Thursday, July 30, 2009

ఐ లవ్ యు మాన్

మార్చ్ లో వచ్చిన I love you man అప్పుడు చూడటం కుదరలేదు. ఇప్పుడు DVD వచ్చింది కదా అని తెచ్చామొన్న. Paul Rudd తో పాటు Jason Segel కలిసి చేసిన హాస్య చిత్రం కింద చెప్పవచ్చు సినిమాని. గత ఏడాది Paul Rudd చేసిన రోల్ మోడల్స్ చిత్రం కన్నా ఇది మంచి చిత్రం.. అంటే కాకుండా ఒక రకంగా Paul Rudd కి లీడ్ హీరో గాసోలో చిత్రం గా చెప్పుకొనవచ్చు . మాములుగా మనం ఎక్కువ chick flicks చూస్తాము. ఇది ఒక రకంగా guys flick గా చెప్పుకొనవచ్చు.

Paul Rudd అడ స్నేహితులు తప్ప చెప్పుకోదగ్గ మగ స్నేహితులు ఎవరు లేరు. పాత గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయిన Paul కిపరిచయం అవుతుంది. పరిచయం, ప్రేమకి అది పెళ్లి కి ఎనిమిది నెలలలో జరిగిపోతుంది. పెళ్లిఅనుకోగానే పెళ్లి రోజున best man ఎవరు అన్న ప్రశ్న హథాత్తుగా వస్తుంది. అప్పుడు తనకి ఎవరు సన్నిహితులు లేరుఅన్న సంగతి స్ఫురిస్తుంది. దాంతో స్నేహితులకోసం వేట మొదలు పెడతాడు. ఆయనకి సహాయం కోసం gay తమ్ముడు, తల్లి సహాయానికి దిగుతారు. అనుకోకుండా ఒక రోజు Jason Segal పరిచయం అవుతాడు. అక్కడి నుంచి ఇద్దరి మద్జ్యజరిగే సన్నివేశాలు కథ ని ముందుకు తీసుకు వెళ్తాయి.

కథ కి బలం ఒక రకం గా Paul rudd అమాయకమైన మొహం. తోడుగా jason segal ఎలాగు ఉన్నారు.

చిత్రానువాదం, దర్శకత్వం వహించిన John Hamburg మరియు Larry లెవిన్ లకి Seinfeld experiance బాగాపనికి వచ్చింది. సీన్ తర్వాత సీన్ చకా చకా కదిలి పోతాయి. pop corn movie..
Rashida jones

No comments: