ఈ మాట వినగానే మనకి టక్కున బొమ్మరిల్లు సినిమా లో ..వీలైతే నాలుగు మంచి మాటలు ... కుదిరితే కప్పు కాఫీ అన్న సంభాషణ గుర్తుకు రాక మానదు. ఈ మధ్య డెట్రాయిట్ వెళ్లి వచ్చాక ఒక రకమైన నిర్వేదం లో పడిపోయాను. వెళ్ళినప్పుడు , వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నా, బోలెడు మంది కలిసారు , కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నా , కొన్ని దొరకని సినిమాలు తెచ్చుకున్న అన్న ఆనందం లో ఉన్నా.
చక్కగా నాలుగు మంచి మాటలు , బోలెడు కాఫీలు తాగాను అన్న ఆనందం అక్కడ నుంచి వచ్చాక ఆవిరి అయిపొయింది. మనం వయసులో పెద్ద వాళ్ళం అవుతున్నాం , మనసులో కూడా అవుతున్నామా ? మనలో పెద్దరికం ఎప్పటికి వస్తుంది ? పెద్దరికానికి వయసుకు ఎందుకు సంబంధం లేదు ? మనం వయసుతో పాటు మనసు ఎందుకు పెరగదు ... అంతుపట్టని ప్రశ్నలు
మనం ఎవరం వేరే వాళ్ళ మీద బురద జల్లడానికి... అసలా మనకి ఎం అధికారం ఉంది వేరే వ్యక్తీ జీవితం లో కి తొంగి చూడాటానికి. అసలా ఎవరిని అన్నా అనడానికి మనకి ఎం అధికారం ఉంది. మనకి ఒక వ్యక్తీ కొన్ని కారణాల వల్ల నచ్చక పోవచ్చు, అంతమాత్రం చేత ఆ వ్యక్తీ ని కాని ఆ వ్యక్తి జీవితం మిద కాని బురద చల్లే అధికారం ఎవరు ఇచ్చారు మనకి ? ఎంత సేపు జనాలు మనకే జే జే లు పలకాలి , మన చుట్టూ నే తిరగాలి అంటే ఎలాగా ? మనలో ఆ సత్తా ఉంటె మనం అడగక ముందే జనాలు గుర్తిసారు కదా ?
మనకి నచ్చక పొతే అది సున్నితంగా చెప్పే విధానాలు చాల ఉన్నాయి కాదా. మనం వాళ్లతో మాట్లాడటం మానేయ్యక్కర లేదు . వాళ్లతో నవ్వుతూనే ఇది మాకు ఇబ్బంది గా ఉంది అని చెప్పవచ్చు. సమస్య మనలోనే ఉంది. మనం అందరం. వేరే వాళ్ళ జీవితాలని శాసించాలి అనుకోవడం ఎంత తప్పు! మన జీవితాన్ని శాసించడానికి మనకి సమయం సరిపోదు. అలాంటిది మనం వేరే వాళ్ళకి చెప్పడం ఎంత హాస్యాస్పదం ! వారికి సలహా కావలిస్తే మనం వారికీ ఇచ్చే వారం అని వాళ్ళు అనుకుంటే ముందే అడిగీ వారు కదా. అసలా మనకి సలహా ఇవ్వలిసినంత అవసరం ఉందా ? మనం సరిగ్గా ఉన్నామా .. మనకే అంతా తెలుసా ? మనం ఎప్పుడన్నా సమస్య కి రెండో వైపు చూస్తున్నామా ? ఎవరు మన మాట వినకపోతే వాళ్ళని బ్లాగ్‌లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు రాసేయ్యడమేనా. ఎంత గందర గోళం గా ఉందొ
అంతా చదివి అంతే నా అనుకుంటే ఎం చెప్పలేం...
కుదిరితే కాసిని మంచి మాటలు .. కొంచం కాఫీ తాగి వెళ్ళండి .. దయ చేసి పక్క వాళ్ళ మిద మాత్రం బురద చల్లకండి.. ఇది విజ్ఞప్తి మాత్రమె...
6 comments:
!?!!
:( :( you can't change the human nature Sree
Anything wrong??
well said
Well said.
అక్షరలక్షలు విలువైన మాట చెప్పారు. ఒక్క చిరునవ్వు చాలు. పేద్ద ఖర్చు కూడా కాదు.దానికి కూడా మన దూరం ఎందుకు కావాలి? అసలు ఒక వ్యక్తి నచ్చకపోతే మాట్లాడటం మానడం అన్నది ఎంత మూర్ఖమైన ఆలోచనో కదా!!
అంటే, ప్రపంచం లో ఉన్న 6 బిలియన్ల మందితో మాట్లాడతాము ఆ ఒక్క వ్యక్తితో తప్ప! అంటే we are making him one in billions అనవసరమయిన ప్రాముఖ్యం ఇస్తున్నట్లే కదా!!
దానికన్నా ఒక చిరుచిరునవ్వు,ఒక హాయ్ ఇంకొక్క బయ్ సరిపోయె.
ముఖం చిట్లించుకుని చిరాకు పరాకు చూపెడితే మళ్ళీ మన ముఖంలోకి చిరునవ్వు రావడానికి బాగానే సమయం పడుతుంది కదా..అంత అవసరమా!!!
Post a Comment