కొన్ని నెలల క్రితం మెహర్ రమేష్ అనే ఒక గొప్ప దర్శకుడు , వెంకటేష్ అనే హీరో ని డిఫరెంట్ గా చూపిస్తా , ఈ సినిమా డిఫరెంట్ గా చేశా అని కాకమ్మ కథలు చెప్పి షాడో అని మహత్తర చిత్ర రాజాన్ని తీసి అటు నిర్మాతని , హీరో ని పనిలో పని గా ప్రేక్షకులని హింసించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. మనవాళ్ళు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోకుండానే , వీరబద్రం అనే దర్శకుడు నాగార్జున ని అదే కథ ని కొంచం అటు ఇటు గా చెప్పి నిర్మాతగా కూడా ఒప్పించి సినిమా తీసి పారేసాడు (నిజ్జంగా పారేసాడు ) .
సినిమా విడుదల కి ముందర వీరబద్రం , నాగార్జున ఇచ్చిన బిల్డుప్ కి ఈ సినిమా తోపు అని వెళ్ళామో , హాల్ లో నుంచి తోసు కుంటూ రావాల్సిందే . హీరో పేరు భాయ్ , చేసేది ఒక మాఫియా డాన్ వద్ద కిల్లర్ పని. కానీ ఆరుగంటల వరకే ఆ పని ఆ తరవాత ప్లే బాయ్ అని ఒక డైలాగ్ ఉంటుంది అది మొదటి సీన్ వరకే (సాంగ్ కోసం) , ఆ తరవాత ఆ సంగతి మర్చిపోతారు. నాగన్న ఓపెనింగ్ పంచ్ డైలాగ్ , ఆ తరవాత ఒక నెత్తిమీద టోపీ కిందపడకుండా జులపాల విగ్ కదలకుండా వొళ్ళు అలవకుండా ఒక భీకరమైన (చూసేవాళ్ల కి అని తీసేవాళ్ల అభిప్రాయం లెండి ) ఫైట్ అయ్యాక సాంగ్ అయ్యాక హైదరాబాద్ లో ఉన్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ని లేపే పని ఒప్పుకుని హైదరాబాద్ కి విగ్ తీసేసి వస్తాడు .
హైదరాబాద్ లో అండర్ కవర్ కాప్ ని పట్టుకునే పని మర్చిపోయి సరదాగా ఇంటర్వెల్ వరకు గడిపి ఇంటర్వెల్ లో ఆ పోలీస్ తన తమ్ముడు అని తెలుసుకుని షాక్ తింటాడు . (షాడో లో కూడా డిట్టో డిట్టో ) . తరవాత హీరో వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తి ఇంట్లో కి చేరి హీరో తమ్ముడిని రక్షించుకోడానికి ప్రయత్నిస్తాడు , కాని తమ్ముడికి తెలిసిపోతుంది అన్న భాయి అని . తమ్ముడు హీరో వెనకాల పడతాడు , ఈ లోపల నిజం డాన్ కి సంగతి తెలిసి వాళ్ళ వెనకాల పడతారు, ఇంకా క్లైమాక్స్ ఫైట్ గట్రా గట్రా ...
నాగార్జున ఒకటో రెండో సీన్స్ లో కాస్త నటించడానికి ట్రై చేసాడు . మిగిలిన సీన్స్ లో నల్ల కళ్ళజోడు తో లాగించేసాడు. బాబు కి ఈ మధ్యే మోకాళ్ళకి శాస్త్ర చికిత్స జరిగింది దాంతో ఇంకా ఎక్కువ శ్రమ పడకుండా ఫైట్ లు డాన్సులు కానిన్చేసారు . గురుడు ఫైటింగ్ కి వెళ్ళే ముందర ఒక డ్రెస్ , ఫైట్ లో ఒక డ్రెస్ , ఫైట్ అయ్యాక వచ్చే సీన్ లో ఇంకో డ్రెస్ తో సంబంధం లేకుండా దృశ్యాలు వచ్చి పోతూ ఉంటాయి.
ఇంకా నటుల సంగతి సరే సరి . హేమ కి డైలాగ్స్ కూడా లేవు, ఇంకా మిగిలిన వాళ్ల సంగతి సరే సరి . సినిమా అంతా హేమా హేమీలు ఉన్నారు .. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నటించాలి , సినిమా కి ప్లస్ అవుతుంది అన్నవాళ్లు లెరు. అందరు ఒకటే చెక్క మొహం వేసి నటన అంటే తెలీని వాళ్ళలాగా కనిపించారు .హీరోయిన్ సంగతి మర్చిపోయా ... ఎందుకంటే హీరోయిన్ కి చెయ్యడానికి ఎం లేదు . అమ్మాయి మొహం లో ఎటువంటి భావం పలకదు (సినిమా లో తండ్రి పాత్ర ద్వారా ఆ విషయం కూడా చెప్పించారు ). మన అదృష్టం బాగుంది అమ్మాయి సినిమాలో నుంచి ఇంకా తాత్కాలికం గా విరమించా అని మొన్నే ట్వీట్ చేసింది భారి తారాగణం భారి డబ్బింగ్ , భారి తలనొప్పి వెరసి భాయి.
సినిమా మొత్తం పంచ్ డైలాగు ల తో లాగించారు . సినిమా లో మాత్రం పంచ్ లేకుండా చేసారు .
నిజానికి ఈ సినిమా పోకిరి రాజా అన్న మలయాళం సినిమా కి ఫ్రీ మేక్ ... ఆ సినిమాలో మమూట్టి , పృథ్వీ రాజ్ లు ఇద్దరికీ మంచి పాత్రలు ఉండటం వల్ల సినిమా వర్క్ అవుట్ అయింది . ఇక్కడ తమ్ముడి పాత్ర ని స్నేహ భర్త ప్రసన్న తో చేయించారు . అలా అని ఆ పాత్ర కి మంచి గా మలచారా అంటే అలాంటిది ఎం లేదు, ఆట లో అరటి పండు పాత్ర .
సినిమా విడుదల కి ముందర నాగన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో అత్తారింటికి సినిమాకి దేవిశ్రీ సంగీతం ఇచ్చాడు, హంస నందిని గెంతింది ... మా సినిమా కి కూడా సేం టు షేమ్ అన్నాడు . నిజం గానే షేమ్ .. ఇలాంటి సోది లెక్కలు వేసుకుని సినిమా తీస్తే సినిమా సోది లో లేకుండా పోతుంది అని థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ కి తెలీకపోవడం ఏంటో అర్ధం కాదు.
4 comments:
baaga chepparu.... ninnaney tappaka movie chusi...talanoppocchondhiiiii
@ "ఇలాంటి సోది లెక్కలు వేసుకుని సినిమా తీస్తే సినిమా సోది లో లేకుండా పోతుంది అని థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ కి తెలీకపోవడం ఏంటో అర్ధం కాదు..." - ముసలితనంవల్ల వచ్చిన చాదస్తంతో కూడిన అవివేకం.
నాగన్న, వెంకన్న ఇద్దరూ గౌరవప్రదంగా పెద్దపాత్రలలోకి వెళ్ళటమో, పదవీవిరమణ చేయటమో బెటర్.
Will follow your reviews from now on!!
బాగుంది మీ సమీక్ష
Post a Comment