Sunday, October 3, 2010

కరెంటు పొతే ....

మరీ చెత్త ప్రశ్న ... కొవ్వొత్తి వెలిగించుకోవచ్చు కదా...అని చిన్న పిల్లాడు కూడా చెప్తాడు.. దానికి మళ్ళా బ్లాగ్ లో రాయాలా సోది కాకపోతే అని తిట్టిపోయకండి ..మామూలుగా అయితే అంతే.. అది ఒక గంట రెండు గంటల కట్ అయితే సమస్య లేదు ... భారత దేశం లో అయితే రోజు కరెంటు పొతూ నే ఉంటుంది కాబట్టి అంత పెద్ద విషయం అసలు కాదు... కోవోత్తో ,ఊళ్ళో అయితే కిరసనాయిలు లాంతరు వెలిగించి జీవితం గడిచిపోతుంది. కాని పొద్దున్న లేచి కరెంటు పొయ్యి వెలిగించి (లేదా మైక్రో వేవ్ లో పెట్టి ) కాఫీ కాని కార్న్ ఫ్లకేస్ కాని తిని పొద్దునే బస్సు (లేదా కార్ పూల్ కో ) బయలుదేరని వాళ్ళు ఉండరు ఏమో అమెరికా లో.. అలాంటిది ఒక గాలి వాన కి మన అపార్ట్మెంట్ కాంప్లేక్స్ ఒక నాలుగు రోజులు కరంట్ మటాష్ అయితే మన పని మటాష్ అని వేరే చెప్పాలా...

గత వారం మా ఏరియా లో బోలెడు గాలి .. ఒక చిన్న వాన వచ్చింది.. ఆ దెబ్బకి మా పక్క బిల్డింగ్ పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మ ఒకటి విరిగి కరంట్ తీగల్ని తాకుతూ కింద పడ్డాయి.. ఇలాగే మా చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లో జడగడం వల్ల దాదాపు గా ఒక యాభై వేల ఇళ్ళల్లో కరంట్ పోయింది...ఇది జరిగింది మధ్యానం. ఆ సమయానికి మనం పని లో ఉండటం తో , (అక్కడ కరెంటు పోలేదు లెండి ). మా రూంమేట్ ఎస్ ఎం ఎస్ పంపాడు ... కరంట్ పోయింది అని.. ఇక్కడ కరెంటు పొతే ఒక అర గంట లో మాములుగా వచ్చేస్తుంది లే అన్న ధీమాతో ... ఇట్ ఇస్ ఓకే అని రిప్లై పంపా. ...
ఇంటికి వెళ్ళే సమయం కి ఎందుకన్నా మంచింది అని పక్కనే ఉన్న డాలర్ షాప్ లో ఒక రెండు కొవ్వొత్తులు (మాకు ఒకటి .. మా పక్క ఇంటివాళ్ళ కోసం ఒకటి ) కొని ఇంటికి బయలుదేరా ... ఈ లోపల మా వాడి రెండో ఎస్ ఎం ఎస్ ఇంకా రాలా కరంట్ ..నేను ఇంకా ఆఫీస్ లో నే ఉన్నా... నా భోజనం ఇక్కడే అవ్వొచ్చు ...మీరు మన రెస్టారంట్ కి ఆర్డర్ ఇస్తారా అని ఉంది... నేను ఇంటికి చేరాలంటే రెండు బస్సులు మారాలి.. రెండు బస్సు ఎక్కే చోట మాక్ డొనాల్డ్స్ ఉంది .. అక్కడ కి వెళ్లి రెండు మాక్ చికెన్ ఆర్డర్ చేస్తే ఆ అమ్మాయి ఆస్ప్రో బిళ్ళలు లాంటి చిన్న చిన్న బన్ను ముక్కుల మధ్య ఇంకా చిన్న చికెన్ ముక్క పెట్టి ఇచ్చింది. అది ఇద్దరికీ సరిపోదు (ఇంకో పక్క బస్సు వస్తుంది ఏమో అన్న కంగారు..) మొత్తానికి ఇద్దరికీ సరిపడా ప్యాక్ చేయించు కొని బస్సు స్టాప్ కి వచ్చా... అక్కడ రోజు బస్సు స్టాప్ లో కనపడే అరవ అబ్బాయి కనపడ్డాడు.. సరే అని ఆ అబ్బాయి కి తెలుసో లేదో ఇంకా బస్సు కూడా రాలేదు అని ఆంగ్లం లో ఇలా కరంట్ పోయింది , ఇంకా రాలేదు ... భోజనం కి ఇబ్బంది కావొచ్చు , మాక్ డొనాల్డ్స్ లో ఏదన్న కొనుకుని వెళ్ళు బాబు అని చెప్పాను . వద్దు మా ఇంట్లో మా రూం మేట్ ఉంటాడు ... నేను వెళ్ళే సమయానికి వండి పెట్టి ఉంటాడు సమస్యే లేదు అని అన్నాడు... అబ్బ చా ! అనుకుని ...డూడ్ మనం ఉండే అపార్ట్మెంట్ లో కరంట్ లేక పొతే పొయ్యి వెలగదు అని చెప్పను.. బాబు కి అప్పుడు తలలో దీపం వెలిగి వాళ్ళ రూం మేట్ కి కాల్ చేసి అరవ భాష లో అడిగాడు సంగతి ఏంటి అని... నేను చెప్పెంది చెప్పినట్టు ఉన్నాడు అవతల అబ్బాయి... ఇదంతా అయ్యే సరికి బస్సు వచ్చేసింది దాంతో చేసేది ఎం లేక బిక్క మొహం వేసుకుని బస్సు ఎక్కాడు ( ఇంకో బస్సు ఇంకో గంటకి కాని లేదు ... అప్పటికే సమయం పావు తక్కువ తొమ్మీది అయ్యింది ... ఆ సమయం లో బస్సు స్టాప్ లో ఉండటం కొంచం రిస్క్ కదా మరి ) బస్సు ఎక్కాక మాకు కార్ కూడా లేదు ఇప్పుడు వెళ్ళాలి అంతే ... పిజ్జా ఆర్డర్ చేస్తాం ఎం చేస్తాం అన్నాడు... చుట్టూ పక్కల అంతా కరంట్ పోయింది పిజ్జా ఎలా ఆర్డర్ ఇస్తాడో పాపం ఇంటికి వెళ్ళే సరికి ఎమన్నా సర్దుకుంటుంది అని ఆలోచిస్తూ బస్సు దిగాను...

బస్సు దిగి మా పక్క బిల్డింగ్ లో ఉండే ఇంకో స్నేహితుడి కి ఫోన్ చేశా ..వంట సంగతి ఏంటి బాబు.. భోజనం చేసావా అని .. లేదు వెన్నెల లో కుర్చుని టీ తాగుందాం పొయ్యి మిద టీ పెట్ట కాని పొయ్యి వెలగదు కదా అని అప్పుడు నాకు వెలిగింది అని నవ్వాడు.. సరే మా ఇంటికి రా బన్ను ముక్కలు తెచ్చాను అని అన్నా... వాళ్ళు ఉండేది ఆరో అంతస్తు .. మేము ఉండేది పక్క బిల్డింగ్ లో ఎనిమిదో అంతస్తు ... పాపం తను దిగి మల్ల మా ఎనిమిది అంతస్తులు ఎక్కి వచ్చాడు (లిఫ్ట్ పని చెయ్యదు కదా మరి ..సెల్ ఫోన్ వెలుగు లో మెట్లు చూసుకుంటూ ఎక్కక తప్పలా మరి... ) మా అపార్ట్మెంట్ తలుపు తెరవగానే బోలెడు వెలుతురు.. కార్పెట్ అంతా వెన్నెల పరచుకుని ఉంది ... రోజు లైట్ ల వెలుగులో ఇంత వెన్నెల ని మిస్ అవుతున్ననా అని అనిపించింది... ఆ వెన్నెల్లో కొవ్వొత్తి వెలిగించి బన్ను ముక్కలని .. నిన్నటి అన్నం లో పెరుగు వేసుకుని ఆవకాయ తో తిన్నాం ఇద్దరం.

ఆ రోజు మా వాడు ఆఫీసు లో నుంచి వచ్చే సమయానికి అర్దరాత్రి దాటింది... పొద్దున్నే కి కరంట్ వస్తుంది కదా అన్నా ఆశ తో పడుకుంది పోయాం. కానీ పొద్దునే కి కూడా రాలేదు.. తప్పదు కదా అని చల్లటి నీళ్ళతో స్నానం చేసి పనికి వేల్లిపోయం ఇద్దరం... కాని సాయంకాలానికి కూడా రాలేదు ... (వెబ్ సైట్ లో చెక్ చేస్తే తెలిసింది కానీ దాదాపు గా డెబ్బై శాతం ఇళ్ళకి వచ్చింది అని వార్త కనపడింది ) .. ఎం చేద్దామా అని ఆలోచిస్తుంటే వేరే ఏరియా లో ఉండే స్నేహితుల నుంచి ఫోన్స్ , మా ఇంటికి వచ్చి ఉండు కరంట్ వచ్చేదాకా అని ... వెళ్దామా అనుకుని కూడా ... మనలాగా ఇంకా ముప్పై శాతం మంది ఉన్నారు .. వాళ్ళకి లేని సమస్య మనకేనా అని అనిపించింది.. సున్నితంగా రాను అని చెప్పి వాళ్ళకి తప్పించుకున్నా .. ఇంటికి వెళ్లి మల్లి దేవుడా అని ఎనిమిదో అంతస్తు ఎక్కి మా వాడి కోసం వెయిటింగ్ మొదలు పెట్టాను. మా వాడు రెస్టారంట్ కి ఆర్డర్ ఇచ్చి గంట అయ్యింది .. అది తీసుకు రాడానికి వెళ్తే ఇంకో గంట పడుతుంది అని చెప్పారు చల్లగా ... దాంతో ఆగే ఓపిక లేక వాడి వచ్చే లోపల పడుకుని నిద్ర పోయాను...

మర్నాడు మధ్యానం కాని మాకు కరెంటు రాలేదు ... మేము బాచిలర్స్ కాబట్టి అంత సమస్య కాదు కాని .. పిల్లలు కలవాళ్ళ అవస్తలు ఎలా ఉన్నయ్యో అని మాత్రం అనిపించింది ... ఇండియా నీ బెటర్ కరంట్ పోయిన అంత ఇబ్బంది అనిపించింది .. కాని గుడ్డి లో మెల్ల స్నో టైం లో కన్నా ఈ టైం లో జరిగింది అని కూడా అనిపించింది (అప్పటి పరిస్థితి ఇంకా ఇప్పుడే తెలీదు కదా ! )

1 comment:

మురళి said...

బాగున్నాయండీ కరెంటు కష్టాలు..