Tuesday, September 15, 2009

Patrick Swayze ఇక లేరు

Dirty dancing , Ghost స్టార్ Patrick Swayze ఇక లేరు అంటే బాద వేసింది. స్కూల్ లో ఉన్నపుడు skyline ధియేటర్ లో చూసిన dirty dancing సినిమా గుర్తుకు వచ్చింది. అప్పటికే ఫ్లాష్ డాన్స్ , saturday night fever, grease లాంటి సినిమాలు చూసి ఉండటం వల్ల , మైఖేల్ జాక్సన్ ప్రభావం వల్ల డాన్స్ అంటే మోజు వల్ల హీరో , హీరోయిన్ ఎవరో కూడా తెలీకుండా పోలో మంటూ సినిమాకి వెళ్ళిపోయాం. ఆఖరి డాన్స్ అయ్యే దాకా సీట్లు లో నుంచి కదిలితే ఒట్టు. జాన్ ట్రవోల్టా , జాక్సన్ , జీన్ కెల్లీ కాకా ఇంకా డాన్సింగ్ స్టార్స్ ఉంటారు అని నమ్మే వాడిని కాదు . అలాంటిది ఈ సినిమా చూసాక సౌండ్ లేదు మనకి.

సినిమా మొత్తం అయిదు మిల్లియన్స్ లో తీసారు అప్పట్లో .. ఇప్పటికి రెండు వందల యాభై మిల్లియన్ లు సంపాదించింది సుమారుగా. హోం వీడియో లో మిల్లియన్ కాపి లు అమ్ముడు పోయిన మొదటి చిత్రం ఇదే. Patrick సినిమాలో దుంగల మీద నడిచే సన్నివేశం కోసం సుమారు ఒక డజను సార్లు పడి మోకాలి చిప్ప కి గాయం కూడా చేసుకున్నాడు. ముందర ఈ పాత్రకోసం వేరే వాళ్ళని అనుకున్నారు. కాని అతను నచ్చక patrick ని సంప్రదించారు. patrick మేనేజర్ కి కథ నచ్చలేదు. కాని పాట్రిక్ కి నచ్చింది. అందువల్ల ఈ సినిమా సాధ్యం అయ్యింది.

సినిమా షూటింగ్ జరిగాక మొదటి కాపీ చూసాక ... నిర్మాతకి నచ్చలేదు. నెగిటివ్ లు తగలబెట్టి ఇన్సురెన్సు డబ్బులు తీసుకోడం బెటర్ అని సలహా కూడా ఇచ్చాడు. చివరకి ఒక వారం ధియేటర్ రిలీజ్ చేసి నెల లో వీడియో లో పెట్టేదాం అని నిర్ణయం తీసుకుని విడుదల చేసారు. వీళ్ళు టీన్ ఏజ్ వాళ్ళ కోసం అనుకుని తీసిన సినిమా పెద్దవాళ్ళకి విపరీతం గా నచ్చి వచ్చిన నేలలోపలె బోలెడు సంపాదించింది ఇంకా సంపాదిస్తూనే ఉంది. ఇది పాట్రిక్ కి బాగా పేరు తెచ్చిన సినిమా .

ఇంకో సినిమా ఈయనకి పేరు తెచ్చింది ఘోస్ట్. ఈ సినిమా నిజం చెప్పాలి అంటే నేను Demi moore కోసం వెళ్ళాను. కానీ సినిమా చూసాక పాట్రిక్ అంటే ఉన్న ఇష్టం ఇంకా పెరిగింది. ఈ సినిమా ని మన వాళ్ళు సుబ్బరంగా కాపి చేసి మన మీదకి వదిలేసారు .. హిందీ లో ప్యార్ కా సాయా అని తీసారు తెలుగు లో ఆత్మబంధం అని సుమన్ లిజి ల (దర్శకుడు ప్రియదర్శన్ గారి రెండో భార్య ) తో రాఘవేంద్ర రావు బ్రాకెట్లో బి ఏ గారి శిష్యుడు సునీల్ వర్మ తీసారు . (సునీల్ వర్మ గారు ఈ మధ్యే గుండె నొప్పి వల్ల పోయారు) హిందీ గురించి అంత చెప్పుకునే విశేషాలు ఏమి లేవు కాని ... తెలుగు లో మంచి పాటలు ఉన్నాయ్ ... ఒట్టేసి చెప్పవా ఇంకొక్క సారి ... కన్నాడు మా అయ్యా కనకయ్య ... వురుకో ఏడవకు బంగారు కొండ ...

పాట్రిక్ కోసం నేను చూసిన ఇంకో సినిమా పాయింట్ బ్లాంక్ .. దేంట్లో కిను రేవిస్ కూడా ఉన్నారు (స్పీడ్ , మాటరిక్ష్) అది అంత గొప్ప సినిమా కాదు ...

dirty dancing లో మచిపోలేని డాన్స్ ఆఖర్లో వచ్చే డాన్స్.. పాట్రిక్ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ...



ఆత్మబంధం పాటలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు

4 comments:

కొత్త పాళీ said...

అయ్యో .. sorry to hear that! I saw several of his movies but only vividly remember "Ghost". I believe he'd been battling with some form of cancer. He also starred as an American physician workign in the slums of Calcutta in "City of Joy"

Ruth said...

Hmm... I remember the movie ghost very vividly.... just love the song "oh my love..."
but what I liked most in the movie is woopi goldberg. she's just amazing!

శ్రీ said...

@ కొత్తపాళి గారికి : నేను ఆ సినిమా చూడలేదు పూర్తగా ... బిల్లు బిట్లుగా చూసా HBO లో
@ RUTH గారికి ... WHOOPI గారికి ఆస్కార్ వచ్చింది అండి ఆ పాత్రకి ... హిందీ లో అమృత సింగ్ చేసింది ఆ పాత్ర.. తెలుగు లో ఎవరు చేసారో నాకు గుర్తు లేదు...

Ruth said...

హ్మ్మ్ నాకు తెలిసి, తెలుగులో ఆ కేరక్టర్ సత్యనారాయణ గారు చేసారు. అంటే, తెలుగు సినిమా లో లేడీ బదులు మగ మీడియం(భూత వైద్యుడు) అన్నమాట.