Tuesday, October 5, 2010

నేను .. బ్లాగు ....

దాదాపు మూడేళ్ళ క్రితం బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు ముఖ్యం గా మా సైట్ లో ఉన్న పాత ఆర్టికల్స్ వెతకడం కష్టం అవుతోంది కాబట్టి ఇక్కడ అన్ని పెడదాం అని మొదలు పెట్టాను. నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ... తరవాత ఏవో కొన్ని ఆర్టికల్స్ పెట్టాను.. మళ్ళా కొన్ని రోజులు ఎం పెట్టలేదు... తరవాత ఒక సారి డెట్రాయిట్ వెళ్ళినప్పుడు చాలా మంది బ్లాగర్లు కలిసారు... అప్పటికి నేను బ్లాగ్ రాస్తున్నా అని కూడా చెప్పలేదు. కాని నేను మా తెలుగుసినిమా సైట్ ద్వారా చాలా మందికి తెలిసి ఉండటం వల్ల వాళ్ళ మీటింగ్ లో కుర్చోవలిసి వచ్చింది. నాకు తెలుగు లో రాయడం ఒక యజ్ఞం అప్పటికి (కంప్యూటర్ లో సుమా ) అందువల్ల అప్పటికి తెలుగు లో రాయాలని కూడా ఆలోచించలేదు ... ఆ మీటింగ్ లో గూగుల్ తెలుగు ఉందని తెలిసి సరే ఇంకా బ్లాగ్ తెలుగు లో రాయాలి అని నిశ్చయించుకున్నాను. మొదట్లో అసలు బ్లాగ్ కి పేరు కూడా పెట్టలేదు .. తరవాత నేను సినిమాలు .. పుస్తకాలూ ఇంకా అన్ని అని పెట్టాను... కొన్ని రోజులకి బోర్ కొట్టింది ... ఇదేదో సొంత సోది అని అనుకుంటారు అని అనిపించింది .. అప్పుడే ఉగాది వచ్చింది .. సరే తెలుగు వాళ్ళకి ఏంటో ఇష్టమైన పండగ కదా మన జీవితాలకి సరిపోతుంది కదా ఇది పెడితే ఎలా ఉంటుంది అని ... ఆ పేరు పెట్టాను... తీరా చూస్తె ఉగాది తెలుగు వల్లే కాదు ... ఉత్తరభారతం లో కూడా చేసుకుంటారు అక్కడ కూడా ఇలాంటిదే ఏదో పచ్చడి చేస్తారు అని తెలిసింది ... దేవుడా అనుకున్నా ... పేరు మార్చాక రెగ్యులర్ గా కామెంట్ చేస్తే వాళ్ళు చాలా మంది తెలీక రావడం మానేసారు ... దాంతో ఇప్పుడు మళ్ళి పేరు మార్చాలి అంటే అలోచినలో పడ్డాను...
కామెంట్స్ వాటి ప్రభావం : చాలా వరకు ప్రోత్సాహకరంగానే ఉంటాయి... కాని నేను అప్పుడప్పుడు సినిమా రివ్యూ లో నేగితివే గా రాస్తే .. కొంతమంది బూతులు పంపుతారు... నాకు భాద కాదు కాని నవ్వు వస్తుంది ... ఆ రాసేది కూడా పేరు లేకుండా అనామకులు గా పంపుతారు.. అంత ధైర్యం లేకుండా అనామకం గా పంపడానికి పాపం ఎంత కష్టపడతారో కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు .. కొంతమంది ఏమో మీరు .. మీ నేపధ్యం వివరాలు పంపండి అని మెయిల్ పంపుతారు ... ఇది కొంచం ఇబ్బంది పెట్టె విషయం.. అవతల వ్యక్తీ గురించి తెలీకుండా .. తెలిసినా కాని మన వివరాలు , అభిరుచులు మొత్తం ఎలా చెపుతాం .. మీతో స్నేహం చెయ్యాలని ఉంది అని మెయిల్ పంపుతారు .. అది కూడా కొంచం ఇబ్బందే ... స్నేహం అనేది మనం చేస్తే రాదు ఏమో అని నా అభిప్రాయం అది కాలం తో పెరిగేది
ప్రస్తుతానికి మళ్ళా పేరు మార్చే ఆలోచన కి కొంచం విరామం ఇద్దాం అని అనుకుంటున్నా ...

3 comments:

shyamkr said...

ప్రతీ మనిషి కి కొత్త వ్యక్తి తో మాట్లాడడానికి కొంత మొహమాటం ఉంటుంది. దానికి రక రకాల కారణాలు ఉంటాయి. స్వతఃసిధ్ధంగా ఉండే బిడియం, పుట్టి పెరిగిన వాతావరణం, మనో నిబ్బరం,చదువు,వ్యక్తిత్వం ఎట్సట్ర ఎట్సట్ర. అందరికీ 'శరత్-కాలం' గారికి ఉన్నంత ధైర్యం ఉండదు కదా? అలాగని తన అభిప్రాయాన్ని చెప్పకుండా మనసులొ దాచుకోలెరు. అందుకే అనొనమస్ యూజర్ గా మీకు టపాలు పంపుతారు. మంచి విషయాన్ని చేరవేయడానికి అనొనమస్ గా ఉన్నా పెద్ద తప్పు లేదు అన్నది నా అభిప్రాయం.

మనం రైళ్ళలొ, పబ్లిక్ టొయిలెట్ లొ కొన్ని కొన్ని మళయాళ పత్రికలు సిగ్గుపడే అద్భుతమైన రాతలు, భారతీయ శిల్ప కళా సౌందర్యం అచ్చెర్వొందే బొమ్మలు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు, ఫొన్ నంబర్లూ, కొలతలూ, కవితలు ఎట్సట్ర ఎట్సట్ర చుస్తూ ఉంటాం

కొంత మంది తిట్టడానికి అనొనమస్ అవతారం ఎత్తుతారు. వీళ్ళందరూ...ఈ పైన చెప్పిన బాపతు. అదో శునకానందం.

అంచేత, పేరు చెప్పి వ్యాఖ్య రాసినంత మాత్రాన అది గొప్పా కాదు .. అనొనమస్ గా ఉండడం తప్పూ కాదు.....కాదా?

శ్రీ said...

శ్యాం గారు ...
అనామకం గా మెయిల్ పంపడం పై మీ అభిప్రాయం బాగానే ఉంది ... కాని మనం ఎదగాలి అంటే కొన్ని విషయాలలో మారాలి.. శరత్ కాలం గారికి ఉన్న ధైర్యం ఉండదు అని మీరు చెపుతున్నది నిజమే కావొచ్చు కాని అది చూసి కూడా స్పూర్తి పొందలేకపోవడం దురదృష్టం.. వారు ధైర్యం గా రాసేదాంట్లో కామెంట్ పెట్టె ధైర్యం లేకపోవడం అన్నది నిజంగా .........
భవదీయుడు
శ్రీ

కొత్త పాళీ said...

బ్లాగుకి ఈ పేరు బాగుంది. ఇలా ప్రొసీడైపోండి.