Friday, October 30, 2009

బంపర్ ఆఫర్ , జయీభవ చిత్ర సమీక్షలు

పూరీ గారి తమ్ముడు, శ్రీ సాయి రాం శంకర్ గారు నటించిన బంపర్ ఆఫర్ చూసే బాగ్యం ఈ మధ్య తటస్తించింది అప్పటికే రమణమ్మ పాట సూపర్ హిట్ కావడం వల్ల సినిమా మీద పెద్ద అంచనాలే పెట్టుకున్నారు సోదరులు ఇద్దరూ. సినిమా మొదలే తేడా గా మొదలు అవుతుంది. తల్లి కోవై సరళ , కొడుకు కలిసి ఆరవ సినిమాలో లాగ ఎందుకె రవణమ్మ పాటకి మసాలా నాట్యం తో మనకి ఒక రకమైన బెదురు పుట్టిస్తారు. అది అయ్యాక ఎవరో వచ్చి వీడు మరి ఎక్కువ స్టెప్స్ వేస్తున్నాడు అని కాళ్ళు విరగ గొడతారు. అది నాయక పని అని తెలిసి , హీరో వెళ్లి ఆ అమ్మాయి చెంప పగలగొడతాడు. ఆ అమ్మాయి వచ్చి విడి విరిగిన కాలు ని ఇంకో కర్ర తీసుకుని కొడుతుంది. పాత సినిమాలో తలకి దెబ్బ తగిలి మతి పొతే మళ్ళా దెబ్బ తగలనే మళ్ళా పోయిన మతి వచ్చినట్టు వీడి కాలు కూడా వచ్చేస్తుంది. ఆ దెబ్బతో వీడికి కుడా ఆ పిల్ల మీద ప్రేమ పుట్టేస్తుంది

నీ అందం చూసి , నీ బాబు డబ్బు చేసు కాదె , నీ బలుపు చూసి నిన్ను ప్రేమిస్తున్నా అని హీరో గారు చెప్పేస్తారు. నాయక కూడా విడి బుర్ర తురుగుడు చూసి ప్రేమించేస్తుంది. హీరో నాన్న నాయక తండ్రి వద్ద పని చేస్తూ ఉంటాడు.

ఇదేంటి బంపర్ ఆఫర్ కథ అని ఇడియట్ కథ చెపుతున్నాడు వీడికి పూరి సినిమాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది అని మీరు అనుకుంటే, చల్ల చల్లని పూరీ కూరలో కాలు వేసునట్టే (పూరీ గారు అదే హీరో క్యారెక్టర్ ని తీసి తీసి ఆ వేడి లేకుండా చేసాడు మరి ).

ఆవకాయ బిర్యాని నాయిక బిందు అందాలుఆరబోసింది. కాని అమ్మాయి కొంచం ఒళ్లు తగ్గించాలి, ఇలా అందాలు ఆరబోయాలి అంటే. జోక్ ఏంటి అంటే, పాటల్లో సుబ్బరంగా చూపించిన ఈ అమ్మాయి, స్విమ్మింగ్ పూల్ దగ్గర మాత్రం కొంచం కప్పుకుని కనపడింది. ఇంకో కామెడి ఏంటి అంటే , అయిదు లక్షలు ఇచ్చి జయప్రకాశ్ ని (ఈయనది ఒక రాజకీయ నాయకుడి పాత్ర ) ఎవరన్న సరే నాన్న అని అనేయడమే,

హీరో, నాయిక తండ్రి ని బీదవాడిని చేస్తా అని అనడమే బంపర్ ఆఫర్. అప్పటిదాకా బోలెడు తెలివి తేటలు ఉన్న నాయికి తండ్రి కి ఇంటెర్వల్ నుంచి బుర్ర పనిచెయ్యడం మానేస్తుంది. దాంతో హీరో వేసే ఎత్తులకి చిత్తయై , చెత్త అయ్యి డబ్బు పరువు పోగాట్టుకుని జైలు కి వెళ్తాడు. హీరో అతని దగ్గర నుంచి కొట్టేసిన డబ్బుతో నాయిక తో సంతోషంగా ఉంటాడు.

బాడీ పెంచిన సాయి రాం, నటన పెంచితే బాగుండేది. మనం ఆ పైనున్న సాయిరాం ని తలుచుకునే బాద తప్పేది. బిందు కి చెయ్యడానికి ఎం లేదు. హీరో కావలసినప్పుడు వచ్చి అర్ధనగ్నంగా గెంతులేయ్యడం తప్ప. మిగిలిన నటులు ఉన్నారు అంటే ఉన్నారు. లేక పొతే లేదు. . ఉన్నంతలో కొంచం బాగున్నది రఘు సంగీతం మాత్రమె. కొత్త దర్శకుడు జయరవీంద్ర కి కొత్తగా చెయ్యడానికీ ఎం లేదు. అన్ని వెనక ఉండి పూరీ గారు చూస్కున్నారు మరి. సినిమా చిన్న కేంద్రాలలో బాగానే ఆడుతోంది అని భోగట్టా. కాని మరి ఏక్ నిరంజన్ దాటికి మరి ఎంత వరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.

బంపర్ ఆఫర్ : తారాగణం : సాయిరాం శంకర్ , బిందు , సాయాజీ షిండే సంగీతం : రఘు కుంచె , దర్శకత్వం : జయ రవీంద్ర
--------------------------------------------------------------------------------------------------------------------
జయీభవ

యాక్షన్ హీరో గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ మొదటి సారిగా కాస్త ట్రెండ్ మార్చి యాక్షన్ కి కొంచం హాస్యాన్ని కలిపి కుటుంబ ప్రేక్షకులకి దగ్గర కావాలని చేసిన ప్రయత్నం జయీభవ.

కాని కథ పాత చింతకాయ పచ్చడి. కొత్త సన్నివేశాలు ఉన్నయ్యా , అంటే ఆలోచించవలసిందే. సినిమాలో ఒక్కటే కొంచం కొత్తగా ఉంది. హీరో నాకు పుట్టబోయే కొడుకు కి నీ పేరే పెట్టుకుంటా అనగానే ఆలీ కి, బ్రహ్మానందం కి వెనుక దేవుళ్ళకి వచ్చినట్టు చక్రం తిరగడం అన్నది బాగుంది.

కథ ని ఇంటెర్వల్ బాంగ్ కోసం మొదటి సగం గంటలో పూర్తి చేసి , రెండో సగం గంటన్నర సాగదీసారు. కథ ప్రకారం, ఒక దుష్టుడి వల్ల విడిపోయిన స్నేహితుల పిల్లలు ప్రేమించుకుని పెద్దలని కలపడం అన్నది కథాంశం.

ఇంటెర్వల్ లో నాయకా నాయికిలకి వారిద్దరి తండ్రులిద్దరూ ప్రస్తుతం శత్రువులు అన్న సంగతి తెలుస్తూంది. తరవాత ప్రేమికులిద్దరూ కలిసి ఒకరి ఇంట్లో ఒకరు ప్రవేశించి ఇంటి వారిని ఎలా మెప్పించి ఒప్పించారు అన్నది కొంచం కామెడి గా చూపించాలి అని ప్రయత్నం చేసారు. ప్రయత్నం చేసారు అని ఎందుకు అన్నా అంటే, అది ప్రయత్నమే కాని ఫలితం లేకపోవడం వల్ల. సినిమా రెండో సగం నస, కొనసాగడమే తప్ప కోన (చివర ) ఎక్కడా కనపడలేదు. ఒక పాట చిత్రీకరణ బాగుంది. సో సో సంగీతం. కళ్యాణ్ రామ్ హాస్య సన్నివేశాలకు ఇంకా ఇంప్రూవ్ కావాలి. హన్సిక పాత్ర కి చెయ్యడానికి ఎం లేదు షరా మామూలు. ఆడే పాడే బొమ్మ. రఘు బాబు , రఘు కారుమంచి కామెడి పరవాలేదు. బ్రాహ్మి దండగ . ఇంకా ఎక్కువ చెప్పుకోవడం అనవసరం ఈ సినిమాకి. సోది సినిమా.

జయీభవ తారాగణం : కళ్యాణ్ రామ్ , హన్సిక దర్శకత్వం : నరేన్ కొండేపాటి

3 comments:

మురళి said...

'బంపర్ ఆఫర్' కి రిలీజు కి ముందే 'చాలెంజ్' ని తిరగేసి తీసిన సినిమా అన్న పేరు వచ్చేసింది.. ఇక 'జయీభవ' పోస్టర్ లో హీరో పులి కి గొలుసు కట్టి తీసుకెళ్లడం చూసి (గ్రాఫిక్ పులే లెండి.. గ్రాఫిక్స్ వాళ్లకి పులి కాళ్ళు దొరక లేదనుకుంటా, మనిషి కాళ్ళతో సద్దుకున్నారు) హీరో గారు ఏ సర్కస్ లోనో పనిచేస్తారేమో అనుకున్నాను.. 'బెండు అప్పారావు' చూడమని మిత్రులు మొహమాట పెడుతున్నారు.. ఈవీవీ మార్కు నాటు కామెడీ భరించాలేమో అని నాకు డౌటు.. మీరేమంటారు??

Apparao said...

బంపర్ ఆఫర్ గురించి బాగా వ్రాసారు

శ్రీ said...

మురళి గారు
బెండు అప్పారావు ఈ మధ్య వచ్చిన ఈ వి వి గారి సినిమాల్లో కి కొంచం బెటర్ సినిమా. కొంచం పరవాలేదు. చాలా వరకు మనం విన్న జోక్స్ నే వాడారు. కానీ తెలుగు లో ఈ మధ్య బాణం తప్ప (అది ఓ గొప్ప సినిమా అని కాదు ) కాని వీటి అన్నిటి మీద బెటర్ సినిమా. దాని తరవాత ప్రస్తుతం ఎం కనపడటం లేదు. నిన్నే ఏక్ నిరంజన్ కి బలి అయ్యా. దాని గురించి ఈ రోజు సమయం చూసి రాస్తా.

శాస్రి గారు : ధన్యవాదాలు