Monday, October 19, 2009

మహాత్మా - బ్లూ చిత్ర సమీక్షలు

మహాత్మా ( తెలుగు చిత్రం )

కృష్ణ వంశి పేరు వినగానే ఎవరో విలేఖరి పూర్వకాలం ఇచ్చిన ట్యాగ్ లైన్ క్రియేటివ్ అని వచ్చేస్తుంది అదేదో ఇంటి పేరు లాగా. (సూపర్ స్టార్ కృష్ణ , మెగా స్టార్ చిరంజీవి గట్రా లాగా వాళ్ళు ఇప్పుడు ఆ పదవి లో లేక పోయినా సరే. ) శ్రీకాంత్ వందో సినిమా, కృష్ణ వంశి దర్శకత్వం , పేరు మహాత్మా అనగానే జనాలకి అంచనాలు పెరుగాయి.

కృష్ణ వంశి మాములుగానే సినిమా కి శ్రీకాంత్ చిత్రానికి ఉండే మార్కెట్ కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి (కృష్ణ వంశి సినిమాలకి ముందర అనుకున్న బడ్జెట్ కి పూర్తీ అవ్వడం అన్నది కలలో మాట, ఎప్పటికప్పుడు బడ్జెట్ పెంచుకుపోవడం అయన creativity అనడం తప్పుకాదు) సినిమాని నష్టానికి (ఇది కూడా చాలా మామూలు అయన సినిమాకి )అమ్మారు . సరే సినిమా ఇంకా మాములుగా మన ఎన్ ఆర్ ఐ లు కొన్నారు (చెప్పినా వినరు కదా అని మనం చెప్పడం మానము కదా) అతి సాధారణం గా సినిమా ప్రింట్ ఆలస్యం గా వచ్చింది అందువల్ల సినిమా కూడా ఆలస్యం గా విడుదల అయ్యింది.

సరే ఈ లోపల మనకి తిన్నది అరగదు కదా, అందరికి ఫోన్ లు చేసి ఎలా ఉంది సినిమా అని అడిగాం. చాల వరకు కృష్ణ వంశి పైత్యం అది ఇది అన్నారు. మనం కొంచం సీతయ్య టైపు కదా సినిమా చూడటం లో (ఎవరి మాటా వినం ) అందుకని ఓపికగా మొదలు పెట్టా సినిమా చూడటం.

మొదటి నలభై నిమషాలు సినిమా తాబేలు నడక. గొంగళి ఎక్కడ అంటే వేసిన చోటే అన్నట్టు కదలదు. రెండు ఆరవ గోల పాటలు తప్ప. (టైటిల్ సాంగ్ బాగుంది).. ఇంకా నాయిక సంగతి చెప్పక్కరలేదు . కారణం లేకుండా లా చదివి ఉ అంటే ఓ అని ఏడుస్తానుంటుంది. లా చదివితే ఎడవకుడదని కాదు కాని ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారు అండి మన కృష్ణ వంశి సినిమాలో . సినిమా మొదటి గంట దాదాపు గా అయ్యాక అప్పుడు కొంచం మలుపు తిరుగుతుంది అక్కడ నుంచి కొన్ని ఎత్తుకొచ్చిన (అంటే ఇంతకు ముందర ఇలాంటి సన్నివేశాలు వేరే సినిమాలో చూసాం కదా అన్న భావన రావడం అన్నమాట ) సన్నివేశాలతో సాగుతా ఉంటుంది. ఆఖరి పది నిమషాలు మంచి గ్రిప్ లో కి వెళ్లి క్లైమాక్స్ బాగా తీసారు.

కథానాయకి కి భాష తో బాటు నటన కూడా రాదు.కథ మంచి పట్టులో ఉన్నప్పుడు స్వప్నం లో జానపద బాణీ లో పాట వాళ్ళ కేరళ లో హీరో తో పాటు ఇంకో వంద మంది తో నీళ్ళల్లో పాడుకుంటుంది పడవ ఎక్కి.. అమ్మాయి తండ్తి కి ఎక్కువ సహాయపడుతూ ఉంటుంది అయన లాయర్ కాబట్టి. సినిమా మొదట్లో కొత్తగా ప్రాక్టీసు పెట్టిన లాయర్ అని చెపుతారు. మధ్యలో టీవీ వాళ్ళు ఏమో లీడింగ్ లాయర్ అని చెప్పేస్తారు అంటే ఈ లోపల అమ్మాయి లీడింగ్ లాయర్ అయిపొయింది అన్నమాట. హీరో తనకోసం గన్ పట్టుకుంటే రౌడీ అయిన సరే ప్రేమించిన అమ్మాయి తర్వాత గాంధి గారి కబుర్లు చెపుతుంది. హీరో వేరే కారణాల వాళ్ళ గాంధీ గిరి గురించి తెలుసుకుని ప్రశ్నలు వేస్తె అప్పుడు దారి చూపుతుంది. అంతకు ముందర హీరో ని సంస్కరిద్దాం అని ఆలోచన ఏ కోశానా ఉండదు. సుబ్బరంగా పాటలు పాడుకుంటూ తిరిగేస్తుంది.

ఒక్క హీరోయిన్ అనే కాదు, ఏ పాత్రకి సరి అయిన లోతు లేదు పాత్రలు . అన్ని పై పై నే. ఏ సన్నివేశం చూసినా మందలు మందలు గా జనం. కథ కాళ్ళకి అడ్డం పడుతూ కనపడతారు. కథకి అవసరం లేని సన్నివేశాలతో ఇబ్బంది పడుతూ, మనని ఇబ్బంది పెడుతూ ఏదో ఉంది అని అనిపిస్తూ , ఏమి లేదని కనిపిస్తూ , ఇదే కృష్ణ వంశి సినిమా అని నిరూపిస్తూ నీరసంగా, నిశ్చలం గా కదలక పోవడం ఈ కదిలే చిత్రం ప్రత్యేకత.

సినిమా చూస్తుంటే శ్రీకాంత్ తన నటన కంటూ ఉన్న ప్రత్యేకత ని మర్చిపోయాడు ఏమో అనిపిస్తుంది. చాలా సన్నివేశాలలో చిరంజీవే కనపడతాడు శ్రీకాంత్ కన్నా. రామ్ జగన్ కి కొంచం గుర్తింపు వచ్చిన వేషం ఇదేనేమో శివ తరవాత. జయప్రకాశ్ రెడ్డి కూడా పరవాలేదు.

సినిమా లో ముఖ్యం గా చెప్పుకోవలిసినది సిరివెన్నెల పాట. అద్బుత్యమైన పాట. ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధి (సెన్సార్ ఇబ్బంది వల్ల కొంతమంది ఇంటిపేరు గా మార్చారు ) అది తప్ప సినిమా లో పైన చెప్పినట్టు గా సరుకు తక్కువ సౌండ్ ఎక్కువ.

ఇన్ని కబుర్లు చెప్పిన మహాత్ముడు కృష్ణ వంశి వరదబాదితులకి సహాయం చేసే విషయం లో గాంధి గారి విగ్రహం లాగే నిశ్చలంగా ఉన్నారు కదలకుండా , మెదలకుండా, నన్ను కాదన్నట్ట్టుగా జరిగేది చూస్తూ ...

మహాత్మా .. శ్రీకాంత్ వందో చిత్రం. భావన నాయిక , కృష్ణ వంశి దర్శకత్వం .
---------------------------------------------------------------------------------------------
బ్లూ (హిందీ చిత్రం )

హిందీ వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు ఏమో అని మనకున్న సందేహలని పటాపంచలు చేసే చిత్రం బ్లూ.. నూట ముప్పై కోట్లు పెట్టి తీసిన సినిమా. ఈ సినిమాకి pirates of the carribean సినిమాకి పనిచేసిన కెమెరా మాన్ పని చేసారు, సంవత్సరం కష్ట పడి చేసిన సినిమా అది ఇది అని ఓ చెప్పితే నిజమే అనుకున్నా. పాటలు కూడా బాగానే ఉన్నాయ్ కదా అని కొంచం ఆతురత గానే చూసా.. సినిమా లో మొదటి సన్నివేశం చూడగానే ఇది కూడా సరుకు తక్కువ సౌండ్ ఎక్కువ సినిమా అని తల మిద బల్బు వెలగడం మొదలు పెట్టింది. అయిన సరే మనం సీతయ్య వారసులం కదా సినిమాలు చూడటం లో, అందుకని ఆ బల్బ్ మిద టర్కీ టవల్ వేసి మొత్తం ఓపికగా చూసా.

సినిమా చాలా వరకు ఆంగ్లం లో వచ్చిన పాత సినిమా Deep (1977) కి నకలు. సినిమాలో చాలా వరకు సన్నివేశాలు వేరే వేరే ఆంగ్ల సినిమాలో వచ్చిన సన్నివేశాలకి నకలు. పనికి రాని చేజ్ దృశ్యాలు. నవ్వు రాని హాస్య దృశ్యాలతో నింపేశారు.

లారా దత్తా బికిని దృశ్యాలు బాగున్నై . అలాంటివి చూసి మనం ప్రియమణి ని అలా చూస్తె రాజుని చుసిన కళ్ళతో మొగుడిని చూస్తినట్టు ఉంటుంది మరి. సినిమాలో బాగుంది కెమెరా మాత్రమె. మిగిలింది అంతా పరమ పరమ బోర్ సినిమా.

సంజయ్ దత్ ఊరిపోయి దారుణంగా ఉన్నాడు. నాయికలు పరవాలేదు. అక్షయ్ కొంచం పరవాలేదు. జావేద్ ఖాన్ సినిమా సగం మొహం కనపడదు రెండు కారణాల వల్ల .. ఒకటి అయన కి ఉన్నవి ఎక్కువగా చేజ్ దృశ్యాలు అందువల్ల బైక్ మిద హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మొహం కనపడదు. రెండో కారణం జుట్టు సగం మొహం కప్పెయ్యడం వల్ల (మన రామ్ చరణ్ కి అంటే అర్ధం చేసుకోగలం వీడికి ఆ అవసరం ఏంటో అర్ధం కాలా మరి )

కథ మొత్తం ఒక సముద్రం లో మునిగిన సంపద గురించి. దానికి దారి తెలిసిన వాడు ఒక్కడే .. సంజయ్.. దాని కోసం ఎవరు ఎలా ఎం చేసారు అన్నది కథ. బాహామాస్ కొత్తగా అందంగా ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. అది ఎలాంటి కెమెరా అన్న సరే అందంగానే ఉంటుంది . అండర్ వాటర్ కమెరా బాగుంది. మంచి స్టాండర్డ్ maintain చేసారు.


నీతీ : పాటలు బాగుంటే ... సి డి కొనుక్కుని విను. అంతే కాని సినిమా చూడాలనుకోకు.( గన్ను చూడాలనుకుంటే తప్పులేదు.. బుల్లెట్ చూడాలనుకుంటే తప్పే. చచ్చి పోతాం ( అతడు లో డైలాగు ) )

నూట ముప్పై కొట్లలో ముప్పై కోట్లు వచ్చినా గొప్పే ఈ సిన్మాకి .


బ్లూ : తారాగణం : అక్షయ్ కుమార్, సంజయ్ డుత్త్, జావేద్ ఖాన్ ,

4 comments:

Ramakrishna Podila said...

I agree with your review on Mahatma..

And I infact felt that krishna vamshi ended up portraying more non-gandhian ideas!

Dialogues should have been more effective at least!

Uttej did a great job!

Mari too much gaa hero ki TDP gurinchi gaani, PRP gurinchi gaani emi teliyadu!

కొత్త పాళీ said...

హ హ హ. బాగున్నై రివ్యూలు.
మొన్న అనుకోకుండా ఈ నీలిచిత్ర రాజమును మూడొంతులు పెద్దతెరమీద వీక్షించే భాగ్యం కలిగింది. సినిమా గురించి అంచనాలు దేవుడెరుగు, అసలు తారాగణం కూడ ఎవరో తెలీకుండా లోపలికెళ్ళాను, అంచేత, నాకు పర్లేదనిపించింది :) అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు ఏవీ చూళ్ళేదింతవరకూ, అతనుకూడా పర్లేదనిపించాడు. ఆస్ట్రేలియను సంగీత తార కలీమినోగ్ చిగివిగీ బహుపసందు :)

కన్నగాడు said...

అసలు కృష్ణవంశీ ఎందుకు సినిమా తీసాడో అర్థం కాలేదు, ఒక పక్క కాంగ్రెసు వాళ్ళు తెరమీదకి తెచ్చిన సెజ్ లని విమర్శిస్తూనే వై. ఎస్.ని టైటిల్స్ లో గొప్ప దేశభక్తులు కళాకారుల పక్కన కూర్చోబెట్టాడు.
ఇక బస్తీ వాళ్ళకు పట్టాలిప్పించే సన్నివేశం లాజిక్ అయితే నా పిచ్చి బుర్రకు అందలేదు, గాంధేయవాది ఆత్మహత్య ప్రయత్నం చేయడమేంటో.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం సినిమాపై చెలరేగిన వివాదాలపై వ్యాఖ్యానిస్తూ సినిమాని ఒక ఎంటర్ టైనర్ లా చుడాలంట మరి అలాంటప్పుడు స్లమ్।డాగ్ ని ఎందుకు విమర్శించాల్సి వచ్చిందో.
మొత్తం సినిమానే ఏదో కంగాళీగా ఏదో సీన్ల కుప్ప పోసినట్టుంది. యాక్.

budugu said...

హహ్హ.. మీ సమీక్ష దాంట్లో నీతి చాలా బాగున్నాయి. మనమూ సీతయ్య జాతేకాబట్టి బుద్ధిలేకా, కృష్ణవంశీకి ఒక లాస్ట్ చాన్స్ ఇద్దామని వెళ్ళా. ఫస్త్ హాఫ్ అయ్యేసరికి ఆ సౌండ్‌కి తలనొప్పి వచ్చి సినిమాలోంచి బయటకి వచ్చేశా.
చిన్న విజ్ఞప్తి. మీరు కథా నాయకి అనడం మానేసి కథా నాయిక అని రాయండి.