Thursday, October 8, 2009

నిన్ను కలిసాక - చిత్ర సమీక్ష

అభిరాం (చైతన్య), దీప్తి (దీప ) ఒక జంట. చందు (సంతోష్) బిందు (ప్రియ ) ఇంకో జంట. అభిరాం , బిందు ప్రాజెక్ట్ పనిమీద అమెరికా కి వస్తారు. ఇద్దరు ఒకే చోట పని చెయ్యడం, పక్క పక్క అపార్ట్మెంట్ లో ఉండటం తో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అక్కడ భారతదేశం లో దీప్తి కి చందు పరిచయం అవుతాడు. కానీ వాళ్ళ పరిచయం స్నేహాన్ని దాటదు. అభిరాం తనది ప్రేమో ఆకర్షణ అన్నది తెలుచుకోలేక పోతాడు. దీప్తి ని ప్రేమించే తను మళ్ళా ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిచగలడో అతనికే అర్ధం కాదు. చివరికి ఎం చేసాడు అన్నది ముగింపు.

మాములుగా ఇలాంటి కథల్లో మన వాళ్ళు హీరో పేరున్న వాడు అయితే , నాయకి పేరున్నది అయితే ఇద్దరినీ కలిపేసి ఇండియా లో ఉన్న వాళ్ళని కలిపేసి నానా కంగాళీ చేసి , తల తోక లేని ప్రేమ మిద ఒక ఉపన్యాసం పెట్టి ముగిస్తారు. ఈ సినిమాలో అందరు కొత్తవాళ్ళు కావడం వల్ల అటువంటి పైత్యం ఎం పెట్టకుండా చక్కగా ముగించారు.

నటుల్లో చైతన్య బాగా చేసాడు. సంతోష్ పరవాలేదు. నాయకిలు ఇద్దరు పరవ్హాలేదు. సంగీతం బాగానే ఉంది. మౌనం మనసుల్లోన పాట బాగుంది. నిర్మాణ విలవలు బాగున్నై.

శివనాగేశ్వర రావు అమితాబ్ గెట్ అప్ లో లవ్ గురు గా దండగ పాత్ర. అలాగే ఎం ఎస్ నారాయణ, కొడుకు పాత్రలు కూడా దండగ. కథకి ఎందుకు పనికి రాని పాత్రలు. కృష్ణుడు , ఆఫీసు లో సన్నివేశాలు చాలా వరకు సాగాతీతకి తప్ప దేనికి పనికి రావు. కథకి అనవసరమైన సన్నివేశాల వల్ల సినిమా నత్త నడక సాగినట్టుగా ఉంటుంది.

ఆందరూ డాన్సుల్లో వీకే .. జగపతి బాబు ఒక చిన్న పాత్రలో తన వేషం తానె వేసాడు. సినిమా పర్వాలేదు చూడొచ్చు. శివనాగేశ్వర రావు తన భాణి వదిలి కొత్త భాణి లో వెళ్ళడానికి మంచి ప్రయత్నమే చేసారు.

2 comments:

కన్నగాడు said...

కొన్ని రివ్యూలలో సినిమా ఎందుకు తీసారో అర్థం కాలేదన్నట్టు రాసారు? మీ చివరి మాట ఉషాకిరణ్ వారి నించి ఇంకో మినిమమ్ గ్యారెంటీ అంటారు.

శ్రీ said...

కథ మంచి ప్రయత్నం అండి .. కాని సినిమా గ్యారంటీగా ఆడదు.. వరదల్లో కొట్టుకుపోయింది