Saturday, September 12, 2009

ఈ వారం నేను చూసిన సినిమాలు

ఈ వారం బోలెడు సినిమాలు చూసాను.. అన్ని సినిమాలు విడి విడిగా రాయడం దేనికి అని అన్ని కలిపి చిన్న చిన్న గా రాద్దాం అని మొదలు పెట్టాను....

బాగున్న సినిమాలు ముందర...
సికిందర్ : ఇది హిందీ సినిమా ... కాశ్మీర్ నేపద్యం లో నడుస్తుంది. ఒక స్కూల్ కి వెళ్ళే అబ్బాయి కి అనుకోకుండా ఒక పిస్టల్ దొరుకుతుంది. అప్పటి నుంచి తన జీవితం ఎలా మలుపులు తిరిగింది .. తనకి తెలేకుండానే ఎలా సాలె గూటిలో చిక్కుకున్నాడో తెలియ చెప్పే చిత్రం ఇది.
బాగున్నా అంశాలు : సంజయ్ సూరి, మాధవన్ ల నటన. సంజయ్ సూరి కూతురు గా వేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. కెమెరా చాల చాల బాగుంది...
బాగోలేని అంశాలు : రెండో సగం లో సినిమా రెగ్యులర్ సినిమా పంథా ని అనుసరించడం. మొదటి సగం చాల బాగా తీసారు.

బాబార్
ఇది కూడా హిందీ సినిమానే .
శోహం షా అని కొత్త నాయకుడు పరిచయం అయ్యాడు ఈ చిత్రం తో. కొంచం మన రాంగోపాల్ వర్మ చిత్రం సత్య పోలికలు ఉన్నాయి. ఒక చిన్న అబ్బాయి పరిసరాల ప్రభావం వల్ల ఎలా ఒక కిల్లర్ గా మారాడు అన్నది. పోలీసు వ్యవస్థ లో అవినీతి , నిజాయితీ గల ఒక పోలీసు ఆఫీసర్ ఇలా అన్ని కొనాలని చూపించే సినిమా. ప్రతి దృశ్యం లో ఒక తూటా పేలుతూనే ఉంటుంది.
బాగున్నా అంశాలు : సోహం షా , ఓం పూరి , మిథున్ నటన , సంగీతం
బాగోలేని అంశాలు : ఒకళ్ళని ఒకళ్ళు కాల్చు కోవడం తప్ప ఎక్కువ గా ఎం లేక పోవడం. ఇలాంటి సినిమాలు చాల చూసిన ఫీలింగ్.

బాగోలేని సినిమాలు :
జోష్
నాగ చైతన్య సినిమా అంటే నాగార్జున కొడుకు కదా అని కుతూహలం తో చూసారో చచ్చారే ... బాబు కి నటన లో ఓ అంటే డ రాదు. అబ్బాయి చేసిన దాంట్లో ఒక్కటే సీన్ బాగుంది . ఒక చోట ఉపన్యాసం ఇస్తాడు. అది ఒక్కటే బాగుంది. మిగిలిన అన్ని సన్నివేశాల్లో బాబు చాల వీక్. నాయక విషయం చెప్పక్కర లేదు ..నాయకుడికన్నా బాగుంటే సమస్య అనుకున్నారేమో ఆవిడా ఇయనకి సరి జోడి. దొందు దొందే . కథ మొదటి సగం ఎక్కడికి కదలదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు గా ఉంటుంది. రెండో సగం కొంచం శివ కొంచం స్టూడెంట్ నెంబర్ వన్ . దిల్ రాజు గారు ఎం చెప్పాలి అనుకుంటున్నారో ఆయనకి క్లారిటీ ఉందా అన్నది తెలిదు. యువతని ఆకర్షించడం కోసం స్టూడెంట్ అన్నవాడు ఎవెరి మాట వినడు లాంటి తొక్కలో సంభాషణలు చొప్పించారు. నాయకుదికన్న పక్కన ఉన్న నటులు బాగున్నారు / బాగా చేసారు . సో సో సంగీతం. అన్ని సో సో నే. .. బ్రహ్మానందం దండగ ... చక్రి కూడా దండగే. .
నాకు నచ్చిన ఒక సంభాషణ ఈ చిత్రం లో :
నాయకుడు : రోజు ఎం చేస్తారు మీరు ?
స్టూడెంట్ : ఏముందండి రాగానే హాజరు వేయించుకోడం , గోడ మిద కూర్చుని వచ్చే పొయే అమ్మాయిలకి sight కొట్టడం, మనకి పడ్డారా మన అదృష్టం లేక పొతే వాళ్ళ అదృష్టం.(ఈ సినిమా చూసారా నిర్మాత అదృష్టం చూడలేదా మీ అదృష్టం )

రాజాది రాజా
రాఘవేంద్ర లారెన్స్ గారి డబ్బింగ్ చిత్రం ఇది. సినిమా అంతా పరమ నాటు సంభాషణలు మాములుగా కొన్ని సిన్మాల లో ద్వాందా అర్ద సంభాషణలు ఎక్కువగా ఉంటాయి. కాని ఈ సినిమాలో అన్ని ఆ రకమైన సంభాషణలే. కథ ప్రకారం రాజా (లారెన్స్ ) కస్టపడి అన్నలని ఒకళ్ళని డాక్టర్ , ఒకళ్ళని పోలీసు ఆఫీసర్ ఇంక్కోక్కరిని లాయర్ ని చేస్తాడు. కాని వాళ్ళు సమాజ సేవ కి బదులు డబ్బు సంపదనే ధ్యేయం గా పెట్టుకుని సమాజానికి హాని చెయ్యడం చూసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు . చివరకి వాళ్ళని తుదముట్టిస్తాడు. అది టూకీగా కథ. దానికి ముగ్గురు నాయకలు .. అర కోర దుస్తులు దారుణమైన పాటలు అదనపు ఆకర్షణ.

సుమారుగా ఉన్న సినిమా
వాదా రహా ...
ఇది హిందీ సినిమా .. బాబి డియోల్ నాయకుడు , కంగనా రావత్ నాయక. నాయకుడి కి మొదటి పాట అవ్వగానే ఆక్సిడెంట్ అవుతుంది దాంతో మెడ కింద బాగం అంతా చచ్చు పడిపోతుంది. అప్పటికి మంచి డాక్టర్ గా పేరు ఉన్న నాయకుడికి జీవితం మిద ఆసక్తి నశించి పోతుంది. ఆసుపత్రి లో ఒక అబ్బాయి పరిచయం తో ఎలా కొత్తగా జీవితం మొదలు పెట్టాడు అన్నది కథ...
బాగున్నవి : ఫోటోగ్రఫీ .. అబ్బాయి ఆక్షన్.
మంచి సెంటిమెంట్ .. తీరికగా ఏడవొచ్చు సినిమా చూస్తునప్పుడు.. కళ్ళకి మంచి excercise కొంచం మన పాట సినిమా జ్యోతి, ఆనంద్ (హిందీ ) పోలికలు ఉన్నాయ్ ...

6 comments:

మురళి said...

:-) :-) బాగుందండి టపా..

కన్నగాడు said...

అయితే నేను అదృష్టవంతున్నంటారా! మా స్నేహితులు ఎంత పోరినా ఎందుకో జోష్ సినిమాకి వెళ్ళలేదు.
మీరు సినిమాలు బాగానే చూస్తారన్నమాట...:)

sunita said...

baagunnaayi kaburlu!!!

శ్రీ said...

మురళిగారు , సునీతా గారు
ధన్యవాదాలు

కన్నా గారు ..
మీరు చాల చాల అదృష్టవంతులు

Vinay Chakravarthi.Gogineni said...

బాగుందండి మీ బ్లాగ్ ....చాలా సింపుల్గా చెప్పలనుకున్నది చెబుతున్నారు.....బాగుంది.....

Sandeep P said...

చైతన్య "బాబు" కింగ్ ఆడియో ఫంక్షన్ లో భయంకరమైన డవలాగులు చెప్తే ఏదో మేటర్ ఉంది అని పొరబడ్డాను. తుస్సు అన్న మాట.