గతంలో సొమ్మొకడిది - సోకొకడిది , గజదొంగ లాంటి కవలలు తప్పి పోయి చివరికి తండ్రిని రక్షించే సినిమాలు చూసిన వాళ్ళకి ఈ సినిమాలో తరవాత వచ్చే సన్నివేశం ఏంటో చాలా అవలీలగా చెప్పెయ్యవచ్చు. వినాయక కి పాత పాత చింతకాయ సినిమా అయిన కొత్త బాటిల్ లో చూపిస్తాడు అన్న పేరు ఉంది. అదుర్స్ నిజానికి కొత్తగా చెప్పింది ఏమి లేదు. కాని ఎన్ టి ఆర్ చారి గా చేసిన నటన కోసం చూడవచ్చు.
సినిమాలో బోలెడు కలగా పులగం చేసి కొత్త వంట అని పాత పచ్చడే పెట్టినట్టు ఉన్నారు. చిన్నపుడే విడిపోయన కవల పిల్లలు నరసింహ, నరసింహా చారి వేరే ఊర్లల్లో పెరిగి పెద్ద అయ్యాక ఒకే ఊరికి చేరుతారు. నరసింహా చారి బ్రాహ్మణుడిగా పెరిగితే , నరసింహ పోలీసు ఆఫీసర్ కావాలి అని ఇన్ఫార్మర్ గా షిండే దగ్గర చేరుతాడు. నరసింహ షియాజీ కోసం చేసే పనులకి తోడుగా పనిలో పనిగా శయాజీ కూతురు షీలా తో ప్రేమాయణం కూడా చాటుగా చేస్తూ ఉంటాడు. ఇది తెలిసిన షియాజీ నరసింహ ని మట్టుపెట్టాలని తెలివిగా ప్లాన్ చేస్తాడు. హీరో ని మట్టుపెట్టే వాళ్ళు ఉండరు అని విలన్ కి తెలీదు కాబట్టి హీరో సహజంగా తప్పించుకుతాడు. సినిమాలో పనికి మాలిన సజ్జ చాల ఉంది, ముకుల్ దేవ్, సుప్రీత్ బుర్ర లేని మెయిన్ విలన్ మహేష్ మంజ్రేకర్ , ఆశిష్ విద్యార్తి ఇలా తెలుగు తెలీని సజ్జ చాలా ఉంది. మరి మనవాళ్ళకి తెలుగు రాణి విలన్స్ అంటే బోలెడు ప్రేమ కదా. దానికి తోడూ నటనలో ఓ అంటే డం రాని నాయిక షీలా ఉంది. అమ్మాయి బట్టలు తక్కువ వేసుకుని హీరో తో గెంతడం తప్ప చేసింది ఏం లేదు సినిమాలో.
సినిమాలో బాగున్నది బ్రాహ్మి, నరసింహా చారి గా ఎన్ టి ఆర్ ల నటన. ఒక రకం గా ఎన్ టి ఆర్ చారి గా అభినయం కాని, వాచకం కాని వంక పెట్టలేకుండా ఉన్నాయి. నరశింహ గా ఎక్కువ చెయ్యడానికి ఏం లేదు నటనలో. సినిమాలో పాటలు వినాయక్ ఫార్మాట్ లో ఉన్నాయి. పాట, కొట్టుకోడం, ఒక హాస్య సన్నివేశం, మళ్ళి పాట, ఇదే సినిమా మొత్తం. అసలా ఇద్దరు నాయకిలకి ఒకటే పని బట్టలు తక్కువ వేసుకుని హీరో తో గెంతులు వెయ్యడమే. నటనకి ఆస్కారం లేని పాత్రలు. పాటలు అసలా అవుట్ అఫ్ ది సింక్ . దేనికి పాట వస్తుందో ఆ వినాయకుడికే తెలవాలి. మాములుగా వినాయక్ సినిమా లో ఉండే సుమోలు మారి ఆడీ కార్ గా రూపాంతరం చెందింది. కెమెరా పరవాలేదు. మొదట్లో తీసిన కొన్ని సన్నివేశాలు బాగున్నై. సంభాషణలు బాగున్నై. కథే బాగాలేదు. సంగీతం సో సో .. దేవిశ్రీ తన పాటలు తానె కాపి కొట్టుకుంటున్నాడు. అర్గెంటుగా అయన సంగీతం తరగతలు హాజరు అవ్వడం బెటర్ ఏమో.
మొత్తం మిద సినిమా ఎలా ఉంది ? పరవాలేదు. చారి, బ్రాహ్మి కామెడి ని ఎంజాయ్ చేయొచ్చు. పాటలు దండగ. కథకి అనవసరం గా వచ్చే అడ్డం తప్ప. ఎన్ టి ఆర్ డాన్సులు బాగానే చేసారు. విలన్లు అందరు దండగ జోకర్ల పాత్రలు. రఘుబాబు బాగానే చేసాడు. విలన్ డెన్ కాని, విలన్ విదేశీయులతో చేసే సమావేశాలు కాని చూస్తె పాత కృష్ణ గారి డిషుం డిషుం సినిమాలు గుర్తుకు వస్తే అది మీ తప్పు కాదు.
2 comments:
నేను చూసా ఈ సినిమాని, చారి, బట్టు లేకపోతే ఈ సినిమా ఏ బాలయ్య సినిమాకి తగ్గదు. వాడు వాడి గ్రాఫిక్సు, అయినా విలన్ డెన్ లో నల్లవాళ్లే ఉండాలని దాని కోసం మన వాళ్లకే బొగ్గు పూయడం, ఒక సన్నివేశంలో ఎమ్మెస్ మీసం ఊడిపోయి ఊగడం చూస్తేనే తెలుస్తుంది ఎంత ఇంట్రెస్టుతో చేసారో.
' దేనికి పాట వస్తుందో ఆ వినాయకుడికే తెలవాలి. మాములుగా వినాయక్ సినిమా లో ఉండే సుమోలు మారి ఆడీ కార్ గా రూపాంతరం చెందింది' ఫన్ టాస్టిక్’
Post a Comment