనుమానం రాదు .. అసలు దాన్ని గురించే పట్టించుకోరు.
త్రివిక్రమ్ ఇంకా అతడు హంగొవెర్ నుంచి బైటకి వచ్చినట్టు లేరు . ఇంకా ఫైట్ సీన్స్ ఆ హాంగ్ ఓవర్ నుంచి రాలేదు . అదే రకం గా తీస్తున్నారు .
కొన్ని సింహాద్రి సీన్స్ , కొన్ని వినాయక్ సీన్స్ , కొన్ని వైట్ల సీన్స్ ... కొంచం గుండమ్మ కథ , కొంచం ఇంగ్లీష్ సినిమా సీన్ సీన్ కి పాత సినిమాలు చిరాగ్గా వచ్చిపోతూ ఉంటాయి ...
బాగున్నై :
పవన్ కళ్యాణ్ , పవన్ కళ్యాణ్ ... పవన్ కళ్యాణ్ ... ఇన్ని లోపాలున్నా సినిమా చూడగలిగాం అంటే ఓన్లీ బికాస్ అఫ్ పవన్ కళ్యాణ్ . అదరగొట్టాడు. ఇంతకు ముందర సెంటిమెంట్ సీన్స్ లో పవన్ చేయ్యగిలిగే వాడు కాదు. కాని ఈ సినిమా తో దాన్ని అధిగమించాడు . హి ఇస్ గుడ్ .
ప్రసాద్ మురేళ్ళ చాయాగ్రహణం బాగుంది . అలాగే అక్కడక్కడ దేవిశ్రీ పరవాలేదు . ఆనంద్ సాయి సెట్స్ బాగున్నై. పవన్ కోసం ఈ సినిమా ఒక సారి ఓకే నాకు ...
No comments:
Post a Comment