Thursday, July 30, 2009

అధిక ప్రవేశ రుసుము ఎంత వరకు సమంజసం ?

ఏదన్నా పెద్ద నటుల చిత్రం విడుదల అవుతోంది అంటే ఒక రకమైన భయం మొదటి వారం లో చూడాటానికి. అసలే ఒక పక్క ఆర్ధిక మాంద్యం దానికి తోడూ టికెట్ పదిహేను డాలర్లు ( అదే ఆ చిత్రానికి నాలుగు రేటింగ్ ఉంటె ఇరవై డాలర్లు కూడా ఉండొచ్చు మన కర్మ కాలితే ) అంటే ఒక కుటుంబం చిత్రం మొదటి వారం లో చూడాలి అంటే కనీసం వంద డాలర్లు కర్చు పెట్టాలి , అది దాదాపు గా ఒక వారం గ్రాసం (ఒక మద్య తరగతి కుటుంబానికి నెలకి రెండువండలు నుండి మూడు వందల వరకు ఇంల్తో వండుకుంటే అయ్యే గ్రాసం కర్చు) ఈ లెఖ్ఖన నెలలో రెండు పెద్ద సినిమాలు వస్తే నెలకి సరిపడే గ్రాసం సినిమాలకే సరి పోతుంది .

ఇంతా కర్చు పెట్టి సినిమాకి వెళ్తే అక్కడ మనకి ఉండేది దారుణమైన ధియేటర్ . సరిఅయిన కనీస వసతులు కూడా లేని ధియేటర్ లో కుర్చుని సరి అయన సౌండ్ సిస్టం లేని ధియేటర్ లు అన్ని. వాటికి అంత ధర పెట్టడం భావ్యమా ? సినిమా బాగుంది కాబట్టి ముక్కు పిండి వసూలు చెయ్యడం ధర్మమా ? మీరు రోజూ లేక అన్ని సినిమాల కి రారు , అందువల్ల మీరు వచ్చే సినిమాకే మేము అన్ని సినిమాల డబ్బులు రాబట్టాలి అనుకోవడం ఎంత ధర్మం ? ప్రతి సినిమాకి వచ్చే సినిమా ప్రేక్షకుడు ఇలాంటి ధరలు చూస్తే గుండె గుభేలు మానదా ?

ఇలా చిత్రానికి చిత్రానికి ధరలు దేనికి పెంచుతున్నారు అంటే , అందరు చెప్పేది ఒకటే అక్కడ ధరలు పెంచారు అందుకని మీ మిద రుద్దుతున్నాము అని.. అక్కడ వీళ్లు పోటి పడి ధరలు పెంచి మన నెత్తిమీద రుద్దడం ఏంటో నాకు ఇప్పటి కి అర్ధం కాని బేతాళ ప్రశ్న.

1 comment:

మురళి said...

పెద్ద బడ్జెట్ సినిమా తీయడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టీ, ఆ సినిమా రన్ మీద నమ్మకం లేదు కాబట్టీ, జనానికి సినిమా మీద ఉన్న క్రేజ్ ని సొమ్ము చేసుకోవచ్చు కాబట్టీ ఇలా రెట్లు పెంచుతున్నారండీ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోడం అన్నమాట.. మీరు కేవల టిక్కెట్ ధర మాత్రమే రాశారు.. మధ్యలో తినుబండారాలు, పానీయాలు.. ఈ ఖర్చు? యెంత ఖర్చు పెట్టినా సినిమా చూసే వాళ్ళు ఉన్నప్పుడు, తీసేవాళ్ళు టిక్కట్ రేటు పెంచుతూనే ఉంటారు..