Wednesday, October 14, 2009

పురాణ ప్రలాపం - హరి మోహన్ ఝూ

డెట్రాయిట్ లో సాహితి సభలకి ఉమా వచ్చినప్పుడు లక్ష్మి రెడ్డి గారి ఉపన్యాసం వినడం జరిగింది. పుస్తకం కొంచం బిన్నంగా ఉంది అని అనిపించింది. చదివాక నిజంగానే భిన్నంగా అనిపించింది. మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక సందర్భం లో సత్యనారాయణ వ్రతాన్ని ఇంట్లో చెయ్యడమో, లేక ఎవరి ఇంట్లో ఏదన్న శుభకార్యం జరిగినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తుకుంటూ ఉంటె వెళ్లి చూడటమో, సంవత్సరానికి ఒక సారి ఏదో ఒక సందర్భం గా ప్రసాదం తినడం జరగక మానదు. ఆ వ్రత కథని ఇప్పటికి బోలెడు సార్లు కూడా వినివుంటాం.

కథకులు హరిమోహన్ ఝూ గారి ప్రకారం ఆ పూజ ఒక పూజ ఒక నాటకమైతే , కథ ఒక నవల.. పూజ నాటకం అని ఎందుకు అన్నారు అంటే , అన్ని ఉత్తితిగా పెట్టి, ఇదే బంగారం అనుకో, ఇదే పట్టు పీతంబరం అనుకో అని అంటాం కదా. పైగా అన్ని పెట్టి గంట వాయించేసి తినేది మనమే. అందువల్ల అది ఒక నాటకం అని ఈయన భావన.

కథ చివర్లో ఈ కథ చదివి అక్షింతలు వేసుకున్నవారికి , ప్రసాదం తిన్నవారికి, పూజ చేసినవారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి, మరణం తరవాత సత్యలోక ప్రాప్తి లభిస్తాయి అని ఉంటుంది కదా. మరి జనాలు అందరు ఇది చదివి ప్రసాదాలు తినేసే ఉంటారు కదా. వారు అందరికి ఐశ్వర్యం ఎందుకు రాలేదు. ముందర ఈ పూజ కాశి లో బీద బ్రాహ్మణుడు చేసి తరించారు అని అంటారు కదా. మరి మిగిలిన బ్రాహ్మణులు ఎందుకు ఈ పూజ చెయ్యలేదు. వారికి ఆ మాత్రం తెలివి లేదా ?

అంతే కాదు భగంతుడు పెద్ద వ్యాపారి. పూజ చేస్తా అని చెయ్యకుండా వాయిదా వేసే వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేసి వాళ్ళు పూజ చెయ్యగానే వాళ్ళకి విముక్తి కలిపిస్తూ ఉంటాడు .

సౌభాగ్య సంతతికరం సర్వత్రా విజయీ ప్రచమ్ (పూజ చేసే వాడు సౌభాగ్యం పొందుతాడు అన్ని చోట్ల గెలుపొండుతాడు ) అంటే వాడి ప్రతివాది ఇద్దరు పూజ చేస్తే ఎవరు గెలుపు పొందుతారు.

పూజ చేయించే గృహస్తు కోరిక సిద్దిస్తుందో లేదో కాని పూజ చేయించన బ్రాహ్మణుడి కోరిక మాత్రం సిద్దిస్తుంది. ఎందుకంటే కథ విని అందరు బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. లేక పొతే విధాత కూడా ప్రతికులుడు అయి పోగలదు..

ఇది మచ్చుకు మాత్రమె నేను ప్రస్తావించింది . హరి మోహన్ గారు ప్రతి పద్యం ఎంచుకుని దానికి బోలెడు నానార్హాలు చెప్పారు. అయన భాష పాండిత్యానికి ముగ్డులం కాక తప్పదు. ఒక ఇరవై మూడు ప్రసంగాలో అన్ని బాబాయి , అబ్బాయి ల మధ్య చర్చ జరిగినట్టు చూపించారు. అక్కడక్కడ అనువాదం కొంచం ఇబ్బంది పెట్టినా తప్పకుండా చదవాలిసిన పుస్తకం ఇది .

పురాణ ప్రలాపం - మైథిలి మూలం : హరి మోహన్ ఝూ . తెలుగు అనువాదం : లక్ష్మి రెడ్డి వేల వంద రూపాయలు

5 comments:

నాగప్రసాద్ said...

>>"ప్రతివాది ఇద్దరు పూజ చేస్తే ఎవరు గెలుపు పొందుతారు".

ఎవ్వరూ గెలుపొందరు, ఇద్దరికీ సంధి చేస్తాడు.

మీకు "కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు" అనే అన్నమయ్య కీర్తన గురించి తెలిసే ఉంటుంది.

ఈ కీర్తనలో స్వామిని పొగుడుతూ ఒకచోట "దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు" అని ఉంటుంది.

ఒకసారి, ఈ తొండమాన్ చక్రవర్తికి, మరో రాజుకు యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ గొప్ప విష్ణు భక్తులే కావడంతో, స్వామి ఇద్దరినీ రక్షించాలన్న ఉద్దేశ్యంతో, శంఖు చక్రాలు రాజు వైపు, స్వామి తొండమాన్ చక్రవర్తి వైపు ఉండి యుద్ధం చేస్తారు.

అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగాక, ఎన్ని రోజులైనా ఫలితం ఎటూ తేలకపోవడంతో, చివరికి ఇద్దరు రాజులు సంధి చేసుకుంటారు.

కాబట్టి, భక్తులు ఎవ్వరైనప్పటికీ, వాళ్ళని భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు.

ఇటువంటి పుస్తకాలు రాసేటప్పుడు, సదరు రచయిత భారతీయ ఆచార వ్యవహారాల గురించి, జరిగిన సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకొని రాస్తే మంచిది.

కేవలం హేతువాద ముసుగులో వ్యంగ ధోరణిలో ఈ పుస్తకం రాశారని విన్నాను.

>>"ముందర ఈ పూజ కాశి లో బీద బ్రాహ్మణుడు చేసి తరించారు అని అంటారు కదా. మరి మిగిలిన బ్రాహ్మణులు ఎందుకు ఈ పూజ చెయ్యలేదు. వారికి ఆ మాత్రం తెలివి లేదా ?"

భూమికి ఆకర్షణ శక్తి ఉందని ముందుగా న్యూటనే ఎందుకు చెప్పాడు?. మరి మిగిలిన మనుషులకు తెలివిలేదా? అన్నట్లుంది ఈ ప్రశ్న.

>>"కథ విని అందరు బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి".

ఇందులో తప్పేమి ఉందో నాకైతే అర్థం కాలేదు. బళ్ళో బడిపంతులు పాఠాలు చెప్పాలన్నా, కాలేజీలో లెక్చరర్లు బోధించాలన్నా తగిన మొత్తంలో జీతం ఇవ్వాలని డిమాండు చేస్తారు. ఒకవేళ జీతం తక్కువని భావిస్తే, విద్యార్థుల భవిష్యత్తుని పక్కన పెట్టేసి, వాళ్ళ డిమాండు తీరే వరకు ధర్నాలు, బంద్‌లు చేస్తారు.

అలా కాకుండా, బ్రాహ్మణుడు కథ మొత్తం చెప్పిన తర్వాత, దక్షిణ ఇవ్వమంటున్నాడు. అక్కడ కూడా ఇచ్చే వాళ్ళు ఇస్తారు లేకపోతే లేదు. ఒక విషయం గుర్తుంచుకోండి. ఉచితంగా, ఇతరులతో పని చేయించుకోవడం మహా పాపం. మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, కంపెనీ ఒక నెల జీతం ఎగ్గొట్టేసిందనుకోండి. మనకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి.

అలాగే, దక్షిణ అనేది పూజారి భుక్తి కోసం అనుకోండి. అందులో తప్పేమీ లేదు కదా. పైగా ఇంతే ఇవ్వాలని డిమాండు చేయట్లేదు కదా, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు.

ఇప్పటికే చాలా రాశాను. తరచి చూసేకొద్ది, చాలా తప్పులు కనిపిస్తున్నట్టున్నాయి ఈ పుస్తకంలో.

జై హింద్.
నాగప్రసాద్.

durgeswara said...

బాబూ నాగప్రసాదూ


ఏవిషయం లోనైనా అల్పునికి అల్పమైన ఆలోచనలేవస్తాయి .అమ్తకంటే వున్నతమైన ఆలోచనలు రావు. ఇక్కడ ఆథ్యాత్మిక లోతులలోంచి చూస్తేగాని అర్ధంగానివాటిని పక్కాహిందూద్వేషంతో వ్రాసినవారిగూర్చి సమయం వృధాచేసుకోవాల్సిన పనిలేదు.

అయితే వీల్లు చాలా తెలివితేతలుకూడా కలిగివుంటారు.ఇతరులదగ్గర ఇలా కూతలు౮ కూయరు.
అల్లాకు చెవుడా అలా అరుస్తారు అనో ,క్రీస్తు చేతకానివాడా శిలువకెక్కిస్తే కిక్కురుమనలేదనో మాట్లాడరు[అలామాట్లాడటం తప్పు] .ఎందుకంటె అది తప్పనికాదు వాల్లు తంతారని భయం. నీనమ్మకానికి విఘాతం కలిగితే కోర్టుకెళ్ళు అంతేగాని వ్బీళోలమనసులో ద్వేషం మాటలతో మారదు .

durgeswara said...

మీరెవరోగాని ఇలాంటి వ్యాఖ్యాాలతో కోరి పాపాన్ని మూటకట్టుకోవద్దని మనవి. తెలియకుంటే తెలుసుకోండి ఆసక్తిలేకుంటే వీటిజోలిరాకండి .ధన్యవాదములు

రాఘవ said...

భాషాపాండిత్యం ఉన్నంత మాత్రాన విషయపాండిత్యం ఉండవలసిన అవసరం లేదులెండి!

Unknown said...

అసుర మూకల ఆర్తనాదాలు ఇవి