Monday, October 11, 2010

ఖలేజా - ఓ సినిమా కథ ...

ఖలేజా సినిమా రివ్యూ మళ్ళి మళ్ళి రాసి విసిగించదలచుకోలేదు ...

ఖలేజా సినిమా దాదాపుగా పూర్తీ అయ్యింది అన్న వార్త వచ్చినప్పటినుంచి బోలెడు అంచనాలు... అభిమానుల హుంగామ... ఇంకో పక్క రోబో డబ్బింగ్ సినిమా చరిత్రలో కానీ విని ఎరుగని ధరకి అమ్ముడుపోవడం.. ఒక వారం ముందర అది కూడా విడుదల కి సన్నాహాలు చేసుకోవడం తో టెన్షన్ మొదలు అయ్యింది. మధ్యలో బృందావనం కూడా విడుదల అవ్వొచ్చు అన్న ఒక వార్త దానికి తోడై ఇంకా ఎక్కువ అయ్యింది...

ఇక కథలో కి వస్తే ... మా ఊర్లో రోబో తమిళ్ వెర్షన్ విడుదల ఒక రెండు వారాల ముందర నుంచి మొదలు అయ్యింది... మా వాళ్ళు పోస్టర్ అంటించడం ఆలస్యం సినిమా ఎక్కడ , ఎప్పుడు , టిక్కెట్ ఎంత ... ఎక్కడ అమ్ముతారు అని వరసగా ఫోన్స్.. ఇంకో పక్క సినేమార్క్ వెబ్ సైట్ వాడేమో షెడ్యూల్ అప్ లోడ్ చెయ్యడు. అసలు ప్రింట్లు వస్తాయా రావా అని ఒక టెన్షన్.. మన తెలుగు వాళ్ళు ఒత్తి వెధవాయులోయి అన్ని గిరీశం గారు తెలుగు వాళ్ళని అన్నారు కాని తమిళ్ తంబి లని కాదు కదా అని ఒక ఓదార్పు .. తమిళ్ తంబిల సినిమా ఎప్పుడు సరిగ్గా సమయానికి విడుదల అవుతుంది.. మనవాళ్ళ సినిమాలు నూటికి డెబ్బై శాతం వరకు ప్రింట్స్ కాని డి టి ఎస్ కానీ సమస్య అవుతుంది.. డిజిటల్ వచ్చాక కూడా ఆ సమస్య పోలేదు.. రేలైన్సు వాళ్ళు సరిగ్గా అప్ లోడ్ చెయ్యక... చేసినా పాస్ వర్డ్ పంపక బోలెడు సార్లు సినిమాలు ఆలస్యం అయ్యి పంపణీ దారులని త్రిశుంక స్వర్గం లో నెట్టారు.. తాజా ఉదాహరణ కొమరం పులి.. సినిమా ఒక రోజు ఆలస్యం గా విడుదల అయ్యింది అమెరికా అంతటా... దాంతో కొన్నవాళ్ళకి బోలెడు నష్టం.. (పవన్ కళ్యాణ్ తన పారితోషికం లో కొంత తిరిగి నిర్మాతకి తిరిగి ఇచ్చాడు అని తాజా వార్త .. కాని ఆ నిర్మాత కొన్నవాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా ).

సరే తమిళ తంబిల ని నిరశాపరచాకుండానే సినిమా ప్రింట్ ఒక రోజు ముందుగానే మా ఊరు వచ్చింది .. కాని వెబ్ సైట్ లో సినేమార్క్ వాడు ఇదిగో వస్తోంది అని పెట్టలేదు .. సినిమా ఏమో రేపే విడుదల ఇంకా చూస్కోండి వస్తోందా రాదా అని ఎడా పెదా ఫోన్స్ .. చివరకి మా మిద దయ తలచినట్టు గా వాడు సైట్ లో పెట్టాడు . వాడు పెట్టిన గంటకి మొదటి రేజు రెండు ఆటలు ...ఫుల్ల్స్ , ఇంకో గంటకి శని, ఆది వారాలు కూడా ఫుల్ అయ్యాయి... ఇంకా ఆ రెండు రోజులు మీ దగ్గర ఏమన్న్నా టికెట్లు ఉన్నాయా అని ఫోన్స్.. తెలుగు రోబో ఎప్పుడు అని ఫోన్స్.. తెలుగు రోబో, ఖలేజా రెండు ఒకే సారి విడుదల చేస్తాం మీ ఊర్లో అని పంపిణీ దారుని ఉవాచ .. సరే అని అదే చెప్పా మా ఊర్లో జనాలకి ... ఇంకా అప్పటి నుంచి ఖలేజా హడావుడి మొదలయ్యింది ...

ఇండియా లో మా వాళ్ళని అడిగితె సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అని అనుకుంటున్నాం అని అన్నారు.. నాకు ఏమో మూడేళ్ళు తీసే సినిమాల మీద అంత నమ్మకం లేదు ఎప్పుడు (అరుంధతి లాంటి సినిమాకి పట్టొచ్చు కానీ సంఘీకం సినిమాలకి అంత సమయం దేనికో నాకు అర్ధం కాదు ). ఆ మాట అంటే ... లేదు త్రివిక్రమ్ , మహేష్ ఇద్దరి సినిమా అతడు కన్నా ఇంకా మంచి సినిమా అది ఇది అని నాకు సుద్దులు చెప్పారు .. ఇంతలో సెన్సార్ లో ఉండే స్నేహితుడు ఒకడు ఫోన్ చేసి .. సినిమా మహేష్ తప్ప సోది అని చల్లగా చెప్పాడు.. ఆ ముక్క మావల్లతో అంటే మీ సెన్సార్ వాళ్ళు అంతే లే.. సినిమా సూపర్ గా ఉంటుంది మీ వాళ్ళకి చూడటం తెలీదు అని చెప్పారు. సరే ఇంకో రెండు రోజుల్లో తెలుస్తుంది కదా అని ఆగాను...

హైదరాబాద్ లో కన్నా విజయవాడ లో ముందర విడుదల అవ్వటం తో నెట్ లో దాని మీద వాడిగా వేడిగా చర్చలు జరిగాయి... సాయంకాలం ఎనిమిది నుంచి వరసగా ఫోన్ లు మొదలు అయ్యాయి.. ఒక్కళ్ళు కూడా మెచ్చుకున్న పాపాన పోలేదు. ఒక్క వీర ఫాన్ మాత్రం సినిమా సూపర్ మీదే తప్పు అని భాద పడ్డాడు . న్యూ జెర్సీ , సానోస్ లాంటి చోట్ల సినిమా అవ్వడం ఆలస్యం ఫోన్ చేసి దర్శకుడిని తిట్టిపోయ్యడమే.

మాకు ఏమో ఇంకా ప్రింట్ రాలా.. సరే పొద్దున్న కన్నా వస్తుందో రాదో అని ఆలోచిస్తూ పడుకున్నా...

మర్నాడు ప్రింట్ వచ్చింది కాని సినేమార్క్ వాడు షరా మాములుగా వాడి వెబ్ సైట్ లో పెట్టలేదు. దాంతో సినిమా ఉందా లేదా అన్నది జనాలకి తెలీకుండా పోయింది. ప్రతి పది నిమషాలకి ఒకసారి ఫోనో ఎస్ ఎం ఎస్ కానీ వచ్చేవి .. సినిమా ఉందా లేదా అని.. చివరకి నా బాద పడలేక సిని మార్క్ వాడు నలుగు గంటలకి వాడి సైట్ లో సినిమా ఉంది అని పెట్టాడు.. పెట్టిన పావు గంటలో టికెట్స్ ఆ రోజు ఉన్న ఒక్క షో కి అయ్యిపోయాయి . మా రూం మేట్ కొనడం తో నాకు టికెట్ ఉండింది..

ముందర వెళ్లి అందరికి సీట్స్ ఆపాము. ఇండియా లో లాగ ఇక్కడ సీట్స్ నంబర్లు ఉండవు కదా మరి .. ఇంకా సినిమా మొదలు అయ్యే దాక వచ్చే పొయ్యే వాళ్ళకి పళ్ళు ఇక్కిలిస్తూ , బుర్ర ఊపుతూ తింగర ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాం .
సినిమా మొదలు అవ్వగానే ఇంకా మావాళ్ళు కయ్యి మని విజుల్స్ వెయ్యడం మొదలు పెట్టారు...మహేష్ బాబు కనపడగానే స్క్రీన్ మీదకి కాగితం ముక్కలు వేసారు...

ఇంకా మహేష్ బాబు గారు గ్రాఫిక్ పాము పట్టుకుని ... ఏదో అర్ధం పర్ధం లేని పోరాటం ఒకటి చేసి నలుగురిని చంపి ...గుర్రం మీదకి ఎక్కడానికి గోడ ఎక్కి దాని మీదకి దూకుతాడు (ఇక్కడే విచిత్రం జరిగిపోతుంది... గుర్రం మీదకి దూకిన మహేష్ బాబు .. మోటర్ బైక్ మీద తేలుతాడు మనకి ఎం జరిగందో కొంచం సేపు అర్ధం కాదు) తరవాత మళ్ళి మహేష్ బాబు ని చూడటం లో మునిగిపోతాం. కొన్ని కుళ్ళు కామెడి దృశ్యాల తరవాత మహేష్ కి అక్కలాగా ఉండే అనుష్క వస్తుంది. ఆవిడ విల్లన్ కొడుకుతో హెలికాప్టర్ ఎక్కి (అమ్మాయి వొంటి మిద నగలు ఉండవు ఆ సమయం లో ) ఎడారి లో కాండిల్ లైట్ డిన్నర్ కి వచ్చి సరదాగా ఎడారిలో పారిపోయి హీరో దగ్గర తేలుతుంది ... ఇక్కడ ఇద్దరు సాంగ్ వేసుకునే సమయానికి నగలు వచ్చేస్తాయి... సెల్ ఫోన్ హీరో హీరోయిన్ లకి తప్ప అందరికి పని చేస్తుంది ... (సునీల్ సెల్ ఫోన్ తో ఫోన్ చేసి వాళ్ళ వాన్ తెప్పించుకుని వెళ్ళిపోతాడు )

మహేష్ బాబు, అనుష్క అక్క బస్సు ఎక్కుదాం అనుకునే సమయానికి సుబ్బరాజు వచ్చి ఒక పోటు పోడుస్తాడు ... పొడిచి మహేష్ వివరాలు ఫోన్ లో ప్రకాష్ రాజ్ కి చెప్తాడు మరి ప్రకాష్ రాజ్ కి మహేష్ వివరాలు ఎలా తెలుసో మహేష్ బాబు కే (సినిమాలో మహేష్ బాబు దేవుడు మరి ) తెలవాలి .. ఇలా సినిమాలో ఒకో సీన్ కి ఒకో రకం గా మనుషులు మారిపోతూ చివరకి మహేష్ బాబు ని దేవుడిని చేసి మానని వెధవలని చేసి పంపుతారు ...

సినిమాలో బాగుంది ఒక్కటే ... మహేష్ ... మహేష్ ... మహేష్ ... అది ఒక్కటే సినిమాకి బలం .. బలహీనత ...

మిగిలిన బలహీనతలు : కథ , కథనం , సంగీతం... మణిశర్మ ఇంత దారుణంగా మహేష్ బాబు చిత్రానికి సంగీతం ఇవ్వడం ఇదే మొదటి సారేమో ... బగున్న ఇంకో అంశం చాయగ్రహణం ....

4 comments:

Naresh said...

I dont agree with u. I liked the movie. Its not as bad as mentioned in reviews and some blogs.

oremuna said...

http://en.chavakiran.com/blog/?p=330

కన్నగాడు said...

సినిమాలో లాజిక్కులు గట్రా వెతకకుండా కేవలం హాస్యం కోసమే చూస్తే మొదటి అర్ద్థభాగం పరవాలేదనిపిస్తుంది. కానీ మూడో రెండో సంవత్సరాలు తీసేటంట అద్భుతమైన సినిమానైతే కాదు.
పావు గంటలో టిక్కెట్లు అయిపోయాయా, ఇంతకీ ఎన్ని సీట్లుంటాయి?
మా దగ్గర విడుదలైన రోజే వచ్చింది(సాధారణంగా విడుదలైన తర్వాత మొదటి సోమవారం వస్తుంటుంది, సింగిల్ షో), హౌస్।ఫుల్, టిక్కెట్టు మాత్రం పదిహేను పౌండ్లు చేసారు రోబోతో(సాధారణ హాలీఉడ్ చిత్రాలకి అయిదారు పౌండ్లకి మించదు). అంత ఖర్చు పెట్టి తెలుగు సినిమా చూసే ధైర్యం చెయ్యలేక టోరెంట్ల మీద పడ్డాను.
పైరసీ చేసే వాళ్ళకున్నంత కమిట్।మెంటు నిర్మాతకు, పంపిణీదారులకు ఉండట్లేదు, శుక్రవారం మధ్యాహ్నానికల్లా పైరసీ ప్రింటు స్క్రీన్।షాట్లు దర్శనమిచ్చాయి, కాస్త ప్రయత్నం మీద శనివారం కల్లా డౌన్లోడు పూర్తయ్యింది.

శ్రీ said...

సిని మార్క్ వాడు సీటింగ్ కెపాసిటీ తక్కువే ఇచ్చాడు ఈ సినిమాకి ... నూట డెబ్బై అయిదు సీటింగ్ కెపాసిటీ ... టికెట్ ధర కూడా మరీ ఎక్కువ కాదు.. పన్నెండు డాలర్లు పెట్టాడు... సినిమాలో చాల చోట్ల మహేష్ బాబు పోకిరి లాగే సంభాషణలు చెప్పాడు అనిపించింది ... త్రివిక్రమ్ కన్నా పూరి బెటర్... నిర్మాత గురించి ఆలోచిస్తాడు ...