తెలుగు వారికీ స్వంతమైన పచ్చడి... జీవితానికి నిర్వచనం .... అందుకే బ్లాగ్ పేరు మార్చాను ....
Monday, September 24, 2007
Railway Gate (2007)
Agatha Christie వ్రాసిన Murder on the Orient Express (1974)ని ఎంత చెత్తలాగా తీయొచ్చో మనం ఈ సిత్రం చూసి తెలుసుకోవచ్చు. ఆకశ్ (పృథ్వీ) అమెరికా నుంచి వచ్చి వ్యాపార వ్యవహారాలు చక్కపెట్టుకుని ఆస్తి అమ్మేసి మళ్ళీ అమెరికా పోవాలనుకుంటాడు. అతనికి ఉన్న అమ్మాయిల పిచ్చి వల్ల దారుణంగా railway gate దగ్గర హత్య చేయబడతాడు. దాన్ని పరిశోదించడానికి ఇంకో పృథ్వీ వచ్చి ఎలా murder mysteryని ఛేదించదు అన్నదే క్లుప్తంగా కథ. మొదటి సగం సిత్రం పృథ్వీ అమ్మాయిల పిచ్చి, హత్యతో సరిపోగా రెండో సగం రెండో పృథ్వీ పరిశోధన పేరుతో కాలక్షేపం చెయ్యాలని చూసారు. సినిమాకి సంబంధం లేకుండా మరో పక్కన ఆలీ-కొండవలస comedy track, సుమన్ శెట్టి dance ఏంటో ఆ దర్శకమహానుభావుడికే తెలియాలి. ఒక మంచి thrillerని ఎలా ఖూనీ చేయవచ్చో మనవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
hey dude can u tell me how to get the telugu script for the blogger
Post a Comment