Saturday, April 3, 2010

అమెరికా అల్లుడికి పాతికేళ్ళు ....

ఈ వేసవి కి అమెరికా అల్లుడు సినిమా విడుదల అయ్యి పాతికేళ్ళు. తెలుగు లో మొట్టమొదటిగా అమెరికా లో నిర్మించ బడ్డ తెలుగు చిత్రం ఇదే. అంతే కాదు ఈ సినిమా కి బోలెడు చరిత్ర ఉంది.

తెలుగు లో మొట్ట మొదటిసారిగా ఒక తెలుగు పాట ని సినిమా కోసం అమెరికా లో రికార్డు చెయ్యడం కూడా మొదటి సారే. అంతే కాదు, దానికి సంగీతం, గాయకులు, గీత రచయితా అందరు ప్రావాస ఆంధ్రులు కావడం ఒక విశేషం. (ఆ పాటకి ప్రేరణ ఒక ఆంగ్ల గీతం అనుకోండి అది వేరే విషయం).

ఈ సినిమాకోసం అతి తక్కువ మంది మంది ఇండియా నుంచి వచ్చారు. సుమన్ తో పాటు ఒక సహాయకుడు, భానుప్రియ తో ఆమె తల్లి, డాక్టర్ తంబు, కే వాసు (దర్శకుడు, నటుడు ), సూర్యకాంతం గారు, కెమెరా మాన్ రఘు , అతనికి ఒక సహాయకుడు అంతే. మిగిలిన వాళ్ళు అందరు ఇక్కడ పని చేసే వాళ్ళే కావడం గమనించ దగ్గ విషయం.

దాదాపు ఏడాది పైగా కథ చర్చలు జరిగాయి. ముందర అనుకున్న కథ ప్రకారం అమెరికా కి వచ్చిన నలుగురు అబ్బాయిలు , అందులో ముగ్గురు, వారి అభిరుచులకి అనుగుణంగా భిన్న స్వభావాలు కల అమ్మాయిలని పెళ్లి చేసుకుంటారు. నాలుగో అతను వీళ్ళ పెళ్లి లో ఏది మంచిది అన్నది బెరేజు వేసుకుని పెద్దలు నిర్ణయించిన పెళ్లి మంచింది అని మన సంప్రదాయాలకి అనుగుణంగా పెళ్లి చేసుకుంటాడు. కాని తరవాత ఆ కథ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాదు ని నిర్ణయించుకుని డాక్టర్ కావూరి గారు సలహా మేరకు ఈ కథ ని మేడిసన్ యునివెర్సిటీ లో ప్రొఫెసర్ గా చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారి తో కథా చర్చలు మొదలు పెట్టి ఈ కథ నిర్ణయించారు. ముందుగా ఈ చిత్రానికి జంధ్యాల గారిని దర్శకుడిగా అనుకున్నారు. జంధ్యాలగారు కూడా ఒప్పుకున్నారు. కానీ అయన వీసా కి వెళ్ళినప్పుడు అమెరికా లో సినిమా దర్శకత్వం వహించడానికి వెళ్ళుతున్నా అని చెప్పడం తో దానికి హే చ్ వన్ వీసా కావాలి అని రెజెక్ట్ చేసారు. దాంతో రమేష్ గారికి చిన్నప్పటి నుంచి తెలిసిన స్నేహితుడు కే. వాసు గారికి అప్పగించారు.

ఈ వ్యాసం పూర్తి గా తెలుగుసినిమా.కాం లో ఆంగ్లం లో చదవగలరు.

ఈ వ్యాసం కోసం సుమన్ ని సంప్రదించాలని చాలా ప్రయత్నం చేసాం. కాని సుమన్ దొరకలేదు. అందువల్ల సుమన్ అనుభవాలను రాయలేక పోయాను.

6 comments:

సుభద్ర said...

బానుప్రియనటన చాలా బాగు౦టు౦ది...కేరేజ్ పెట్టాలని అనుకుని సుమన్ కి పొన్ చేసి అన్నట్లు మీ టె౦క అ౦టే ఇష్టమేనా అని అడిగే సీన్ చాలా ఫన్నీగా ఉ౦టు౦ది..కురలుకొ౦టూ కొసరు కోట్టేసే అప్పుడు బానుప్రియ ఎక్షన్ సుపర్,,

సుభద్ర said...

టైటిల్ లో చిన్న అక్షర దోష౦ ఉన్నట్లు ఉ౦ది..

Rajendra Devarapalli said...

ఈ సినిమా గురించి మీరు పేర్కొన్న విషయాల్లో,-తెలుగు లో మొట్టమొదటిగా అమెరికా లో నిర్మించ బడ్డ తెలుగు చిత్రం ఇదే-అన్నది పూర్తిగా నిజంకాదు.ఎందుకంటే1980లోనే కృష్ణ,శ్రీప్రియ జంటగా నటించగా మహాదర్శకుడు శ్రీధర్ రూపొందించిన హరేకృష్ణ-హలోరాధ వచ్చింది.

శ్రీ said...

లేదండి అది విదేశాలలో తీసారు కాని అమెరికా లో తియ్యలేదు .... (నేను ఆ సినిమా చూడలేదు, కాని పెద్ద వాళ్లతో మాట్లాడినందువల్ల చెప్పడం... ) తప్పు అయినా అయి ఉండవచ్చు ... కాని అమెరికా లో స్థిరపడ్డ తెలుగు వారు అమెరికా లో తీసిన మొట్ట మొదటి సినిమా అని మాత్రం చెప్పగలను..

మురళి said...

మంచి సినిమా అండీ.. భానుప్రియ బాగా చేసింది..

srinivas bhamidipati said...

chala bagundhi e blog.