Friday, October 15, 2010

వై వి ఎస్ కామెడి ...

సినిమా వాళ్ళల్లో మందు మగువ జోలికి పోనీ అతి కొద్ది మంది లో వై వి ఎస్ గారు ఒకరు. ఆ విధం గా అయన అంటే నాకు మంచి గౌరవం ఉంది. దానికి నేను కింద చెప్పబోయే దానికి సంబంధం లేదు.
భారతీ రాజా గారి దర్శకత్వం లో వచ్చిన సీతాకోక చిలక సినిమా గుర్తు ఉంది కదా ... ఆ సినిమా లో నాయకుడు మురళి కార్తికేయన్ (తెలుగు లో మురళి అని తమిళ్ లో కార్తిక్ అని అంటారు..) ప్రముఖ తమిళ నటుడు ముత్తురామన్ కొడుకు . ఆ సినిమా మీద ఒక ఆర్టికల్ చేద్దాం అని అనుకున్నప్పుడు ప్రముఖ చాయగ్రహుడు కన్నన్ తో మాట్లాడాను . (కన్నన్ గారు ప్రముఖ దర్శకుడు యోగానంద్ కొడుకు ) అప్పుడు అయన చెప్పిన కథ :

సీతాకోక చిలక సినిమా కోసం హీరో కోసం వెతుకుతూ ఉంటె ఒక రోజు ఇంటి పక్కన గల్లి లో క్రికెట్ ఆడుకుంటున్న అబ్బాయి కనపడ్డాడు.. భారతీ రాజా ఆ అబ్బాయి దగ్గరకి వెళ్లి ఎవరబ్బాయివి , మా సినిమాలో హీరో వేషం వేస్తావా అని అడిగారు అంట .. అప్పుడు ఆ అబ్బాయి తాను ముత్తు రామన్ కొడుకు అని తొందరలో సినిమా మొదలవ్వబోతోంది అని చెప్పారు అంట. భారతీ రాజా పట్టుబట్టి తన సినిమాలో హీరో గా తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సీతాకోక చిలక లో నటింప చేసారు ( తమిళం లో రాధ , తెలుగు లో ముచ్చెర్ల అరుణ హీరోయిన్ లు గా చేసారు ) ..

ఒక్క మగడు , సలీం చిత్రాలు రెండు దారుణంగా ఫ్లాప్ అవ్వడం తో తరవాత సినిమా కోసం ఆలోచిస్తున్న చౌదరికి పవన్ కల్యాణ్ కబురు పంపారు. తన అక్క కొడుకు సాయి ధర్మ తేజ ని హీరో చేసే బాధ్యత ఒప్పగించాడు.. దానికి దాదాపు గా ఎనిమిది కోట్లు చెక్ కూడా ఇచ్చాడు అని సినిమా జనల భోగట్ట.. దానికోసం చౌదరి ఈ మధ్య ఎవరికీ చెప్పకుండా అమెరికా అంతా లొకేషన్ ల కోసం తిరిగాడు కూడా .. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి తన సొంత బ్యానర్ మిద సినిమా తీస్తునట్టు తెలియజేసారు . అంతే హీరో ని ఎలా కనుకున్నారు అంటె ... పవన్ కళ్యాణ్ చూపించాడు అని చెప్పకుండా ... ఆ అబ్బాయి మా ఆఫీసు దగ్గర క్రికెట్ ఆడుతుంటే చూసి హీరో గా వేస్తావా అని అడిగా .. అప్పుడు చెప్పాడు తాను చిరు గారి మనల్లుడు అని... ముప్పై ఏళ్ళ క్రితం మురళి కి జరిగిన కథ ఇప్పుడు మళ్ళి కొత్తగా జరిగినట్టు గా చెప్పారు...

మనవాళ్ళు సినిమాలో సన్నివేశాలే కాదు జీవితం లో సన్నివేశాలని కూడా కాపి కొడతారు అని నిరూపించారు ....

2 comments:

Anonymous said...

>>దాదాపు గా ఎనిమిది కోట్లు చెక్ కూడా ఇచ్చాడు<<

మీ కథ కంటే వై.వి.యస్ కథే కొద్దిగా బాగుంది.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

వై.వి.ఎస్ లాంటి రాడ్ సినిమాల దర్శకుడికి మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఇస్తున్న మన నిర్మాతలకు,హీరోలకు జోహార్లు.