Monday, August 31, 2009

అనువాద రచయిత రాజశ్రీ గారి కి నివాళి

ఇందుకూరి రామకృష్ణ రాజు అంటే ఎవరు అన్నట్టు చూసే వారు ఉన్నారు కాని, డబ్బింగ్ రచయిత రాజశ్రీ అంటే తెలీని వారు ఉండక పోవచ్చు. డబ్బింగ్ రచయిత గా పేరు పొందినా అయన దాదాపు గా అరవై కి పైగా తెలుగు చిత్రాలకి రచన చేసారు, అంతే కాకా కొన్ని సినిమాలకి దర్శకత్వం కొన్నిటికి సంగీతం కూడా సమకూర్చారు. అయన డెబ్భై అయిదవ జన్మదిన సందర్భంగా ఒక వ్యాసం రాద్దాం అని అనుకుని పూర్తీ చేసాక , కాకతాళియంగా వారి అబ్బాయి పేరు నెట్ లో చూడటం జరిగింది .అయన ని తన తండ్రి గారి గురించి చెప్పమనడం బాగుంటుంది అని అనిపించి ఎలా పట్టుకోవాలా అని ఆలోచించడం మొదలు పెట్టా..

ముందరగా వెన్నెలకంటి గారికి ఫోన్ చేశా. అయన రాజశ్రీ గారి అబ్బాయి సుధాకర్ తో పరిచయం ఉంది కాని ఫోన్ నెంబర్ తెలీదు మా అబ్బాయి శశాంక్ కి తెలుసు రేపు ఫోన్ చెయ్యండి కనుక్కుని చెప్తా అని అన్నారు. (వారి అబ్బాయి అప్పుడు అక్కడ లేరు అని చెప్పారు లెండి ). సరే ఈయన ఉండేది మద్రాస్ కదా, అక్కడ మనకి గణేష్ పాత్రో గారు తెలుసు కదా, చాలా రోజులు అయింది పలకరించి అని ఆయనకి ఫోన్ చేశా. అయన తో కాసేపు మాట్లాడాకా జరిగింది చెప్పాను. పాత్రో గారు వెంటనే రాజశ్రీ గారి అమ్మాయి, వారి అమ్మాయి మంచి స్నేహితులు అని నెంబర్ కనుక్కుని ఫోన్ చేస్తా అని ఒక పావు గంట లో అయన ఫోన్ చేసి ఇచ్చేసారు. అలా రాజశ్రీ గారి అబ్బాయి సుధాకర్ నెంబర్ దొరికింది. ఇంకేం కోతికి కొబ్బరి కాయ లాగ వెంటనే ఫోన్ చేశా ఆయనకి. అయన ముంబై లో ఉన్నారు. నాదగ్గర రాజశ్రీ గారి ఫోటో లేదు అంటే అయన తన దగ్గర ఉన్న చిత్ర పటాన్ని పంపారు.

అయన చెప్పిన కబుర్లలో కొన్ని ఇక్కడ ...
నాన్నగారు డబ్బింగ్ రచయిత గా బాగా పేరు ఉంది అని చెప్పడం అంటే కొత్త విషయం కాదు. శ్రీ శ్రీ , ఆరుద్ర గార్లు ఇద్దరి తర్వాత నాన్నగారే ఎక్కువ సినిమాలు చేసారు. బంగారు పతకం సినిమా డబ్బింగ్ జరిగే అప్పుడు శివాజీ గణేషన్ గారు డబ్బింగ్ చూడటానికి వచ్చారు. జగ్గయ్య గారు డబ్బింగ్ చెపుతున్నారు దానికి. ఆ సమయం లో శివాజీ గారు వచ్చారు. శివాజీ గారిది కొంచం టిపికల్ లిప్ మూమెంట్. ఆయనకి డైలాగ్ భావం చెడకుండా ... లిప్ మూమెంట్ కి అతికేలా డబ్బింగ్ అన్నది కష్టమైన ప్రక్రియ అయన ఆక్కడ డబ్బింగ్ చూసి వెంటనే వచ్చి నాన్నగార్ని గట్టిగా కుగిలించుకుని ఇన్నాళ్ళు నేను తెలుగు డైరెక్ట్ చిత్రం చెయ్యలేదు అని బాధపడే వాడిని. ఇప్పుడు ఈ డబ్బింగ్ చూసాక నాకు ఆ బాధ తప్పింది ఇది నా డైరెక్ట్ సినిమా అంత గొప్పగా వచ్చింది అని అన్నారు. ఇది నేను ఎప్పటికి మర్చిపోలేని సంఘటన

రెహమాన్ తన మొదటి చిత్రం నుంచి నాన్నగారు ఉన్నంత కాలం అయన తో నే వర్క్ చేసారు. అలాగే మణిరత్నం గారు. అలా చాల మందికి నాన్నగారు రెగ్యులర్ గా రాసీవారు. ఒక సారి నాన్నగారితో స్నేహం చేస్తే ఎవరు వదిలే వారు కాదు. చలం గారి రమణ చిత్ర బ్యానర్ కి నాన్నగారు చేసిన పాటలు సత్యం గారి సంగీతం ఎప్పట్టికైన మరవగలమా.... కురిసింది వానా నా గుండెలోనా ... (బుల్లెమ్మ -బుల్లోడు ), మామా , చందమామా ... (సంబరాల రాంబాబు ), ఎక్కడో దూరాన కూర్చున్నావు ... (దేవుడమ్మ ), రాధకు నీవేర ప్రాణం ... (తులాభారం ) ఇలా ఎన్ని పాటలు అని చెప్పగలం.

నాన్నగారికి దర్శకత్వం అంటే మక్కువ ఎక్కువ. అప్పట్లో అయన మూడు సినిమాలకి దర్శత్వం వహించారు. రాఘవ గారి చదువు సంస్కారం , నిజం చెపితే నేరమా, ఓ ప్రేమ కథ. చదువు సంస్కారం బాగానే ఆడింది, నిజం చెపితే నేరమా ఓ మోస్తరుగా ఆడింది. ఓ ప్రేమ కథ ఫ్లాప్. ఓ ప్రేమ కథ మొదలు పెట్టగానే రాధిక పెళ్లి చేసుకుని లండన్ వెళ్లి పోయింది. దాంతో ఆ సినిమా ఒక ఆరు నెలలు కదలలేదు. ఈ లోపల అదే కథ తో శ్యాం ప్రసాద్ గారు తలంబ్రాలు తీసి హిట్ చేసేసారు (నాన్నగారు దానికి కూడా పాటలు రాసారు , నేను దానికి గిటారిస్ట్ ని , సత్యం గారి దగ్గర అప్పుడే చేరాను నేను) . అదే కథ మళ్ళా రావడం తో ఆ సినిమా అనుకున్నంత గా ఆడలేదు. దాంతో అయన దర్శత్వానికి స్వస్తి చెప్పారు. అంతే కాక అనువాద రచయిత గా కూడా చాలా బిజీ గా ఉన్నారు అయన. అది ఇంకో కారణం.

నాన్నగారు హటాత్తుగా పోవడం తో నాకు ఒక్కసారి ఎలా అయన చేసే ప్రాజెక్ట్స్ హేండిల్ చెయ్యాలో తెలీలేదు. అప్పటికి నేను గిటారిస్ట్ గా చాలా బిజీ గా ఉన్నాను. మా ఇంట్లో నేను ఒక్కడినే సినిమాల్లోకి వచ్చింది. అందువల్ల నేను ఆ సమయం లో నాన్నగారు చూస్తున్న శ్రీ కృష్ణ, రామాయణం సీరియల్స్ కి సంగీతం , పాటలు మాత్రం చేసాను. 2000 లో నేను మొట్ట మొదటి చిత్రం అనువాద రచయిత గా ప్రవేశం చేసాను. మొదటి సినిమా deep blue sea (పడమట సంద్యా రాగం నాయకుడు టాం హీరో గా వచ్చిన చిత్రం ) . అది కొలంబియా వారిది. దాని తరవాత ఒక రెండు వందలు దాక చేసి ఉంటా ఆ బ్యానర్ కి. హిందీ లో నేను బాగా కష్టపడ్డ సినిమా జోదా అక్బర్. దాదాపు ఒక ఏడాది కష్ట పడ్డాను దానికి. అసుతోష్ కూడా మద్రాస్ లో పది రోజులు నాతొ కుర్చుని ఒక్కో వాక్యం చెక్ చూసుకుని చూసుకున్నారు. ఆ సినిమా నాకు చాల పేరు తెచ్చింది. మా నాన్న గారి పేరు నిలబెట్టే సినిమా అని నేను అనుకుంటున్నా ఆ సినిమాతో.

రా
జశ్రీ గారి మిద వ్యాసాన్ని ఆంగ్లం లో ఇక్కడ చదవండి ...
రాజశ్రీ సుధాకర్ గారి మినీ ఇంటర్వ్యూ ని ఆంగ్లం లో ఇక్కడ చదవండి

1 comment:

Vinay Chakravarthi.Gogineni said...

niceo info...........

sundari song in dalapati by whom rajasri or any?