తెలుగు వారికీ స్వంతమైన పచ్చడి... జీవితానికి నిర్వచనం .... అందుకే బ్లాగ్ పేరు మార్చాను ....
Monday, August 31, 2009
అనువాద రచయిత రాజశ్రీ గారి కి నివాళి
ముందరగా వెన్నెలకంటి గారికి ఫోన్ చేశా. అయన రాజశ్రీ గారి అబ్బాయి సుధాకర్ తో పరిచయం ఉంది కాని ఫోన్ నెంబర్ తెలీదు మా అబ్బాయి శశాంక్ కి తెలుసు రేపు ఫోన్ చెయ్యండి కనుక్కుని చెప్తా అని అన్నారు. (వారి అబ్బాయి అప్పుడు అక్కడ లేరు అని చెప్పారు లెండి ). సరే ఈయన ఉండేది మద్రాస్ కదా, అక్కడ మనకి గణేష్ పాత్రో గారు తెలుసు కదా, చాలా రోజులు అయింది పలకరించి అని ఆయనకి ఫోన్ చేశా. అయన తో కాసేపు మాట్లాడాకా జరిగింది చెప్పాను. పాత్రో గారు వెంటనే రాజశ్రీ గారి అమ్మాయి, వారి అమ్మాయి మంచి స్నేహితులు అని నెంబర్ కనుక్కుని ఫోన్ చేస్తా అని ఒక పావు గంట లో అయన ఫోన్ చేసి ఇచ్చేసారు. అలా రాజశ్రీ గారి అబ్బాయి సుధాకర్ నెంబర్ దొరికింది. ఇంకేం కోతికి కొబ్బరి కాయ లాగ వెంటనే ఫోన్ చేశా ఆయనకి. అయన ముంబై లో ఉన్నారు. నాదగ్గర రాజశ్రీ గారి ఫోటో లేదు అంటే అయన తన దగ్గర ఉన్న చిత్ర పటాన్ని పంపారు.
అయన చెప్పిన కబుర్లలో కొన్ని ఇక్కడ ...
నాన్నగారు డబ్బింగ్ రచయిత గా బాగా పేరు ఉంది అని చెప్పడం అంటే కొత్త విషయం కాదు. శ్రీ శ్రీ , ఆరుద్ర గార్లు ఇద్దరి తర్వాత నాన్నగారే ఎక్కువ సినిమాలు చేసారు. బంగారు పతకం సినిమా డబ్బింగ్ జరిగే అప్పుడు శివాజీ గణేషన్ గారు డబ్బింగ్ చూడటానికి వచ్చారు. జగ్గయ్య గారు డబ్బింగ్ చెపుతున్నారు దానికి. ఆ సమయం లో శివాజీ గారు వచ్చారు. శివాజీ గారిది కొంచం టిపికల్ లిప్ మూమెంట్. ఆయనకి డైలాగ్ భావం చెడకుండా ... లిప్ మూమెంట్ కి అతికేలా డబ్బింగ్ అన్నది కష్టమైన ప్రక్రియ అయన ఆక్కడ డబ్బింగ్ చూసి వెంటనే వచ్చి నాన్నగార్ని గట్టిగా కుగిలించుకుని ఇన్నాళ్ళు నేను తెలుగు డైరెక్ట్ చిత్రం చెయ్యలేదు అని బాధపడే వాడిని. ఇప్పుడు ఈ డబ్బింగ్ చూసాక నాకు ఆ బాధ తప్పింది ఇది నా డైరెక్ట్ సినిమా అంత గొప్పగా వచ్చింది అని అన్నారు. ఇది నేను ఎప్పటికి మర్చిపోలేని సంఘటన
రెహమాన్ తన మొదటి చిత్రం నుంచి నాన్నగారు ఉన్నంత కాలం అయన తో నే వర్క్ చేసారు. అలాగే మణిరత్నం గారు. అలా చాల మందికి నాన్నగారు రెగ్యులర్ గా రాసీవారు. ఒక సారి నాన్నగారితో స్నేహం చేస్తే ఎవరు వదిలే వారు కాదు. చలం గారి రమణ చిత్ర బ్యానర్ కి నాన్నగారు చేసిన పాటలు సత్యం గారి సంగీతం ఎప్పట్టికైన మరవగలమా.... కురిసింది వానా నా గుండెలోనా ... (బుల్లెమ్మ -బుల్లోడు ), మామా , చందమామా ... (సంబరాల రాంబాబు ), ఎక్కడో దూరాన కూర్చున్నావు ... (దేవుడమ్మ ), రాధకు నీవేర ప్రాణం ... (తులాభారం ) ఇలా ఎన్ని పాటలు అని చెప్పగలం.
నాన్నగారికి దర్శకత్వం అంటే మక్కువ ఎక్కువ. అప్పట్లో అయన మూడు సినిమాలకి దర్శత్వం వహించారు. రాఘవ గారి చదువు సంస్కారం , నిజం చెపితే నేరమా, ఓ ప్రేమ కథ. చదువు సంస్కారం బాగానే ఆడింది, నిజం చెపితే నేరమా ఓ మోస్తరుగా ఆడింది. ఓ ప్రేమ కథ ఫ్లాప్. ఓ ప్రేమ కథ మొదలు పెట్టగానే రాధిక పెళ్లి చేసుకుని లండన్ వెళ్లి పోయింది. దాంతో ఆ సినిమా ఒక ఆరు నెలలు కదలలేదు. ఈ లోపల అదే కథ తో శ్యాం ప్రసాద్ గారు తలంబ్రాలు తీసి హిట్ చేసేసారు (నాన్నగారు దానికి కూడా పాటలు రాసారు , నేను దానికి గిటారిస్ట్ ని , సత్యం గారి దగ్గర అప్పుడే చేరాను నేను) . అదే కథ మళ్ళా రావడం తో ఆ సినిమా అనుకున్నంత గా ఆడలేదు. దాంతో అయన దర్శత్వానికి స్వస్తి చెప్పారు. అంతే కాక అనువాద రచయిత గా కూడా చాలా బిజీ గా ఉన్నారు అయన. అది ఇంకో కారణం.
నాన్నగారు హటాత్తుగా పోవడం తో నాకు ఒక్కసారి ఎలా అయన చేసే ప్రాజెక్ట్స్ హేండిల్ చెయ్యాలో తెలీలేదు. అప్పటికి నేను గిటారిస్ట్ గా చాలా బిజీ గా ఉన్నాను. మా ఇంట్లో నేను ఒక్కడినే సినిమాల్లోకి వచ్చింది. అందువల్ల నేను ఆ సమయం లో నాన్నగారు చూస్తున్న శ్రీ కృష్ణ, రామాయణం సీరియల్స్ కి సంగీతం , పాటలు మాత్రం చేసాను. 2000 లో నేను మొట్ట మొదటి చిత్రం అనువాద రచయిత గా ప్రవేశం చేసాను. మొదటి సినిమా deep blue sea (పడమట సంద్యా రాగం నాయకుడు టాం హీరో గా వచ్చిన చిత్రం ) . అది కొలంబియా వారిది. దాని తరవాత ఒక రెండు వందలు దాక చేసి ఉంటా ఆ బ్యానర్ కి. హిందీ లో నేను బాగా కష్టపడ్డ సినిమా జోదా అక్బర్. దాదాపు ఒక ఏడాది కష్ట పడ్డాను దానికి. అసుతోష్ కూడా మద్రాస్ లో పది రోజులు నాతొ కుర్చుని ఒక్కో వాక్యం చెక్ చూసుకుని చూసుకున్నారు. ఆ సినిమా నాకు చాల పేరు తెచ్చింది. మా నాన్న గారి పేరు నిలబెట్టే సినిమా అని నేను అనుకుంటున్నా ఆ సినిమాతో.
రాజశ్రీ గారి మిద వ్యాసాన్ని ఆంగ్లం లో ఇక్కడ చదవండి ...
రాజశ్రీ సుధాకర్ గారి మినీ ఇంటర్వ్యూ ని ఆంగ్లం లో ఇక్కడ చదవండి
Saturday, August 29, 2009
సు'స్వరాల' మాల - పెండ్యాల గారికి నివాళి
శివశంకరీ, శివానందలహరి... (జగదేకవీరుని కథ, 1961)
చిగురాకులలో చిలకమ్మా!... (దొంగ రాముడు, 1955)
రసికరాజ, తగువారము కామా?... (జయభేరి, 1958)
హాయిహాయిగా జాబిల్లి... (వెలుగునీడలు, 1961)
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ... (పరువు-ప్రతిష్ట, 1963)
మీరజాలగలడా నా యానతి... (శ్రీకృష్ణ తులాభారం, 1966)
మాట మీరగలడా... (శ్రీకృష్ణ సత్య, 1971)
జోహారు శిఖిపింఛమౌళీ!... (శ్రీకృష్ణ విజయం, 1971)
మెరిసే మేఘమాలికా... (దీక్ష, 1974)
చిరునవ్వుల తొలకరిలో... (చాణక్య చంద్రగుప్త, 1977)
ఇలా వ్రాసుకుంటూపోతే చాలానే ఉన్నాయి. కె.వి.రెడ్డి గారికి పెండ్యాల గారే ఆస్థాన సంగీత దర్శకుడు ఒక రకంగా. ఆయన చేసిన చాలా సినిమాలకి (దొంగరాముడు, భాగ్యరేఖ, భాగ్యచక్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము, సత్య హరిశ్చంద్ర, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ), అలాగే కె.బి.తిలక్ గారి అన్ని చిత్రాలకి (అత్తా ఒకింటి కోడలే, ఈడు-జోడు, ఉయ్యాల జంపాల, కొల్లేటి కాపురం, భూమి కోసం, పంతాలు-పట్టింపులు, ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ) ఈయనే సంగీత దర్శకుడు. ఎన్ని పాటలు, ఎన్ని చిత్రాలని చెప్పగలం... ఆయన చేసిన ప్రతి పాటా ఒక అణిముత్యమే, ప్రతి చిత్రమూ ఒక మధుర సంగీత జ్ఞాపకమే!
Friday, August 28, 2009
మల్లన్న - చిత్ర సమీక్ష
కథ ఎమన్నా కొత్తదా అంటే ఎం లేదు. అదేం లేదు. ఇంతకు ముందు శంకర్ మూడు సార్లు తీసి పడేసిందే. జెంటిల్ మాన్, ఒకే ఒక్కడు, శివాజీ అన్నిటి కథ ఒక్కటే కదా. ఇది కూడా ఆ తాను లోని ముక్కే. ఇండియా లో ఉన్న బ్లాకు మనీ ని జనాలకి పంచి పెడితే ఎలా ఉంటుంది అన్నది కధాంశం. దానికి మాములుగానే ఆరవ గోల లో తీసారు. మీకు ఏదన్న సమస్య వస్తే మల్లన్న గుడి లో చీటీ కడితే మీ కోరిక తీరుతుంది అని నమ్మిక. అలా జనాల సమస్య తీర్చడం ఎలా అంటే .. నాయకుడు CBI లో ఆర్ధిక నేరాల విభాగం లో ఉంటాడు. అందువల్ల బాగా ఉన్నవాళ్ళ ఇంటి మిద దాడి చేసి అక్కడ వచ్చిన డబ్బులో సగం GOVT కి ఇవ్వకుండా జనాలకి పంచి పెడతాఉంటాడు. ఆయనకి సపోర్ట్ మన సూపర్ స్టార్ కృష్ణ. అయన మీద ఎంక్వయిరీ ఆఫీసర్ ప్రభు. నాయకుడి ని ప్రేమిస్తునట్టు నటించి ప్రేమలో పడే సుబ్బలక్ష్మి పాత్ర లో శ్రేయ వేసింది.
నాయకుడిగా విక్రం విభిన్న పాత్రలు బాగానే చేసాడు. కష్టపడ్డాడు. కానీ కథ ఎక్కడా కదలదు. ఎక్కడ వేసిన గొంగళి లాగా సాగు...తూ.... ఉంటుంది. నిర్మాత బోలెడు కర్చు పెట్టారు. అంత అవసరమా అంటే అక్కరలేదు నిజానికి.
దర్శకుడు సుసీ గణేష్ కి ఇది నాల్గో చిత్రం. రెండో చిత్రం 5 star చిత్రం చూసాను. బాగుంది బాగా తీస్తారు అని అనుకున్నా (తెలుగు లో లైఫ్ స్టైల్ అని మొన్న విడుదల అయ్యింది, ముప్పలనేని శివ దర్శకుడిగా, ఆ చిత్రానికి మాతృక ఈ చిత్రం.). సుసీ గణేశన్ అసలు పేరు సుబ్బయ్య (తండ్రి పేరు ) గణేషన్ డిగ్రీ చదువుతున్నపుడు (ఇంజనీరింగ్ ) తల్లి పేరు (సితప్ప ) కూడా కలిసి వచ్చేలా సూసీ గణేశన్ గా మార్చుకున్నాడు. చదువు అయ్యాక కొంతకాలం పత్రికా విలేఖరిగా చేసాడు. అక్కడ ఒకసారి మణిరత్నం ని కలిసాడు. మణిరత్నం దగ్గర బొంబాయి , దిల్ సె , ఇద్దరు చిత్రాలకి సహాయకుడిగా చేసాడు. (5 star చిత్రానికి మణిరత్నం నిర్మాత ) మూడో సినిమా తిరుత్తు పాయలె కూడా మంచి హిట్ సినిమా. ఇలాంటి దర్శకుడు తీసే సినిమా అంటే అంచనాలు అంబరాన్ని అంటాయి. కానీ సినిమా చూసాక స్పుత్నిక్ లా చతికిల పడ్డారు .
సినిమా కి ఒక రకం గా మైనస్ ఎడిటింగ్ . సినిమా నిడివి మూడు గంటల పదినిమషాలు శ్రియ , విక్రం మధ్య లవ్ ట్రాక్ చెత్తగా ఉంది. శ్రియ జయమాలిని, ముమైత్ ఖాన్ లకి పోటీ అని చెప్పుకొనవచ్చు. అర కోర దుస్తులతో పాటు, తెరపై మొదటి సారి లిప్ కిస్ ఇచ్చింది.
ఈ సినిమాలో ముమైత్ ధర ముప్పై లక్షలు అని చూపించారు. ముప్పై లక్షలు ఇస్తే ఎవరి దగ్గర అన్నా నాట్యం చేస్తుంది అన్న భావన వచ్చేలా ఉన్నాయ్ దృశ్యాలు. మరి ముమైత్ కి విషయం తెలుసో లేదో మనకి ఎరుక లేదు.
అన్ని అన్ని దేశాలు ఎందుకు వెళ్ళారో ఎందుకు అంత కర్చు పెట్టారో అర్ధం కాని సినిమా. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్టు గా ఉంది ఈ సినిమా. వీళ్ళు చెప్పినట్టు ఆ సినిమా కి పెట్టిన కర్చు ని జనాలకి పంచి పెడితే ఇంకా మంచి ఉపయోగం గా ఉండేదేమో.
రఘువరన్ ఈ సినిమా చెయ్యాల్సి ఉంది. సగం షూటింగ్ అయ్యాక అయన మరణించడం వల్ల అయన పాత్రలో ఇంకొకరిని తీసుకున్నారు.
విక్రం ఈ చిత్రం లో తన పాటలు తానె పడుకోడమే కాక తొలిసారిగా తెలుగు లో తన డబ్బింగ్ తానె చెప్పుకున్నాడు. అది ఒకటి అభినందనీయం. కానీ ఆహార్యం సరిగ్గా లేదు. వయసు మీరినట్టు కనిపించాడు చాల చోట్ర్ల . సరి అయిన శ్రద్ధ తీసుకున్నట్టు కనపడదు.
పాటలు అన్ని గోల గోల పాటలే. కెమెరా కూడా అయన ఇష్టం వచ్చినట్టు గా ఉంది.
సినిమా చూడాల వొద్దా అంటే నేను మాత్రం వొద్దనే చెపుతాను.
పాపం మా ఫ్రెండ్. ...
పెళ్లి అయ్యి హనీ మూన్ గట్రా ముగించుకుని రాత్రి న్యూయార్క్ లో వాలాడు కొత్త పెళ్లి కూతురు తో కలిసి. కనెక్టింగ్ ఫ్లైట్ చాలా మాములుగా దైవాదీనం కదా. ఒకసారి ఇంకో గంట అన్నాడు .. మళ్ళా తూచ్ కాదు రెండు గంటలు అంటా అన్నాడు .. ఏదయితే ఎం రాత్రి తొమ్మిది కి రావాల్సిన వాళ్ళు , రెండుగంటలకి ఫ్లైట్ దిగారు. వాళ్ళ లగేజీ కి ఒక కార్ సరి పోదు కదా అని రెండు కార్లు వేసుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాం. అక్కడ నుంచి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్లి లగేజి వాళ్ళ ఇంల్లో పెట్టె కార్యక్రమం నలుగురు చూస్తూండగా , మా వాడు ఇంకో ఫ్రెండు కింద కార్లు పార్క్ చేసి పైకి వచ్చారు. కొత్త పెళ్లి కూతురు కదా అని హారతి ఇద్దాం అని ఉత్సాహ పడిపోయింది మా కజిన్. ఎవరం సిగరెట్లు తాగేవాళ్ళం కాకా పోవడం వల్ల అగ్గిపెట్టె లేదు. వాళ్ళ స్టవ్ చూస్తె electric స్టవ్ సరే అని కొంచం కుస్తీ పది ఒక పేపర్ అంటించి దాంతో కర్పూరం వెలిగించాం.
\
గుమ్మం కాడ (గుమ్మం అంటే లేదు లెండి కాని ఫ్రంట్ డోర్ దగ్గరే ) పేర్లు చెప్పి లోపలి రండి అని హారతి ఇస్తున్నాం, ఈ లోపల వల్ల తలుపు దగ్గర ఉన్న (వీళ్ళు ఉండేది మూడో అంతస్తు ) కారిడార్ లో ఉన్న ఫైర్ అలారం మోగడం మొదలు పెట్టింది (హారతి దానికి అనుకున్నట్టు ఉంది ). అప్పుడు సమయం ఉదయం మూడు గంటలు. అది ఎక్కడ ఆగేలా లేదు అని అర్ధం అయింది. మేము మా వాడికి జాగర్తలు చెప్పి చల్లగా కిందకి చేరుకునే అప్పటికి పాపం నిద్ర మొహాలతో జనాలు గదులు కాళి చేస్తూ బయటకి వస్తున్నారు. అది false అలారం అని కొంతమందికి చెప్పి మేము మా ఇంటికి బయలుదేరాం.
దార్లో situation ఏంటో కనుక్కుందాం అని వాడికి కాల్ చేసాం. ఏముంది నాలుగు పోలీసు కార్లు, మూడు ఫైర్ ఇంజన్లు , నలుగు అంబులెన్స్ లు వచ్చాయి అని చల్లగా చెప్పాడు. వాళ్ళు వచ్చి అంతా వెతికి అంతా బాగానే ఉంది అని చెప్పే దాక అందరూ కింద నిద్రమొహాలతో కూర్చున్నాం అని చెప్పాడు. అది ఒక అరగంట పట్టింది.
పొద్దున్నే మా వాడు మళ్ళా ఫోన్ .. ఏంటి అంటే కార్ కనిపించడం లేదు అని. కార్ రాత్రి పార్క్ చేసాం కదా అంటే . అది డే కేర్ కి సంబందించిన పార్క్ ఏరియా దాంట్లో ఎక్కువ సేపు చెయ్యకూడదు. అందువల్ల మళ్ళా tow చేసారు అని తాజా వార్త. పొద్దున్నే మా వాడికి ఇంకో నూట యాభై డాలర్లు బొక్క.
Thursday, August 27, 2009
సగం తెరిచిన తలుపు - పాపినేని శివ శంకర్
మొన్న వారాంతం రోజున న్యూయార్క్ వెళ్ళే అప్పుడు దారిలో చదువుదాం అని ఆ పుస్తకాన్ని తీసుకు వెళ్ళాను. పుస్తకం లో మొదటి కథ చింతల తోపు కథ చదువుతూ ఉంటె ఒకప్పటి బాల్యాన్ని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు అని అనిపించింది. ఒక బాలుడి బాల్యం తో ముడిపడిన సేద్యపు జీవితం ఎలా మెల్లిగా మారింది అన్నది కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది.
అలాగే ఒక్క వాన కోసం కథ లో జీవితాన్ని జీవితం లాగా ఎలా తిసుకోవచ్చో చాలా బాగా చెప్పారు. ఎప్పటికి ఈ పరుగు అపకపోవడం వల్ల ఎలా ఉంటుందో చెప్పకుండా నే చెప్పారు.
మనం మాట్లాడక పోవడం వల్ల మనుషుల మధ్య లో గోడలు ఎలా పేరుకు పోతాయో ఇంకో కథ లో చెప్పారు.
శివ రెడ్డి గారి కవిత్వం ఎందుకు నచ్చుతుందో.. నారాయణ రెడ్డి గారు ఇంకా ఇంగువ కట్టిన గుడ్డ లాగ పత్రికలని ఎలా తింటున్నారో (పరోక్షంగా ) చెప్పారు.
చివరి పిచ్చుక కథ చదువుతుంటే ఒకప్పుడు మా ఊర్లో ఉండే తుమ్మ చెట్లకి గుత్తులు గుత్తులుగా వేళ్ళాడే గిజిగాడి గూళ్ళు ఇప్పుడు కనపడక పోవడానికి కారణం తెలిసింది ఏమో అనిపించించి. అప్పట్లో తుమ్మ చెట్లు, తుమ్మ బంక కోసం వెళ్లి ఆ గూళ్ళు చూసి, నగరంలో మాకు అవి కనపడవు కదా అని ఎత్తుకొస్తే మా బాబాయి తిట్టిన తిట్లు ఇంకా చెవిలో మోగుతున్నట్టుగా వినిపిస్తాయి.
సముద్రాన్ని ఎక్కడ పరబోయ్యాలో తేలిక మనం కూడా ఆలోచన లో పడిపోతాం సముద్రం కథ చదివాక.
మొత్తం పదహారు కథలు ఉన్న ఈ సంకలనం మనలని ఒక లోకం లో కి తీసుకుపోవడం ఒక అనుభూతి.
మాములుగా మనం ఒక కథ చదివితే రచయిత మనకి తను ఎం అనుకుంటున్నారో విపులంగా చెప్పేస్తారు. మనకి ఎక్కువ ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉండక పోవచ్చు. కాని శివశంకర్ గారి కొన్ని కథల్లో రచయిత గా అయన చెప్పాల్సింది చెప్పేసి కథ ని మన ఊహకే వదిలేస్తారు. దాని వల్ల ఒక కథ చదువరి మెదడుకి పదును పెడుతుంది. కథ కొంతకాలం తప్పకుండా వెంటాడుతుంది.
ప్రతి కథ దేనికి దానికి బిన్నంగా, ప్రతి కథ లో కూడా వస్తు వైవిధ్యాన్ని దాంట్లో కూడా మర్కిజం అస్తిత్వం ఇలా భిన్నమైన సబ్జెక్టు లను అవలీల గా చర్చిస్తారు. అలా అని తన భావాలని మన మిద రుద్ద కుండా మన ఆలోచనలని పదును పెట్టె లాగా రాసారు.
ఈ కథా సంకలం అన్ని పుస్తక విక్రేయ కేంద్రాల్లో లభ్యమవుతాయి. వేల డెబ్భై రూపాయలు. అమెరికా లో అయితే avkf.org వాళ్ళ సైట్ లో దొరుకుతుంది. వేల సుమారుగా ఒక డాలరు అరవై సెంట్లు.
Tuesday, August 25, 2009
వర్షం లో న్యూయార్క్
ఈ మధ్యే చదువు కోసం మన దేశం నుంచి మా ఊరు (pittsburgh) వచ్చాడు ఒక అబ్బాయి పేరు అనూప్ . ఆ అబ్బాయి కి న్యూయార్క్ ఈ వారాంతం చూపిద్దాం అని మా స్నేహితుడు ప్రమోద్ నేను బయలుదేరాం. నాకు తెలిదు కానీ మా ప్రమోద్ కి వారాంతం వాతావరణం బాగా లేదు అని weather report లో చూసేసాడు అంట. వచ్చిన అబ్బాయి అనూప్ చెన్నై నుంచి, తెలుగు వాడే. చెన్నై లో అలవాటు ప్రకారం గొడుగు తన సంచి లో వేసుకు వచ్చాడు. ( నేను ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో అక్కడ నుంచి గొడుగు తేవడం అన్నది చూడటం మొదటి సారి సుమా. ) మా కార్ సగం దూరం వచ్చాక మా స్నేహితుడు చల్లగా రేపు thuderstroms న్యూయార్క్ లో అన్నాడు. ఆనూప్ ఏమో నేను గొడుగు తెచ్చాగా అని ఇంకా చల్లగా చెప్పాడు. న్యూజెర్సీ లో ఉన్న ఇంకో స్నేహితుడు కిరణ్ ఇంటికి వెళ్ళాం. అక్కడ మేము చేరే అప్పటికి రాత్రి పన్నెండు అయ్యింది. అప్పటికే భోరున వర్షం. మేము వెళ్ళాక తగ్డింది. నైట్ టైం న్యూ జెర్సీ నుంచి న్యూ యార్క్ చూద్దాం అని ఒక నలభై నిమషాలు డ్రైవ్ చేసి వెళ్ళాం .. వెళ్ళే అప్పుడు బాగానే ఉంది వాతావరణం అని గొడుగులు తీసుకెళ్ళ లేదు. అక్కడ బండి పార్క్ చేసి నడుచు కుంటూ వెళ్ళాం. వెళ్ళిన అయిదు నిమషాలు బాగా ఎంజాయ్ చేసాం వ్యూ. ఈ లోపల భోరున వర్షం అలా తడుస్తూ న్యూ యార్క్ ని వర్షం లో చూడటం ఒక మంచి అనుభవం. అర్ధరాత్రి ఎవరు మనలని తరమ కుండా అలా ఎంత సేపు అన్న చూస్తూ ఉండటం ఎంత బాగుంటుందో. కాని ఎక్కువ సేపు ఆ వర్షాన్ని తట్టుకోలేక గబ గబా పరిగెత్తి ఒక అపార్ట్మెంట్ బాల్కొని కింద నిల్చున్నాం . మాతో వచ్చిన ఇంకో అబ్బాయి వెళ్లి కార్ తీసుకుని వచ్చాడు. ఇంకా అందరం ఇంటికి బయలు దేరాం. ఇంటికి చేరే అప్పటికి రాత్రి మూడు అయ్యింది. వెంటనే నిద్ర పోద్దాం అంటే కుదరలేదు. కారణం మరేం లేదు. నల్లులు పీకి పాకం పెట్టాయి. వాటికీ పాపం చాలా రోజులకి కొత్త మనుషులు దొరికినట్టు ఉన్నారు, పండగ స్పెషల్ ఆఫర్ అన్నమాట.
ఆలస్యంగా పడుకోవడం వాళ్ళ శనివారం నాడు ఆలస్యంగా నే లేచాము. లేచి న్యూయార్క్ కి కార్లో వెళ్లి తిరగడం కష్టం కాబట్టి న్యూయార్క్ వరకు ట్రైన్ లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. కార్ రైలు స్టేషన్ లో పెట్టి రైలు ఎక్కుదాం అని స్టేషన్ కి బయలు దేరాం. ఇంటి దగ్గర ఎడమ వైపు మలుపు తీసుకోకుండా కుడి వైపు తీసుకోడం వల్ల దారి తప్పి కొంచం సేపు తిరిగాం. మళ్ళా కిరణ్ కి ఫోన్ చేసి సరిఅయిన దరి కనుక్కొని. అటు వెళ్ళాం. కాని వెళ్ళే దారి అంతా సందేహమే రైలు సరి అయిన సమయానికి వస్తే దొరకదు అని. మా అదృష్టం కొద్ది అది పదిహేను నిమషాలు ఆలస్యం గా వచ్చింది (శని , ఆదివారాలు తక్కువ రైళ్ళు తిరుగుతాయి అందువల్ల ఈ రైలు కనుక అందుకోలేక పొతే ఇంకో గంట అక్కడ స్టేషన్ లో చెక్క భజనే అది మా సమస్య ) అప్పటికే వాతావరణం మన ఊటీ లాగ ఉంది. అంటే పొగమంచు సన్నగా తుపర ఎటు చూసినా పచ్చగా చాలా అందంగా ఉంది .
ప్రమోద్ టికెట్ కొన్న నలుగు నిమషాలలో నే రైలు వచ్చింది. నేను TANA కి వచ్చినప్పుడు పాపినేని శివశంకర్ గారు ఇచ్చిన సగం తెరిచిన తలుపు పుస్తకం తెచ్చుకున్నా రైలో చదువుకోడానికి. దాంట్లో ఒక్క వాన కోసం కథ చదువుతూ ఉంటే నేను కూడా న్యూయార్క్ లో వర్షం లో లిబెర్టి విగ్రహాన్ని వర్షం లో చూస్తా కదా అన్న ఆలోచన వచ్చింది.
మేము న్యూయార్క్ చేరే అప్పటికి వర్షం రావడానికి ముందర వచ్చే ఉక్క, మబ్బు లతో ఉంది. నలభై రెండో వీధి (42 nd street ) దిగి అక్కడ మమ్మల్ని కలవడానికి వచ్చే కమల్, నిత్య ల కోసం వేచి ఉన్నాం. కమల్ కి గొడుగులు తెమ్మని చెప్పాము. కమల్ న్యూయార్క్ లో ఉండటం వల్ల ఇంట్లో నాలుగు గొడుగులు ఉన్నాయ్ అని చెప్పాడు. (న్యూ యార్క్ లో ఉండే జనాలకి గొడుగులు రోజు తెసుకేల్లడం అలవాటు మన చెన్నై వాసుల లాగా) కానీ కమల్ మర్చిపోవడం వల్ల మళ్ళా వెనక్కి వెళ్లి తీసుకుని రావడానికి వెళ్ళడం వల్ల తనకి రావడం ఆలస్యం అయింది. ఈ లోపల మేము తిరగడం మొదలు పెట్టాం. కమల్ వచ్చే దాక వర్షం పాపం మా దగ్గర గొడుగులు లేవు కదా అని ఆగింది. కమల్ వచ్చిన అయిదు నిమషాలకి వర్షం మెల్లిగా మొదలు అయింది. అప్పటిదాకా రెండు డాలర్లు ఉన్న గొడుగు ఇరవై డాలర్లకి అమ్మడం మొదలు పెట్టాడు రోడ్డు పక్కన ఉన్న చైనా వాడు. మేము గొడుగు లు ఉండటం వల్ల హాయిగా తిరగడం మొదలు పెట్టాం.
నాకు , అనూప్ కి ఫొటోస్ పిచ్చి ఉండటం వల్ల వర్షాన్ని ఎక్కువ లెక్క చెయ్యకుండా ఫోటోలు తియ్యడం మొదలు పెట్టాం. ప్రమోద్ , కమల్ పాపం మాకు (లేక మా కెమెరా లకా ? ) మేము ఫొటోస్ తీస్తుంటే మాపైన వర్షం పడకుండా గొడుగులు పట్టారు . నిజం చెప్పాలి అంటే ఇద్దరికీ బోలెడు ఓపిక అండ్ మంచితనం లెండి. టైం స్క్వేర్ కి మధ్యలో ముప్పై నాలుగో విధి (34th street ) నుంచి రోడ్ మధ్యలో కుర్చీలు, బల్లలు (tables) వేసారు ఈమధ్యే. దాంతో మనం రోడ్ మధ్యలో కుర్చుని చక్కగా వచ్చే పోయే జనాలని చూస్తా ఆనందించవచ్చు. అక్కడ నుంచి time square రెండు వైపులా చక్కగా కనిపిస్తుంది. పక్కనే toys "R" us, M & M , Gap లాంటి స్టోర్స్ చాలా ఉన్నాయ్.. మేము కొంత సమయం అక్కడ తిరుగుతూ గడిపాం. అనూప్ క్లాసు మేట్ అక్కడే న్యూయార్క్ లో చదువుతున్నారు. తను కూడా కొత్తగా వచ్చారు ఇండియా నుంచి. పేరు మదన్, తను కూడా వచ్చి కలిసాడు అక్కడ. అందరం M&M స్టోర్ లో తిరిగాం. స్టోర్ బాగానే ఉంది కానీ, చిక్కల్లా ఒక్కటే.. పైకి వెళ్ళే escalator మాత్రమె పనిచేస్తుంది అక్కడా. రెండు అంతస్తులు ఉన్నా దేనికీ కూడా కిందకి వచ్చే escalator పని చెయ్యదు. ఒక రకమైన marketing tactics ఏమో మరి.
అక్కడ నుంచి బైట పడి కిందకి వచ్చాక , మదన్ పాపం పొగ తాగుదాం అనుకుని malboro cigerettes కొన్నాడు . అమెరికా మొత్తం మిద ఎక్కడ ఖరీదు ఎక్కువ అంటే సిగరెట్లు దొరకును అనగా న్యూయార్క్ అని టక్కున సమాధానం చెప్పొచ్చు. ఒక్క పాకెట్ ఖరీదు పడి డాలర్లు మాత్రమె. పాపం ఎం చేస్తాడు అలవాటు కదా తప్పదు అని దేవుడా అని కొన్నాడు (మనవాళ్ళు మాములుగా ఇండియా నుంచి వచ్చే అప్పుడు ఒక డబ్బా తెచ్చుకుంటారు సిగరెట్లు, ఇండియా బ్రాండ్లు ఇక్కడ ఖరీదే కాక దొరకవు కదా. ఈ అబ్బాయి కూడా అల తెచుకున్నాడు కాని, ఈ రోజు తీసుకురావడం మర్చి పోయాడు. ఈయన కూడా ఇండియా నుంచి గొడుగు తెచ్చుకున్నాడు )
అక్కడ నుంచి టైం స్క్వేర్ దగ్గరకి వచ్చాం. క్రతం ఏడాది లేనిది కొత్తగా అక్కడ పెట్టింది ఏంటి అంటే ఎర్ర మెట్లు . రాత్రి పుట ఆ మెట్ల కింద లైట్లు వెలుగుతూ ఒక రకమైన అందాన్ని ఇస్తాయి. ఆ మెట్లు ఎక్కి చుస్తే టైం స్క్వేర్ మొత్తం బాగా కనిపిస్తుంది. మెట్లకి ఇరు వైపులా చాలా మంది ఒక వరసలో నుల్చుని పాటలు వినడమో, పుస్తకం చదవడమో లేక పక్క వాళ్లతో మాట్లాడటమో చేస్తున్నారు. నాకు అర్ధం కాలా ఎందుకో అని. కమల్ ని అడిగా దేనికి ఆ లైన్ అని. ఆ లైన్ లో ఆ రోజు broadway shows కి మిగిలన టికెట్స్ అమ్ముతారు సగం ధరకి అని చెప్పాడు. తెలుసుగా అక్కడ broadways కి చాలా ప్రసిద్ది. ఈ సారి డిసెంబర్ లో jude law నటించిన Hamlet ప్రదర్శన కూడా ఉంది. (jude law అంటే talented mr. ripley lo dickie greenfield పాత్ర వేసారు, ఇంకో మంచి సినిమా ఈయన చేసింది Road to Perdition (2002) దిన్ని తెలుగు లో మన మోహన్ బాబు శివశంకర్ అని తీసి పడేసారు లెండి ) . ప్రస్తుతం ఎక్కడ చూసినా లయన్ కింగ్ musical బాగా ఆడుతోంది అక్కడ. ఎక్కడ చూసినా ఆ ప్రదర్శన తాలూకు ప్రకటనలే కన్పించాయి.
కమల్ అక్కడ ఉన్న john pizzaria కి తేసుకు వెళ్ళాడు. అది నిజానికి 1888 లో ఒక చర్చి. అది కాలి పోవడం తో అలాగే కనిపించేలా pizzaria ని కట్టారు. ఇది న్యూయార్క్ లో చాలా ప్రసిద్ది పొందినది. 1907 లో కట్టిన ఈ pizaaria లో ఒకే సారి నాలుగు వందల మంది దాకా తినవచ్చు. దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. అది brick oven లో చేస్తారు. ప్రతి పిజ్జా కూడా చేత్తో చెయ్యడం కూడా దీని ప్రత్యేకత. పిజా ఎలా ఉందొ నాకు తెలిదు కాని (అంటే శనివారం కదా అందుకని నేను ఒక పుటే భోజనం లెండి, అందువల్ల తినలేదు నేను ) అక్కడ సర్వర్ మాత్రం సరిగ్గా లేడు. మేము చెప్పేది సరిగ్గా వినకపోవడమే కాక ముందర తేవలిసినవి తర్వాత తేవడమే కాక , rude గా మాట్లాడాడు.
భోజనాలు అయ్యాక అక్కడ నుంచి సబ్వే పట్టుకుని statue of liberty కి బయలుదేరాం. అక్కడ మాకు స్ట్రీట్ performers కనపడ్డారు . మంచి పెర్ఫార్మన్స్ వాళ్ళది. బాగుంది. అక్కడ నుంచి ఫెర్రీ ఎక్కి liberty statue కి బయలుదేరాం. దాని చుట్టూ తిరిగి మళ్ళా వెనక్కి వచ్చాము. ఫెర్రీ లో నుంచి చూస్తే న్యూ యార్క్ చాలా బాగా కనపడుటింది . అక్కడ కాల్గేట్ వాళ్ళ పెద్ద watch కనపడుతుంది .
అక్కడ నుంచి మళ్ళా సబ్వే పట్టుకుని సెంట్రల్ పార్క్ కి బయలు దేరాం. సెంట్రల్ పార్క్ కి వెళ్ళే దార్లో కమల్ వాళ్ళ ఆఫీసు చూసాం. వాళ్ళ ఆఫీసు పైన ఉన్న అపార్ట్మెంట్ ల లో సింగెర్ బియన్సి ఉంది అని చెప్పాడు. ఆ అమ్మాయి పెళ్లి అయినప్పుడు ఆ విధి అంతా ప్రెస్ రిపోర్టర్లు తో నిండి పోయింది అని చెప్పాడు. సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న పార్క్ హోటల్ లో ఒకప్పుడు హోం ఆలోన్ సినిమా తీసారు ఇప్పుడు దాన్ని condominums గా మర్చి అమ్మేసారు. దాని కి ఇంకొంచం ముదుకు వెళ్తే సోనియా గాంధి అమెరికా వచ్చినప్పుడు నివసించిన హోటల్ ఉంది అది దాటి ముందుకు వెళ్తే కొలంబస్ సర్కిల్ . అక్కడ సింగర్ Rickey martin (Livin' La Vida Loca పాట గుర్తు ఉందా, తెలుగు లో మనవాళ్ళు పెళ్లి పెళ్లి అంది అమ్మాయి అని వెంకటేష్ బాబు పాడెసాడు ) తను ఉండేది అక్కడే, టాప్ ఫ్లోర్ లో సింగల్ బెడ్రూం కి నూట అరవై మిల్లియన్ లు అని అన్నాడు కమల్.
దారి నిండా పక్కన మనకి గుర్రం బళ్ళు (చూడటానికి బాగానే ఉన్నా కాని పక్కన నడవలెం సుమా ! కారణం మరేం కాదు. గుర్రం వేసే లద్దె బకెట్ లో ఆ గుర్రం బండి కీ తగిలించి ఉంటుంది అందువల్ల దారుణమైన వాసన) అక్కడ రిక్షా బళ్ళు కూడా ఉన్నాయ్. ఎవరు ఎక్కినట్టు కనపడదు కానీ చాలానే ఉన్నాయ్. ఒక అబ్బాయి మాత్రం మన దేశం అతను కనిపించాడు. ఎక్కువగా పార్క్ చుట్టూ లోపల తిరగడానికి వాటిని ఉపయోగిస్తారు అని చెప్పాడు కమల్.
ఆర్ వైశాల్యం 843 ఎకరాలు. దీని ప్రత్యేకత ఏంటి అంటే , దీన్లో ఉన్న ప్రతి మొక్క కూడా మనుషులు నాటిందే. ప్రపంచం లో ఒక నగరం లో ఉన్న పెద్ద పార్క్ ఏది అంటే ఇదే అని చెప్పుకొనవచ్చు. పైన ఉన్న ఫోటో చూస్తున్నారు కదా ఇది ప్రతి ఋతువు కి మారుతుంది . దీని పోస్ట్ కార్డు లాగ అమ్ముతారు . అక్కడ ఇంకా చీకటి పడటం తో పార్క్ నుంచి బైటకి వచ్చి జాక్సన్ హైట్స్ కి బయలుదేరాం. సబ్వే కి వెళ్ళే దారిలో NBC స్టూడియో చూసాము. రోజు weatherman ఎక్కడ నిల్చున్తాడో అక్కడికి పక్కనే ఉంది APPLE స్టోర్. దాంట్లో కి వెళ్ళాం. బైట ఉన్న ఉక్కకి లోపలి వెళ్ళగానే బోలెడు చల్లదనం ఏంటో హాయిగా అనిపించింది.
రాత్రి తొమ్మిది అయినా బాగా జనం ఉన్నారు అక్కడ. అది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది అని చెప్పాడు కమల్. ఎక్కువగా IPOD లు IPHONE లో ఉన్నాయ్. IPHONE నుంచి ఎవరికన్నా ఫోన్ చేసుకోవచ్చు అనుకుంటా .. చాలా వరకు నంబర్లు కనపడ్డాయి మేము ఒక దాని BROWSE చేస్తుంటే . మదన్ ఒక్కసారి గట్టిగా తుమ్మాడు. ఇంకా చూసుకోండి చుట్టూ ఉన్న జనాలు చిల్ల పెంకుల్లా చెదిరిపోయారు. మదన్ కి పాపం ఎం అర్ధం కాలా.. (ఇక్కడ జనాలు మనం తుమ్మాము అంటే చాలు వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది అని భయపడతారు ). బైటకి వచ్చాక మదన్ తనకి పని ఉంది అని వెళ్ళిపోయాడు. మేము జాక్సన్ హైట్స్ కి దారి తీసాము.
జాక్సన్ హైట్స్ ఒక రకంగా మన సుల్తాన్ బజార్ అని చెప్పుకొనవచ్చు. కిళ్ళీ కోట్లు, బట్టల కోట్లు , భోజన హోటల్ ల తో మనకి మన దేశం లో ఉన్నామా అన్న భావన కనపడుతుంది. షారుక్ ఖాన్ మొహం మనకి ప్రకటనల రూపం లో గోడల మిద కనపడుతుంది. అక్కడ సమోసా , చాట్ లాంటివి లాగించి కమల్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం.
వాళ్ళ ఇల్లు ( apartment ) ఒక చిన్న ద్వీపం లో ఉంది. ఆ ద్వీపం ఒకప్పుడు జైలు గా ఉపయోగించే వారు. దాని తర్వాత దాని కొన్ని రోజులు మానసిక చికిత్సాలయంగా వాడరు. దాని తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్ లు కట్టి polution free జోన్ గా మార్చారు. ద్వీపం మొత్తం ఒక్కటే రహదారి. వీళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అవతల ఒడ్డు న న్యూ యార్క్ నగరం మిరుమిట్లు గొలుపుతూ కనపడుతుంది . సాయంకాలం అలా నదుకుతుంటూ వెళ్ళడం చాల చాల బాగుంది. వాళ్ళు ఉండేది పన్నెండో అంతస్తు. అక్కడ నుంచి న్యూయార్క్ చూడటానికి చాలా బాగుంది (అల కనపడే అపార్ట్మెంట్ కి అద్దె కొంచం ఎక్కువే సుమా ) వాళ్ళ ఇంట్లో భోజనం చేసాక మళ్ళా వెనక్కి బయలు దేరాం (న్యూ జెర్సీ కి ). సమయం అప్పటికే పది దాటటం వల్ల కాబ్ (అద్దె కార్ ) పట్టుకోవడం ఆలస్యం అవడం వల్ల ( కాబ్ డ్రైవర్ మాత్రం మన ఆటో వాళ్ళకి దీటుగా నడిపాడు లెండి, వెనకాల కూర్చున్న మమ్మల్ని బస్తాలు కుదేసినట్టు ఇష్టం వచ్చినట్టు చక్రం తిప్పేసాడు. ) మేము వెళ్ళే సరికి మా రైలు రెండు నిమషాలు ఆలస్యం అని వదిలేసి వెళ్లి పోయింది. (పొద్దున్న ఏదో మా కోసం ఆలస్యం గా వచ్చింది కదా అని ఎప్పుడు ఆలస్యం గా వస్తానా హమ్మ అని తిట్టింది లెండి. ) చేసేది లేక అలా గే ఇంకో ముప్పావు గంట కూర్చున్నాం. పక్కనే ఉన్న పళ్ళ రసం అమ్మే దుకాణం లో కి వెళ్తే అక్కడ మనవాళ్ళే తెలుగు విధ్యార్థులు చక్కని తాజా పళ్ళ రసం ఇచ్చారు.
రైలు వచ్చాక ఇంకో గంట ప్రయాణం చేసి న్యూ జెర్సీ వచ్చాం. వచ్చాక గాస్ (పెట్రోల్ ని ఇక్కడ ఇలాగె అంటారు లెండి) కొట్టిందాం అని చూస్తె ఒక్కడు కూడా లేడు. మరి రాత్రి ఒంటి గంట అయింది కదా. అంటే దాదాపు గా పదమూడు గంటలు రోడ్లంమాట తిరిగాం అన్నమాట. ఆ దెబ్బకి పడుకున్నాక మళ్ళా పొద్దున్నే తొమ్మిది కి సాయికిరణ్ (వినాయకుడు దర్శకుడు ) ఫోన్ చేసే దాకా మెలుకువ రాలేదు. ఇంకా అప్పుడు లేచి మళ్ళా ఒక గంట ఆగి పండగ కదా ఎం చేద్దాం అని ఆలోచించాం. సమయం చుస్తే సరి పోదు అని అక్కడ ఉన్న ఓక్ లాండ్ లో భారతీయ దుకాణాల్లో సరుకులు కొని ఇంకో భోజన శాలలో లో భోజనం చేసి తిరుగు ప్రయాణం అయ్యాము గాస్ కొట్టించుకుని. (మాములుగా అమెరికా లో ఎవరి కార్ లో వాళ్ళే గ్యాస్ నింపుకుంటారు, కాని న్యూజెర్సీ లో మాత్రం ఇండియా లో లాగా వాళ్ళ మనిషి వచ్చి నింపుతారు ) .
వెళ్ళే అప్పుడు PA TURNPIKE తీసుకోవడం వల్ల పల్లె అందాలు చూడలేక పోయాం అని ఫీల్ అవ్వడం వల్ల ప్రమోద్ ఈ సారి మమ్మల్ని పల్లెల్లో నుంచి తీసుకు వెళ్ళాడు. దానికి దీనికి మూడు గంటలు ఎక్కువ సమయం డ్రైవ్ కి. అందువల్ల మేము వచ్చే అప్పటికి రాత్రి పదిగంటలు అయింది దాదాపుగా. ఇంతకూ ముందర చాల సార్లు న్యూయార్క్ వెళ్ళా ( స్వాగతం షూటింగ్ అప్పుడు, అంతకు ముందర కూడా రెండు మూడు సార్లు వెళ్ళా ను ) కాని ఈ సారి బాగా ఎంజాయ్ చేసాను. చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల కావచ్చు అది.
Friday, August 21, 2009
స్నేహితుడా - చిత్ర సమీక్ష
చార్మి నటించిన 16 days అని ఈ మధ్యే ఒక సినిమా వచ్చింది గుర్తు ఉందా. దాంట్లో చార్మి చేసేది అదే పని. అక్కడే ఒక ఇంట్లో ఆ అమ్మాయి కి నాయకుడు పరిచయం అవుతాడు. అక్కడి నుంచి కథ lucky number sleven అన్న ఇంకో సినిమాలోకి వెళ్తుంది.
స్నేహితుడా సమీక్ష అని ఇదేం సోది అనుకోకండి. ఇది కూడా ఆ సినిమా తాను లో ని ముక్కే.
సాయి (నాని ) అనాధ (తెలుగు సినిమాల్లో చాలా మంది నాయకులు అనాధలె ఈ మధ్య అదేంటో కాని, అలా అయితే సపోర్ట్ కాస్టింగ్ బాధ తప్పుద్ది అని ఏమో మరి). పైన చెప్పిన విధంగా రోజు ఒక ఇంట్లో గడిపేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు వెళ్ళిన ఇంట్లో నాయకి సావిత్రి (మాధవి లత) కనపడుతుంది. ఆమె ఇష్టం లేని పెళ్లి తప్పించుకోడానికి ఇంట్లో నుంచి షరా మాములుగా పారిపోయి వస్తుంది. అది తండ్రికి ఇష్టం లేక నీ మొహం నాకు చూపించకు అంటాడు. అక్కడి నుంచి నాయకుడు ఎం చేసాడు వాళ్ళని ఎలా కలిపాడు గట్రా గట్రా తో సినిమా సా....గుతుంది
సినిమా చాల వరకు మూలం లో ని సన్నివేశాలని తీసుకుని, మన వాళ్ళకి సరిపడేలా మర్చి దానికి కాసింత కామెడి, కూసింత సెంటిమెంట్ కలిపి బాగానే వందారు.
సినిమా మొత్తం నాని మోసాడు ఒకరకం గా అని చెప్పుకొనవచ్చు. కాని కొత్త హీరోలు అందరిలాగే ఈయనకి కూడా పెళ్లి , తాళి లాంటి వి పలకడం రాదు . భాష సుబ్బరంగా ఖూనీ చెయ్యగలడు. నటన , నాట్యం లాంటివి బాగానే చేసాడు. మాధవి లత పర్వాలేదు. లయ, అక్షర సీరియల్స్ లో వచ్చే రవికిరణ్ ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. బాగానే చేసాడు. బ్రాహ్మి సో సో, ఎం ఎస్ నారాయణ అంటే తాగుడి పాత్ర. అయన అలాగే లాక్కు వచ్చాడు. నాజార్ కి వెరైటీ గా ప్రేమాయణం ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అది బాగానే ఉంది. సత్యం బెల్లంకొండ గారికి ఇదే మొదటి చిత్రం దర్శకుడిగా.. సొంత కథ తో వచ్చి ఉంటె ఇంకా బాగుండేది అని అనిపించింది నాకు. సంగీతం సో సో, కెమెరా పర్వాలేదు. సంభాషణలు బాగానే ఉన్నాయ్. పంచ్ డైలాగులు ఉన్నాయ్. బాగానే కష్టపడ్డారు.
సినిమా కాలక్షేపం బఠాణీ . చూడక పొతే నష్టం లేదు. చూసినా పర్వాలేదు.. వర్షం కురిసే సమయం లో బైటకి వెళ్ళే ఛాన్స్ లేక పొతే DVD లో కాళీ సమయం చూడొచ్చు . మనం అన్ని భాషల సినిమాలు చూడలేం అని మనకోసం మనవాళ్ళు తెగ కస్టపడి ఆ సినిమాని నానా హింస పెట్టేసి మనకోసం తెలుగు లో తీస్తే మరి మనం ఆ మాత్రం చెయ్యక పొతే ఎలా చెప్పండి.
Thursday, August 20, 2009
నాన్నకి తోడు
“ఈ రోజు వేసుకెల్లాళి”
“మీరె కుట్టుకోండి, ఏం కుట్టుకోలేరా?! “ అంటూ పేపర్ మడుస్తూ “రేపు నేను లేక పోతే మీకు కష్టం కాబట్టి ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోవడం“ అన్నాను.
నా వైపు ఒక సారి చూసారు , పెళ్ళై పదిహేను ఏళ్ళు కాబట్టి నా మొహం చూడగానే ఏమనుకుంటున్నానో తెలిసిపోతుంది ఆయనకి. ఇంకేం అనకుండా చొక్కా తీసుకుని “దారపు డబ్బా ఎక్కడ ఉంది అని” అన్నారు.
“రోజూ ఉండే చోటే అలమారాలో. అక్కడ నుంచి అది కదలదు “ అని అన్నాను.
రెండు నిమషాలలో దారపు డబ్బా తెచ్చుకుని నా పక్కన కుర్చుని, నల్ల దారం తీసి సూదిలోకి ఎక్కించడం మొదలు పెట్టారు
“తెల్ల చొక్కా కి నల్లదారం ఎంటి స్వామీ? తెల్ల దారం వాడండి” చిరాగ్గా అన్నా .
మారు మాట్లాడకుండా తెల్లదారం ఒక గజం తెంపి, సూదిలో కి ఎక్కించి కుట్టడం మొదలు పెట్టారు బ్రోచేవారెవరురా అని పాట పాడుతూ మెల్లగా.. ఒక రెండు కుట్లు అయ్యాక “ ఈ రోజూ నీ మూడ్ బావోలెదా,మళ్ళి మీ నాన్న గారి మీద కొపం వచ్చిందా” దారాన్ని లాగుతూ అడిగారు .
“వూ .. ఆయనకి నచ్చినట్టు ఆయన పనులు చెయ్యడం నా వల్ల కావడం లేదు, ఇది అంతా మా అమ్మ తప్పు, ఆయనను అలా తయారు చేసింది. ఆయన చెయ్యి కూడా ఆయనని కదుల్చుకోనివ్వకుండా పనులు చేసిపెట్టేది ఇప్పుడు నా చావుకు వచ్చింది,” చిరాగ్గా అన్నా.
రాము చేతిలో చొక్కా తీసుకుంటూ “ అందుకే మీ పనులు మీరు చేసుకోవాలని అనేది, రేపు నేను లేక పోతే మీరు అలా అందరి మీద ఆధారపడకూడదు అనే నా కోరిక” అన్నా సంజాయిషీ గా..
మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తావు? అమెరికాలో మీ అన్న దగ్గరికి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అన్నారు నవ్వుతూ..
"ఆ నవ్వులాటలే వద్దు. నేనంటోంది మీకర్ధమయ్యిందని నాకు తెలుసు" చిరు కోపంతో అన్నాను.
నువ్వు చెప్పినట్టల్లా చేస్తే మీ నాన్న వయసుకి నేను మన వాళ్ళందరిలోకి ఎక్స్పర్ట్ అవుతానులే అన్నారు రాము.
వచ్చే నవ్వు ఆపుకుంటూ, గుండీ కుట్టడం పూర్తి చేసి, ఆయనకు క్యారేజీ కట్టి ఇచ్చి, ఆయన అటు వెళ్ళగానే నాన్నగారికి భోజనం పట్టుకుని ఆయన ఫ్లాట్ కి బయలు దేరాను. ఇంటి నుంచి పది నిమిషాల నడక ఆయన ఉండే ఫ్లాట్.
అమ్మ పోయిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా నా పని అదే. రోజూ పొద్దున్నే నిద్ర లేచే అమ్మ ఒక రోజు లేవలేదు. తన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పలేదు. డాక్టర్ ఇచ్చిన మందులు మామూలుగానే నిర్లక్ష్యం చేసి ఒక రోజు
వెళ్ళిపోయింది.
వార్త వినగానే అమెరికా నుంచి అన్నయ్య వెంటనే వచ్చాడు. వాడక్కడ పదిహేనేళ్ళుగా ఉండడం వల్ల వాడి పద్ధతులు, ఆలోచనలు, అన్నీ అమెరికనైజ్ అయిపోయాయి. వాడిని తట్టుకోవడం నాకు కష్టమయిపోయింది. వదిన పిల్లలందరినీ పదిరోజులకోసం తీసుకురావడం డబ్బులు దండగ అని అనేసాడు. వీడేనా చిన్నప్పుడు నాతో ఆడుకున్న అన్న అని విస్తుపోయాను.
నాన్నగారు అన్నయ్యతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. అన్నయ్య పెదవి చివరినుండి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ఆయనకి ఒక సారి అక్కడికి వెళ్ళినప్పటి ఒంటరితనం గుర్తు వచ్చిందో ఏమో మరి.
నేను రాను. అమ్మలు ఉందిగా, తను చూసుకుంటుంది లే ఇక్కడ అని నా ప్రమేయం ఏమీ లేకుండానే చెప్పేసారు.
అన్నయ్య మొహంలో కనిపించిన రెలీఫ్ చూసి పిచ్చి కోపం వచ్చింది. వెంటనే వాడితో నెల నెలా నాన్నగారికి డబ్బులు పంపు. ఆయన అవసరాలకి, వంటమనిషికి, పనిమనిషికీ కావలసి ఉంటుంది అన్నాను.
అదేంటీ? నాన్న గారు నీతో ఉండరా? ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తి అడిగాడు అన్నయ్య. వాడి దృష్టిలో నాకు ఇంకేం పని లేదు మరి. పెద్దాయన ఒక్కడే కష్టం కదా అమ్ములు అన్నాడు పైగా.
నాన్న గారు కలగజేసుకుని వాడికి సమాధానం ఇచ్చారు. "అదేంటీ? నేను అక్కడ ఎలా ఉండగలను? నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే స్వతంత్రంగా ఉంటుంది.అదీ..." అంటూ రాము గదిలోకి రావడంతో అసంపూర్తిగా ఆపేసారు. అది కూతురు ఇల్లు అక్కడ ఎలా ఉండగలను అని ఆయన పాతకాలపు ఆలోచన.
ఆయన ఆలోచనకి నాకు కొంత సంతోషమే వేసింది. ఈయన ఇంటికి వస్తే, ఉన్న రెండో బెడ్రూం ఈయనకి ఇవ్వాల్సి వచ్చేది. మా అబ్బాయి హాల్లో దివాన్ మీద పడుకోవాలి. చదువు పరీక్షల సమయంలో సరిగ్గా సాగదు. ఇవన్నీ గిర్రున బుర్రలో తిరిగాయ్.
ఆ సంతోషం కొంతకాలమే ఉంది. ఆయన పనులకి ఒక పనిమనిషిని పెట్టినా, ఆయన వాడి చేతి వంట తినడానికి ససేమీరా ఇష్టపడలేదు. పై పనులవరకూ సరే. కానీ వంట మాత్రం రోజూ రెండు పూటలా తీసుకెళ్ళల్సి వచ్చేది. అతి కష్టం మీద పొద్దున్నే బ్రెడ్డూ, టోస్ట్, కాఫీ వాడి చేతి మీద తినడానికి ఒప్పుకున్నారు.
ఇంకా నేను వెళ్ళేటప్పటికి, రోజూ నాకోసం ఏదో ఒకపని వేచి ఉండేది. ఒక రోజు బట్టలు ఇస్త్రీకి వెయ్యడం, ఇంకో రోజు వంటగదిలో లైటు పని చెయ్యడం, లేకపోతే చెత్తడబ్బా విరిగింది అని ఏదో ఒక పని చెప్పేవారు. ఒక్కో సారి రెండు సంసారాలు చూస్తున్నానా? అనిపించేది. దీనికన్నా ఆయన నా దగ్గిర ఉంటే బావుండేదేమో అనిపించేది.
రోజూ ఈ డ్యూటీ వల్ల నేను చూసే టీవీ సీరియల్లు మానేసా. మధ్యాహ్నం పూట స్నేహితులతో వెళ్ళే మ్యాటినీ సినిమాలు, హస్కు కి సమయం లేకుండా పోయింది. ఒక జైలులో బందీ అన్న భావన ఏర్పడి పోయింది. దానికి తోడు నాన్నగారికి నేను సేవ చేస్తున్నానన్న భావన ఏమాత్రం లేదు. ఆయన హక్కు లాగ అనుకుంటారు అది. అది సహజం కావచ్చు కాని నాకు ఒకో సారి చిరాకు వచ్చేది. ఒక రోజు కూరలో ఉప్పు తక్కువ, ఇంకో రోజు పప్పుబాగా ఉడకలేదు అనో లేకపోతే అన్నం ఎక్కువ ఉడికింది అనో వంకలు పెట్టేవారు. నాకు కోపం వచ్చి మాట్లాడే దాన్ని కాదు. అమ్మ ఎలా తట్టుకుంది ఈయన్ని అన్నేళ్ళు అని ఒక్కో రోజు గొణుక్కుండేదాన్ని. ఒక్కో రోజు అన్నయ్య ఇవి అన్ని తప్పించుకున్నందుకు పీకల లోతు కోపం వచ్చేది. అవీ ఇవీ అన్ని ఒకోసారి ఆయన మీద చూపలేక రాము మీద మా అబ్బాయి మీద చూపించవలసి వచ్చేది. వాళ్ళు కూడా సర్దుకు పోవడం నేర్చుకున్నారు. ఈ బాధలన్ని చూడలేక ఒక రోజు రాము నాన్నగారిని మా ఇంటికి తీసుకొద్దామనే ప్రతిపాదన తెచ్చారు. అది తలచుకుంటేనే
భయం వేసింది. అప్పుడు రోజంతా ఆయనకోసం పరిగెత్తడం నా వల్ల కాదు.
ఇదంతా రాస్తున్నా అని నేను ఏదో మరీ చెడ్డ కూతుర్ని అనో లేక మా నాన్న గారు ఆయన పనులు ఆయన చేసుకోలేరు , నేను చూడటం లేదు అనుకోకండి. ఆయన రోజూ పొద్దున్నే నాలుగు మైళ్ళు సాయత్రం నాలుగు మైళ్ళు నడుస్తారు. మంచి ఉక్కు కడ్డీ లాంటి కాయం. కాని ముందు నుంచి మా అమ్మ అటు పుల్ల ఇటు పెట్టకుండా చేసి ఇలా
అలవాటు చేసింది. ఆయన దృష్టిలో ఆయన ఏమీ పని చెయ్యకూడదు అంతే.
ఒక రోజు రాము ఆఫీసునుంచి రాగానే తనకి సింగపూరు రెండు నెల్ల ట్రిప్ పడిందని, కంపనీ నాకు కూడా సగం టికెట్ పెట్టుకుంటుందని అన్న మంచి వార్త మోసుకొచ్చారు. కాని మరి మా నాన్న సంగతో... దాంతో హుషారు అంతా చచ్చిపోయింది. మా అబ్బాయి ని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ రెండు నెలలు ఉంచవచ్చు, కాని మా నాన్న గారి తిండి మాటో? నాకు ఏడుపు ఒక్కటే తక్కువ.
రాము తెలిసిన ఎవరినన్నా వంట కి పెడదాం అని అన్నారు. నాకు పక్కవీధిలో ఉండే విధవ మామి గారు గుర్తుకు వచ్చారు. ఆవిడ అప్పడాలు, పచ్చడులు పెట్టి అందరికీ అమ్ముతూ ఉంటారు. ముందు మా నాన్న గారిని దానికి ఒప్పించాలి కదా అని తలచుకునే సరికి నీరసం వచ్చేసింది.
ఆయన దగ్గర ఈ విషయం ఎత్తగానే నేను అనుకున్నంతా అయ్యింది. డబ్బు దండగ అంత దూరం ఎందుకు వెళ్ళడం ? నువ్వు వెళ్తే నాకు భోజనం ఎవరు వండి పెడతారు? నాకు ఏదన్నా అయితే ఎవరు ఉంటారు? అన్నారు.
ఓపిక అంతా కూడగట్టుకుని, మీకు ఏమీ కాదు నాన్నగారు, రోజూ మీ మనవడు వచ్చి చూసి వెళ్తాడు. మీకు వంటకు పక్క వీధి మామిని మాట్లాడుతాను ఈ రెండు నెలలు అని చాల సేపు నచ్చచెప్పి, రోజు విడిచి రోజు ఫోన్ చేస్తా అని ఒట్టు వేసి బైట పడ్డా.
ఆయన దానికి కూడా సవాలక్ష ప్రశ్నలు, ఆవిడ శుభ్రంగా వుంటారా? సరిగ్గా మడి కట్టుకు వండుతారా? అసలు ఒప్పుకుంటారా? ఆవిడ ఎందుకు మనకి వండి పెడుతుంది గట్రాలు..
అన్నయ్యకి ఫోన్ చేసి నేను వెళ్తున్నట్టు, మామి గారు వండి పెడుతున్నారు అని చెప్పి నేను రాము సింగపూరు బయలుదేరాం. రోజు విడిచి రోజు మా వాడు తాతగారి దగ్గర మేము ఫోన్ చేసినప్పుడు ఉండేలా చేసాం. (ఫోన్ బిల్లు తగ్గుతుంది అని)
ఆయనకి ఫోన్ చేసినప్పుడల్లా ఎలా ఉన్నారు అని అడిగితే బాగానే ఉన్నాను అని చెప్పేవారు. నన్ను ఎక్కువ మిస్ అవుతున్న ఫీలింగు ఏమీ కనపడలా నాకు. అదే అన్నా రాముతో ఒక రోజు. రాము నవ్వి "నువ్వు మీ నాన్న మొత్తానికి నీ మీద ఆధారపడి పోవాలి అన్న భావం మనసులో ఉన్నట్టు ఉంది అది తొలగించుకోవడం మంచిది. ఒకరి
కోసం కాలం ఆగదు అన్నారు.
రెందు నెలల తర్వాత రాగానే, సూట్‌కేసులు ఇంట్లో పెట్టి అలాగే నాన్న గారి దగ్గరకి వెళ్ళాను. ఆయన కులాసాగా నవ్వుతూ కనిపించారు చాల రోజుల తర్వాత. ఆయనకి మామి వంట చాలా బాగా నచ్చినట్టు ఉంది. ఆయనకి నేను లేని లోటు ఎక్కడా కనపడ్డ ఛాయలు లేవు, అది నన్ను బాగా బాధించింది.
రెండో రోజు నేను మధ్యాహ్నం వెళ్ళిన కాసేపటికి నాన్న గారు, నాకు రోజు వండిపెట్టడం నీకు ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది కదా అమ్మలు అని అడిగారు.
నేను ఆశ్చర్యపోయాను. "అలా ఏం లేదు అండి, అలవాటు అయిపోయింది" అన్నా.
కానీ నాకా వయసు అయిపోయింది, నా అవసరానికి నిన్ను రోజు ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు రోజు నువ్వు అక్కడ ఇక్కడ రెండు చోట్ల పనులు కష్టం కదా" అన్నారు.
ఈయన అక్కడ కి వచ్చేస్తారా ఎంట్రా భగవంతుడా అనుకున్నాను.
ఈ లోపల ఆయనే "నాకు ఎవరన్నా తోడుగా ఇక్కడ ఉంటే బాగుందును అని అనుకుంటున్నా" అన్నారు.
హమ్మయ్య అయితే రారు అని ఊపిరి పీల్చుకున్నా. "అదేంటండి రోజూ మెంఉ వచ్చి వెళ్తూనే ఉన్నాంగా? అన్నా.
"అలా కాదు అమ్మలు, ఎంత కాలం ఇలా? మీకు ఇబ్బంది... నేను మళ్ళీ పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటున్నా" అన్నారు చాలా నెమ్మదిగా విని వినపడనట్టుగా.
నేను విద్యుత్ఘాతం తినట్టు ఉలిక్కిపడ్డాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. నిలబడే శక్తి లేక దగ్గర్లో ఉన్న కుర్చీ లో కూర్చుని.." మీరు...మళ్ళీ పెళ్ళా?" ఎవరిని ? అన్నా కూడబలుక్కుంటూ.
నన్ను వేరుగా అనుకోవద్దు అమ్మలూ..శారీరిక అవసరాలకోసం కాదు నేను ఈ పెళ్ళి చేసుకుంటున్నది. ఇంట్లో ఒంటరిగా ఉండడం చాలా కష్టం. అర్ధరాత్రి పూట మంచినీళ్ళు కావలసిన అడగటానికి ఎవరూ ఉండరు. రోజంతా నేను ఒక్కడినే ఉండటం వల్ల ఆ నిస్సహాయత ఒకో సారి నీమీద చూపేవాడిని" అన్నారు.
"కానీ మిమ్మల్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? ఈ వయసులో? "అస్పష్టంగా గొణిగాను.
"నీకు తెలిసిన ఆవిడే మన వంటకోసం తెచ్చిన మామి ని చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఆవిడికి ఓర్పు, దైవభక్తి చాల ఎక్కువ, నాకు సరిపోతారు" అన్నారు.
"మరే ఆవిడ వంట కూడా మీకు చాలా ఇష్టం కదా" వెటకారంగా అన్నాను.
"ఈ వయసులో అందరికీ జిహ్వ చాపల్యం ఎక్కువ అవుతుంది అమ్మలు. నీకు అనుభవం మీద తెలుస్తుంది. నిజమే ఆవిడ వంట కూడా నాకు నచ్చింది" అన్నారు.
నాకు మా అమ్మ స్థానం ఎవరికో ఇవ్వడం అసలు నచ్చలేదు. ఈయన అన్నేళ్ళ తన సహచరిని ఎలా మరిచి పోగలిగారు అనుకుంటే కన్నీళ్ళు ఆగలేదు. లేచి ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా గబా గబా వచ్చేశాను.
ఇంటికి వచ్చేసరికి రాము ఇంట్లోనే వున్నారు. తన లీవు ఉండటం వల్ల ఆఫీసుకి పోలేదు. రాగానే సోఫాలో కూర్చున్న తన పక్కన కూర్చుని భుజం మీద తల పెట్టి భోరుమన్నాను. రాము గాభరా పడిపోయారు.
"ఏమయింది? మామయ్య గారు కులాసాన? " అదుర్దాగా అడిగారు.
"ఆయనకేం? బ్రహ్మాండంగా ఉనారు. కాబోయే పెళ్ళి కొడుకు ఆయనకి ఏంటి?" అన్నా వెక్కిల్ల మధ్య.
"సరిగ్గా చెప్పు" ఆశ్చర్యంగా అన్నారు, నా కన్నీళ్ళు తుడుస్తూ.
"మీకు కొత్త అత్తగారిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఆయన" అంటూ మొత్తం చెప్పాను.
అంతా విన్నాక ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండి "ఇంతకీ ఆవిడ ఒప్పుకుందా?" అని అడిగారు.
"ఒప్పుకున్నట్టే ఉంది. మనం లేని సమయంలో మా నాన్నకి ఏ మందో మాకో పెట్టి ఉంటుంది. లేకపోతే ఆయన మా అమ్మని మర్చిపోగలరా?" అన్నా కళ్ళు తుడుచుకుంటూ.
"నువ్వు ఆయన ఒంటరి తనం చూడటం లేదు, మీ అమ్మ గారు పోయారు. ఈయన ఇంకా చాలా కాలం బతుకుతారు. ఆయనకు తోడు కావాలి అది ఎందుకు ఆలోచించవు? నువ్వు?"
"ఈ వయసులో ఆయనకు ఈ వ్యామోహం ఏంటి అండీ?" కోపంగా అన్నాను.
"మీ నాన్నగారు పదహారేళ్ళ బాలాకుమారిని చేసుకోడం లేదు కదా .. వ్యామోహం అనుకోవడానికి" నవ్వుతూ అన్నారు.
నాకు నవ్వు వచ్చింది. ఆయన అన్నది సబబుగానే ఉందికదా. ఈ వయసులో ఆయన పడక సుఖంకోసం చేసుకోరు కదా. నాలో అసూయ, కోపం తగ్గి మెల్లగా, తిన్నగా ఆలోచించి నాన్న గారికి ఫోన్ చేసా.. ఈపెళ్ళి నాకు ఇష్టమే అని. ఫోటోలో అమ్మ నవ్వినట్టు అనిపించింది నేను సరైన నిర్ణయమే తీసుకున్నా అన్నట్టు.
గమనిక : ఈ కథ దాదాపు అయిదు ఏళ్ళ క్రితం రాసింది. నాకే నచ్చక అలా పక్కన పడేసి ఉంచా. ఇలాంటి కథలు బోలెడు వచ్చాయి. కొత్తగా ఎం చెప్పాను ? ఏమి లేదు ... హిందీ లో అవతార్ అని రాజేష్ ఖన్నా, షబానా అజ్మి లతో ఒక సినిమా వచ్చింది . తెలుగు లో దాన్నే అది దంపతులు అని తీసారు. కొంచం అటు ఇటు గా, కలికాలం, బహుదూరపు బాటసారి గట్రా గట్రా లాంటి చిత్రాలు వచ్చాయి ఓల్గా రాసిన తోడు (దిన్ని సినిమా గా కూడా తీసారు )ఇలాంటి కథాంశం తో నే వచ్చింది దాంతో ఇది అవసరమా అని పక్కన పడేసా.
Wednesday, August 19, 2009
మిస్టర్ ఆంజనేయులు - చిత్ర సమీక్ష
సినిమా కి అనధికార నిర్మాత మంత్రి బొత్స సత్యనారాయణ అని ఒక కథనం అధికారికంగా చిన్న చితకా వేషాలు వేసే హాస్య నటుడు గణేష్! మీరు గమనించారో లేదో కాని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అప్పుడు ఈయన (గణేష్ ) మంత్రి గారి వెనకే కుర్చుని ఉన్నారు .
సరే కథ కి వస్తే అన్ని పూరి చిత్రలలాగే దీంట్లో కూడా నాయకుడు ఒక రకమైన పోరంబోకు. ఒక టీవీ ఛానల్ లో పని చేస్తా ఆ ఛానల్ అదినేత ని లెక్క చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు చేసే (దీనే తెలుగు సినిమా పరిభాషలో నాయకత్వ లక్షణములు అందురు) అతను. ఇంకా మాములుగా నాయకి వెనకాల చిల్లర వేషాలు వేసి ప్రేమించేసా అనడం. ఆ పిల్లకి వేరే దిక్కులేక వీడే నాయకుడు కావడం వాళ్ళ ప్రేమిచేయ్యడం షరా మామూలు. నాయకుడి కి ప్రతినాయకుడి తో గొడవ. ప్రతినాయకుడు ఇంకొంత మంది తొట్టిగాంగ్ తో కలిసి నాయకుడి కి అన్యాయం చెయ్యడం. నాయకుడు ప్రతీకారం తో అందరిని మట్టుపెట్టడం. పోలీసులు నాయకుడి ని ఆహా ఒహో అనడం షరా మామూలు .
కథనం , సంభాషణలు అన్ని మనకి ఇంతకు ముందు చుసిన లెక్క లేని అన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. శ్రీనివాస్ రెడ్డి హీరో పక్కన ఉండి, మాటకి ఒక చెంపదెబ్బ తినే పాత్ర. ఇలాంటివి సునీల్ కాని శ్రీనివాస్ రెడ్డి కాని బోలెడు సార్లు చేసారు. కొత్తదనం ఎం లేదు దాంట్లో. బ్రహ్మానందం పాత్ర కూడా అంతే. కొన్ని సంభాషణలు వింటే మనకి పోకిరి, బుజ్జిగాడు సినిమాలకి బాగా పాపులర్ ఆయనవి కొంచం అటు ఇటు మార్చి రాసాడు అని అనిపించడం లో తప్పు లేదు. తెర మీద పాత్ర ఎం చెప్పబోతోందో ముందే ఊహించగలం అలా ఉన్నాయ్ సంభాషణలు. పోనీ సన్నివేశాలు చూద్దామా అంతే అవి కూడా పాత సినిమాల కి కొన్ని నకళ్ళు. ఒక్కడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాల్లో నుంచి కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు యదాతధం గా వాడుకున్నారు.
ప్రతినయకులని పట్టించడానికి నాయకుడు, స్నేహితుడి తో కలిసి వాళ్ళు చేసే వెధవ పనులని వీడియో తీస్తాడు. కామెడి ఏంటి అంతే.. ఆ వీడియో లో వీడియో తేసే స్నేహితుడు కూడా కనపడతాడు. మరి వీడియో ఎవరు తీసారు చెప్మా అని ప్రేక్షకుడికి బేతాళ ప్రశ్న.
నాయక పాత్ర అందాల అడ బొమ్మ. చెయ్యడానికి ఎం లేదు. అలా అని అందం గా కూడా లేదు అదేంటో గాని. అంటే ఆంజనయులు కదా అలా ఉన్న సరిపోతుంది అనుకున్నారో ఏంటో తెలిదు మరి.
సినిమాలో నచ్చింది ఒక్కటే.. నిర్మాత దిల్ రాజు ని టార్గెట్ గా పెట్టి ఎం ఎస్ నారాయణ చేత వేయించిన వేషం. ఇది ఒక్కటే బాగుంది. మరి పరుశురాం కి అయన మీద అంత కోపం దేనికో తెలిదు. సంగీతం సో సో. కెమెరా బాగుంది సినిమా లో ఉన్న అదృష్టం ఏంటి అంటే ఎక్కడ నుంచి అన్న సరే చూడొచ్చు. ముందర చూడలేదే ఎమన్నా మిస్ అయ్యామే అన్న భాద లేదు.
Tuesday, August 18, 2009
దర్శకుడు అరుణ్ ప్రసాద్ తో ముఖా ముఖి.
మొదటి సినిమా నుంచి ....
మొన్నీ మధ్య జో జీతా వహి సికందర్ మళ్ళా చూస్తుంటే (ఎన్నో సారి అని మాత్రం అడగకండే ! ) , తెలుగు లో ఇదే అరుణ్ ప్రసాద్ కి మొదటి చిత్రం అని గుర్తుకు వచ్చింది. నవదీప్ అరుణ్ తో రెండు సినిమాలు చెయ్యడం వల్ల అరుణ్ గారి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడు సరే అని అరుణ్ గారి నెంబర్ సంపాదించి ఆయనకు ఈ సమయం లో కాళి నో కనుక్కుని మర్నాడు మళ్ళా ఫోన్ లో పలకరించాను. ఆయనతో జరిగిన సంభాషణ క్లుప్తంగా ఇక్కడ మీ కోసం..
అరుణ్ ప్రసాద్ : నేను పుట్టింది పెరిగింది అంటా చీరాల లో నే. మొదటి నుంచి సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి. అప్పట్లో దాసరి గారి సినిమాల చివరలో ఒక ఉపన్యాసం లాంటివి ఉండేవి. మూడుగంటల సినిమా అయ్యాక కూడా అయన ఉపన్యాసం వినడానికి జనాలు కూర్చునే ఉండే వాళ్ళు. అది చూసి డైరెక్టర్ అంటే ఆయనే.. అలా ఎప్పటికన్నా పేరు తెచ్చుకోవాలి అన్న ఒకే ఒక కోరికతో సినిమాల్లో కి వచ్చాను.
చదువు లో ఒక రకం గా నేను గౌతమ్ SSLC టైపు. పదో తరగతి మూడు సార్లు తప్పాను. ఇంటర్ లో కాలేజి నుంచి డిబార్ అయ్యాను. దాంతో ఇంకా ఇంట్లో గోల భరించలేక (మా నాన్నగారికి నేను IAS లేక IPS అవ్వాలి అని ఉండేది. నాకేమో IAS అంటే పూర్తీ abbrivation కూడా సరిగ్గా తిలీడు. ఇంకా చదువు కూడానా ! ఇలా కాదు అని చెప్పి మద్రాస్ పారిపోయి వచ్చేసాను.
మద్రాస్ వచ్చాక దాసరి గారిని కలవడానికి ప్రయత్నం చేసాను. కాని ఆయనకి అప్పటికే డెబ్భై మంది దాకా assistants ఉన్నారు. అయన దగ్గర కుదరదు అని అప్పటికి మంచి ఊపు మిద ఉన్న కోడి రామకృష్ణ గారి దగ్గర చేరాను. అయన దగ్గర కూడా అప్పటికి నలభై మంది దాక ఉన్నారు. నేను నిజానికి నలభై ఎనిమిదో assistant ని అయన దగ్గర. అయన దగ్గర కూడా జేరడం అంత సులువుగా జరగలేదు, స్వాతి ముత్యం లో కమల్ హసన్ లో లాగ రోజు ఇంటి దగ్గర హాజరు వేయించుకునే వాడిని. అలా తిరగగా తిరగగా అయన చివరకి చేర్చుకున్నారు. అంత మంది ఉండటం వల్ల అందరికి ఒక్క సారి పని దొరికేది కాదు. ఒకో సినిమాకి ఒక బాచ్ కి పని ఉండేది. అలా నాకు సంవత్సరానికి ఒక చిత్రానికి పని చేసే అవకాసం ఉండేది. అయన చాల త్వరగా సినిమా పూర్తీ చేసేవారు. అందువల్ల నాకు సంవత్సరం మొత్తం మీద మూడు లేక నాలుగు నెలలు పని ఉండేది. మిగిలిన సమయం అంతా బ్రిటిష్ లైబ్రరీ లోను బైట దొరికిన సినిమా అల్లా చూడటమే పనిగా ఉండేది.
కోడి రామకృష్ణ గారి దగ్గర ఏడు సినిమాలకి పని చేసాను అయన దగ్గర మొదటి సినిమా స్టేషన్ మాస్టర్, తర్వాత బాలగోపాలుడు, శత్రువు , పోలీసు లాకప్ లాంటి సినిమాలు చేసాను.
శివ వచ్చిన కొత్తలో అందరు కొత్త దర్శకులు కొత్త ఆలోచనలు అని కొత్త దర్శకులకి అవకాశం ఇద్దాం అన్న ఆలోచనలో ఉండి కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కొంచం ఉత్త్సాహం చూపించారు. అదే సమయం లో రాము తీసిన రాత్రి సినిమా అట్టర్ ఫ్లోప్ అవ్వడం తో వీళ్ళు ఒక్క సినిమా నే సరిగ్గా చేస్తారు అన్న ఆలోచన తో చాల మంది వెన్నక్కి వెళ్లి పోయారు. ఈ నేపద్యం లో నేను తెలుగు లో ప్రయత్నం చెయ్యాల తమిళ్ లో ప్రయత్నం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాను.
అప్పట్లో నేను మద్రాస్ లో ఉండటం వల్ల ఆర్. బి. చౌధురి గారి పరిచయం ఉండటం తో వెళ్లి ఆయనకి ఒక కథ వినిపించాను. ఆయనకి అది బాగా నచ్చింది. అప్పుడు అయన సుస్వాగతం సినిమా పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారు. అయన తీసుకెళ్ళి నన్ను కళ్యాణ్ కి కథ చెప్పమని చెప్పారు. నేను కళ్యాణ్ గారికి కథ చెప్పాను. కళ్యాణ్ కి కథ బాగా నచ్చి తప్పకుండా సుస్వాగతం తర్వాత సినిమా చేద్దాం అని చెప్పారు. చౌదరి గారు కూడా తర్వాత సినిమా మళ్ళా పవన్ కళ్యాణ్ తో నే అని చెప్పారు. నేను సరే అని కథ డెవలప్ చేసి సన్నివేశాలు రాసుకునే పని లో పడ్డాను. కాని సుస్వాగతం తర్వాత చౌధురి గారికి కళ్యాణ్ కి remuneration విషయం లో కుదరక పోవడం వల్ల ఆ సినిమా ఆగి పోయింది. కాని ఆ విషయం నాకు తెలిదు. అందువల్ల నేను నా పని లో నే ఉన్నాను.
ఆ సినిమా అయ్యాక చౌదరి గారికి కళ్యాణ్ కి పారితోషకం విషయం లో అభిప్రాయ బేధాలు దావడం తో తర్వాత సినిమా కుదరలేదు. కాని ఆ విషయం నాకు తేలిక పోవడం వల్ల నేను నా పని లో మునిగిపోయాను. సుస్వాగతం విడుదల అయింది. కళ్యాణ్ తరవాత సినిమా మొదలు కూడా పెట్టేసారు . అదే తోలి ప్రేమ. ఆ షూటింగ్ సమయం లో నాకు కబురు పంపారు . నేను మద్రాస్ లో ఉన్నా అయన హైదరాబాద్ లో ఉన్నారు. నేను వెళ్లి కలిసాను. ఎంటయ్యా మళ్ళా కలవలేదు అని అడిగారు. నేను మీకు చెప్పిన కథకి స్క్రిప్ట్ పని లో ఉన్నా అండీ అని చెప్పాను. అయన ఆ సినిమా ఆగిపోయింది కదా మీకు చౌధురి గారు చెప్పలేదా అని , మీరు చెప్పిన కథ , కథనం బాగా నచ్చాయి . కాని కొంచం ఆ పోలికలు నేను ఇప్పుడు చేసే కథ లో కూడా ఉన్నాయి . మీరు వేరే కథ తీసుకు రండి నేను తొలిప్రేమ తర్వాత సినిమా మీకే చేస్తాను అని మాట ఇచ్చారు. నాకు అప్పటికే షాక్ సినిమా ఆగి పోయింది అని అనే అప్పటికి. ఎం చెయ్యాలో తోచలేదు . అలాగే మద్రాస్ తిరిగి వచ్చేసాను.
కోడి రామకృష్ణ గారు అప్పడే దాడి దాడి అని ఉషాకిరణ్ బ్యానర్ కి సినిమా చేస్తున్నారు. దాంట్లో వెళ్లి మళ్ళా అయన దగ్గర చేరి పోయాను. సినిమా చివరలో ఉండగా అయన కళ్యాణ్ ఫోన్ చేసారు. బురుగుపల్లి శివరామ కృష్ణ గారి సినిమా ఒప్పుకున్నాను వచ్చి కలవమని. నేను ఆయన్ని వెళ్లి కలిసాను. అప్పుడు అయన జో
జితా వహి సికందర్ సినిమా రీమేక్ హక్కులు కొన్నాము. దాని మనకి సరిపడే లాగా మార్చమని చెప్పారు. నేను ఆ పని లో పడ్డాను. కాని బూరుగుపల్లి గారికి నేను దర్శకుడుగా అంటే జంకారు. అయన దృష్టిలో బి. గోపాల్ గారు కాని రాఘవేంద్ర రావు గారు కానీ అయితే బాగుటుంది అని అనుకున్నారు. సినిమా ఇంకో రెండు రోజుల్లో ఉంది అనగా కూడా అయన అదే మాట అన్నారు. కాని కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. నేను దర్శకుడిగా లేక పొతే సినిమా మానేస్తాను అని చెప్పారు. ఇంకా తప్పని సరి పరిస్థితిలో అయన ఒప్పుకోక తప్పింది కాదు. నేను ఆయన్నని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే నా పని చూపిస్తే ఆయనే సమాధాన పడతారు అని అనుకున్నాను. మొదటి షెడ్యూల్ అయింది. అది అంతా ఆయనకి చూపించా అది చూడగానే అయన బాగా ఇంప్రెస్స్ అయ్యి , వెంటనే మూడు సినిమాలకి కాంట్రాక్టు రాయించుకున్నారు.
శ్రీ : నాకు తెలిసి అదితి బదులు ఇంకెవరన్నా అయితే ఇంకా బాగా ఉండేది ఏమో అనుకున్నా..
అరుణ్ ప్రసాద్ : నిజానికి అదితి ని అందుకే తీసుకున్నాం. మా ఉద్దేశం ఏంటి అంటే పక్కన అందమైన సంప్రదాయమైన పక్కింటి అమ్మాయి ఉండగా, మాములుగా ఉన్న మోడరన్ అమ్మాయి వైపు ఎలా ఆకర్షించబడతామో చూపించడానికి అలా ఆ అమ్మాయి ని ఎన్నుకున్నాము.
శ్రీ : తెలుగు లో హిందీ లో పాపులర్ సాంగ్ రుట్ కే హుమ్సే నహి పాట మొత్తం లేపెసారు ...
అరుణ్ ప్రసాద్ : అదే అని ఏంటి ... నాటకం సీన్ కూడా లేదు కదా.. మన వాళ్ళకి ఎలా నచ్చుతుంది అని అనుకున్నామో అలా ట్రీట్మెంట్ మార్చాము. తెలుగు లో సైకిల్ రేస్ కూడా లేదు కదా.. దాని బదులు boxing పెట్టాము. కళ్యాణ్ దాని కోసం ప్రత్యేక తర్ఫీదు తీసుకున్నాడు.
శ్రీ : సినిమాలో కూడా హిందీ లో ఉన్న ఫీల్ మిస్ అయినట్టు కనపడింది నాకు. హిందీ లో ఆ హోటల్ వాతావరణం అవి కొంచం సహజం గా ఉన్నాయ్.. తెలుగు లో కి వచ్చేసరికి ఆ హోటల్ అది posh వాతావరణం ..
అరుణ్ ప్రసాద్ : అసలా కథే సహజమైనది కాదు కదా.. కావలి అంటే ఇరానీ కేప్ లాంటివి పెట్టొచ్చు కాని మనకి ఈ కాలేజి లో వాడు గవర్నమెంట్ కాలేజి , ప్రవేట్ కాలేజి కాన్సెప్ట్ అన్నదే లేదు కదా. సినిమా కొంచం ఆసక్తి గా ఉండాలి కాబట్టి అలాంటివి తప్పవు.
శ్రీ : అందరికి ఉండే సెకండ్ ఫిలిం syndrome మీకు కూడా తప్పినట్టు లేదు. (భలే వాడివి బాసు సినిమా గురించి ) ?
అరుణ్ ప్రసాద్ : నిజానికి ఆ సినిమా నాకు తప్పని సరిగ్గా చెయ్యవలిసి వచ్చింది... నేను బాలయ్య గారికి మొదట చెప్పనా కథ వేరు. ఆయనకి ఆ కథ నచ్చినా కాని, చెయ్యడానికీ అయన ఆసక్తి చూపించలేదు. కారణం మరేం లేదు. ఎప్పుడు చంపుడు , నరుకుడు సినేమాలేనా కొంచం ligther vein సినిమా తీద్దాం అని అన్నారు. నేను నిర్మాత గారికి ఆ సినిమా వేరే వాళ్లతో తీద్దాం అని కూడా అన్నాను . కానీ అయన ఈ సినిమా చెయ్యక పొతే తను అప్పుల్లో కి పోతాను అని, సెంటిమెంట్ తో కమిట్ చేయించడం వల్ల చేసాను. అప్పట్లో నాకు దాని ప్రభావం తెలీలేదు.
శ్రీ : నా ఉద్దేశం లో మీరు మీ భవిష్యత్తు గురించి సరిగ్గా ఆలోచించినట్టు లేదు.
అరుణ్ ప్రసాద్ : ఒకరకం గా నిజం. అప్పట్లో కోడి రామకృష్ణ గారు కాని దాసరి గారికి కాని ఒక సినిమా సరిగ్గా ఆడక పోయిన అంత సమస్య ఉండేది కాదు. కాని మా తరం వచ్చే అప్పటికి పరిస్తితులు మారాయి. అందువల్ల ప్రతి సినిమా కూడా కొద్ద మాకు జీవన్మరణ సమస్యే. అప్పట్లో అది నాకు తెలీలేదు. తమ్ముడు విడుదల అవ్వగానే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చారు. కాని నేను అప్పుడే మీతో సినిమా అంటే నేను తర్వాత కొంచం తక్కువ హీరోలతో చెయ్యలేను ఏమో తర్వాత చేస్తాను అని అన్నాను. ఆ సమయం లో నాకు మహేష్ తో ఒక సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లతో ఒక సినిమా ఇలా పెద్ద పెద్ద బానర్లు లో ఆఫేర్లు ఉన్నాయ్.
మహేష్ తో యువరాజు తర్వాత సినిమా చెయ్యవలసి ఉంది. యువరాజు సరిగ్గా ఆడకపోవడం తో ఆ బ్యానర్ లో మళ్ళా చెయ్యడానికి అయన ఇష్టపడలేదు. అందువల్ల ఆ సినిమా ఆగి పోయింది. అదేసమయం లో సురేష్ ప్రొడక్షన్స్ ఆఫర్ దిని మిద ఎక్కువ శ్రద్ధ వల్ల వదులుకున్నాను.
కళ్యాణ్ తో నే రెండో సినిమా కూడా చెయ్యవలిసి ఉండేది. అది కూడా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాని వల్ల కొంత సమయం పోయింది.
బూరుగుపల్లి గారితో మూడు సినిమాలు కాంట్రాక్టు ఉంది అని చెప్పా కదా. దాంట్లో భాగం గా తమ్ముడు తమిళ్ వెర్షన్ విజయ్ తో తీసాను. అది పెద్ద హిట్. విజయ్ ఆ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు చెయ్యమని అడిగారు. కాని అవి అన్ని ఒకే ఫార్మాట్ లో మూస ధోరణి లాగ అనిపించడం వల్ల వదులు కున్నాను. బూరుగుపల్లి గారితో మూడో సినిమాగా నేను సర్దుకుపోదాం రండి సినిమా చెయ్యవలిసి ఉంది. ఆ సమయం లో నేను కన్నడ సినిమాలో బిజీ గా ఉండటం వల్ల కుదరలేదు.
కన్నడ లో హీరో సుదీప్ తో సినిమా ఆఫర్ రావడం తో కన్నడ లో మూడు సినిమాలు చేసాను. ఇలా తమిళ్, కన్నడ చిత్రసిమల్లో ఉండటం వల్ల నేను ఇంకా తెలుగు సినిమాలు చెయ్యను అన్న రూమర్ స్ప్రెడ్ అవ్వడం తో కొన్ని సినిమాల్లో ఆఫర్లు వెన్నక్కి వెళ్లి పోయాయి.
శ్రీ : గౌతమ్ ఎస్ ఎస్ సి లో మళ్ళా తమ్ముడు పోలికలు కనిపించాయి ... యాగం , మా నాన్న చిరంజీవి చిత్రాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ముఖ ముఖి కి ముగింపు పలికాను
అరుణ్ ప్రసాద్ : అది నేను ఒప్పుకోను ఒక రకం గా అది నా కథ అని అనుకోవచ్చు. నేను చెప్పాను కదా నేను కూడా మూడు సార్లు పదో తరగతి తప్పాను. చాల వరకు అది నా కథే.. కాకపోతే ఆ సెంటిమెంట్ అవి సినిమాటిక్ గా ఉండటం కోసం తప్పదు.
శ్రీ : మీ యాగం, మా నాన్న చిరంజీవి రెండు దగ్గర దగ్గర ఒకే సమయం లో విడుదల కి సిద్దం అయినట్టు గా ఉంది.
అరుణ్ ప్రసాద్ : యాగం, మా నాన్న చిరంజీవి రెండు డిఫరెంట్ కథాంశాలు ఒకదానికి ఒకటి సంబంధం లేని చిత్రాలు. అది కాక నేను బాగా పేరు ఉన్న దర్శకుడిని ఏం కాదు కదా. అందువల్ల అంత సమస్య ఎం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు.
శ్రీ : ముందుగా మా నాన్న చిరంజీవి సినిమాకి సుబ్బరాజు ని అనుకున్నట్టు గా విన్నాను ...
అరుణ్ ప్రసాద్ : నిజమే కాని ప్రొడ్యూసర్ కి జగపతి బాబు అంటే ఫ్యామిలీ audience ఎక్కువ వస్తారు అని జగపతి బాబు గారిని కలిసాము. అందువల్ల సుబ్బరాజు తో కుదరలేదు. ఇది తప్పనిసరిగా అందరికి నచ్చే సినిమా నే అవుతుంది.
శ్రీ : దీనికి inspiration my super ex-girl friend అని విన్నాను.
అరుణ్ ప్రసాద్ : లేదు అండీ. మన తండ్రి మనకి ఎప్పుడు సూపర్ మాన్ లాగ కనపడతారు కదా ఆ కాన్సెప్ట్ మిద తీసిన సినిమా అంతే.
శ్రీ: సి. ఎం. రాజశేఖర్ రెడ్డి గారి తో సినిమా ఏమయింది. ఎలక్షన్స్ ముందర విడుదల చేస్తారు అని అన్నారు కదా..
అరుణ్ ప్రసాద్ : ఎలక్షన్స్ ముందర విడుదల చెయ్యడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు కదా అండీ. ఇంకా రెండు రోజులు షూటింగ్ బాలన్స్ ఉంది ఆ సినిమా. అయన బిజీ కదా అందువల్ల ఆలస్యం అయింది.
శ్రీ : ఈ సినెమా ల తరవాత సినిమాలు ఎమన్నా అనుకుంటున్నారా ..
అరుణ్ ప్రసాద్ : నవంబర్ నుంచి ఎలెవెన్ అని తెలుగు / తమిళ్ ద్వి భాష చిత్రం చేస్తున్నాను అండీ. మిగిలిన ఎనిమిది మంది కి నిజ జీవితం లో రౌడీలని సెలెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికి నలుగురిని సెలెక్ట్ చేసాం.. మిగిలన వాళ్ళకోసం ఇంకా వెతుకుతున్నాం.
Thursday, August 13, 2009
జో జీతా వహి సికిందర్ (1992)
ఈ చిత్రాన్ని నిర్మించింది నాసిర్ హుస్సేన్.
తెలుగు లో అన్నదమ్ముల అనుభందం అని ఒక సినిమా వచ్చింది గుర్తు ఉందా . దాని మాతృక యాదోన్ కి బారాత్ సినిమా ఆమిర్ ఖాన్ కి మొదటి చిత్రం. దాంట్లో బాల నటుడిగా చేసారు ఆమిర్ ఖాన్. ఆ చిత్రానికి నిర్మాత దర్శకుడు నాసిర్ హుస్సేన్. ఆమిర్ ఖాన్ కి మేన మామ. అప్పట్లో అయన చాలా సూపర్ హిట్ సినిమాలు తీసారు. షమ్మి కపూర్ , అశాపరేఖ్ కలయిక లో బోలెడు హిట్ సినిమాలు తీసారు అయన. తీస్రీ మంజిల్, (దర్శకుడు : విజయానంద్) హమ్ కిసీ కే కం నహి లాంటి హిట్ సినిమా రికార్డు ఉంది ఆయనకి. దాదాపు పది హిట్ సినిమాల తర్వాత మూడు ఫ్లాప్ సినిమాలు రావడం తో తాత్కాలికం గా సినిమాలు ఆపేసి , తిరిగి కొడుకు మన్సూర్ ఖాన్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ కయామత్ సే కయామత్ తక్ అన్న సూపర్ హిట్ సినిమా తో తిరిగి రంగప్రవేశం చేసారు.
అశాపరేఖ్ ని ప్రేమించారు అని చెప్పుకుంటారు. ఆశాపరేఖ్ ని తెరకి పరిచయం చేసింది ఆయనే . దిల్ దేఖే దేఖో చిత్రం ద్వారా పరిచయం అయిన ఆశా ఎక్కువ నాసిర్ హుస్సేన్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు కానీ బహిరంగం గా ఎప్పుడు ఇద్దరిలో ఎవరు బయటపడలేదు.
మన్సూర్ ఖాన్ గురించి ..
నాసిర్ కొడుకైన మన్సూర్ ఖాన్ మొత్తం నాలుగే చిత్రాలు చేసారు. కయామత్ సే కయామత్ తక్. జో జీతా వహి సికిందర్ , అకేలే హమ్ అకేలే తుం, జోష్. నాలుగు కూడా వేరే చిత్రాలు లేక నాటకాల ఆధారంగా తీసినవే.
మన్సూర్ ఖాన్ మొదటి చిత్రం కయామత్ సే కయామత్ తక్. షేక్స్ ఫియర్ రాసిన రోమియో జూలియట్ నాటకం ఆధారంగా తీసారు. జో జీతా వహి సికిందర్ చిత్రం దర్శకుడి గా రెండో చిత్రం మన్సూర్ కి ఆమిర్ కి కూడా (నాయకుడిగా ) . దీనికి ఆధారం ఇంగ్లీష్ లో వచ్చిన బ్రేకింగ్ అవే అన్న చిత్రం మూలం. అకేలే హమ్ చిత్రానికి మూలం kramer vs kramer చిత్రం ఆధారం. జోష్ చిత్రానికి ఆధారం westside story . దీని తర్వాత ఈయన సినిమాలు అన్ని మానేసి కూనూర్ లో వ్యవసాయం చేసుకుంటూ సంఘ సేవలో నిమగ్నం అయ్యారు. ఈ మాదే ఇంకో మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ని నాయకుడిగా పరిచయం చేస్తూ ఆమిర్ తీసిన జానే తు చిత్రానికి సహా నిర్మాతగా కనిపించారు ..
మూలం బ్రేకింగ్ అవే చిత్రం గురించి :
అప్పుడే యవ్వనం లో కి అడుగుపెడుతున్న నలుగురు యువకులు , (డెన్నిస్ quaid) వాళ్ళలో ఒకడు లెండి. ఆ వయసులో వాళ్ళలో ఉండే వేడి వాడి. తల్లి తండ్రుల ఆశలు వారు పైకి రావాలి అని. చిత్రం లో ముఖ్య పాత్ర by-cycle పందాలు . Indiana University Little 500 bicycle race. ఇది యదార్ధంగా జరిగిన కథ కి సినిమాటిక్ రూపకల్పన గా చెప్పుకొనవచ్చు . చిత్రం చాల వరకు ఇండియానా లో ను బ్లూమింగ్టన్ లో ను తీసారు . చిత్రం ఆఖరిలో తీసిన e "old" Memorial Stadium సినిమా అయిన కొన్నాళ్లకే demolish చేసారు.
సినిమా యధార్ద గాదా ఆధారంగా తీసారు అని చెప్పా కదా. ముఖ్య పాత్ర నిజం పేరు Blase అతను చిత్రం లో రేస్ అన్నౌన్సుర్ గా కనిపిస్తారు. నిజ జీవితం లో రెండు వందల రౌండ్స్ కి అయన నూట ముప్పై అయిదు పూర్తి చేస్తారు.
హిందీ లో తీసినప్పుడు ముఖ్య సన్నివేశాలు కొన్ని మాత్రమె తీసుకుని మిగిలినది అంతా మార్చి తీసారు. ఆంగ్లం లో అసలా సోదరుడి పాత్ర లేనే లేదు. అయిదు ఆస్కార్ అవార్డు లను గెల్చుకున్న ఈ చిత్రం అమెరికా లో టాప్ టెన్ స్పోర్ట్స్ చిత్రాలలో దీనికి ఎనిమిదో స్థానం ఉంది అంటే ఇది ఎంత పాపులర్ సినిమానో అర్ధం చేసుకోగలరు .
సంగీత దర్శకులు జతిన్ - లలిత్ ల గురించి :
జతిన్ లలిత్ లు ఇద్దరు సోదరులు. పండిట్ జస్రాజ్ కి మేనలుళ్ళు. తండ్రి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న సోదరులు తర్వాత గిటార్ , పియానో ప్రముఖ సంగిత దర్శకులు lakshmi kaath - ప్యారేలాల్ దగ్గర నేర్చుకున్నారు. (సులక్షణ పండిట్ గుర్తు ఉందా ?! apanapana అని జిత్రేంద్ర తో ఒక సినిమా చేసింది (ఇంకా చాలా చేసింది కానీ నాకు గుర్తు ఉంది అదే లెండి ) దాన్ని తెలుగు లో కూడా ఇల్లాలు పేరు తో చేసారు (శోబన్ బాబు, శ్రీదేవి , జయసుధ ) తర్వాత మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది (ఒక ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది ). ఆ అమ్మాయి జతిన్ లలిత్ ల కి సోదరి .స్వర్గీయ సంజీవ్ కుమార్ ని ప్రేమించింది అని చెపుతారు (ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు ). ఇంకో సోదరి విజేత పండిట్ ( కుమార్ గౌరవ సరసన లవ్ స్టొరీ (తెలుగు లో ప్రేమసంకెళ్లు అని నరేష్ రెండో సినిమా ) లో చేసింది).
1992 సంవత్సరం జతిన్ - లలిత్ ల కి అచ్చి వచ్చిన సంవత్సరం గా చెప్పుకొనవచ్చు .వాళ్ళకి ఆ సంవత్సరం మూడు సూపర్ హిట్ సినిమాలు చేసారు . జో జీతా వహి సికిందర్ , కిలాడీ, రాజు బాన్ గయా జెంటిల్ మాన్ చిత్రాలు వచ్చాయి. జో జితా వహి సికిందర్ వాళ్ళకి రెండో చిత్రం. పదహారేళ్ళ కలిసి చేసిన వీళ్ళు తర్వాత విడిపోయారు. (ఆర్ధిక లావా దేవిలే కారణం అని అంటారు, నిజమెంతో తేలేదు కానీ ) .
జో జితా వహి సికిందర్ కి ఆమీర్ తమ్ముడు ఫైసల్ సహాయ దర్శకుడిగా పని చేశారు సినిమా లో చాలా చిన్న వేషం వేసారు లెండి. ముందుగా ఈ చిత్రానికి గీతాంజలి గిరిజ ని నాయకి గా అనుకున్నారు. సినిమా చాలా వరకు తీసారు కూడా. కానీ మన్సూర్ కి గిరిజ కి అభిప్రాయ భేదాలు రావడం వల్ల అయేషా ని ఆ స్థానం లో తేసుకున్నారు. కానీ నాటకం లో గిరిజ ని చూడవచ్చు మనం. నాటకం (దివానా హమ్ ప్యార్ కే పాట) లో మొదట లో వచ్చే గిటార్ ప్లేయర్ లలిత్. అమ్మాయి తో నాట్యం చేసేది జతిన్ . రూట్ కే హం సే (ఆక్సిడెంట్ అయ్యాక వచ్చే బ్యాక్ గ్రౌండ్ పాట ) లో చిన్ని ఆమీర్ గా వేసింది ఆమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. (జానే తు చిత్రం నాయకుడు ).
అయేషా జుల్కా అంటే తెలుగు లో కూడా రెండు సినిమాలు చేసింది . నాగార్జున సినిమా నేటి సిద్దార్థ గుర్తు ఉందా (ఓసి మనసా నీకు తెలుసా పాట ఉంది ఆ సినిమాలో ) దాంట్లో నాయక. ఈ మధ్య తేజ తీసిన ఫ్లాప్ సినిమా లో తల్లిపాత్ర కూడా వేసింది అయేషా చేసిన సినిమాల్లో కల్లా ఇది మేటి చిత్రం గా చెప్పుకొనవచ్చు.
అన్న వేషం వేసిన నటుడి పీరు మైమిక్ సింగ్. అప్పట్లో పాపులర్ మోడల్. మైమిక్ కి ఆ పాత్ర మంచి పేరు తెచ్చినప్పటికీ తర్వాత చెప్పుకోదగ్గ మంచి పాత్రలు రాలేదు. కానీ TV లో చాలా సీరియల్స్ చేసారు (నిర్మాతగా కూడా ) .
ఇంకో చెప్పుకో తగ్గ పాత్ర వేసింది పూజ బేడి. పాపులర్ మోడల్ కబీర్ బేడి, ప్రోతిమా బేడి ల కుమార్తె. అప్పట్లో వచ్చిన కామసూత్ర మోడల్. విషకన్య అన్న చిత్రం తో సిని రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మాయి కి పేరు తెచ్చింది మాత్రం ఈ చిత్రమే.
శేఖర్ పాత్ర వేసింది దీపక్ తిజోరి. కయమత్ సే లో ఆమీర్ కి స్నేహితుడిగా వేసాడు. ముందుగా ఈ చిత్రానికి
ఆ పాత్ర కోసం అక్షయ్ కుమార్ కూడా ప్రయత్నం చేసారు కానీ దీపక్ కి ఆ పాత్ర వరించింది. ప్రస్తుతం దర్శకుడిగా fox అన్న చిత్రాన్ని తొందర్లో విడుదల చెయ్యడానికి ప్రయతిస్తున్నారు .
ఈ సినిమా అనగానే గుర్తు వచ్చే ఇంకో పేరు Farah Khan సరోజ్ ఖాన్ పాట చిత్రీకరణ పూర్తీ కాకా ముందే అలిగి వెళ్ళిపోవడం వల్ల ఆ స్థానం లో వచ్చారు. తర్వాత ఈవిడ దర్శకురాలి గా మారి మై హు నా లాంటి చిత్రాలు తీసారు. తెలుగు లో తోడూ నీడ అని ఒక చిత్రం వచ్చింది గుర్తు ఉందా ఆ చిత్రం లో చేసిన చిన్న పిల్ల డైసీ ఇరాని వీళ్ళకి పిన్ని. Farah మై హూ నా కి పని చేసిన ఎడిటర్ ని తర్వాత ప్రేమించి పెళ్ళాడారు (అయన కూడా దర్శకుడి గా మారారు జానేమన్ చిత్రం తో ). .
ఈ సినిమా విడుదల కి ముందర filmfare పత్రిక లో చిత్రం కి సంబంధించిన ఫోటోలు ప్రచురించి కథ కనుకోండి అని ఒక పోటి పెట్టారు. కథ కనుకున్న వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇస్తాం అని ప్రకటించారు ఈ చిత్రానికి film fare award కూడా వచ్చింది. సినిమా రామకృష్ణ ధియేటర్ లో విడుదల అయింది
తెలుగు లో ఈ చిత్రాన్ని బురుగపల్లి శివ రామకృష్ణ గారు నిర్మించారు. చిత్రం పేరు తమ్ముడు. కాకపోతే ఈ చిత్రం లో by cycle race లెదు దాని బదులు బాక్సింగ్ పోటీలు పెట్టారు. అంతే కాకా చాలా విషయాలు మార్చారు. సినిమా హిట్ అయినా కాని జో జీతా వహి సికిందర్ లో లాగా ఆ ఫీల్ మిస్ అయ్యాము.
Monday, August 10, 2009
వావి వరసలు...
నేను బడిలో ఉండగానే ... అంటే నాలుగైదు తరగతుల్లో అనుకుంటా ... ఒక రోజు డిగ్రీ అయిపోయిన మా చుట్టాలబ్బాయి బడికి వచ్చాడు నన్ను తొందరగా తేసుకు వెళ్ళడానికి.. వరస ప్రకారం నేను తనకి బాబాయ్ అవుతాను. అందువల్ల (మరియు నన్ను ఏడిపించడం కోసం ) నన్ను బాబాయి అనే పిల్చే వాడు. తను తరగతి గదికి వచ్చి మా శ్రీను బాబాయ్ ని తెసుకేల్లోచ్చ అని పంతులు గారిని అడిగారు. ఇంకా చూసుకోండి క్లాసు అంతా ఒక్క సరి గొప్ప కలకలం అండ్ నవ్వులు... నాకు గొప్ప సిగ్గు అండ్ అవమానం ( ఆ సమయం లో రెండు ఒక్కటే అని అనుకునే వాడిని లెండి ). తనతో ఇంకా వారం మాట్లాడితే ఒట్టు. తను గదిలో కి వస్తే వేరే గదిలో కి వెళ్లి పోయేవాడిని.. నాన్నగారు కూర్చో పెట్టి వరస పెట్టి పిలవడం లో తప్పు లేదు అని నాకు సర్ది చెప్పారు . అక్కడికి అది సర్దు మణిగింది. అప్పటినుంచి నేను ఆ పిల్పు కు అలవాటు పడిపోయాను. తను నన్ను ఇప్పటికి అలాగే పిలుస్తాడు.
కట్ చేస్తే ఇప్పుడు అతను అమెరికా లో ఉన్నాడు.. మొన్న మద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి కి పదిహేను ఏళ్ళు అనుకుంటా . పిలిచి మీ తాతగారు అని పరిచయం చేసారు. ఆ అబ్బాయి ఒక చూపు చూసి. He don't look that old. I cannot call him as తాతగారు అనేసి చక్క వెళ్ళిపోయాడు. నాకు నవ్వు ఆగలేదు . మళ్ళా భోజనలకాడ కలిసాడు. నాకు తాతగారు అని పిలిస్తే నేను ఎం ఫీల్ కాను అని అన్నాను. ఒక సరి ఎగా దిగా చూసి I think I can call you as brother అని తీర్మానం చేసేసి ఇదే నా తీర్పు లాగా వినిపించేసాడు.
TANA కి వెళ్ళినప్పుడు, మా మేనకోడలు, తన భర్త తో banquet కి వచ్చింది. అబ్బాయి ఆరడుగుల కన్నా ఇంకో ఇంచి ఎక్కువే. తనని తీసుకు వెళ్లి సిరివెన్నెల గారికి మా అబ్బాయి అని పరిచయం చేశాను ఆయనకి ఒక నిమషం అర్ధం కాలా పాపం. నీకు పెళ్లి అయిందా ? అప్పుడే ఎంత పెద్ద కొడుకా అని ఒక గుక్క తిప్పుకోకుండా అడిగేసారు. ఆయనకి అప్పుడు చుట్టరికం చెప్పను. అంత పొడవు అబ్బాయి ని పాలనా వాళ్ళ భర్త అని ఎం పరిచయం చేస్తాము, కాంతం గారి మొగుడు టైపు లో కష్టం కదా .. అలా రెండు సార్లు అయ్యే సరికి పాపం అబ్బాయి సిగ్గు పడిపోయి బాబాయ్ మనం కజిన్స్ అని చెప్తే ప్రాబ్లం ఉండదు ఏమో అది బెటర్ ఆప్షన్ ఏమో అన్నాడు..అలా కాదులే మా వాడు అని చెప్తా లెండి అన్నా అక్కడి నుంచి ఎవరకి పరిచయం చెయ్యాలి అన్న మా వాడు అని అటు ఇటు కాకుండా పరిచయం చేశా.
నిన్న ఇంకో అబ్బాయి వచ్చాడు. తను కూడా నాకు వరసకి అబ్బాయే.. కొత్తగా పెళ్లి అయింది . చాల ఇబ్బంది పడి పోయాడు. ఇమ్మలని బాబాయి అని పిలవాలంటే .. అన్నా అని పిలవోచ్చ అని అడిగాడు... నీకు ఇబ్బంది లేన్దినిది ఏదన్న పరవాలేదు లే అంటే ఇంకా అప్పటి నుంచి అన్న అనడం మొదలు పెట్టాడు...
Saturday, August 8, 2009
నిన్న ఖదీర్ నేడు గోపిని...
గోపిని గారు ఇలా రాస్తారు అని ఎప్పుడు అనుకోలా ... పాఠకుల కోసం ఆ చిత్రం లో సన్నివేశాలని కథని ఇక్కడ పెడుతున్నా .. మీరే న్యాయ నిర్ణేతలు ... (ఇక్కడ ఉన్న వీడియో edited వెర్షన్ ) సినిమా కథ కి ఈయన రాసిన కథ చాల వరకు ఒకటే.
Friday, August 7, 2009
అన్నం గుడ్డ - సుంకోజి దేవేంద్రాచారి
ఈ రోజు చెయ్యవలిసిన పని తొందరగా అయి పోవడం తో పుస్తకం మొదలు పెట్టాను. ప్రతి కథా జీవన చిత్రమే మనకి బాగా తెలిసిన కథలే ... ఇది మనవాళ్ళ జివితామే ఏమో అన్న అనుమానం ఒకో కథ చదువుతున్న కొద్ది బలపడి పుస్తకం పూర్తి చేసే సమయానికి ఈయనకి మనకథలు ఎలా తెలుసు ? మన ఇంట్లో మనిషే ఏమో ఇలా రాసాడు అన్న ఆత్మీయతా భావం వచ్చేస్తుంది దేవేంద్ర గారి మీద.
రాబందులు కథ చదువుతుంటే ఊర్లో కుప్పనుర్పిళ్ళ దగ్గరే కనపడే మా ఊరి రైస్ మిల్లు యజమాని కనపడ్డాడు. (ఊర్లో అందరు మనకి బాబాయ్ లు మామయ్యలు కదా , వాళ్ళ కళ్ళల్లో కనపడ్డ నైరాశ్యం ఆక్కడ కనపడింది. )
కడ గొట్టొల్లు కథ చదువు తుంటే ఊర్లో మా ఇళ్ళ వెనకాల ఉండే జనాల జీవితం గుర్తుకు వచ్చింది.. నేను ఆడుకోడానికి వెళ్ళాలి అంటే మా ఇంట్లో చిరాకు పడే వాళ్ళు , మేము హైదరాబాద్ లో పెరగడం వల్ల ఇలాంటివి తేలిక పోవడం తో అర్ధం అయ్యేది కాదు.
అన్నదాత చదువుతుంటే ఎందరు బాబాయిలు గుర్తుకు వచ్చారో... కొల్లేరు మునిగినప్పుడల్లా వాళ్ళ పంటలు మునిగేవిమా ఇంటి ముందర ఎప్పుడు ఆ బాబాయిల గోషీ ... (మా ఇల్లు కొల్లేటి ఒడ్డున ఉండేది లెండి ). మనకి సరిగ్గా లేవువాడికి బియ్యం కొలవమంటావు అనే పిన్ని సనుగుడుకి మా బాబాయి నవ్వు కనపడింది ఆ కథ లో. ..
తమ్మిపూ లు చదువుతుంటే గది అంతా తమ్మిపూల వాసన వస్తున్నా అనుభూతి (నీ మొహం అమెరికా లోతమ్మిపూలు ఏంటి .. రూమీ గాడు రాసుకున్న స్ప్రేయ్ ఏమో అన్న బుడుగు ఎటకారం యాహూ లో )
కొస మెరుపు : ఊరు నుంచి కొడుకు దగ్గరకు వచ్చిన బాబాయ్ గారికి ఈ పుస్తకం ఇచ్చాను చదవమని ... పుస్తకం మొత్తం చదివి అక్కడ ఇదే భాద ఇక్కడ కూడా ఇదేనా .. ఈదేడన్నా కొత్తగా సేపుతాడు అనుకున్నా.. మన బాదలు మళ్ళా కొత్తగా సదవాలా అని రెండు తిట్టులు తిన్నా (అంటే ఎంత బాగా రాసారో ఒక్క సారి ఆలోచించండి )
పుస్తకం ఇచ్చిన ఉమగారికి కృతజ్ఞతలు ...
అన్నంగుడ్డ - కథలు .. రచయిత సుంకోజి దేవేంద్రా చారి . యుక్త ప్రచురణలు (వారి అమ్మాయి పేరు మిద అనుకుంటా ) ధర యాభై రూపాయలు.
Thursday, August 6, 2009
స్వప్న (1981)
ముద్ద ముద్ద మందారాలు, లేత బుగ్గ సింగారాలు - ఇవి రెండు దాసరి గారు (లేక పాలగుమ్మి పద్మరాజు గారా?) వ్రాసినవి.
ఇన్ని సూపర్ హిట్ పాటలు ఉన్న చిత్రం "స్వప్న"! హైదరాబాదులోని సంధ్య 70mm థియేటర్లో విడుదల అయిన ఈ చిత్రానికి సంగీతం "ఢోలక్" సత్యం గా ప్రసిద్ది పొందిన చెళ్ళపిళ్ళ సత్యం గారు. దాదాపు అంతా కొత్తవాళ్ళతో తీసిన చిత్రం గా చెప్పుకొనవచ్చు ఈ చిత్రాన్ని. "స్వప్న"గా నామకరణం చెయ్యబడ్డ మంజరికి తెలుగులో ఇదే మొదటి చిత్రం. తర్వాత ఈ అమ్మాయి "టిక్.. టిక్.. టిక్..", "పార్వతీపరమేశ్వరులు", "ప్రియ" లాంటి కొన్ని తెలుగు చిత్రాలలో కనిపించి ఆ తరువాత "ఏక్ దిన్ కీ బహూ" అన్న చిత్రంతో హిందీ రంగానికి వెళ్లి అక్కడ "తేరీ మెహర్బానియా"(జాకీ ష్రాఫ్ సగంలో చనిపొతే కుక్క ప్రతీకారం తీర్చుకునే సినిమా అంటే కొందరికి గుర్తు రావచ్చు.) చిత్రంలో రెండో నాయకగా కనిపించి అలా అలా మెల్లిగా మాయమయిపోయింది లెండి. (పాఠకులు చెప్పిన వార్త స్వప్న అమెరికాలో Las -Vegas లో ఒక షో ప్రోమోటర్ గారిని పెళ్ళాడారు పదేళ్ళ క్రితం కనపడ్డారు )...
ఈ చిత్రం లో బాగా పేరు వచ్చింది రాజాకి. అంకితం నీకే అంకితం..., ఇదే నా మొదటి ప్రేమలేఖ... అన్న పాటలు ఇతని మీదే తీసారు. రాజా చాలా చిత్రాల్లో సహాయ పాత్రల్లో బాగానే రాణించి, పాపం, చిన్న వయసులో గుండె నొప్పితో చనిపోయాడు.
ఇంకో నాయకుడిగా రాంజీ అన్న ఉత్తరాది అబ్బాయి నటించాడు. "జేగంటలు" అన్న చిత్రం గుర్తు ఉందా? (ఇది ఆమని సాగే చైత్ర రథం, ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం..., జేసుదాస్ పాడిన ఎవరమ్మా, ఎవరమ్మా ఈ కొమ్మ..., వందనాలు, వందనాలు, వలపుల హరిచందనాలు..., తెలుసులే, నీకు తెలుసులే... వంటి అద్భుతమైన పాటలుండి సింగీతం దర్శకత్వం వహించిన ఫ్లాప్ చిత్రం) ఆ చిత్రంలో ముచ్చెర్ర్ల అరుణ పక్కన కథానాయకుడిగా చేసాడు రాంజీ. తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి కనుమరుగయిపోయాడు.(పాఠకులు చెప్పిన వార్త : రాంజీ గారు ప్రస్తుతం travel agent గా వుండి అవుట్ డోర్ షూటింగ్ లకి సహాయపడుతున్నారు )
నాటకరంగంలో ప్రసిద్ధి గాంచిన చాట్ల శ్రీరాములు గారు ఈ చిత్రంలో తండ్రి పాత్ర పోషించారు. (ఈయన "న్యాయం కావాలి" చిత్రంలో రాధికకి తండ్రిగా కనిపించారు, ఈ మధ్య విడుదల అయిన "రాముడు మంచి బాలుడు" చిత్రంలో కూడా కనిపించారు.) చాట్ల శ్రీరాములు గారు నాటకరంగానికి చేసిన సేవ చాలా గొప్పది. ఈయన "రసరంజని" అన్న సంస్థ ద్వారా "శంకరాభరణం" సోమయాజులు గారితోనూ, వారి సోదరుడు, నటుడు జె.వి. రమణమూర్తి గారితోనూ కలిసి బోలెడు నాటక ప్రదర్శనలు ఊరూరా ప్రదర్శిన్చారు.
కథాంశం ప్రకారం స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే స్వప్నకి రాంజీతో పెళ్లి నిశ్చయం చేస్తారు ఆమె తండ్రి. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంకో డబ్బున్న అమ్మాయి వెనకాల పడతాడు. ఆ అమ్మాయి రాంజీ స్వభావం తెలిసి వదిలేస్తుంది. రాంజీ తిరిగి స్వప్న దగ్గరకి వస్తాడు. స్వప్న ఛీకొట్టి రాజాతో వెళ్ళిపోతుంది. రెండో అమ్మాయి పేరు గుర్తు లేదు కాని తరువాత శోభన్‌బాబుతో ఒకటి రెండు చిత్రాలు చేసింది ఆ అమ్మాయి.
ఈ సినిమాని నిర్మించింది జగదీశ్ ప్రసాద్. జగదీశ్ గారు తన భార్య లలిత గారి పేరు మీద పెట్టిన బ్యానర్ "లలితా కంబైన్స్". లలిత గారు అన్నపూర్ణ కంబైన్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు గారి కూతురు కావటం వల్లన జగదీశ్ గారికి సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. జగదీశ్ గారు దాసరితో దీనికి ముందర "ఇదెక్కడి న్యాయం?", "కోరికలే గుర్రాలయితే..." చిత్రాలు తీసారు. "స్వప్న" వీరిద్దరి కలయికలో మూడో చిత్రం. మూడో చిత్రం కదా అని మూడు భాషల్లో మొదలు పెట్టినట్టు ఉన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తీసారు.
నాయకానాయికలు తప్ప మిగిలిన సహాయ పాత్రలకి ఆయా భాషల చిత్రరంగాల్లోని నటులని తీసుకున్నారు. కానీ ల్యాబ్‌లో జరిగిన పొరపాటు కారణం వల్ల తమిళ చిత్రం ప్రింట్ పాడయ్యి తమిళంలో విడుదలవలేదు. తెలుగు, కన్నడ భాషల్లో మాత్రం విజయవంతం అయ్యింది.
గాడిద ...
కూసే గాడిద వచ్చి మేసే గాడిదని పాడుచేసింది ... కుక్క పని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలి... అడ్డ గాడిద .. ఇవి అన్ని వినికుండా పెరగని వాళ్ళు వుండరు నాకు తెలిసి. గాడిద మీద బోలెడు కథలు ... నిజానికి వరసకు మా పెదనాన్న గారు ఒకరు (అట్లూరి పిచ్చేశ్వర రావు గారు , ఆయన్నని నేను ఎప్పుడు చూడలేదు అనుకోండి ) ఒక గాడిద ఆత్మ కథ అన్న పుస్తకం కూడా రాసారు.
చిన్నప్పుడు ఎప్పుడు బళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కువ గా తిట్టే తిట్టు అడ్డ గాడిద .. అలా ఊరంతా అడ్డగాడిలా తిరగక పొతే ఏదన్నా తరగతి పుస్తకం చదువుకోవచ్చు కదా (తరగతి పుస్తకమే సుమా , ఏంటో ఈ పెద్ద వాళ్ళు ఎప్పుడు తరగతి పుస్తకమే, వాళ్ళు మాత్రం ఏదన్నా చడువ్కోవచ్చు .. ఎంత దారుణమో చూడండి.
అందరికి ఉండే ఇంకో అనుభవం దాడిగా డువానసిరా దీని తిప్పి చదవడవంది అని క్లాసు లో కామెడి చెయ్యని గాడి ఉండడు కదా.
పోనీ ఇన్ని తిడుతున్నారు కదా ఎమన్నా పని చెప్పకుండా ఉంటారా అంటే అది లేదు ... గాడిద చాకిరి చేయిస్తారు
అడ్డ గాడిదా అంటారు అంటే గాడిదలు ఎమన్నా నిలువుగా ఉంటాయ ? దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయారో...
Wednesday, August 5, 2009
రాఖి
దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి చిన్న చిన్న షాప్స్ లో పెట్టడం మొదలు పెడతారు . బాగా చిన్నప్పుడు అక్కలని తేసుకు వెళ్లి నాకు కావలిసిన వి చూపించే వాడిని. పాపం వాళ్ళు వాళ్ళ పాకెట్ మనీ అంతా వాటికే సరి పోయేది .. పోనీ నేను ఎమన్నా వాళ్ళకి బహుమతిగా ఇవ్వడానికి మనకి చాల చిన్న వయసు కాదా.. ఆ సమయం లో ఆంధ్ర లో ఉంటె మాత్రం అక్కడ ఈ హడావుడి ఎం కనపడేది కాదు. సందులో ఉండే అక్కలందరూ పాపం డబ్బులు ఇవ్వక పోయినా కట్టే వాళ్ళు.
మేము అక్కడ ఇల్లు మారాక , మా అక్కలకి పెళ్లి ళ్ళు అవ్వడం , నేను హాస్టల్ కి మారిపోవడం ఇలా రక రకాల కారణాల వల్ల తర్వాత తర్వాత రాఖీలు తగ్గిపోయ్యాయి .
అమెరికాలో దాదాపు ఒక నెల ముందరే షాప్ లో దర్శనం ఇచ్చే ఆ రాఖీలు చూడగానే బోలెడు మంది అక్కలు గుర్తుకు వచ్చారు. ఇంటర్ లో ఉన్నప్పుడు మిత్రుడి అక్క ప్రతి సంవత్సరం కట్టేది. ప్రతి సంవత్సరం వచ్చే రాఖీలు అన్ని ఒక డబ్బా లో పెట్టి వుంచేవాడిని. ( ఆ అలవాటు మా అక్క నేర్పింది. అవి పారేయ్య కూడదు అని చెప్పేది ). అమెరికా వచ్చే ముందర సామాను సర్దుతుంటే ఒక సరి ఆ డబ్బా కనపడింది .. ఒక్క సరి ఎన్ని జ్ఞాపకాలో చుట్టూ ముట్టాయి . ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలీని అక్కలు (మా ఇంట్లో వాళ్ళు కాదు లెండి ) ఎక్కడ ఉన్న బాగా ఉండాలని ఈ రాఖి రోజు మళ్ళా కోరుకుంటూ ...
ఓ తమ్ముడు
Sunday, August 2, 2009
మగధీర
మాములుగానే మొదటి రోజు నేను ఉన్న ఊర్లో ప్రింట్ రాకపోవడం వల్ల సినిమా చూడలేక పోయాం. ఇంకా మాములుగా ఆ ఎదవ exibitor / డిస్ట్రిబ్యూటరూ ఫోన్ ఎత్తడం కానీ , ప్రెస్ రిలీజ్ కానీ ఇవ్వలేదు చాలా మాములుగా ధియేటర్ కాడికి వెళ్లి మేము ఎదవలం అయ్యాం. సరే అని మరసటి రోజు ఆరుగంటల ఆటకి టికెట్ కొందాం అనుకున్నా, లేవు పో అన్నాడు exibitor . సరే అని జే కి ఫోన్ చేస్తే తొమ్మిది గంటల ఆటకి టికెట్స్ తీసుకున్నా అన్నాడు. తొమ్మిదికి కాదా ఏడు గంటలకి ఇంటికి కాడ బయలుదేరవచ్చు లే అనుకున్నాం. ఈ లోపల ఫోన్ మధ్యలో ఒక స్పెషల్ షో వేస్తున్నాం రండి బాబు అని.. సరే అని ఏడున్నర కి ఉండేలా రున్నింగ్ రేస్ (కారు లో నే లెండి ) మొదలు పెట్టి , సమయానికి అన్న ముందరే చేరుకున్నాం. రా రమ్మని రారా రమ్మని మనకోసం కుర్చీలు ఆపరు కదా ఎవరు అందువల్ల నేలక్లాస్స్ తప్పలా మాకు.. నాకు అక్కడ చూస్తె బొమ్మ (సినిమా) చూసినట్టు ఉండదు కదా. అందువల్ల వెనక్కి వెళ్లి నిల్చున్నా.
చిత్రం మొదలు పెట్టాక బూజు బూజు గా మొదలయింది (లెన్స్ సరిగ్గా లేక ) బంగారు కోడిపెట్ట పాట సగం అయ్యేదాకా. అప్పుడు జనాలు గోల పెట్టారు అని మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టారు లెన్స్ సరి చేసి. సినిమాలో మొదటి సగం కథ ఎం జరిగినట్టు కనపడదు. నాయకా నాయకుల మధ్య ప్రేమ నాయకుడికి ఏదో పూర్వజన్మ స్మృతులు కనపడటం తప్ప.
రెండో సగం మొదలు కాగానే ఒక అద్బుత ప్రపంచం లో కి వెళ్ళిన భావన. ఆర్ట్ డైరెక్టర్, చాయగ్రాహాకుడు కలిసి ఆడుకున్నారు వాళ్ళకి దర్శకుడు తోడయ్యాడు. ప్రతి దృశ్యం ఒక చాయ చిత్రం లా ఉంది.. మనవాళ్ళు ఎవరికీ తీసి పోము అని నిరూపించారు. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే చిత్రం హటాత్తుగా చివరకి వచ్చేస్తుంది. శ్రీహరి పాత్రకి ఫ్లాష్ బ్యాక్ అయ్యాక వచ్చే సన్నివేశాలకి సరిగ్గా సంయమనం కుదరలేదు .
చిత్రంలో లోపాలు లేవా అంటే చాలా ఉన్నాయ్ . బ్రహ్మానందం , హేమ పాత్ర లకి తల తోకా లేదు. ఆలి పాత్ర అసలా కనపడలా. సునీల్ పాత్ర రెండో సగం లో కనపడదు, సలోని పాత్ర దండగ. హీరో కి వాచకం స్పష్టంగా లేదు (కొత్త హీరోలకి అందరికి అదే సమస్య లెండి , అందువల్ల క్షమించేయ్యవచ్చు నాకు తెలిసి ఒక తెలుగు సినిమాని ఒక దృశ్య కావ్యంగా ఒక వర్ణ చిత్రంగా ఇంత బాగా చెయ్యగలగడం ఈ జనరేషన్ లో గొప్పగా చెప్పుకొనవచ్చు. నాకయితే మొదటి సగం నచ్చక పోయిన రెండో సగం కోసం సినిమా ఎన్ని సార్లు అయిన చూడొచ్చు.. (ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవ్వగానే లేచి రావచ్చు కూడా )
Saturday, August 1, 2009
ప్రకృతి పిలుపు
కథ కి నాయకుడు బక్ అన్న ఒక కుక్క. Sanfransico లో దర్జాగా ఒక జడ్జి ఇంట్లో పెరుగుతున్న దాన్ని డబ్బు కోసం ఒకడు ఎత్తుకు పోయి అమ్మేస్తాడు. ఆ సమయం లో arctic ప్రాంతాల్లో gold rush బాగా ఉండేది. అక్కడ దర్జాగా పెరిగిన ఆ కుక్క sledge dog గా ఎలా మారింది. అక్కడ దాని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది కథా సంగ్రహం.
కథలో ఎంతగా లీనం అయి పోతాము అంటే బక్ ఒక కుక్క అని అనుకోలేము. అది కూడా మనలాంటి మనిషే అని ఫీల్ అయిపోతాము. ఒక సంధర్బం లో మన కళ్ళవెంట మనకి తెలీకుండానే కళ్ళవెంట నీలు కారిపోతాయి. అదిగో అప్పుడే పట్టుబడిపోయాను. మొదటి బెంచి లో కూర్చుని కారణం లేకుండా ఎందుకు ఎదుస్తున్ననో అర్ధం కాక పాపం మా టీచర్ గారు కంగారు పడిపోయారు. నేను పుస్తకం చదువుతూ ఏడుస్తున్న అంటే మళ్లా బెంచి ఎక్కించే ప్రోగ్రాం కి వెళ్ళిపోతారు అని తెలుసు. ఇంకో పక్క మా జే అండ్ ఎస్ ల నవ్వు నన్ను చూసి ... ఇంకా నా అవస్త ఆ దేవుడికి తెలవాలి...
అది తర్వాత నేను పుస్తకాలు కొనే వయసు వచ్చే సమయానికి దొరకలేదు ... వేరే వారి అనువాదాలు దొరికాయి కానీ కో.కు గారి అనువాదం దొరకలేదు ఇప్పటికి కూడా..
జాక్ లండన్ జీవితమే ఒక పది పుస్తకాలకి సరిపడా కథలు ఉన్నాయ్. ఓడ కూలి, జాలరి, సీల్ వేటగాడు, ముత్యపు చిప్పల దొంగ ఇలా రక రకాల పనులు చేసే అతను, gold rush లో దాని కోసమూ పరిగెత్తాడు. Egerton R. Young రాసిన My Dogs in the Northland.(ఇది నేను ఇంకా చదవలేదు ) పుస్తకం ఆధారంగా ఈయన call of the wild రాసారు.
జాక్ లండన్ గారు రాసిన ఈ పుస్తకాన్ని కో.కు గా ప్రసిద్ది చెందినా కొడవగంటి కుటుంబరావు గారు అనువదించారు . ప్రకృతి పిలుపు అని పేరు పెట్టారు. దాన్ని దేశి కవిత మండలి వారు ప్రచురించారు. 160 పేజీల పుస్తకం. అయిదు వేల పత్రులు ప్రచురించారు అని అన్నారు .
ఇప్పుడు సర్క్యులేషన్ లో మాత్రం లేదు..
ఇప్పుడు పీకాక్ వాళ్ళు సంక్షుప్త అనువాదాన్ని ప్రచురించారు.పుస్తకం పేరు అడవి పిలిచింది . ఏ . గాంధీ గారి అనువాదం. వేల ముప్పై రూపాయలు.