ఇప్పుడంటే సిబాకా టూత్ పేస్టు కాని మా చిన్నపుడు దాన్నే బినాకా టూత్ పేస్టు అనే వాళ్ళు. పది పైసలకి ఎర్ర పళ్ళ పొడి వచ్చేది ... మా నాయనమ్మ అది చాల ఇష్టం లెండి .. హైదరాబాద్ నుంచి దాన్నే కొనుకుని వెళ్ళేవాళ్ళం ఊరికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇది ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే .. మొన్న ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాం. అక్కడ వాళ్ళ అమ్మాయి చిన్న చిన్న జంతువు బొమ్మలతో ఆడుకుంటోంది ... అవి చూడగానే ఒక్క సారి నాకు బినాకా బొమ్మలు గుర్తుకు వచ్చాయి మరి .
అప్పట్లో బినాకా టూత్ పేస్టు తో పాటు ఒక చిన్న జంతువు బొమ్మ ఆ పేస్టు ఉన్న డబ్బాలో నే పెట్టి వచ్చేది. అది అక్కడే డబ్బా తీసి చూసుకునే వాళ్ళం (కొట్టు దాటినతరువాత అయితే మళ్లా దుకాణం వాడు ఒప్పుకొడు కదా. ) రకరకాల బొమ్మలు ఉండేవి అందువల్ల అవి సేకరించడం ఒక హాబీ గా వుండేది.
అదే బినాకా పళ్ళపొడి డబ్బాతో ఇచ్చేవాడు కాదు అందువల్ల తప్పనిసరిగా పేస్టు యే కొనవలసి వచ్చేది. మా ఇంట్లో మా నాన్నగారే బినాకా పేస్టు వాడె వారు. మిగిలన వాళ్ళు కాల్గేట్ వాడేవాళ్ళం . మాకు నెల వచ్చే పేస్టు ఆయనకి రెండు మూడు నెలలు వచ్చేది. అందువల్ల ఎవరు చూడకుండా అయన పేస్టు కొంచం కొంచం ఎవరు చూడకుండా కాలి చేసే వాడిని. అలా రకరకాల బొమ్మలు సేకరించి ఇంటి హాల్ లో షో కేసు లో పెట్టె వాళ్ళం. దసరా పండగ అప్పుడు వాటిని అక్క వాళ్ళు ఉపయోగించాలి అంటే మనకి లంచం ఇవ్వాలి మరి .
బినాకా అనగానే అందరికి అమీన్ సయ్యని గుర్తు రాక మానడు. బినాకా గీతమాల గుర్తు రాకా మానదు. రేడియో శ్రీలంక నుంచి ప్రతి వారం వచ్చే బినాకా గీతమాల ఎవరు మర్చి పోగలరు. నలభై రెండు ఏళ్ళు ఏకదాటిగా అన్ని తరాల వాళ్ళని అలరించన గొప్పతనం అమీన్ సయ్యనిది. అది వచ్చే సమయానికి అన్న అక్క అందరు గొడవలు మాని రేడియో ని ముందుగ ట్యూన్ చేసి పెట్టేవాళ్ళు. అది హైదరాబాద్ కానీ ఆదిలాబాదు కానీ... ఆ టైం కి టీవీ ఉన్న సరే రేడియో కే అతుక్కు పోయేవాళ్ళు .
బినాకా కంపనీ సిబాకా కంపెనీ గా మారాక కూడా కొన్ని రోజులు దాన్ని అయన కొనసాగించారు. కానీ సిబాకా వాళ్ళు మాత్రం బొమ్మలు మానేసారు. దాంతో ఆ టూత్ పేస్టు మిద మనకి ఉన్న ఆసక్తి కూడా పోయింది. బొమ్మలు మాత్రం మిగిలాయి మా షో కేసు లో మేము పెద్ద అయిన అవి పెద్ద వి కావు కదా మరి..
4 comments:
vaarevvaa..kya baat hai..
annee baagunnaayi.. apputacchulu tappa.
:)
-bu
మాఇంట్లో బినాకా బొమ్మలకి మూడు తరాల అభిమానులు ఉన్నారు.. బ్లాగు కొత్త డిజైన్ బాగుంది.. టైటిల్లో చెప్పిన అన్ని విషయాల గురించీ రెగ్యులర్ గా రాస్తూ ఉండండి..
మీ బ్లాగ్ ఇవాళే చూసానండి.బినాకా గీత్ మాలా గురించి,అమీన్ సయ్యాని గురించి నేను రాద్దం అనుకుని, ఎవరికీ తెలియదులే అని ఉరుకున్ననండి..మీ బ్లాగ్లొ అ పేరు చూసి సంబరమేసింది.సిలోన్ స్టేషన్ పెట్టుకుని క్లారిటి లేకున్నా చెవులు రిక్కించికుని టొప్ సాంగ్స్ అన్ని లిస్ట్ రాసుకునేదాన్ని నేను..ఇంకా ఎక్కడో ఆ డయిరీ ఉంది..
బినాకా బొమ్మలు మా ఇంట్లో కూడా పెట్టె నిండా ఉన్నాయండి..!!
మా అన్న అక్క అయితే అల రేడియో కి అత్తుక్కు పోయి (సిలోన్ స్టేషన్ సరిగ్గా రాదుగా మరి ) వినేవాళ్ళు... వాళ్ళు వెళ్ళాక నేను మెల్లిగా అలవాటు చేసుకున్నా ... ఆ వాయిస్ ఎవరు మరిచిపోగలరు చెప్పండి...
Post a Comment