Friday, October 29, 2010

శిశిరం .


చిన్నప్పుడు మా ఊర్లో వీధి లో రెండు రావి చెట్లు ఉండేవి ... దాని ఆకులు అప్పడప్పుడు రంగు మారుతూ సంక్రాంతి సమయానికి చెట్లు మొత్తం బోడిగా ఉండేవి ఎండాకాలం లో ఆ చెట్ల కింద పులి మేక ఆటో , పెకాటో ఆడేవాళ్ళు.. వేసవి లో చెట్టు ని పచ్చగా చూసి, సంక్రాంతి పండగ కి ఊరికి వచ్చి అలా చూడాలి అంటే బోలెడు బెంగ వేసేది. మళ్ళా ఎప్పుడు ఆకులతో చూస్తామో అని అనిపించేది. అదే కాదు ఇంటి ముందర ఉన్న వేప చెట్టు కూడా బోలెడు ఆకులని రాల్చేది కాని మొత్తం బోడిగా ఉండేది కాదు. (మా పనివాడు ఆ ఆకులని ఎత్తి పోయ్యలేక గొణిగేవాడు ) కాని మొక్కలు / చెట్లు మొత్తం రంగు మారడం కాని మొత్తం చెట్లు అన్ని బోడిగా అవ్వడం అన్నది నేను పెరిగిన చోట ఎక్కడా చూడలేదు. అలాంటిది అమెరికా వచ్చిన కొత్తలో ఫాల్ డ్రైవ్ కి వెళ్దాం అని అడిగితె అర్ధం కాలేదు.
అక్టోబర్ మాసం మొదలు అవ్వగానే చెట్లు మెల్లి మెల్లి గా ఆకుల రంగు మారుతూ అక్టోబర్ మాసం ముగిసే సరికి దాదాపుగా మోడుగా మారిపోతాయి. చలి ఎక్కువగా ఉంటె ఇంకా తొందరగా కూడా అవ్వొచ్చు లెండి. రోజూ బస్ లో వచ్చే అప్పుడు పుస్తకం చదవుకోవడమో , పాటలు వినడమో అలవాటు అలాంటిది ఈ శిశిరం లో కాని వసంత మాసం లో కాని బైటకి చూస్తూ ప్రకృతిని చూడటం ఎంత బాగుంటుందో .. గత ఏడాది శిశిరం లో భారి వర్షం పడి ఆకులు అన్ని ఒక్కసారి ఆ గాలి కి రాలి పోయి ఒక్కసారిగా మోడు పడిపోయాయి. అయ్యో ఈ ఏడాది ఒక్క ఫోటో కూడా తియ్యలేదు అని ఎంత భాద పడిపోయానో. ఫాల్ డ్రైవ్ కి రెండు వారాల క్రితం వెళ్దాం అనుకున్నాం. కాని మా సుబ్బి శెట్టి గారు కుదరన్నివ్వలేదు (పెట్రోల్ బిల్ అవుతుంది అని మనసులో అనుకున్నాడు) పొద్దునే బాల్కనీ లో నుంచి చుస్తే రంగు రంగుల చెట్లు ఊరినిండా దూరం నుంచి చూడటానికి ఒక పూల గుత్తి లాగా కనపడుతుంది.
రోజు చూసే చెట్టే కాని ఒక రోజు పొద్దున్న లేచే అప్పటికి కొత్తగా రంగు రంగులుగా కనపడుతుంది కొన్ని చెట్లు ఎర్రగా కొన్ని లేత గులాబీ రంగులో కొన్ని పసుపు పచ్చగా ... లేక పొతే ఒక చెట్టే సగం ఆకులు ఒక రంగులో.. మిగిలిన సగం ఇంకో రంగులో ఉంది చూడటానికి కంటికింపుగా కనపడతాయి... కొన్నిసార్లు అవి ఆకులా లేక గులాబి రేకులా అన్న సందేహం రాకపోదు అంట బాగుంటాయి ఆకుల రంగులు.
శిశిరం ఆఖర్లో వచ్చే హల్లోవిన్ పండగ కోసం ఇంటి ముందర పెద్ద పెద్ద గుమ్మడి కాయలతో , దానికి తోడూ దారి పొడుగునా గుమ్మం దాక రాలిన ఆకులు చూస్తూ ఉంటె ఎంత బాగుంటుందో ... ఆ చెట్లు ఈ చలి కాలం అంతా ఇలా బోడిగా ఉండాలి కాబోలు అని తలచుకుంటే బోలెడు బాధ .. ఇంకో నలుగు నెల్లల్లో వసంతం వస్తుంది అని మనలని మనం ఓడర్చుకోవడం తప్ప ఎం చెయ్యగలం ...

3 comments:

తృష్ణ said...

nice photos..good post.

అక్షర మోహనం said...

Photos are very nice. your narration is so good.

budugu said...

అయ్య బాబోయ్...ఎంత భావుకత్వం.
నన్నడిగితే అమెరికాలో శిశిరమంత డిప్రెస్సివ్ దృశ్యమింకోటి లేదు. ఏప్రిల్ వచ్చేదాక నిజంగానే దిగులుగా ఉంటుంది.