సిరు గారు కేంద్రమంత్రి గా కావడం .... జంజీర్ సినిమా హిందీ ప్రకటన దాదాపు గా ఒక సమయం లో జరిగాయి. తెలుగే సరిగ్గా రాని అంజని పౌత్రుడు హిందీ లో ఇరగ తీసేస్తాడు అని మన వాళ్ళు బోలెడు నమ్మకాన్ని , కొండంత ఆశని పెట్టుకున్నారు (కొంతమంది ). కాకపోతే బాబు గారి కోయ్యమొహం మీద ఇంకాస్త ఎక్కువ నమ్మకం ఉన్న నాలాంటి వాళ్ళు ముందరగానే ఫిక్స్ అయిపోయాం ఇదో గాలివాటం సినిమా నే కాని వాళ్ళు చెప్పినట్టు గా తూఫాన్ కాదు అని.
సినిమా మొదలు అవ్వగానే అవాంతరాలు కూడా మొదలు అయ్యాయి. ముందర హక్కుల చిక్కులు, ఆ పై సంజయ్ జైలు మధ్యలో ఇలా చిక్కులు అన్ని అయ్యిపోయాయి అనుకుంటే చివర్లో రాష్ట్ర విభజన , సినిమా కొన్న బ్లూ స్కై వాళ్ళు వెన్నక్కి పోవడం లాంటివి జరిగాయి. అన్ని అడ్డంకులు దాటి సినిమా విజయవంతం గా విడుదల అయ్యింది . ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుల సంగతి చూద్దాం.
సినిమా మొదలు కాగానే ఇప్పటికి కొన్ని వేల సార్లు చూపించినట్టే రాష్ట్ర మంత్రి రోడ్ మిద ధర్నా , హీరో గారు తండ్రి , బాబాయ్ గార్ల పోస్టర్ల సాక్షి గా మంత్రి ని కొట్టి దారి ని సుగమం చేసి ప్రజలని రహదారి బాధల నుంచి రక్షించి మంత్రి ఆగ్రహం కారణం గా ముంబై కి బదిలీ చెయ్యడం చక చక జరిగిపోతాయి .
ఆల్రెడీ కామెడి మొదలయింది అని అనుకోకండి ... పేర్లు పిచ్చ కామెడి ... తూఫాను టపాను అంటూ దాదాపు నగ్నంగా ఉన్న అమ్మాయిలు (బాండ్ టైపు ) వొంటి నిండా సంకెళ్ళ తో వస్తూ పోతూ ఉంటారు . (జంజీర్ అన్నమాట ) దానికి అర్ధం పర్ధం లేని సాహిత్యం ఒకటి జత . చంద్రబోసు గారు ఇలా దరిద్రం గా రాస్తారు అని అనుకోలా ... డబ్బింగ్ గాబ్బు గా ఉంది ... నిజానికి తెలుగు సినిమాకి దర్శక పర్యవేక్షణ యోగి కాని అయన ఎక్కడా కనిపించినట్టు గా లేదు మరి.
పేర్లు అవ్వగానే సర్ గారి రికార్డ్లు పనిపాట లేని అనౌన్సర్ లు రికార్డ్లు వేస్తూ ఉంటారు . వెనకాల ఒకటే నేపధ్య సంగీతం రఘుపతి రాఘవ రాజారాం అని, సినిమాకి దానికి సంబంధం లేకుండా . ఒకపక్కన హీరో జనాలని చావ చిత్తక కొడుతూ ఇంకో పక్క శాంతి మంత్రం పాటిస్తున్నట్టు గా ఉంది . మన పోలీసులకి గడ్డం చేసుకోడానికి సమయం ఉండదో లేక జీతం చాలదో తెలీదు కాని సినిమాలో ఎక్కడ గడ్డం చేసుకున్నట్టు గా కనపడదు.
ఇంకా శ్రీహరి నటన ... అబ్బోఅదొ టార్చర్ .. షేర్ ఖాన్ అని పేరు పెట్టుకున్నా కదా అని అరవడమే పనిగా పెట్టుకునట్టు గా ఉంది . ప్రతి మాట ఒక రేంజ్ లో అరవడం అరవ సినిమా లాగా ...షేర్ ఖాన్ , హీరో ఇద్దరు కొట్టుకున్నాక , షేర్ ఖాన్ చెయ్యి కలపబోతే నీకు సంకెళ్ళే వేస్తా అని , తరవాత సీన్ లో ఇద్దరు స్నేహితులు అయిపోతారు, ముందర సీన్ కి సంబంధం లేకుండా. హీరో పక్కన ఉండే పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు బఫూన్ టైపు బుర్ర అరికాల్లో కూడా లేని రకాలు .
ఇంకా హీరోయిన్ పేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితురాలి పెళ్ళికి అమెరికా నుంచి వచ్చి , పెళ్లి లో ఐటం డాన్సు చేసి మందు కొట్టి (పెళ్లి నగరం లో జరుగుతుంది ) అమ్మాయి స్టార్ హోటల్ లో ఉంటుంది రెండిటికి మధ్య ఊరు ఉంటుంది ...ఇంక ఆవిడ అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ గారి హత్య చూస్తుంది .
ఆ తేజ ఎవరు అనగానే ఇంకో ఐటెం సాంగ్. అది అవ్వగానే డైనింగ్ టేబుల్ మిద తేజ ఒకడిని చంపడం . ఏంటి ఈ పాత చింతకాయ సీన్స్ అంటే అదే మరి తూఫాన్ గొప్పదనం . ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్ లేకుండా , నలభై ఏళ్ళ క్రితం వచ్చిన జంజీర్ సినిమాకి అదే సీన్స్ తో తెలుగు హిందీ నటులతో ఏ మాత్రం కొత్తదనం కాని, నటన కాని లేకుండా ఎంత చెత్తగా తియ్యోచ్చో భారి కర్చు పెట్టి అని చూపించారు .
ఇంకా ఈ సినిమా కి అన్ని చోట్ల జీరో రేటింగ్స్ ఇచ్చినా అంజనీ పౌత్రుడు మాత్రం అబ్బో నాకు బోలెడు మంది ఫోన్స్ చేసి పోగిడేసారు అని ఊదర కొట్టేస్తున్నాడు .
రిలీజ్ కి ముందరే ఈ సినిమా వంద (నా బొంద ) కోట్లు దాటేస్తుంది అని కాకి లెక్కలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. హిందీ మిద చూస్తె తెలుగు లో కొంతవరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది , హిందీ లో ప్రకటన కర్చులు కూడా వచ్చే అవకాశం లేదు మరి . ఈ హీరో కి నటన ఎప్పటికి వచ్చెనో లేక మనం తినగా తినగా వేమ తియ్యగనుండు లాగ ఈ చెక్క మొహానికి అలవాటు పడిపోతాం ఏమో (ఇప్పటికే అలవాటు పడ్డవాళ్ళ గురించి నేను ఎం చెప్పలేను అనుకోండి ).
సినిమా కి పాటలు , నేపధ్య సంగీతం దొందు దొందే ... ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఇంతోటి సినిమా కి అది చాల్లే అనుకున్నట్టు గా ఉన్నారు ..
సినిమాలో లోపాలు కో కొల్లల్లు .. హీరో తండ్రిని కోల్పోయిన సంఖ్య సీన్ కి ఒకలాగా మారుతుంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎందుకు ఎలా పుట్టిందో డైరెక్టర్ కి కూడా తెలుసా అన్నది అనుమానమె.
సొరంగం లో నీటి నిప్పుల మధ్య జరిగే పోరాటం మొహ్హారం ఊరేగింపు లో కి వచ్చి మళ్ళి సొరంగం లో కి ఎలా వెళ్తుందో ఆ ఎడిటర్ కి కూడా తెలీదు ..
ఇలా ఒకటా రెండా సినిమా చూస్తె మెదడు ఏ కాల్లో ఉందొ ఎత్తుక్కుకోవాల్సి వచ్చింది
ఈ సినిమా తరవాత ఇంకా రెండో మూడో హిందీ సినిమాలు అతి త్వరలో అని ప్రకటించేసాడు అబ్బాయి .. ఇంకా కాసుకోండి...
6 comments:
Hi శ్రీగారూ,
చాలారోజుల తర్వాత మీ పోస్ట్ చూస్తున్నాను. సంతోషం. మీ బ్లాగ్ పేరు ఇంతకుముందు వేరేగా ఉండేదనుకుంటా!
ఒక గొప్ప పార్టీ నాయకుని కొడుకు..సినీమా ని చూసి ..మీరు వ్రాసిన ..చిన్న కధ...ఒక రకంగా..ఆ సినిమా చూడాలనుకునే సగటు పేక్షకుడికి..కొండంత ధైర్యాన్నిచ్చి...జేబుకి చిల్లుపడకుండా కాపాడుతుందని....ఆశిస్తూ....మీ ఉగాది పచ్చడి ఈ వినాయకచవితిరోజున మరల హాయిగా తిన్నాము...
@tejaswi garu ... yeah blogperu nenu cinemalu .. pustakalu gatra ani undedi ...
@vaidyanath birudukota garu .. thanks andi
inka telugu field lo chaala chekka mukhaalu unnayi...vaalla gurinchi kooda...reviews ilaane raasthe...mee reviews unbiassed ani voppukuntanu...meeruraasinavi kakunta...emyna manchi ledha ee cinema lo...meeru chekka mukham meeda concentrate ekkuvagaane chesaru mari.....
YES, I have suffered on the first day only, i had coffee in interval instead of cool drink
చెక్కమొహం....perfect గా చెప్పారు...
ఈ చెక్క తగలెట్టడానికి కూడా పనిచేయదు
Post a Comment