Sunday, July 26, 2009

కలవరమాయే మదిలో ...


సినిమా రామన్ కొంటా అన్నపుడే అవసరమా అని అడిగా.. చిన్న సినిమా కదా ఫరవాలేదు అని అని అన్నారు.. కమల్ కామరాజు ఏమో కథ చాల బాగుంది అని అన్నాడు ...నాకు నిజానికి సతీష్ మిద గొప్ప నమ్మకం కానీ అంచనాలు కాని ఎక్కువ లేవు. పాటలు విన్నాక బాగున్నై అని పించింది. చిత్ర గారికి ఎన్ని సంవత్సరాలు అయినా ఎందుకు తిరుగులేదో మళ్ళా ఒక సరి అర్ధం అయ్యింది. మూడు పాటలు బాగా నచ్చి నా సెల్ ఫోన్ లో కి ఎక్కించా.

కమల్ కి కాల్ చేసి పాటలు బాగున్నై అని చెప్పాను. సినిమా ప్రమోషన్ విషయం లో చాలా బిజీ గా ఉన్నా అని చెప్పారు కమల్.

సినిమా రిలీజ్ కి ముందరే మన పత్రికల స్నేహితులకి వేసారు. చూసిన వాళ్ళు శంకరాభరణం , సాగరసంగమం , స్వర్ణకమలం లాంటి విశ్వనాధ్ గారి చిత్రాలు అన్ని కలగలిపి సినిమా తీసారు అని చెప్పారు. మనకి ఎవరు చెప్పిన సినిమా చూడకుండా ఉండటం అన్నది లేదు కదా.. మనం తప్పక చూడాల్సిందే కదా.... ఒక రోజు తీరికగా చూడటం మొదలు పెట్టాను.

సినిమా లో కొత్తదనం అన్నది మచ్చుకి కనపడలా. స్వాతి తన తండ్రి సంగతి తెలిసి బయటకి వచ్చి ఏడ్చే సన్నివేశం బాగా చేసింది .. దాని తర్వాత కమల్ తో ఉన్న సన్నివేశం లో ఇద్దరికీ నటించడం రాలేదు. ఒకరకంగా ఓవర్ ఆక్షన్. కమల్ తేలిపోయాడు.

క్లబ్ లో పాటలు పాడటం అంటె వచ్చే అప్పటికి ఆలస్యం అవడం సహజం. కాని తల్లి వాటి మిద ఎక్కడ శ్రద్ద పెట్టినట్టు కనపడదు. మరి అమ్మాయిలు అంత ఆలస్యం గా (అంటె అబ్బాయిలు తిరగొచ్చు అని కాదు ). వస్తే తల్లి ఎక్కడ ప్రశించినట్టు కనపడదు మరి.

స్వాతి జుట్టు ఒకో సన్నివేశం లో ఒకో రకమైన పొడవు.. ఎక్కడా సరిగ్గా ఉన్నట్టు లేదు. ఇంకా సంగీతం నేర్చుకోడానికి పనిపిల్ల లాగా చేరడం ఏంటో జాతీయ బహుమతి గ్రహిత సతీష్ గారికే ఎరుక. పవిత్ర (కమల్ తల్లి పాత్ర ) దండగ పాత్ర. ఢిల్లీ రాజేశ్వరి కి చెయ్యడానికి ఏమి లేదు. కమల్ కి కూడా అంతే అనుకోండి .. ఒకరకంగా చెప్పాలి అంతే కమల్ పాత్ర మగ నాయకి (male heroine) గా చెప్పుకొనవచ్చు. ఒక్కప్పుడు విజయశాంతి సినిమాల్లో వినోద్ కుమార్ లాగా అన్నమాట. భరణి గారి పాత్ర శరత్ బాబు సాగరసంగమం లో పాత్రకి నకలు. చాలా సన్నివేశాలు విశ్వనాథ్ గారి చిత్రాలలో సన్నివేశాలకి నకళ్ళు. ఓపిక ఉంటె పని పాటా లేకపోతె సమయాన్ని గడపటం ఎలాగో తేలిక పొతే చూడండి లేక పొతే నష్టం ఎం లేదు.

సినిమా మాత్రం నిజంగా కలవరమే నిర్మాతకి .. డబ్బులు రావు కదా మరి .. పాపం..

1 comment:

Done with Dreemz said...

Very good review, andi....

Purnesh