ఈనాడు, వాంటెడ్ చిత్రాలు అంచనాలకి ఎందుకు అందుకోలేక పోయాయి ? వేరే భాషలో బాగా హిట్ అయిన సినిమా ని మన వాళ్ళు ఎందుకు సరిగ్గా తియ్యలేరో అర్ధం కాదు చాలా సార్లు.
ఈనాడు (తెలుగు )
పోయిన ఏడాది అనుకుంటా నేను ఒక రోజు కాళీగా (అంటే ఎం చెయ్యాలో తేలిక ) ... చాలా విశ్రాంతిగా ఒక సినిమా చూద్దాం అని నిర్ణయించుకుని నసీర్ సినిమా చూసి చాలా కాలం అయ్యింది అని A Wednesday అన్ని సినిమా మొదలు పెట్టాను చూడటం. సినిమా సరిగ్గా అయిదు నిమషాలు కాగానే కొంచం సర్దుకుని కుర్చోవలిసి వచ్చింది అలా సినిమా మొత్తం ఆసాంతం కదలకుండా కూర్చోబెట్టి , ఆలోచింప చేసిన సినిమా ఇది. దీంట్లో ఎవరు కూడా నటులు కనపడరు, ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో.. కథలో ఇమిడే నటి నటులు కూడా అంతే ముఖ్యం అని మరి ఒక్క సారి చెప్పిన సినిమా a wednesday .
దిన్ని తెలుగు లో తెస్తున్నారు అనగానే మంచి సినిమా మన వాళ్ళు మాములుగానే కంగాళీ చేస్తారు అని ఆలోచించా. జగపతి బాబు స్నేహితుడు జే. డి. చక్రవర్తి దర్శకత్వం లో అని ముందర అనుకున్నారు.. జగపతి పోలీసు ఆఫీసర్ గా , రాజేంద్ర ప్రసాద్ నసీర్ పాత్రకి అనుకున్నారు ముందర. జే డి మిద నమ్మకం లేక పోయిన రాజేంద్ర ప్రసాద్ బాగానే చేస్తాడు అనుకున్నా. ఈ లోపల కమల్ సినిమా హక్కులు కొన్నారు అని అన్నారు. ఇద్దరూ కోర్ట్ కి ఎక్కారు చివరకి కమల్ గెలిచాడు.
కమల్ దీన్ని ద్విభాషా చిత్రం గా విడుదల చేద్దాం అని అనుకోగానే దానికి మోహన్ లాల్ (తమిళం లో ), వెంకటేష్ (తెలుగు లో ) చేస్తారు అని అనగానే కొంచం అంచనాలు పెరిగాయి. ఇంకా సాగర సంగమం చక్రి దర్శత్వం, మొదటి సారి రెడ్ కెమెరా ఒక తెలుగు సినిమాకి ఇలాంటివి అన్ని ఈ సినిమాని వార్తల్లో ఉంచాయి. కమల్ కూతురు శ్రుతి సంగీతం గట్రా అదనపు తళుకులు కనపడ్డాయి .
సినిమా మొదలు పెట్టగానే కమల్ నసీర్ పాత్రని ఇష్టం వచినట్టు చేసేసారూ అని అర్ధం అయ్యింది. హిందీ లో పెద్ద తారాగణం లేదు కదా.. తెలుగు లో ఇలా పెద్ద తారాగణం దేనికి అన్న ప్రశ్న కి కమల్ దీన్ని బి సి సెంటర్స్ లో కి వెళ్ళే లా చెయ్యడానికి అన్న సమాధానం ఇచ్చారు. హిందీ లో చక్కగా అందరు ఎక్కువ గా హిందీ లో మాట్లడితే .. తెలుగు లో కి వచ్చేసరికి ... కమల్ గారు దాని పూర్తిగా ఆంగ్ల చిత్రాన్ని చేసి పడేసారు. ఏదో అప్పుడప్పుడు నామ్కేవాస్తే తెలుగు మాట్లాడటం తప్ప ఉన్న వారందరూ ధారాళంగా ఆంగ్లం లో మాట్లాడటం సరి పోయింది. (రెండు భాషల్లో కదా మళ్ళా మళ్ళా డబ్బింగ్ చెప్పే పని తగ్గుద్ది అని ఏమో ) లక్ష్మి లాంటి మంచి నటిని ఒక పనికి మాలిన పాత్ర తో సరిపుచ్చారు. చాలా వరకు హిందీ సినిమా సంభాషణలను యధావిధంగా ఆంగ్లంలోకి మార్చి వాడుకున్నారు (ఆ మాత్రం దానికి దర్శకుడు నిలకంత గారు రాయాల్సిన అవసరం ఏంటో ).. వెంకటేష్ పర్వాలేదు ..మన సినిమా వాళ్ళకి ఒక జబ్బు ఉంది.. నాయకుడు ఎలాంటి వాళ్ళని అన్నా సరే ఎదిరించి ఏదో ఒకటి అంటానే ఉంటారు.. ఇందులో కూడా పెద్దవాళ్ళ మింద కస్సు బస్సు అంటా ఉంటాడు.. కమల్ మంచి నటుడు అవ్వొచ్చు కాని నసీర్ చేసినట్టు మాత్రం చెయ్యలేక పోయారు. అది మాత్రం నిజం..
భారత్ రెడ్డి గణేష్ రామన్ బాగానే చేసారు. చక్రి తనకి ఇచ్చిన స్వాతంత్రానికి సరిపడా చేసినట్టే ఉన్నారు (కమల్ సినిమాలో దర్శకుడు ఒక రకంగా డమ్మీ అని చెప్పుకుంటారు )
ఈనాడు : లక్ష్మి, కమల్, వెంకటేష్ , భారత్ రెడ్డి , గణేష్ రామన్
కెమెరా : మనోజ్ సోని
సంగీతం : శ్రుతి హసన్
దర్శకుడు : చక్రి తోలేటి
వాంటెడ్ (హిందీ )
పోకిరి సినిమా చూడని వాళ్ళు ఉండరు ఏమో నాకు తెలిసి. తెలుగు సిని పరిశ్రమ లో కొన్ని రికార్డ్లని సృష్టించిన చిత్రం అది. దాన్ని హిందీ లో కి శ్రీదేవి గారి భర్తా బోనీ కపూర్ కొన్నారు. దానికి ప్రభు దేవ గారి దర్శకత్వం అనగానే అప్పట్లో అంచనాలు పెరిగి పోయాయి... సల్మాన్ ఖాన్ హీరో అనగానే నాకు తగ్గిపోయాయి .. అప్పట్లో లవ్ అని మన తెలుగు సినిమా ప్రేమ ని హిందీ లో కి తీసారు.. ప్రేమ అంత గొప్పగా ఆడక పోయినా ... నాకు కొంత నచ్చిన సినిమా (రేవతి అంటే మౌన రాగం నాయకి గా ఇష్టం ఉండేది లెండి.. ) ఆ సినిమా ని చూసాక సల్మాన్ ఖాన్ మన తెలుగు వాటిని హిందీ లో చెయ్యడానికి పనికి రాదు అని ఫిక్స్ అయి పోయాను. ఈ సినిమా దానికి తిరిగు లేని ఉదాహరణ ..
ఒక సినిమాని వేరే భాష లోకి తిరిగి తీస్తున్నప్పుడు ఆ సినిమాకి సరిపడా నటినటులని ఎన్నుకోడం ఒకరకం గా కత్తి మిద సాము. దీని విషయం లో ప్రభుదేవా పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పవచ్చు. అయేషా టకియా తల్లిగా వేసిన అమ్మాయి అయేషా కన్నా తక్కువ వయసులా కనపడింది. అలాగే బ్రాహ్మి పాత్ర వేసినతను ఎక్కడా పనికి రాదు పోల్చడానికి ... మిగిలిన పాత్రలు కూడా అంతే. ప్రకాష్ రాజ్ తన పాత్ర తనే తిరిగి వేసుకున్నాడు. కొంత లో కొంత నయం..
సల్మాన్ ముఖం మిద వయసు బాగా కనపడుతోంది. నటన ఎలాగు శూన్యం. అయేషా టకియా కూడా దాదాపు అంతే. ప్రభుదేవా నాట్యం మిద తప్ప మిగిలిన వాటి మిద ఎక్కవు శ్రద్ద పెట్టినట్టు కనపడదు. సినిమాలో పాటలు మాత్రం విదేశాలలో తీసారు . తెలుగు లో బాగా ప్రసిద్ది పొందిన ఇప్పటికింకా నా వయసు పాట హిందీ లో దారుణంగా ఉంది .. అసలు బాగా లేదు . పోరాట దృశ్యాలతో సహా చాలా వరకు మక్కి కి మక్కి. మహేష్ బాబు ఎలా కొడితే అలాగే కొట్టించారు సల్మాన్ ఖాన్ తో.. తెలుగు లో గోల్కొండ లో fight ఉంటె హిందీ లో కూడా అక్కడే పెట్టారు.
సినిమా చూసాక పాపం శ్రీదేవి డబ్బులు ఇలా మొగుడు గారు వృధా చేస్తున్నారు అని అనుకుంటే మన తప్పు కాదు.. నన్ను అడిగితె మాత్రం సినిమా చూడకండి అని చెప్తా. తెలుగు లో ఆడింది కదా అని సరిపడా నట వర్గాన్ని ఎన్నుకోకుండా తీస్తే , దర్శకుడు మక్కి కి మక్కి కాపీ కొడితే ఎలా ఉంటుంది అంతే ఈ సినిమాలాగా ఉంటుంది .
వాంటెడ్ : సల్మాన్ ఖాన్, అయేషా టకియా , ప్రకాష్ రాజ్
దర్శకుడు : ప్రభుదేవా
1 comment:
అయ్య శ్రీ గారు, వాంటెడ్ సినిమా గజిని కలెక్షన్స్ ని బ్రేక్ చెసిందట..మొదటి వారం కలెక్షన్స్ 72 కోట్లట..! ఆ సినిమా హిట్ అవ్వడం తో బాలీవుడ్ వారు టాలీ హుడ్ వైపు డబ్బింగ్ హక్కూల కోసం క్యూ కడుతున్నారట...కమల్.
Post a Comment