చిన్నప్పుడు తరగతి గదిలో పాఠమ్ జరుగుతున్నపుడు టీచర్ కి తెలీకుండా డెస్క్ లో కథల పుస్తకం చదవకుండా ఉండే బుద్దిమంతులని చూస్తె కొంచం నాకు జాలేసేది సుమండీ .. మరి ఇంత దద్దోజనం ఏంట్రా బాబు అని జాలి చూపులు చూసే వాడిని. సాధారణంగా ఎప్పుడు కూడా అలా వేరే పుస్తకాలు చదువుతూ పట్టు బడ్డ సంఘటనలు లేవు. అలా పట్టుబడ్డ సంఘటన నాకు బాగా గుర్తు ఉన్నది ప్రకృతి పిలుపు. అప్పటివరకు సరదా కదలు చదువుకునే నేను ఒక్క సారి ఉల్లిక్కిపడే లాగా చేసిన పుస్తకం అది. అప్పట్లో నాతో కూర్చునే (మాది మొదటి బెంచి బాచ్) నేను మధ్యలో కూర్చునే వాడిని .. ఇరుపక్కల ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. జే అండ్ ఎస్ వాళ్ళ పేర్లు. మా మధ్య ఒప్పందం ఏంటి అంటే రోజు ఒకళ్ళు ఒక పుస్తకం తేవాలి. వారానికి ఆరు రోజులు కాబట్టి లెక్క సరిపోయేది. (అక్కడ తమ్ముడు - అన్న సూత్రం వర్తించదు ) ఎవరు తెచ్చినా కాని స్కూల్ అయ్యే లోపల నేను ఆ పుస్తకం పూర్తీ చెయ్యాలి అది ఒప్పందం. (లేక పొతే రెండో రోజు కి అద్దె పెరుగుతుంది కదా మరి చందమామ లాంటివి ఈ ఒప్పందం లో కి రావు మరి. అలాగే Hardy boys lantivi కూడా ). (నేను పుస్తకం తెచ్చినా కాని సాయంకాలానికి పూర్తీ చెయ్యక తప్పదు (మనకి సాయంకాలాలు నాటకాలు గట్రా ఉండేవి కదా మరి , క్లాసు పుస్తకాలకే సమయం లేదు ఇంకా ఇవి చదివితే టెంకి జల్లలు గోడ కుర్చీలు తప్పవు కదా ) ఇంత సోది దేనికి అంటే క్లాసు రూం లో పుస్తకం ఎందుకు చదవాల్సి వచ్చిందో చెప్పడానికి అంతే.
కథ కి నాయకుడు బక్ అన్న ఒక కుక్క. Sanfransico లో దర్జాగా ఒక జడ్జి ఇంట్లో పెరుగుతున్న దాన్ని డబ్బు కోసం ఒకడు ఎత్తుకు పోయి అమ్మేస్తాడు. ఆ సమయం లో arctic ప్రాంతాల్లో gold rush బాగా ఉండేది. అక్కడ దర్జాగా పెరిగిన ఆ కుక్క sledge dog గా ఎలా మారింది. అక్కడ దాని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది కథా సంగ్రహం.
కథలో ఎంతగా లీనం అయి పోతాము అంటే బక్ ఒక కుక్క అని అనుకోలేము. అది కూడా మనలాంటి మనిషే అని ఫీల్ అయిపోతాము. ఒక సంధర్బం లో మన కళ్ళవెంట మనకి తెలీకుండానే కళ్ళవెంట నీలు కారిపోతాయి. అదిగో అప్పుడే పట్టుబడిపోయాను. మొదటి బెంచి లో కూర్చుని కారణం లేకుండా ఎందుకు ఎదుస్తున్ననో అర్ధం కాక పాపం మా టీచర్ గారు కంగారు పడిపోయారు. నేను పుస్తకం చదువుతూ ఏడుస్తున్న అంటే మళ్లా బెంచి ఎక్కించే ప్రోగ్రాం కి వెళ్ళిపోతారు అని తెలుసు. ఇంకో పక్క మా జే అండ్ ఎస్ ల నవ్వు నన్ను చూసి ... ఇంకా నా అవస్త ఆ దేవుడికి తెలవాలి...
అది తర్వాత నేను పుస్తకాలు కొనే వయసు వచ్చే సమయానికి దొరకలేదు ... వేరే వారి అనువాదాలు దొరికాయి కానీ కో.కు గారి అనువాదం దొరకలేదు ఇప్పటికి కూడా..
జాక్ లండన్ జీవితమే ఒక పది పుస్తకాలకి సరిపడా కథలు ఉన్నాయ్. ఓడ కూలి, జాలరి, సీల్ వేటగాడు, ముత్యపు చిప్పల దొంగ ఇలా రక రకాల పనులు చేసే అతను, gold rush లో దాని కోసమూ పరిగెత్తాడు. Egerton R. Young రాసిన My Dogs in the Northland.(ఇది నేను ఇంకా చదవలేదు ) పుస్తకం ఆధారంగా ఈయన call of the wild రాసారు.
జాక్ లండన్ గారు రాసిన ఈ పుస్తకాన్ని కో.కు గా ప్రసిద్ది చెందినా కొడవగంటి కుటుంబరావు గారు అనువదించారు . ప్రకృతి పిలుపు అని పేరు పెట్టారు. దాన్ని దేశి కవిత మండలి వారు ప్రచురించారు. 160 పేజీల పుస్తకం. అయిదు వేల పత్రులు ప్రచురించారు అని అన్నారు .
ఇప్పుడు సర్క్యులేషన్ లో మాత్రం లేదు..
ఇప్పుడు పీకాక్ వాళ్ళు సంక్షుప్త అనువాదాన్ని ప్రచురించారు.పుస్తకం పేరు అడవి పిలిచింది . ఏ . గాంధీ గారి అనువాదం. వేల ముప్పై రూపాయలు.
5 comments:
టపా బాగుందండీ.. కానీ టైటిల్ కి సంబంధం ఏమిటో అర్ధంకాలేదు.. మీరు మేష్టారికి పట్టుబడ్డప్పుడు తప్పించుకోడానికి 'నేచర్స్ కాల్' అని చెప్పి తప్పించుకుని ఉంటారని ఊహించాను.. కరక్టేనా? నేను అప్పట్లో యద్దనపూడి నవలలు చదివేవాడిని ఇలా :-)
call of the wild తెలుగు అనువాదం కో. కు గారు చేసిన దాని పేరు ప్రకృతి పిలుపు అండి
బాబాయ్, టైటిల్ చూసి ఏదో అనుకున్నా :) ఈ మధ్య అది రీప్రింట్‌కి వచ్చిందన్నట్టు గుర్తు. నండూరి గారి అనువాదాలతో పాటు రాలేదా? (కాంచనద్వీపం గట్రా..)
-బు
ఓ దీనికి కొ.కు గారి అనువాదం కూడా ఉందా? అడవి పిలిచింది చదివాను.
కో కు గారి పుస్తకం పేరు ప్రకృతి పిలుపు అండి ... అది దొరకడం లేదు ఇప్పుడు.. కానీ బాగా గుర్తు ఉండిపోయిన పుస్తకం అండి ..
Post a Comment