Tuesday, July 28, 2009

ఆర్ట్ ఫెస్టివల్


Ann Arbor లో ఆర్ట్ ఫెస్టివల్ కి ఉమా తో కలిసి వెళ్ళాను. ఉమా మహేశ్వర రావు గారికి ఇదే మొదటి సారి అమెరికా రావడం. Pittsburgh లో ప్రతి సంవత్సరం ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది అందువల్ల నాకు పెద్ద ఇదిగా అనిపించలా ముందర. నేను మేము దిగిన చోట ఉన్న మూడు వీధులు మాత్రం ఉన్నాయ్ అనుకున్నా. మా ఊర్లో అంతే ఉంటుంది మరి. అక్కడే తిరుగుతా ఒక గంట పైగా గడిపేసాం. అప్పుడే మాతో వచ్చిన కొత్తపాళీ గారు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగారు .ఇక్కడే మీరు వదిలిన చోటే ఉన్నాం (గొంగళి పురుగులాగా ) అని చెప్పాను. అయ్యో అది మొత్తం ఆర్ట్ ఎక్సిబిషన్ కాదు .. అది కొత్తగా వచ్చిన extension మాత్రమే మీరు ఇంకా మెయిన్ స్ట్రీట్ కి రాలా అని అన్నారు .. ఇంకా అక్కడ నుంచి మెయిన్ స్ట్రీట్ కి వెళ్ళాం.

అక్కడ ఎటు చూసినా జనసంద్రం 450 దుకాణాలు దాక ఉన్నాయి . ఎంత నడిచినా తరగని దుకాణాలు.. రక రకాల దుకాణాలు ఆర్ట్ అనే కాదు అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. ఒక పక్క మార్స్ లో స్పేస్ రిజర్వు చేసుకో అని.. ఇంకో పక్క అల్లానో జీసస్ ఓ లేక రాముడో మిమ్మల్ని కాపాడుతారు అన్న దుకాణం. దాని పక్కనే marx పక్కనే ఒబామా పరస్పర విరుద్ద భావాల కలబోత. రోడ్ పక్క సంగీతం వాయించే చిన్న కళాకారులూ ... లేజీ గా కుర్చుని దినపత్రిక చదువుకునే పెద్దాయన.. వయోభారం మీద పడ్డా అది మనసుకు సంబందించినది కాదు అనేలా తిరిగే పెద్దవాళ్ళు.

రోడ్ పక్కన ఉన్న ఫుట్ పాత్ ని ఆక్రమించి అమ్మే ఫుడ్. ఇక్కడ కొన్ని ఆర్ట్ వి ఫొటోస్ తియ్యడానికి కొంతమంది ఒప్పుకోరు.. కారణం మరేం కాదు వారి కష్టాన్ని మనం ఇంకో రకం గా వాడుకుంటాం ఏమో అన్న ఉద్దేశం మాత్రమే. ఒకో సరి వాళ్ళు వేసినవి ఫొటోస్ తీసి అలాగే నకలు వేసిన సందర్బాలు ఉన్నాయ్ మరి.. వాళ్ళ జాగర్త వాళ్ళది. అందువల్ల మనం ఫోటో తియ్యాలి అనుకుంటే ముందుగ వాళ్ళని అడగటం, ఎప్పుడూ మంచిది.; మేము వెళ్ళినప్పుడు వాతావరణం కూడా బాగుండటం వల్ల ఎక్కువ శ్రమ అనిపించలేదు.

భిన్నత్వం లో ఏకత్వం అంతే ఒక రకం గా ఇదే అన్న భావన కలించింది ఈ ఆర్ట్ ఫెస్టివల్


ఆర్ట్ ఫెస్టివల్ ఫొటోస్ కి ఇక్కడ క్లిక్ చెయ్యండి

4 comments:

మురళి said...

ఇంతకీ ఏమైనా షాపింగ్ చేశారా, లేదా?

Kottapali said...

welcome to the blog world!
@మురళి .. షాపింగ్ ఎక్కడ, ఆయనకి ఫొటోలు తియ్యడమే సరిపోయింది

buduggaay said...

బాగుంది బాబాయ్ ఫోటో. నేనట్టే ఎక్స్అర్ట్ ని కాను గానీ, ఇంకొంచెం జూమిన్ చేస్తే బాగుంటుందనుకుంటా.. ఏమంటారు?
-బుడుగ్గాయ్

శ్రీ said...

మురళి గారికి : లేదండి ఎం కొనలేదు ... చూడటానికే సమయం సరిపోలా ...
బుడుగు గారికి : ఫోటో మిద క్లిక్ చేస్తే పెద్ద ఫోటో వస్తుంది అండి