అతనొక్కడే , హరే రాం విజయవంతం అయ్యాక కళ్యాణ్ రాం జయీభవ అని ఒక డకోటా సినిమా తీసాడు.. అది గల్ల పెట్టి దగ్గర గల్లంతయ్యింది. దాని తరవాత వరసగా పరాజయాలే సోపానాలుగా ఉన్న మల్లికార్జున్ తో కత్తి అని సినిమా మొదలు పెట్టాడు. మూడు పరాజయాలు కదా ఈ సారి అన్నా ఈ దర్శకుడు ఏదన్నా కొంచం కొత్తగా ప్రయత్నిస్తాడు ఏమో అని చూద్దాం అనుకున్నామో... మన మంగలి కత్తి తో మన గొంతు కోసుకున్నట్టే.
సినిమా పరమ పాత చింతకాయ పచ్చడి (అఫ్ కోర్సు అది ఆరోగ్యానికి మంచిది .. కాని ఈ సినిమా కాదు ). ఈ సినిమా హీరోలకి అందరికి ఒక జాడ్యం ఉంది. అన్న సెంటిమెంట్ , తమ్ముడి సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్ ఉన్న సినిమాలు గల్ల పెట్టెలను బద్దలు చేస్తాయని. ఇప్పటికే తమ్ముడి సెంటిమెంట్ మిద కళ్యాణ్ రాం సినిమా చేసేసాడు ...ఇంకా వరసలో మిగిలింది చెల్లి... తన సీనియర్ లు అయిన వాళ్ళు, తనతో పాటు సినిమాలు చేసే వాళ్ళు అందరు చెల్లి సెంటిమెంట్ మిద ఇప్పటికే చేసేసి ఉండటం వల్ల, తను వెనకపదిపోయాను ఏమో అన్న ఫీల్ తో ఈ సినిమా చేసాడు అనుకుంటా ...
ఈ సెంటిమెంట్ ఒక రాజశేఖర్ కి మాత్రం వర్కౌట్ అయ్యింది. గోరింటాకు సినిమా హిట్ అయింది. కాని మిగిలిన వాళ్ళకి కాలేదు . గోపి చంద్ కి లక్ష్యం తరవాత వచ్చిన శౌర్యం సుమారుగా ఆడింది. అది చెల్లి సెంటిమెంట్ సినిమా., కాని తారక్ కి రాఖి ఫ్లాప్ , పవన్ కి అన్నవరం ఫ్లాప్ , మహేష్ కి అర్జున్ ఫ్లాప్. ఇవి అన్ని చూసి కూడా మనకి వర్క్ అవుట్ అవుతుంది అని అదే పాత పద్దతిలో తియ్యడం ఒక పెద్ద బ్లండర్.
కథ లో మనకి కావాల్సిన కామెడి మనం ఏరుకోవచ్చు. వేణుమాధవ్, బ్రాహ్మి లాంటి వాళ్ళు ఉన్నా కాని కామెడికి కరువు సినిమాలో. కళ్యాణ్ మొహం లో నటన శూన్యం. చూడటానికి మాన్లీ గా ఉన్నాడు. డాన్సులు బాగా కష్టపడ్డాడు. నటన మాత్రం దరికి చేరనివ్వలేదు. సనాఖాన్ కొన్ని వైపుల నుంచి చూడటానికి బాగుంది. నటన లో కళ్యాణ్ రామ్ కి పోటి (మొహం లో ఒక భావం కనపడితే ఒట్టు). సినిమాలో ఇంకో ముఖ్య పాత్ర కిక్ శ్యాం ది. హీరో హీరోయిన్ లు ఇద్దరు దొందు దొందే లాగ నటించనప్పుడుఐ నేను మాత్రం తక్కువ తిన్నానా అని అయన సినిమా మొత్తం ఒకే మొహం తో లాగించేసాడు. ఆహుతి ప్రసాద్ అండ్ కో , చంద్ర మోహన్ అండ్ కో సినిమాలో ముప్పాతిక బాగం కనపడరు.
మణిశర్మ ఇంక సినిమాలు మానెయ్యడం మంచిది. సింహ పాట కి కాపి కొట్టేసారు. (సింహ మంచి చిన్నోడే వేట కొచ్చాడే .... దొర దొర దొర దండాలు ).ఇంకో పాట క్కోక్కో రకో పాట హ్యాపీ హ్యాపీ గా లో పుట్టుకు జరా జరా డుబ్బుకు మే పాటకు మక్కి మక్కి. (హ్యాపీ హ్యాపీ గా కి కూడా ఆయనే సంగీతం ). మిగిలిన పాటలు కూడా పాత పాట లే తిప్పి తిప్పి దేవిశ్రీ లాగా వాడారు. నేపధ్య సంగీతం ఒక దారుణమైన శిక్ష . సినిమాలో బాగుంది కమెరా పనితనం. నిర్మాణ విలువలు బాగున్నై. ఈ కత్తి కి దూరం గా ఉండటం చాల మంచింది ..
1 comment:
atanokkade movie is hit
Post a Comment