.
గోపీచంద్ సినిమా అంటే మూస సినిమా ... కొన్ని హాస్య సన్నివేశాలు .. బోలెడు రక్తపాతాలు ... కలిపి చిటికెడు సెంటిమెంట్ ... రంగరించి మన మీదకి వదిలెయ్యడమే. ... తమిళ్ / తెలుగు లో విశాల్ రెడ్డి కొంచం అటు ఇటు గా చేసే చిత్రాలు కూడా కొంచం అటు ఇటు గా ఇదే ... శంఖం సినిమా వీటికి అతీతం గా ఎం లేదు. కాకా పొతే కొన్ని సన్నివేశాలు (ముఖ్యం గా పాటలు) విదేశాలలో తీయడం ఈసారి ప్రేత్యేకత అంతే.
సినిమా మొదటి సగం అంట విదేశాలలో చందు (గోపీచంద్ ) మహలక్ష్మి (త్రిష) ప్రేమ కోసం తిరగడం సరిపోతుంది. విశ్రాంతి ముందర మహలక్ష్మి మేనత్త వచ్చి మహలక్ష్మి ని కడప తీసుకు పోవడం తో చందు కూడా మహలక్ష్మి కోసం కడప వస్తాడు. సినిమాలో కడప అంతే తెలుసు కదా బాంబులు నరుక్కోదాలు తప్ప ఎం ఉండవు .. ఇంకా ఇక్కడ నుంచి సినిమా మూడు రీళ్ళు అరవై నరుక్కోదాలు తో సా... గిపోతుంది ..
సంగీత దర్శకుడిగా తమన్ కి ఈ సారి పని తక్కువ సౌండ్ ఎక్కువ ... పరమ చెత్త సంగీతం ఈ మధ్య కాలం లో (ఇయన అన్నిటికి ఒకే రకమైన సంగీతముని అందించెదను అని కంకణం కట్టుకున్నట్టు గా ఉంది - కిక్ , ఆంజనేయులు .. ఇప్పుడు ఇది ) ... సినిమా కి కొంచం ప్రేరణ పందెం కోడి, క్షత్రియ పుత్రుడు. త్రిష సన్నివేశాలు కొన్ని రాజమౌళి సై సినిమా కి నకలు.... మొదట్లో బుర్ర తక్కువ నాయక రెండో సగం లో బోలెడు తెలివి మిరిపోతుంది ... కొన్ని లాజిక్ కి అందని సంభాషణలు షరా మామూలు (నాయకకి వయసు పద్దెనిమిది కానీ విదేశాలలో graduation అయి పోయి ఉంటుంది.. నాలుగు సంవత్సరాలుగా పెళ్ళి వాయిదా వేస్తూ ఉంటుంది ... అంటే పద్నాలుగు వయసు నుంచి పెళ్ళికి తొందర పెడతారా ఈ కాలం లో ? నాయకుడు కూడా అమ్మాయికి పద్దెనిమిది అయితే చాలు అని చూస్తా ఉంటాడా ??
ప్రయోగాలు చెయ్యడానికి గోపీకి ఉన్న ఇబ్బందులు గోపి కి ఉండవచ్చు (ఆయనకి పోకూరి బాబు రావు గారు తప్ప గాడ్ ఫాదర్ లేరు ఇండస్ట్రీ లో , బైట జనాలతో కూడా ఎక్కువ కలవడు. ) సినిమా అన్నది రిస్కీ వ్యాపారం కాబట్టి సేఫ్ గా ఉండటం మంచిదే.. కాదని అనలేం.. కానీ సినిమా చూస్తునంత సేపు ఇతర సినిమాలు చూసిన బావన వస్తే ఇదే చూడటం దేనికి ? మేకప్ కూడా బాగాలేదు.. మరి తెల్ల రంగు వేసినట్టు ఉంది మొహం.. కొంచం జాగర్త పడితే మంచిది...
దర్శకుడి గా శివ కి ఇది రెండో సినిమా. దీని మీద మొదటి చిత్రం కొంచం బెటర్ ఏమో అని అనిపించింది నాకు...
శంఖం : తారాగణం : గోపీచంద్, త్రిష , బ్రహ్మానందం , ఆలి , సత్యరాజ్ గట్రా .. దర్శకత్వం శివ , సంగీతం : తమన్
ద్రోహి
గౌతమ్ మీనన్ సినిమా అంటే హరీష్ జయరాజ్ సంగీతం , మంచి కెమెరా వర్క్ తప్పని సరి .. ఈ సినిమా కూడా అంతే.. (హరీష్ .. గౌతమ్ ఇప్పుడు విడి పోయారు లెండి ). గౌతమ్ ఈ సినిమా జ్యోతిక పెళ్ళికి ముందర తీసాడు, ఇప్పుడు జ్యోతికకి పిల్లలు కూడా లెండి( మనవాళ్ళు ఎవరు కొనక ఈ సినిమా ఇప్పటిదాకా విడుదల కాలేదు ).
సరే కథ ఏంటి అంటే శరత్ కుమార్ ఒక మెడికల్ reprasentative కొడుకు కి జబ్బు, దానికోసం డబ్బు కూడ పెడుతుంటూ ఉంటాడు. రోజు వెళ్ళే రైల్ లో జ్యోతిక పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాఫీ కి అక్కడ నుంచి హోటల్ రూం దాక చేరుతుంది. హోటల్ రూం లో ఇద్దరు కలిసి ఉండగా రూం లో కి హటాత్తుగా మిలంద్ సోమన్ ప్రవేశించి శరత్ ని చితకబాది జ్యోతిక ని రేప్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత నుంచి శరత్ కి బ్లాక్ మెయిల్ మొదలు, కొడుకు కోసం దాచిన డబ్బు ఆంతా వాడికి ఇవ్వడానికే సరిపోతుంది , భార్యకి కి కూడా ఈ విషయం చెపుతాడు. ఆ అమ్మాయి వదిలేసి వెళ్లి పోతుంది
జ్యోతిక కోసం వెతికిన శరత్ కి జ్యోతిక మిలంద్ ఇద్దరు కలిసి ఆడిన నాటకం తెలుసుతుంది. శరత్ ఎం చేసాడు అన్నది మిగిలన కథ ...
జ్యోతిక బాగానే చేసింది... కానీ సినిమా చాల వరకు (క్లైమాక్స్ తప్ప ) derailed అన్న సినిమా కి మక్కికి మక్కి.
ముందుగా మాధవన్ ని అనుకున్నారు ఈ సినిమాకి.. అయన పక్కకి తప్పుకున్నాక శరత్ కుమార్ చేసారు. అలాగే శరత్ భార్య పాత్ర కి సిమ్రాన్, శోభన , టాబు లు చేయను అనేసారు.. జ్యోతిక కి పాత్ర ఎక్కువ అని తెలిసి. చివరకి ఆండ్రియా అన్న అమ్మాయి చేసింది...
దర్శకుడు మాములుగానే ఒక చిన్న సన్నివేశం లో కనపడ్డాడు ఒక పాట లో ..
ద్రోహి : దర్శకత్వం :గౌతమ్ మీనన్, తారాగణం : శరత్ కుమార్ , జ్యోతిక, ఆండ్రియా , మిలంద్ సోమన్ సంగీతం : హారిస్ జయరాజ్
2 comments:
శంఖం సిన్మా చూసాక నాకనిపించిందేమిటంటే గతి లేక చూసానని... :(. ఇలాంటివి మనకు కోకొల్లలు. అయినా వస్తున్నాయంటే, దర్శకులు మన తెలుగు ప్రేక్షకుల స్థాయి ఇంతేనని నిర్ణయించి చెంప ఛెళ్ళుమనిపిస్తున్నారు.
రెండింటిలోనూ 'ద్రోహి' కొంచం బాగుందేమో అని అనుమానం కలుగుతోందండి, మీ టపా చదివాక :-)
Post a Comment