ఏదన్నా పెద్ద నటుల చిత్రం విడుదల అవుతోంది అంటే ఒక రకమైన భయం మొదటి వారం లో చూడాటానికి. అసలే ఒక పక్క ఆర్ధిక మాంద్యం దానికి తోడూ టికెట్ పదిహేను డాలర్లు ( అదే ఆ చిత్రానికి నాలుగు రేటింగ్ ఉంటె ఇరవై డాలర్లు కూడా ఉండొచ్చు మన కర్మ కాలితే ) అంటే ఒక కుటుంబం చిత్రం మొదటి వారం లో చూడాలి అంటే కనీసం వంద డాలర్లు కర్చు పెట్టాలి , అది దాదాపు గా ఒక వారం గ్రాసం (ఒక మద్య తరగతి కుటుంబానికి నెలకి రెండువండలు నుండి మూడు వందల వరకు ఇంల్తో వండుకుంటే అయ్యే గ్రాసం కర్చు) ఈ లెఖ్ఖన నెలలో రెండు పెద్ద సినిమాలు వస్తే నెలకి సరిపడే గ్రాసం సినిమాలకే సరి పోతుంది .
ఇంతా కర్చు పెట్టి సినిమాకి వెళ్తే అక్కడ మనకి ఉండేది దారుణమైన ధియేటర్ . సరిఅయిన కనీస వసతులు కూడా లేని ధియేటర్ లో కుర్చుని సరి అయన సౌండ్ సిస్టం లేని ధియేటర్ లు అన్ని. వాటికి అంత ధర పెట్టడం భావ్యమా ? సినిమా బాగుంది కాబట్టి ముక్కు పిండి వసూలు చెయ్యడం ధర్మమా ? మీరు రోజూ లేక అన్ని సినిమాల కి రారు , అందువల్ల మీరు వచ్చే సినిమాకే మేము అన్ని సినిమాల డబ్బులు రాబట్టాలి అనుకోవడం ఎంత ధర్మం ? ప్రతి సినిమాకి వచ్చే సినిమా ప్రేక్షకుడు ఇలాంటి ధరలు చూస్తే గుండె గుభేలు మానదా ?
ఇలా చిత్రానికి చిత్రానికి ధరలు దేనికి పెంచుతున్నారు అంటే , అందరు చెప్పేది ఒకటే అక్కడ ధరలు పెంచారు అందుకని మీ మిద రుద్దుతున్నాము అని.. అక్కడ వీళ్లు పోటి పడి ధరలు పెంచి మన నెత్తిమీద రుద్దడం ఏంటో నాకు ఇప్పటి కి అర్ధం కాని బేతాళ ప్రశ్న.