Wednesday, July 29, 2009

నలుసంత నమ్మకం ...


ఇది దీపశిఖ అన్న కథా సంపుటం లో ఒక కథ పేరు. కథా సంపుటం రాసింది ఇల్లేరమ్మ గా ప్రఖ్యాతి పొందిన సోమరాజు సుశీల గారు. ఇల్లేరమ్మ కథలు ఆంధ్రజ్యోతి వారపత్రికలో వస్తున్నపుడు ఆవిడతో అప్పుడప్పుడు మాట్లాడే వాడిని నామిని గారి పుణ్యమా అని. నామిని గారు ఆంధ్రజ్యోతి వదిలి వెళ్లి పోయాక .. నేను రక రకాల ఊర్లు తిరుగుతూ ఉండటం వల్ల ఆవిడ ఫోన్ నెంబర్ మాములుగానే ఎక్కడో పారేసాను . దాంతో ఆవిడతో టచ్ లో ఉండటం కుదరలేదు.

హఠాత్తుగా ఆవిడ TANA కనపడే సరికి నాకు ఎం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మా పరిచయం గురించి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు . ఒక నమస్కారం పెట్టి ఒక నవ్వు నవ్వి పక్కకి వెళ్లి పోయాను. అదే కాకా ఆవిడ పెద్దావిడ అవడం వల్ల కూడా అనుకుంటా (అంటే కథా చదివి వేరే విధం గా ఊహించుకోడం మన తప్పు అనుకోండి ).

అక్కడ నవీన్ గారు నాకు దీపశిఖ కథా సంపుటం ఇచ్చారు తర్వాత ... కాకతాలియంగా మురళి గారు అదే రోజు ఆ పుస్తకం మీద సమీక్ష రాసారు; చదువుదాం చదువుదాం అని వాయిదా వేస్తూ నా తిరిగుళ్లు తిరుగుతూ గడిపేసా ఇన్ని రోజులు. మొన్న ఒక రోజు ఒంటరిగా వాకింగ్ కి వెళ్తూ పుస్తకం చదవడం మొదలు పెట్టాను. దూరం తెలేకుండా అలా తరిగి పోయింది.

నలుసంత నమ్మకం చదివాక నాకు ఎందుకో తెలిదు కాని మనం చేసే మంచి పనులకి దేవుడు తప్పకుండా పద్దు రాస్తాడు ఏమో అని పించింది. నాకు నిజం చెప్పాలి అంటే ముక్కు మొహం తెలీని స్నేహితులు చాలా మంది ఉన్నారు . కానీ తెలిసిన స్నిహితులకన్న ఆ తెలీని స్నేహితులు కొందరు చాలా మంచి వాళ్ళు గా కనపడ్డారు.. కొంతమంది మాములే మనని వాడుకుని వదిలేసే వాళ్ళు... కాని అది సహజం.. మన చేతి వెళ్ళు ఒకేలాగా ఎలా లేవు మనుషులు కూడా అంతే అని సరి పుచ్చుకోవాలి ఏమో. ఇలాంటి కథలు చదివినప్పుడు ఎందుకో లోకం లో ఇంకా నమ్మకం అన్నది ఉంది ఎప్పటికన్నా మనం ఒకళ్ళని చూస్తె దేవుడు మనని చల్లగా చూస్తాడు అని బలం గా అనిపించింది...

మిగిలిన కథలు బాగా లేవు అని కాదు.. కానీ ఒక పాజిటివ్ attitude ని కలిగించింది ఈ కథ. నాకు నలుసంత నమ్మకాన్ని కలిగించిన కథ .

1 comment:

మురళి said...

ఆవిడ శైలి చాలా ప్రత్యేకమైనదండీ.. ఎలాంటి విషయాన్నైనా చిన్న చిన్న మాటలతో, చమత్కారాలతో చెప్పేస్తారు..